పోసాని కృష్ణమురళికి కరోనా.. ఆసుపత్రికి తరలింపు | Posani Krishna Murali Hospitalized Due To COVID-19 - Sakshi
Sakshi News home page

Posani Krishna Murali : మూడోసారి కరోనా బారిన పడిన పోసాని..  ఆసుపత్రిలో చికిత్స

Apr 14 2023 9:37 AM | Updated on Apr 14 2023 10:04 AM

Posani Krishna Murali Hospitalized Due To COVID 19 - Sakshi

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా పూణె వెళ్లిన ఆయన నిన్న(గురువారం)హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఈ క్రమంలోనే లక్షణాలు ఉండటంతో టెస్ట్‌ చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. అయితే పోసానికి కోవిడ్‌ సోకడం ఇది మూడోసారి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన పోసాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement