
peddi
'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్‌చరణ్ రెడీ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన రామ్‌చరణ్ ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్ అదిరిపోయింది.
ఫస్ట్ బాల్‌కే చరణ్ సిక్సర్ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్ లుక్‌లో బరిలోకి దిగాడు చరణ్. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్ ఉంది. గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో తెలిపారు.
జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా కెమేరామెన్‌గా ఆర్. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్‌చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే.