shooting
-
ఒడిశాలో షూటింగ్ పై వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి
-
ఇలాంటి ప్రాంతాలను రక్షించుకోవడం మన బాధ్యత: ఎస్ఎస్ రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్యాకప్ చెప్పేసింది. దీంతో మూవీ టీమ్ అంతా తమ లోకేషన్ నుంచి తిరుగుపయనమయ్యారు. ప్రియాంక చోప్రా తాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ షూటింగ్ లోకేషన్ సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్లు వెల్లడించారు. పైనుంచి చూస్తే అత్యంత ఉల్లాసభరితంగా అనిపించిందని ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలి.. ఒక ఒక్కరూ పౌరుడు బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుంది... ప్రతి సందర్శకుడు ఇలాంటి ఆహ్లాదకరమైన స్థలాలను రక్షించడంలో సహాయపడటానికి మీ వ్యర్థాలను తిరిగి మీరే తీసుకువెళ్లాలని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Had an amazing solo trek to Deomali, Odisha’s highest and most stunning peak. The view from the top was absolutely breathtaking.However, it was disheartening to see the trail marred by litter. Such pristine wonders deserve better. A little civic sense can make a huge… pic.twitter.com/8xVBxVqQvc— rajamouli ss (@ssrajamouli) March 19, 2025 -
నిర్మాతగా సమంత తొలి సినిమా.. ఫోటోలు షేర్ చేసిన సామ్
-
SSMB 29 మూవీ మేకింగ్ సీన్స్.. వీడియో వైరల్
-
పార్లమెంట్‌కు రామ్ చరణ్.. ఎందుకంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్సీ16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చెర్రీ. తన కూతురు క్లీంకారతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ షెడ్యూల్ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
జాతీయ కోచ్‌గా భారత దిగ్గజ షూటర్
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా తిరిగి కోచ్‌గా జాతీయ షూటింగ్ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ).. జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్’ కోచ్‌గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్‌ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేసింది.జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్ కప్ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్ చాంపియన్íÙప్ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ శిక్షణ ఇవ్వనున్నాడు.రైఫిల్ విభాగానికి హెడ్ కోచ్‌గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్‌పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్ఆర్ఏఐ 16 మంది కొత్త కోచ్‌లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.పిస్టల్ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్కు అమరిందర్ చీమ, ట్రాప్‌కు వర్ష తోమర్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్లుగా మాన్షేర్ సింగ్, రోనక్ పండిట్‌ను ఎన్ఆర్ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్ చండేల్ (ఎయిర్ రైఫిల్), అన్వర్ సుల్తాన్ (ట్రాప్), మనోజ్ కుమార్ (50 మీటర్ల రైఫిల్) హై పెర్ఫార్మెన్స్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. -
కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి -
కందిపోయిన సుందరి
ఎండ తాకిడిని లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొంటున్నారు జాన్వీ కపూర్. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభమైంది. సిద్ధార్థ్, జాన్వీలతోపాటు ప్రధాన తారాగణంపాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే అక్కడి లొకేషన్స్‌లో తీవ్రమైన ఎండ ప్రభావం కారణంగా తన చర్మం కందిపోయినట్లుగా సోషల్ మీడియాలో ‘బర్ట్ట్న్’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు జాన్వీ కపూర్. ఈ ఫోటోను బట్టి ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తీవ్రమైన ఎండ వేడిమిని కూడా తట్టుకుంటూ షూటింగ్లోపాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మా సుందరి కందిపోయిందన్నట్లుగా కొందరు నెటిజన్లు, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, సౌత్ అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది. -
‘మోనాలిసా’ ఫొటోషూట్..ఆశ్చర్యపోతున్న ఫొటోగ్రాఫర్
కోల్‌కతా:మహాకుంభమేళాలో పాపులర్ అయిన తేనేకళ్ల మోనాలిసా గురించి ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం 2022లో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో పరికర్మ అనే సినిమా చిత్రీకరిస్తున్నపుడు ఆ షూటింగ్ చూసేందుకు మోనాలిసా వచ్చింది. ఆకట్టుకునే కళ్లతో పాటు విలక్షణమైన మోనాలిసా ముఖ కవలికలు ఆ సినిమా యూనిట్‌ను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు పనిచేసిన ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి మోనాలిసాను చూశారు. ఆమెలోని కట్టిపడేసే ఆకర్షణకు ముగ్ధులయ్యారు. వెంటనే మోనాలిసాతో ఫొటో సెషన్ చేయాలని డిసైడయ్యారు. ఫొటోలు తీసకునేందుకు మోనాలిసాను ఒప్పించారు. ఇంకేముంది షూటింగ్ భోజన విరామ సమయంలో మోనాలిసా ఫోజులను తన కెమెరాలో బంధించారు. సినిమా షూటింగ్ పూర్తయి కోల్‌కతాకు వచ్చిన వెంటనే మోనాలిసా ఫొటోలను సంజీత్ సోషల్‌మీడియాలో కూడా పోస్టు చేశారు.అయితే ప్రస్తుతం కుంభమేళాలో పూసలమ్ముకునేందకు వెళ్లిన మోనాలిసా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసి ఫొటోగ్రాఫర్ సంజీత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మోనాలిసా రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందని ఫొటోగ్రాఫర్ అన్నారు.కాగా, కుంభేళాలో వచ్చిన పాపులారిటీతో తాజాగా మోనాలిసాకు ఏకంగా బాలీవుడ్లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే మోనాలిసాకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.సినిమాలో నటించడం కోసం మేకప్ వేసుకుని వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే మోనాలిసా ప్రస్తుతం ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఏదేమైనా కుంభమేళా మోనాలిసా ఫేట్‌ను మార్చేసి బాలీవుడ్లో సినిమా ఆఫర్ వచ్చేలా చేసింది. -
ఎముకలు కొరికే చలిలో షూటింగ్.. పట్టువదలని విక్రమార్కుడిలా స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి(Vidaamuyarchi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లోనూ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీని అజర్ బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇందులో కారుతో అజిత్ కుమార్ కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఓసారి అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి కిందపడిపోయింది. అజిత్ కుమార్‌కు కారు రేసింగ్‌తో రియల్ స్టంట్స్ చేయడమంటే సరదా. అలా సినిమాల్లోనూ డూప్ లేకుండానే రియల్‌గా కొన్ని సీన్స్ చేస్తుంటారు.తాజాగా విదాముయార్చి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. విదాముయార్చి షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అజిత్ కుమార్ స్టంట్స్‌తో పాటు.. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఈ మూవీని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.The toughest challenges forge the greatest triumphs! 🔥 Step behind the scenes of VIDAAMUYARCHI 💪 Pushing limits in the harshest terrains. ⛰️🔗 https://t.co/WPFLwCykLRFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/haDfk8fono— Lyca Productions (@LycaProductions) February 3, 2025 -
HYD: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీకి పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి1) కాల్పలు కలకలం రేపాయి. ఇక్కడున్న ఒక పబ్‌కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్‌కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. మొత్తం రెండు రౌండ్లు పాత నేరస్తుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, కానిస్టేబుల్ వెంకట్రామ్‌రెడ్డికి గాయాలయ్యాయి. అయితే చివరకు ఆ పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
డాకు మహారాజ్లో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ స్టిల్స్ (ఫోటోలు)
-
యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.స్థానిక నేతల సీరియస్సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.చిత్రబృందంతో వాగ్వాదం..అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్‌పూర్‌లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. -
అమెరికాలో కాల్పులు..హైదరాబాద్ యువకుడి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా -
ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం
పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం (సరబ్జోత్ సింగ్‌తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. -
ష్... ఎగ్జామ్ ప్రిపరేషన్..!
సినీరంగంలో రాణించాలనే లక్ష్యం ఉన్నంత మాత్రాన అకాడమిక్ జర్నీని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది పెద్ద కళ. ఆ కళలో రాషా ఆరితేరింది.ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ(Rasha Thadani) ‘ఆజాద్’(Azzad) సినిమాతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేయనుంది. ‘ఆజాద్’ సెట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో సినిమా సెట్స్‌లో మేకప్‌లో ఉన్న రాషా 12వ తరగతి ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతూ కనిపిస్తుంది. జాగ్రఫీ పరీక్ష కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్న రాషా వీడియోను చూసి నెటిజెనులు ప్రశంసలు కురిపించారు. ‘ఎంతైనా చదువు చదువే. సినిమాల్లోనే కాదు అకడమిక్‌గా కూడా రాషా విజయం సాధించాలి’ అని ఆశీర్వదించారు. (చదవండి: కలల మేఘంపై అనూజ..) -
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది. -
వనితదే చరిత
చరిత్ర సృష్టించిన విజేతలు కాలం దారిలో వెలిగే దీపాలు అవుతారు. ఎంతోమందిని తమ బాటలో నడిపించే ఉత్తేజం అవుతారు. క్రీడల నుంచి సైన్యం వరకు వివిధ రంగాలలో 2024లో ‘శభాష్’ అనిపించుకోవడమే కాదు చరిత్ర సృష్టించారు మహిళలు...పవర్ఫుల్ బుల్లెట్హరియాణ లోని ఝుజ్జర్ జిల్లాకు చెందిన మను బాకర్ చిన్న వయసులోనే వివిధ ఆటల్లో అద్భుత ప్రతిభాసామర్థ్యాలు చూపింది. షూటింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్లాంటి వివిధ విభాగాలలో రాణించింది. ‘షూటింగ్’లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత షూటర్ల వరుసలో చేరింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.పట్టుదల ఉంటే ప్రతికూలతలు పారిపోతాయిప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే... దృఢ సంకల్పం, నిబద్ధత ఉంటే తిరుగులేని విజయాలు సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవని లేఖర. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. నిరాశ నిండిన ఆ చీకటిలో అవని విల్‌పవర్ కోల్పోయి ఉంటే విజయాలు సాధించి ఉండేది కాదు. స్తబ్దత నుంచి బయటపడడానికి తండ్రి సలహాతో క్రీడల వైపు వచ్చింది. పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణపతకం గెల్చుకొని మన దేశంలోని ప్రసిద్ధ పారాలింపియన్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అవని రెండోస్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.స్ఫూర్తినిచ్చే తేజంభారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్‌పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ చరిత్ర సృష్టించింది. జోద్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్ శక్తి’ సైనిక విన్యాసాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. సాయుధ దళాలలో జెండర్ బ్యారియర్స్‌ను విచ్ఛిన్నం చేసిన అద్భుతం అది.రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో సైనిక కుటుంబంలో పుట్టిన మోహనాసింగ్కు ఫైటర్ పైలట్ కావాలని కోరిక. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ్రపోగ్రామ్(2016)లో అవనీచతుర్వేది, భావనా కాంత్‌తో కలిసి చేరిన మొదటి మహిళల్లో మోహన ఒకరు. ఐఏఎఫ్ హాక్ ఎంకే.132 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్లలో పూర్తిస్థాయి ఆపరేషన్ స్టేటస్ సాధించిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డ్ సృష్టించింది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ కాంబాట్ మోడ్స్లోప్రావీణ్యం సాధించింది. -
Manu Bhaker: నేను చేసిన తప్పు అదే.. అందుకే ఇలా!
తన కూతురిని ‘షూటర్’గా తీర్చిదిద్ది తప్పుచేశామంటూ మనూ భాకర్(Manu Bhaker) తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను క్రికెటర్‌ను చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు.కాగా భారత ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అత్యుతన్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’(Major Dhyan Chand Khel Ratna). ఇందుకు సంబంధించిన అవార్డు కమిటీ సోమవారం నామినీల పేర్లను ప్రకటించగా.. అందులో మనూ భాకర్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మనూ తండ్రి రామ్ కిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నా బిడ్డ ఇంకేం చేయాలి?‘‘ఇప్పటి వరకు భారత్ తరఫున ఎవరూ సాధించని ఘనత నా కూతురు సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతకంటే దేశం కోసం నా బిడ్డ ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించాలి కదా!.పతకాలు గెలవకుంటేనే బాగుండేదిఈ విషయం గురించి నేను మనూతో మాట్లాడాను. తన మనసంతా బాధతో నిండి ఉంది. ‘నేనసలు దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించకపోయి ఉంటే.. ఈ బాధ ఉండేదే కాదు. అసలు క్రీడాకారిణిని కాకపోయే ఉంటే ఇంకా బాగుండేది’ అని తను నాతో అన్నది’’ అని రామ్ కిషన్ భాకర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తమ ఆవేదనను పంచుకున్నారు.బాహ్య శక్తుల ప్రభావం ఉంది!ఇక దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చినా గుర్తింపు దక్కకపోవడం చూస్తుంటే.. కమిటీపై బాహ్య శక్తుల ప్రభావం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదని రామ్ కిషన్ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.కాగా హర్యానాకు చెందిన రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024(Paris Olympics 2024)లో రెండు మెడల్స్ గెలిచింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. హైదరాబాద్‌లో షూటింగ్!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శంబాల. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ సినిమాకు'ఏ' యాడ్ ఇన్ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు.ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ మూవీలో శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
బాదల్‌పై కాల్పులు..కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ చౌరా సిక్కు జాతి రత్నం అని కొనియాడారు. నరేన్‌కు న్యాయ సహాయం అందించాలని శిరోమణి గుర్ద్వారా ప్రబంధక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.నరేన్ కాల్పులు జరపడం వెనుక తన వ్యక్తిగత కారణాలేవీ లేవని, సిక్కుల మనోభావాలు దెబ్బతినడంపై ప్రతీకారం తీర్చుకున్నారన్నాడన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు బాదల్ ప్రభుత్వం సిక్కులు పవిత్రంగా భావించే శ్రీ గురు గ్రాంత్ సాహిబ్‌ను అపవిత్రం చేయడమే కాకుండా స్వర్ణ దేవాలయం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాదల్ చేసిన తప్పుల ఫలితంగానే కాల్పులు జరిగాయని తెలిపారు. నరేన్ టార్గెట్ స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్ సాహిబ్ కాదని కేవలం సుఖ్బీర్ సింగ్ బాదలేనని చెప్పారు. అయితే హింసకు పాల్పడడాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు బిట్టు తెలపడం గమనార్హం. ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయంలో కాల్పులు -
ఎనిమిది రాష్ట్రాలు.. నాలుగు దేశాలు.. 14 నెలల జర్నీ: మోహన్ లాల్
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్‌కు సీక్వెల్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.మోహన్ లాల్ తన ట్వీట్లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.' అని రాసుకొచ్చారు.కాగా.. లూసిఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.That’s a wrap for L2: Empuraan!What an incredible 14-month journey across 8 states and 4 countries, including the UK, USA, and UAE.This film owes its magic to the brilliant direction of Prithviraj Sukumaran whose creativity elevates every frame. A big thank you to Murali Gopy… pic.twitter.com/6bnuItDlxd— Mohanlal (@Mohanlal) December 1, 2024 -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి
సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
ఉమాన్: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం దుండగులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగాముగ్గురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామని,ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. ఎంబసీ సమీపంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ప్రాంతంలో పలుమార్లు నిరసనలు జరిగాయని పోలీసులు తెలిపారు.2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను హత్య చేయడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 44 వేల మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా చెబుతోంది. కాగా మరోవైపు ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య కాల్పుల విరమణ కోసం కొద్ది కాలంగా చర్చలు జరుగుతున్నాయి.ఇదీ చదవండి: భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్ -
షూటింగ్ సెట్లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న హంటర్ వెబ్ సిరీస్ సెట్స్‌లో గాయపడినట్లు సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు తగిలిందని తెలిపారు. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సునీల్ శెట్టికి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాకు చిన్న గాయం మాత్రమే తగిలిందని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని పోస్ట్ చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని అభిమానులను కోరారు. మీ అందరి ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.కాగా.. హంటర్ వెబ్ సిరీస్‌ను ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా డియోల్, బర్ఖా బిష్త్, కరణ్వీర్ శర్మ, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత వెల్కమ్ టు ది జంగిల్ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, సంజయ్ దత్లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.Minor injury, nothing serious! I'm absolutely fine and ready for the next shot. Grateful for all the love & care 🙏❤️ #OnSet— Suniel Shetty (@SunielVShetty) November 7, 2024 -
లక్కీ భాస్కర్‌తో 'మీనాక్షి చౌదరి' రొమాన్స్.. షూటింగ్ ఫోటోలు చూశారా..?
-
మైసూర్లో రామ్‌చరణ్,జాన్వీకపూర్ ప్రయాణం
హీరో రామ్‌చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
‘ఆప్’ నేతపై కాల్పులు..బుల్లెట్ గాయం
చండీగఢ్:పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మన్దీప్ సింగ్ బ్రార్ కాల్పుల్లో గాయపడ్డారు.ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్‌నేత మన్‌దీప్‌సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపనలున్నాయి. ఆదివారం(అక్టోబర్6) అకాలీదళ్ నాయకుడు వర్దేవ్ సింగ్ మాన్ ఓ స్కూల్‌కు సంబంధించిన ఫైల్ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు.ఆ ఫైల్ చూపించేందుకు అధికారులు నిరాకరించడంతో సింగ్ అక్కడినుంచి వెనుదిరిగారు. వెళుతు వెళుతూ బయట ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ బ్రార్‌తో సింగ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఆప్‌నేత మన్‌దీప్‌కు బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అకాలీ పార్టీ నాయకులే కాల్పులకు ఆప్ నేతలు ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో అకాళీదళ్ పార్టీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ నెల 15న పంజాబ్‌లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం -
ముకేశ్ పాంచ్ పటాకా
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మన షూటర్లు క్లీన్‌స్వీప్ చేస్తూ మూడు పతకాలు ఖాతాలో వేసుకోగా... ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి ఓవరాల్‌గా ఐదో పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు గెలిచిన గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్... పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. భారత్‌కే చెందిన సూరజ్ శర్మ 571 పాయింట్లతో బంగారు పతకం కైవసం చేసుకోగా... 568 పాయింట్లతో ముకేశ్ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల ఫైనల్లో దివాన్షి 564 పాయింట్లు సాధించి అగ్ర స్థానం దక్కించుకోగా... భారత్‌కే చెందిన పారిశా గుప్తా 557 పాయింట్లతో రజత పతకం సాధించింది. ఇదే విభాగంలో భారత షూటర్ మాన్వి జైన్ 557 పాయింట్లతో కాంస్యం దక్కించుకోవడంతో మూడు పతకాలు మన ఖాతాలోనే చేరాయి. దీంతో ఈ టోర్నీ చరిత్రలో భారత షూటర్లు తొలిసారి ఒక విభాగంలో మూడు పతకాలను క్లీన్‌స్వీప్ చేసిన ఘనత సాధించారు. దివాన్షికి ఈ పోటీల్లో ఇది ఐదో పతకం కావడం విశేషం. ఈ టోరీ్నలో భారత్ 21 పతకాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, రెండు రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. -
ముకేశ్ ఖాతాలో నాలుగో స్వర్ణం
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో 11వ స్వర్ణ పతకం చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నెలవల్లి, రాజ్వర్ధన్ పాటిల్, హర్సిమర్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1722 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ముకేశ్, రాజ్వర్ధన్ 579 పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... హర్సిమర్ 564 పాయింట్లు సాధించాడు. ముకేశ్, రాజ్వర్ధన్ వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ పోటీపడ్డారు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజ్వర్ధన్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ముకేశ్ 10 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ ఈ టోరీ్నలో నిలకడగా రాణించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో భారత్ 11 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
జాతీయ రైఫిల్ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్
న్యూఢిల్లీ: జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ ఎన్నికయ్యారు. శనివారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన రైఫిల్ సంఘం జనరల్ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కొన్నాళ్లుగా కాళికేశ్ ఎన్ఆర్ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఎవరైనా గరిష్టంగా 12 ఏళ్లకు మించి పదవుల్లో ఉండటానికి వీలు లేదు. దీంతో 2010 నుంచి 2022 వరకు పలు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికైన రణీందర్ సింగ్ గతేడాది కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.అప్పటినుంచి సీనియర్ ఉపాధ్యక్షుడైన కాళికేశ్ జాతీయ రైఫిల్ సంఘం వ్యవహారాలను చక్కబెట్టారు. తాజా ఎన్నికతో ఆయన 2025 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆయన తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన హయాంలోనే పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. అంతకుముందు జరిగిన రియో–2016, టోక్యో–2020 ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఒక్క పతకం కూడా గెలుపొందలేకపోయారు. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
Paris Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. రుబీనాకు కాంస్యం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. షూటింగ్ విభాగంలో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రుబీనా.. ఫైనల్లో 211.1 స్కోర్‌తో మూడో స్ధానంలో నిలిచి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సారే జవాన్‌మర్డి 236.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. టర్కీ షూటర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం కైవసం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించాయి. అందులో నాలుగు పతకాలు షూటర్లు సాధించినవే కావడం గమనార్హం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించిగా.. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. BRONZE 🥉 For INDIA 🇮🇳Rubina Francis wins bronze medal in the Women's 10m Air Pistol SH1 Final with a score of 211.1⚡️#Paris2024 #Cheer4Bharat #Paralympic2024 #ParaShooting@mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/iSBUZ6KNS7— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2024 -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
అవని అద్వితీయం
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్‌కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్‌లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.మూడు రౌండ్లలో మనీష్ 234.9 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన జియోంగ్డు జో గోల్డ్‌మెడల్ సొంతం చేసుకోగా.. చైనా షూటర్ యాంగ్ చావో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.అంతకుముందు ఇవాళ(శుక్రవారం) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో మొత్తం 4 పతకాలు ఉన్నాయి. -
Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్లో భారత్‌కు స్వర్ణం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారుపతకం సాధించింది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్ధానంలో నిలిచిన అవని.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా పారా ఒలింపిక్స్‌లో అవనీకి ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. టోక్యో పారాలింపిక్స్-2021లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 22 ఏళ్ల అవని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఆమె తన పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షూటర్‌గా అవని చరిత్ర సృష్టించింది.కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్..ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 🇮🇳🥇 UNSTOPPABLE! The defending champion Avani Lekhara clinches gold at the Paris Paralympics 2024, proving she's still on top!📷 Pics belong to the respective owners • #AvaniLekhara #Shooting #ParaShooting #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/advcNuWvYR— The Bharat Army (@thebharatarmy) August 30, 2024 -
ప్రభాస్ కల్కి సీక్వెల్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా కల్కి సీక్వెల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల రష్యాలోని మాస్కోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ వీక్‌లో నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కల్కి-2 షూటింగ్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా.. కల్కి మూవీని త్వరలోనే రష్యన్ భాషలోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రంలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. అంతేకాకుండా రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ మూవీలోని బుజ్జి కారుకు కీర్తి సురేశ్ వాయిస్ అందించారు. అయితేస పార్ట్-2లో కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు. దీంతో పార్ట్-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
కాకినాడలో మట్కా
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతోంది.‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ మేకోవర్లలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న షెడ్యూల్లో కీలక తారాగణంపై టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా దేవర పార్ట్-1కు సంబంధించిన ఎన్టీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చివరిదశ షూట్ జరుగుతోందని వెల్లడించారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని.. టీం అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు. సెప్టెంబర్ 27 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెట్లో డైరెక్టర్‌తో ఫోటో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB— Jr NTR (@tarak9999) August 13, 2024 -
Olympics: ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించిన సరబ్జోత్ సింగ్
ఒలింపిక్ పతక విజేత, షూటర్ సరబ్జోత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్యానా ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని తాను స్వీకరించలేనన్నాడు. తన దృష్టి మొత్తం షూటింగ్‌పైనే కేంద్రీకృతమై.. ఉందని అందుకే ఈ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపాడు. తాను ముందే కొన్ని కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నానని.. వాటికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగం ఇదే కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి మూడోస్థానంలో నిలిచిన ఈ హర్యానా అథ్లెట్.. తొలిసారి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అతడికి క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ పదవిని ఆఫర్ చేసింది.కారణం ఇదేఅయితే, సరబ్జోత్ సింగ్ మాత్రం ఇందుకు నో చెప్పాడు. ఒలింపిక్ పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చిన 22 ఏళ్ల సరబ్జోత్ అంబాలాలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘ఇది మంచి ఉద్యోగమే. కానీ ఇప్పుడు దీనిని స్వీకరించలేను. షూటింగ్‌పైనే మరింతగా దృష్టి సారించాలనుకుంటున్నాను.నా కుటుంబం కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటోంది. అయితే, నేను షూటర్‌గానే కొనసాగాలని భావిస్తున్నాను. నా లక్ష్యాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతం ఈ జాబ్ చేయలేను’’ అని సరబ్జోత్ సింగ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కాగా రైతు కుటుంబంలో జన్మించిన సరబ్జోత్ ఎన్నో కష్టాలు దాటి షూటర్‌గా ఎదిగాడు. చదవండి: ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్‌గా ఒలింపిక్ మెడల్ #WATCH | Ambala, Haryana: On Haryana government's offer of the post of Deputy Director in the Sports Department, Indian Shooter and Olympic Athlete Sarabjot Singh says, "The job is good but I will not do it right now. I want to work on my shooting first. My family has also been… pic.twitter.com/XU7d1QdYBj— ANI (@ANI) August 10, 2024 -
స్టైలిష్ యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న మూవీ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.ఈ కీలకమైన షెడ్యూల్లో అజిత్‌తోపాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హీరో సూర్య తలకు గాయం.. నిర్మాత క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ సూర్య44 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో హీరో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్‌లో వార్తలు రావడంతో ఫ్యాన్స్‌కు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్న ట్విటర్ వేదికగా పంచుకున్నారు.నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని.. అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా.. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.Dear #AnbaanaFans, It was a minor injury. Pls don’t worry, Suriya Anna is perfectly fine with all your love and prayers. 🙏🏼— Rajsekar Pandian (@rajsekarpandian) August 9, 2024 -
Olympics: ఒక్క పాయింట్.. భారత్ చేజారిన కాంస్యం
భారత షూటర్లు అనంత్ జీత్ సింగ్ నరౌకా- మహేశ్వరి తృటిలో కాంస్యం చేజార్చుకున్నారు. స్కీట్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన భారత ద్వయం.. మెడల్ కోసం చైనాతో జరిగిన ప్లే ఆఫ్స్‌లో ఆఖరి వరకు పోరాడింది.అయితే, ఆరంభంలో కాస్త తడబడ్డా భారత జోడీ తిరిగి పుంజుకుంది. కానీ..ఆది నుంచి పొరపాట్లకు తావివ్వని చైనా జోడీ జియాంగ్ యితింగ్- లియు జియాన్లిన్ పతకం ఖాయం చేసుకున్నారు. ఫలితంగా.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో నాలుగో స్థానానికి పరిమితమైన అనంత్ జీత్ సింగ్ నరౌకా- మహేశ్వరి రిక్తహస్తాలతో వెనుదిరగనున్నారు.స్కీట్ మిక్స్డ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ జరిగిందిలారెండు జోడీలు... తలా నాలుగు షాట్లు.. షాట్లో సఫలమైతే ఒక్కో షూటర్‌కు ఒక్కో పాయింట్👉ఫస్ట్ స్టేషన్రెండు జోడీల్లో కలిపి అనంత్ జీత్ సింగ్ ఒక్కడి షాట్ మిస్ఇండియా 7 పాయింట్లు- చైనా ఎనిమిది పాయింట్లు👉సెకండ్ స్టేషన్మహేశ్వరి, అనంత్ ఒక్కో షాట్ మిస్యితింగ్ మూడు షాట్లు మిస్13- 13తో స్కోరు సమం చేసిన భారత్👉థర్డ్ స్టేషన్మహేశ్వరి, యితింగ్ ఒక్కో షాట్ మిస్20-20తో సమంగా భారత్- చైనా👉ఫోర్త్ స్టేషన్నాలుగు షాట్లలో అనంత్ సఫలంఒక షాట్ మిస్ అయిన మహేశ్వరిచైనా జోడీకి ఎనిమిదికి ఎనిమిది పాయింట్లుస్కోరు: 28-27తో ముందంజలో చైనా👉ఫిఫ్త్ స్టేషన్మహేశ్వరి- అంకిత్.. నాలుగు షాట్లలో నాలుగూ సఫలంచైనా జోడీ కూడా అన్ని షాట్లలో సఫలం36-35తో ఆధిక్యంలో చైనా👉సిక్త్స్ స్టేషన్నాలుగు షాట్లలో సఫలమై ఎనిమిది పాయింట్లు సాధించిన చైనా జోడీ.. ఓవరాల్‌గా 44 పాయింట్లునాలుగు షాట్లలో సఫలమై ఎనిమిది పాయింట్లు సాధించిన భారత జోడీ.. ఓవరాల్‌గా 43 పాయింట్లుఒక్క పాయింట్ తేడాతో భారత జోడీ చేజారిన కాంస్యం. -
అల్లు అర్జున్ 'పుష్ప-2'.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. దాదాపు మరో నెల రోజుల పాటు షూటింగ్ పూర్తి కావాల్సి ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. డిసెంబర్ 6న తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తామంటూ మరోసారి రిలీజ్ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇటీవల పుష్ప-2 మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందువల్లే పుష్ప టీమ్ షూటింగ్ అప్డేట్ను ప్రేక్షకులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. Shoot Update :#Pushpa2TheRule is currently shooting a spectacular action episode for the climax🔥🔥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/X5haaasHAj— Pushpa (@PushpaMovie) August 5, 2024 -
Olympics 2024: హార్ట్ బ్రేక్.. మనూ చేజారిన పతకం
Paris Olympics 2024: భారత యువ షూటర్ మనూ భాకర్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. నిరాశే మిగిలింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తాజాగా.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక రేసులో మనూ నిలిచింది. అయితే, ఆదిలో కాస్త వెనుకబడ్డా.. తర్వాత తిరిగి పుంజుకున్న మనూ.. కాంస్య పతకానికి చేరువగా వచ్చింది. అయితే, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన ఎలిమినేషన్ ప్లే ఆఫ్‌లో దురదృష్టవశాత్తూ మనూ ఓడిపోయింది. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ భారతీయలు మనసులు గెలుచుకుంది. మనూ ప్రయాణం సాగిందిలా..👉మొత్తం 3 సిరీస్‌లు- 5 షాట్ల చొప్పున మొత్తం 15 షాట్లు👉తొలి సిరీస్👉శుభారంభం అందుకోలేకపోయిన మనూ.. 👉ఐదింటిలో రెండు సఫలం👉ఆరు పాయింట్లతో రేసులోకి వచ్చిన మనూ.. 8 పాయింట్లతో టాప్‌లో సౌత్ కొరియా షూటర్👉రెండో సిరీస్👉ఐదింటిలో 4 సఫలం.. రెండోస్థానానికి చేరిన మనూ👉తొలి ఎలిమినేషన్- యూఎస్ఏ షూటర్ కేటలిన్ మోర్గాన్ రేసు నుంచి అవుట్👉ఆరోస్థానానికి పడిపోయిన మనూ భాకర్👉మూడో సిరీస్👉ఐదింటిలో ఐదూ సఫలం.. మూడో స్థానంలోకి మనూ భాకర్👉ఇరానియన్ షూటర్ రోస్తమియాన్ అవుట్..రెండో స్థానంలో మనూ👉ఐదింట నాలుగు సఫలం- రెండో స్థానంలోనే మనూ👉చైనా షూటర్ నాన్ జావో ఎలిమినేట్👉మూడో స్థానానికి పడిపోయిన మనూ👉మూడో స్థానం కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మనూ ఓటమి👉నాలుగోస్థానంలో సరిపెట్టుకున్న మనూ👉కాంస్య పతక రేసు నుంచి కూడా మనూ అవుట్నాలుగో స్థానంలోసౌత్ కొరియా షూటర్ జిన్ యాంగ్‌కు స్వర్ణంఫ్రాన్స్ షూటర్ కమిలె జెద్రెజెజ్వ్స్కికి రజతంహంగేరీ షూటర్ వెరోనికాకు కాంస్యంనాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే👉మనూ భాకర్- షూటింగ్- రెండు కాంస్యాలు- ప్యారిస్ ఒలింపిక్స్-2024👉నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్- ఇండియన్)- అథ్లెటిక్స్- రెండు రజతాలు- ప్యారిస్ ఒలింపిక్స్- 1900 పారిస్👉సుశీల్ కుమార్- రెజ్లింగ్- ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్- 2012 👉పీవీ సింధు- బ్యాడ్మింటన్- ఒక రజతం, ఒక కాంస్యం- రియో ఒలింపిక్స్- 2016, టోక్యో ఒలింపిక్స్- 2020 -
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో...
పారిస్: ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల విజయగాథలే కాదు... వీటిలో పాల్గొనే వారిలో ఎన్నో భిన్నమైన, ఆసక్తికర నేపథ్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వెనిజులాకు చెందిన షూటర్ లియోనెల్ మార్టినెజ్ పారిస్‌లో ట్రాప్ ఈవెంట్లో పోటీ పడ్డాడు. ఓవరాల్‌గా 28వ స్థానంతో ముగించాడు. అయితే అతను పోటీల్లో పాల్గొనడం విశేషం కాదు... 60 ఏళ్ల వయసున్న మార్టినెజ్ 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగడమే అసలు ఘనత! 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మార్టినెజ్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆటకు దూరమై పలు వ్యాపారాల్లో స్థిరపడ్డాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ షూటింగ్ వైపు మనసు మళ్లింది. మొదటి నుంచి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న మారి్టనెజ్కు మరోసారి క్రీడల్లోకి అడుగు పెట్టడం కష్టం కాలేదు. తన షూటింగ్‌కు పదును పెట్టుకున్న అతను 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలనేదే మారి్టనెజ్ తర్వాతి లక్ష్యం. అప్పటికి 64 ఏళ్లు వచ్చినా సరే... ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను అంటూ అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మారి్టనెజ్కు ముందు జపాన్ ఈక్వె్రస్టియన్ ఆటగాడు హొకెసు హిరోషి మాత్రమే రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం (44 ఏళ్లు) తీసుకున్నవాడిగా నిలిచాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. -
Paris Olympics 2024: స్వప్నిల్ కుసాలేకు ప్రమోషన్
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు రైల్వే శాఖ పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పుణె డివిజన్లో 2015లో కమర్షియల్–కమ్–టికెట్ క్లర్క్‌గా చేరిన కుసాలే ప్రస్తుతం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా పనిచేస్తున్నారు. ఒలింపిక్ పతక విజేతకు ప్రోత్సాహకంగా అతన్ని టీటీఈ నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమిస్తూ ప్రమోషన్ ఆర్డర్‌ను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇకపై కుసాలే ముంబైలోని స్పోర్ట్స్ సెల్‌కు ఓఎస్డీగా వ్యవహరిస్తాడు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం స్వప్నిల్‌కు రూ. 1 కోటి నజరానా ప్రకటించింది. -
Sift Kaur Samra: మెడిసిన్ వదిలేసి మెడల్ కోసం...
ఒలింపిక్స్‌కు సంబంధించి ‘పతకాల వేట’ మాట ఎలా ఉన్నా... స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయి. ఆ కథల్లో ఒకటి... సిఫ్త్ కౌర్ సమ్రా ప్రయాణం. డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు కౌర్. షూటర్ అయింది. ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో మెరిసి దేశం దృష్టిని ఆకర్షించింది. ‘టైమ్ మేనేజ్మెంట్’పై గట్టి పట్టు ఉన్న కౌర్ ఒలింపిక్స్ వరకూ వచ్చింది...పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సిఫ్త్ కౌర్ సమ్రాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంత ఇష్టమో, ఆటలూ అంతే ఇష్టం. తొమ్మిది సంవత్సరాల వయసులో కౌర్‌కు కరణ్ అనే కజిన్ షూటింగ్లో ఓనమాలు నేర్పించాడు. గురి చూసి కొట్టే నైపుణ్యం అప్పటి నుంచే అబ్బింది. ఎంబీబీయస్ చేయాలన్న ఆమె లక్ష్యం కూడా గురి తప్పలేదు. ఫరీద్‌కోట్‌లోని జీజీఎస్ మెడికల్ కాలేజీలో చేరింది. చదువు సంగతి ఎలా ఉన్నా... షూటింగ్ గేమ్స్ ఎక్కడ జరిగినా ఠంచనుగా ఫాలో అయ్యేది. భో΄ాల్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం గెలుచుకోవడం తో ‘మెడికలా? మెడలా?’ అనే సందిగ్ధంలోకి వచ్చింది కౌర్. ‘మెడల్’ అనేది ‘షూటింగ్’కు ప్రతీక.చివరికి ఆమె మెడల్ వైపే మొగ్గింది. ‘కాలేజీలో 80 శాతం అటెండెన్స్’ నియమం వల్ల ్ర΄ాక్టీస్ చేయడానికి, ΄ోటీల్లో ΄ాల్గొనడానికి ఇబ్బందిగా ఉండేది. తాను పూర్తిగా షూటింగ్ వైపు రావాలనుకోవడానికి ఇదొక కారణం. అందరూ కౌర్‌ను ‘కాబోయే డాక్టరమ్మ’ అని పిలుచుకుంటున్న రోజుల్లో...‘చదువు మానేసి పూర్తి సమయం షూటింగ్‌కే కేటాయించాలి అనుకుంటున్నాను’ అని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు షాక్ అవ్వకుండా ‘అలాగే అమ్మా! నీ ఇష్టం’ అని చె΄్పారు. అలా చెప్పడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. కూతురుపై అంతకుమించిన నమ్మకం కావాలి. ఆ నమ్మకం వారికి ఉంది. ఆ నమ్మకం పునాదిపై షూటింగ్లో తన కెరీర్‌ను నిర్మించుకుంది కౌర్.2023 ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ 3 ΄÷జిషన్‌లో వరల్డ్ రికార్డ్ స్కోర్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్న సిఫ్త్ కౌర్ సమ్రా పేరు మారుమోగి΄ోయింది.50 మీ. ఎయిర్ రైఫిల్ 3 ΄÷జిషన్స్లో పర్ఫెక్ట్ స్కోర్ కోసం టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. టైమ్ మేనేజ్మెంట్పై కౌర్‌కు మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనే ఆమె విజయ కారణాలలో ఒకటి. ఒత్తిడికి గురవుతున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి...అనే టెక్నిక్ కూడా కౌర్‌కు బాగా తెలుసు. తన గురించి ‘యాక్సిడెంటల్ షూటర్’ అని చెప్పుకుంటుంది కౌర్. అయితే ఆమె విజయాలు యాక్సిడెంటల్‌గా రాలేదు. చెమట చిందించి సాధించిన విజయాలు అవి.‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి.’ అని అడిగితే...‘మ్యాచ్‌లు అనేవి ్ర΄్టాకిస్ సెషన్లకు రీ నేమ్డ్ వెర్షన్లు మాత్రమే...అని ఒకసారి కోచ్ నాతో చె΄్పారు. ఇక అప్పటి నుంచి ఆ మంత్రాన్ని అనుసరిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది సిఫ్త్ కౌర్ సమ్రా. -
కంటిచూపుతో...
టీ షర్ట్‌తో క్యాజువల్ లుక్... ఎడమ చేయి ప్యాంట్ జేబులో... లక్ష్యాన్ని స్పష్టంగా చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన లెన్స్‌లు లేవు, ఐ కవర్ లేదు, పక్కనుంచి వచ్చే కాంతి నుంచి తప్పించుకునేందుకు వైజర్ పెట్టుకోలేదు, ఇయర్ ప్రొటెక్షన్ లేదు. లక్ష్యంపై గురి...ట్రిగ్గర్‌పై వేలు... నొక్కితే దేశానికి రజత పతకం వచ్చేసింది! టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ ఒక్కసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. సాధారణంగా షూటర్లు పోటీలో దిగినప్పుడు తమతో పాటు ధరించే సరంజామా ఏదీ అతను వాడలేదు. ఏదో అలా వ్యాహ్యాళికి వెళుతూ బొమ్మ తుపాకీతో సంతలో బెలూన్లను కొట్టినంత అలవోకగా అతను బుల్లెట్లను దించేయడం విశేషం. టర్కీ ఆర్మీలో సైనికుడైన 51 ఏళ్ల యూసుఫ్ హాలీవుడ్ సినిమాల స్టయిల్‌ను గుర్తుకు తెచ్చేలా షూటింగ్ చేశాడంటూ కామెంట్లు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో తర్హాన్‌తో కలిసి యూసుఫ్ రజతం సాధించాడు. షూటింగ్లో టర్కీకి ఇదే తొలి మెడల్. -
Paris Olympics 2024: షూటింగ్లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..?
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు చెందిన స్వప్నిల్ కుసాలె కాంస్య పతకం సాధించాడు. ఈ పతకంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. భారత్ సాధించిన మూడు పతకాలు షూటింగ్లో సాధించనవే కావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత్ జోడీ కాంస్య పతకాలు సాధించారు.ఎవరీ స్వప్నిల్ కుసాలె..?29 ఏళ్ల స్వప్నిల్ కుసాలె మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు సమీపంలో గల కంబల్వాడి అనే గ్రామంలో పుట్టిపెరిగాడు. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అతనికి 12 ఏళ్లు పట్టింది. స్వప్నిల్ అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి ఔరా అనిపించాడు. ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్ స్వప్నిల్ కుసాలేనే కావడం విశేషం.మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని స్పూర్తితో..!స్వప్నిల్ కుసాలే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి ప్రేరణ పొందాడు. ధోనిని ఆరాధిస్తాడు. స్వప్నిల్ కూడా ధోనిలాగే కెరీర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్‌గా పని చేశాడు. ధోని బయోపిక్‌ను స్వప్నిల్ చాలాసార్లు చూశాడు. అతని స్పూర్తితో విజయాలు సాధించాలని కలలు కనేవాడు. ఎట్టకేలకు స్వప్నిల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.ధోనిలాగే ఓపికగా, ప్రశాంతంగా ఉంటాడు..!షూటర్‌కు ఓపిక, ప్రశాంతత చాలా అవసరం. ఈ రెండు లక్షణాలు స్వప్నిల్లో మెండుగా ఉన్నాయి. క్రికెట్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ధోనిలోనూ ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. వాస్తవానికి ధోని సక్సెస్‌కు ఈ రెండు లక్షణాలే ప్రధాన కారణం. అతనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అని బిరుదు కూడా ఉంది. ఇప్పుడు స్వప్నిల్ ధోనిని స్పూర్తిగా తీసుకుని భారత్‌కు పతకం సాధించి పెట్టాడు.స్వప్నిల్ కుటుంబ నేపథ్యంస్వప్నిల్ తండి, సోదరుడు ప్రభుత్వ టీచర్లు. స్వప్నిల్ తల్లి కంబల్వాడి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాడు. -
Olympics 2024: భారత్ ఖాతాలో మూడో పతకం
Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్ స్టార్.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు. 28 ఏళ్ల స్వప్నిల్ గురించి ఆసక్తికర అంశాలు..👉మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో గల కంబల్వాడీ గ్రామంలోని రైతు కుటుంబంలో జననం👉2009 నాటి క్రీడా ప్రభోదిని ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన స్వప్నిల్👉షూటింగ్‌పై మక్కువతో కఠిన సవాళ్లకు ఎదురీదిన స్వప్నిల్👉ఆసియా షూటింగ్ చాంపియన్స్(జూనియర్ కేటగిరీ) 2015లో స్వర్ణం👉59వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గగన్ నారంగ్‌ను ఓడించిన స్వప్నిల్👉61వ నేషనల్ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన స్వప్నిల్ -
ప్యారిస్ ఒలింపిక్స్ : ఈ షూటర్ స్టయిల్‌కి నెటిజన్లు ఫిదా ఫోటో వైరల్
ఒలింపిక్స్ క్రీడలు అంటే హోరా హోరీ పోటీలు, విజేతలు, రికార్డులు, పతకాలు. అంతేకాదు అరుదైన ఘట్టాలు, విశేషాలు ఇంకా చాలానే ఉంటాయి. తాజా ప్యారిస్ ఒలింపిక్స్‌లో టర్కీ ఒలింపిక్ షూటర్ ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. నాన్ ఈస్తటిక్ థింక్స్ అనే ఎక్స్ ఖాతా షేర్ చేసిన పోస్ట్ ఏకంగా 78 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఎలాంటి ఫ్యాన్సీ పరికరాలు లేకుండా, అతని స్పెషల్ లుక్స్ నెట్టింట చర్చకు దారి తీశాయి. పలు ఫన్నీ కామెంట్స్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. విషయం ఏమిటంటే..టర్కీ ఎయిర్ పిస్టల్ షూటర్ యూసుఫ్ డికేక్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 51 ఏళ్ల అథ్లెట్ తన జేబులో చేయి పెట్టుకుని స్టయిల్‌గా, క్యాజువ్ ఇయర్ బడ్స్‌తో ,మినిమల్ గేర్‌తో గురి చూస్తున్న ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. సాధారణంగా షూటర్లు రెండు ప్రత్యేకమైన లెన్స్‌లను ఉపయోగిస్తారు, ఒకటి బ్లర్‌ను నివారించడానికి, మరోటి మెరుగైన ఖచ్చితత్వం కోసం, అలాగే బయటి శబ్దాలు డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు స్పెషల్ హెడ్‌ఫోన్స్ ధరిస్తారు.కళ్లద్దాలు, బ్లర్‌ను నివారించడానికి లెన్స్‌లు, ఇయర్ ప్రొటెక్టర్లతో సహా ప్రత్యేకమైన ఇతర జాగ్రత్తలేవీ లేకుండా, పోటీదారులకు పూర్తి విరుద్ధంగా, యూసుఫ్ డికేక్ గురి పెట్టి విజేతగా నిలిచాడు. దీంతో నెటిజన్లు ప్రొఫెషనల్ హిట్‌మ్యాన్ అంటూ కమెంట్ చేశారు. ఇంకా మీమ్స్ , జోకులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. టర్కీ రహస్య గూఢచారిని లేదా హిట్‌మ్యాన్‌ని ఒలింపిక్స్‌కు పంపిందంటూ కొంతమంది ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించడానికి స్వర్ణం గెలవకుండా తప్పించుకున్నాడని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.టర్కీకి చెందిన యూసుఫ్ డికేక్ , సెవ్వల్ ఇలయిడా తర్హాన్ ఫ్రాన్స్‌లోని డియోల్స్లోని చటౌరోక్స్ షూటింగ్ సెంటర్లో జరిగిన ఇదే ఈవెంట్లో చారిత్రాత్మక పతకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్రను లిఖించారు. షూటింగ్లో టర్కీకి ఇదే తొలి ఒలింపిక్ పతకం.बिना स्पेशल ग्लासेज और इंस्ट्रूमेंट के सिल्वर मेडल जीतने वाला 51 वर्षीय यह व्यक्ति 🙏वाकई अद्भुत है 🫡लाजवाब, शानदार और जबरदस्त पूरी दुनिया में यह चर्चा का विषय बना हुआ 'Turkey Man' इनका स्वैग लाखो युवाओं को प्रेरित करेगा। बरसों की त्याग तपस्या और अभ्यास का परिणाम 👇#Olympics pic.twitter.com/GSovPHEFu6— Sonu kumar (@Aryans8825) August 1, 2024 -
124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్.. అత్యంత అరుదైన ఘనత
విశ్వ క్రీడల్లో భారత షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మహిళల విభాగంలో 22 ఏళ్ల మనూ కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లోతద్వారా భారత్‌కు ఈ ఎడిషన్‌లో తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా మనూ నిలిచింది. తాజాగా మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ జంట మెడల్‌ను కైవసం చేసుకుంది.124 ఏళ్ల క్రితంఈ క్రమంలో భారత్ తరఫున ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మనూ.. ఈ ఘనత అందుకున్న ప్యూర్ ఇండియన్‌గా రికార్డులకెక్కింది. అంతకు ముందు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్ ఈ రికార్డు బద్దలు కొట్టింది.చదవండి: నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ రాణా సంతోషంTHE HISTORIC MOMENT! 🇮🇳Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉 - #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024 -
మరో కాంస్యం వేటలో
షూటింగ్ యువ తార మనూ భాకర్ రెండు రోజుల వ్యవధిలో తన రెండో ఒలింపిక్ పతకంపై గురి పెట్టింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం నెగ్గిన మనూ భాకర్‌కు ఈసారి సరబ్జోత్ సింగ్ జత కలిశాడు. ఈ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. జిన్ ఓయె–లీ వన్హో (దక్షిణ కొరియా) జంటతో నేడు జరిగే ఈ పోరులో గెలిస్తే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా మను చరిత్ర సృష్టిస్తుంది. వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్‌జోత్‌కు కూడా తొలి పతకం గెలుచుకునేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా ని్రష్కమించింది. పారిస్: ఒలింపిక్స్ షూటింగ్ సమరాల్లో భారత్‌కు సోమవారం మిశ్రమ ఫలితాలు లభించాయి. మనూ భాకర్–సరబ్జోత్ జోడీ కాంస్య పతకం గెలుచుకునే అవకాశాలు సృష్టించుకోగా... ఇతర షూటర్లు విఫలమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ–సరబ్ జోడీ క్వాలిఫయింగ్‌లో మెరుగైన చక్కటి ప్రదర్శన కనబర్చింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో మనూ–సరబ్ ద్వయం గెలిస్తే భారత్ ఖాతాలో షూటింగ్ నుంచి మరో పతకం చేరుతుంది. ఈ మ్యాచ్‌లో కొరియాకు చెందిన జిన్ ఓయె–లీ వన్హో జంటతో భారత జోడీ తలపడుతుంది. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో 580 స్కోరు సాధించిన భారత షూటింగ్ జంట పతకం కోసం ముందంజ వేసింది. మూడు సిరీస్‌లలో ఇద్దరు భారత షూటర్లు కలిసి వరుసగా 193, 195, 192 స్కోర్లు సాధించారు. తొలి రెండు సిరీస్‌లలో 98, 98 పాయింట్లు సాధించిన మనూ చివరి సిరీస్‌లో 95కే పరిమితం కావడం తుది ఫలితంపై ప్రభావం చూపించింది. సరబ్జోత్ 95, 97, 97 స్కోర్లు నమోదు చేశాడు. నేటి భారత్ ప్రత్యర్థి కొరియా 579 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్వాలిఫయింగ్ ఈవెంట్లో తొలి రెండు స్థానాలు సాధించిన టర్కీ (582), సెర్బియా (581) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకం కోసం పోటీ పడతాయి. ఇదే ఈవెంట్లో బరిలోకి దిగిన మరో భారత జోడీ రిథమ్ సాంగ్వాన్–అర్జున్ సింగ్ చీమా ఓవరాల్‌గా 576 పాయింట్లు స్కోరు చేసి 10వ స్థానంతో ముగించింది. బబూతా పోరాడినా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో పతక ఆశలతో బరిలోకి దిగిన అర్జున్ బబూతాను చివరకు దురదృష్టం పలకరించింది. స్టేజ్–1లో పది షాట్ల తర్వాత 105 పాయింట్లతో అతను మూడో స్థానంతో మెరుగైన స్థితిలో నిలిచాడు. స్టేజ్–2 ఎలిమినేషన్ రౌండ్ తొలి సిరీస్‌లో కూడా 10.6, 10.6 స్కోర్లతో పతకావకాశాలు మెరుగుపర్చుకున్నాడు. అయితే ఇదే జోరును బబూతా కొనసాగించలేకపోయాడు. రెండో సిరీస్ తొలి షాట్లో పేలవంగా 9.9 స్కోరు చేయడం అతడిని బాగా దెబ్బ తీసింది. అయినా సరే... మూడు సిరీస్‌లు ముగిసిన తర్వాత 167.8 స్కోరుతో క్రొయేíÙయా షూటర్ మరిసిచ్తో సమంగా నిలి చాడు. కానీ నాలుగో సిరీస్ రెండో షాట్లో 10.1 మాత్రమే సాధించి వెనకబడిపోయాడు. ఓవరాల్‌గా 208.4 పాయింట్లతో నాలుగో స్థానమే దక్కింది. ఈ ఈవెంట్లో షెంగ్ లిహావో (చైనా–252.2), విక్టర్ లింగ్రెన్ (స్వీడన్–251.4), మిరాన్ మరిసిచ్ (క్రొయేíÙయా–230) స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగం ఫైనల్లో భారత షూటర్ రమిత జిందాల్ నిరాశపర్చింది. మొత్తం 145.3 పాయింట్లతో ఆమె ఏడో స్థానంతో ముగించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో తొలి రోజు భారత షూటర్ పృథ్వీరాజ్ తొండైమన్ పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 75 పాయింట్ల మూడు రౌండ్ల తర్వాత పృథ్వీరాజ్ 68 పాయింట్లు సాధించి ప్రస్తుతం 30వ (చివరి) స్థానంలో కొనసాగుతున్నాడు. అతను వరుసగా 22, 25, 21 పాయింట్లు స్కోరు చేశాడు. మంగళవారం మరో 25 పాయింట్లు చొప్పున రెండు రౌండ్లు జరుగుతాయి. ఆ తర్వాత ఓవరాల్ పాయింట్లను బట్టి టాప్–6లో నిలిచినవారు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. -
హార్ట్ బ్రేకింగ్.. ఒకే ఒక్క పాయింట్! తృటిలో చేజారిన పతకం
ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్‌కు తృటిలో మరో పతకం చేజారింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బాబుటా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పతకానికి 1.1 పాయింట్ దూరంలో అర్జున్ నిలిచిపోయాడు.ఓ దశలో గోల్డ్‌మెడల్ రేసులో ఉన్న అర్జున్ ఒత్తడిలో తప్పిదాలు చేస్తూ 208.4 పాయింట్లతో నాలుగో స్ధానానికి పడిపోయాడు. క్రొయేషియా షూటర్ మిరాన్ మారిసిచ్ 209.3 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.ఇక 231.1 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచిన చైనా షూటర్ షెంగ్ లిహావోకు గోల్డ్ మెడల్, 230.5 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన జర్మనీ షూటర్ విక్టర్ లిండ్‌గ్రెన్ సిల్వర్ మెడల్ దక్కింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్స్‌లో భారత షూటర్ రమితా జిందాల్ ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది. దీంతో ఒలింపిక్ పతకాన్ని సాధించే అవకాశాన్ని రమితా జిందాల్ కోల్పోయింది. -
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా నగరం న్యూయార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ పార్క్‌లో తుపాకుల మోత మోగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం రోచెస్టర్ ప్రాంతంలోని మాపెల్వుడ్ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చనిపోయింది ఒక మహిళగా తెలుస్తోంది. ఆరుగురికి బుల్లెట్ గాయాలుకాగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఒక్కడా? గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారా?.. తదితర వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.#UPDATE : Multiple people were shot at least one person is dead after a shootout occurred at Maplewood Park. Multiple police agencies have the area lockdown. #Rochester #NewYork #MassShooting #Shooting #USA #America #MaplewoodPark pic.twitter.com/ZwNcCW014W— upuknews (@upuknews1) July 29, 2024 -
‘మనూభాకర్’ పాత జుమ్లా ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం గెలిచిన మనూ భాకర్ పాత ట్వీట్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. 2018 అక్టోబర్‌లో యూత్ ఒలింపిక్స్‌లో మనూభాకర్ గోల్డ్‌మెడల్ గెలిచిన తర్వాత అప్పటి హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆమెకు రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు. అయితే ఈ నగదు అందకపోవడంతో రివార్డు ప్రకటించిన మూడు నెలల తర్వాత మనూ భాకర్ ఒక ట్వీట్ చేశారు. అనిల్‌విజ్ రివార్డు ప్రకటించిన ట్వీట్ స్క్రీన్‌షాట్స్ పోస్ట్ చేస్తూ ‘సర్ ప్లీజ్ కన్ఫామ్ చేయండి. ఈ రివార్డు నిజమేనా లేక ఉత్త జుమ్లానా’అని ప్రశ్నించారు. తమకు రివార్డుగా ప్రకటించిన సొమ్ముతో హర్యానా ప్రభుత్వంలో కొందరు ఆటలాడుతున్నారని భాకర్ విమర్శించారు. దీనికి స్పందించిన అనిల్‌విజ్ రివార్డు గురించి భాకర్ తొలుత క్రీడాశాఖలో తెలుసుకుని తర్వాత ఓపెన్‌గా మాట్లాడాలని సూచించారు. భాకర్‌కు రూ.2కోట్ల రూపాయలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. క్రీడాకారులకు క్రమశిక్షణ అవసరం అన్నారు. తాజాగా ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. శివసేన(ఉద్ధవ్) వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. భాకర్‌కు రివార్డు నగదు ఎగ్గొట్టి ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం రాగానే క్రెడిట్ కోసం బీజేపీ నాయకులు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మనుభాకర్ షూటింగ్లో కాంస్య పతకం గెలుచుకుని ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచారు. -
'గురి' అదిరింది.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనూ బాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత.HISTORIC MOMENT. 🇮🇳MANU BHAKER WINS THE BRONZE IN PARIS OLYMPICS. pic.twitter.com/aN6TPamWco— Johns. (@CricCrazyJohns) July 28, 2024Indian flag flying high at Paris Olympics 🥺MANU BHAKER, TAKE A BOW. pic.twitter.com/GeLHFRW4ef— Johns. (@CricCrazyJohns) July 28, 2024BRONZE FOR MANU BHAKER...!!!! 🇮🇳- History in the Paris Olympics by Manu in 10m Air Pistol.ONE OF GREATEST MOMENTS FOR INDIA IN SPORTS 🔥 pic.twitter.com/pwNCszwxk6— Johns. (@CricCrazyJohns) July 28, 2024 -
Paris Olympics 2024: భారత్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ చేరుకున్న మను భాకర్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత్‌కు షూటింగ్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. అయితే ఆఖరిలో మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ విభాగంలో మను భాకర్ ఫైనల్ రౌండ్‌కు ఆర్హత సాధించింది.క్వాలిఫికేషన్ రౌండ్లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మనూ.. తుది పోరు(మెడల్ రౌండ్)కు క్వాలిఫై అయింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్(573 పాయింట్లు) 15వ స్ధానానికే పరిమితమైంది. దీంతో తొలి రోజు షూటింగ్లో భారత్ ఈవెంట్లు పూర్తయ్యాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు నిరాశపర్చగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా కూడా ఫైనల్‌కు ఆర్హత సాధించలేకపోయారు. -
Olympics: షూటింగ్ జోడీలు విఫలం.. పతక రేసు నుంచి అవుట్
Paris Olympics 2024 Day 1: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత షూటర్ల బృందానికి శుభారంభం లభించలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ మెడల్ ఈవెంట్లో మన షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. అర్జున్ బబూటా–రమితా జిందాల్, సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జంట ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి. ఫలితంగా ఈ ఈవెంట్లో భారత్ పతక రేసు నుంచి నిష్క్రమించింది.ఇక ఈ పోటీలో రమితా- అర్జున్ జోడీ ఓవరాల్‌గా 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా.. ఇలవేనిల్- సందీప్ ద్వయం 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పడిపోయింది.నిబంధనల ప్రకారం.. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–4లో నిలిచిన నాలుగు జోడీలు మాత్రమే పసిడి, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడే అర్హత సాధిస్తాయి. అయితే, భారత షూటింగ్ జోడీలు ఈ అడ్డంకిని దాటలేకపోయాయి. చైనా, కొరియా, కజకిస్తాన్, జర్మనీ టాప్-4లో నిలిచాయి.గోల్డ్ మెడల్ రౌండ్లో చైనా- కొరియాఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ మెడల్ ఈవెంట్.. గోల్డ్ మెడల్ రౌండ్లో చైనా- కొరియా అమీతుమీ తేల్చుకోనుండగా.. కాంస్య పతక పోరులో కజకిస్తాన్ జర్మనీతో తలపడనుంది. ఇదిలా ఉంటే.. తదుపరి పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది.భారత్ నుంచి అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో.. మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం గం. 4 నుంచి) మహిళ విభాగంలో పోటీపడనున్నారు.రోయింగ్‌లో మరో అవకాశంఇండియన్ రోవర్ బాల్‌రాజ్ పన్వార్‌కు కూడా తొలిరోజు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెన్స్ వ్యక్తిగత స్కల్స్ హీట్ 1లో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే, ప్రతి హీట్ నుంచి టాప్-3 మాత్రమే ఆటోమేటిక్‌గా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో తొలి ప్రయత్నంలో బాల్‌రాజ్‌కు నిరాశే మిగిలినా.. రేపెచెజ్ రౌండ్ రూపంలో సెమీ ఫైనల్ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి. చదవండి: ఆర్చరీలో అదరగొట్టి.. క్వార్టర్ ఫైనల్లో -
అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ మంగళవారం రాజీనామా చేశారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ విభాగం తన కీలక బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ట్రంప్‌పై హత్యాయత్నం తమ అతిపెద్ద వైఫల్యమని కాంగ్రెషనల్ కమిటీ విచారణలో ఈమె ఒప్పుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో కింబర్లీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈమె 2022 నుంచి సీక్రెట్ సర్వీస్ అధిపతిగా పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ చేపట్టిన ప్రచార ర్యాలీ సందర్భంగా ఒక దుండగుడు దగ్గర్లోని భవనంపై నుంచి కాల్పులు జరపడం, ఆయన త్రుటిలో తప్పించుకోవడం తెల్సిందే. -
Paris Olympics 2024: బుల్లెట్ దిగాలి...
ఇంతింతై వటుడింతై అన్న నానుడి భారత షూటింగ్ క్రీడాంశానికి వర్తిస్తుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్ తరఫున ఇద్దరు షూటర్లు బరిలోకి దిగారు. నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత షూటర్ల ప్రాతినిధ్యం కనిపిస్తోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలిసారి రెండంకెల్లో భారత షూటర్లు పోటీపడగా... 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ అది కొనసాగింది... ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 21 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెడల్ ఈవెంట్స్‌గా ఉన్న 12 విభాగాల్లోనూ భారత షూటర్లు ఉండటంతో ఈసారి రిక్తహస్తాలతో కాకుండా ఒకట్రెండు పతకాలతో తిరిగి వస్తారని భారీ అంచనాలున్నాయి. మన షూటర్లు లక్ష్యంలో బుల్లెట్లు దించి పతకాలను కొల్లగొడుతారా లేక గురితప్పి నిరాశపరుస్తారో వేచి చూడాలి. –సాక్షి క్రీడా విభాగం రెండు దశాబ్దాల క్రితం ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత సైనికాధికారి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ‘డబుల్ ట్రాప్’ షూటింగ్ ఈవెంట్లో దేశానికి తొలిసారి రజతం రూపంలో పతకాన్ని అందించాడు. నాలుగేళ్ల తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా ఎవ్వరూ ఊహించని విధంగా భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేశాడు. 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో విఫలమైన అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అద్భుత ప్రదర్శనతో అందరి అంచనాలను తారుమారు చేశాడు. స్వతంత్ర భారత్‌కు వ్యక్తిగత క్రీడాంశంలో తొలి బంగారు పతకాన్ని అందించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రజతం... గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సాధించడంతో భారత్‌కు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో షూటింగ్ క్రీడాంశంలో పతకాలు దక్కాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి తొలిసారి అత్యధికంగా 12 మంది షూటర్లు పోటీపడటంతో వరుసగా నాలుగోసారీ పతకాలు గ్యారంటీ అని అభిమానులు అనుకున్నారు. కానీ 12 మందిలో ఇద్దరు (అభినవ్ బింద్రా, జీతూ రాయ్) మాత్రమే ఫైనల్ చేరుకున్నారు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోగా... పిస్టల్ షూటర్ జీతూ రాయ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకంగా 15 మంది షూటర్లు పాల్గొనగా... ఒత్తిడికి తట్టుకోలేక స్టార్ షూటర్లు కూడా తడబడ్డారు. కేవలం సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లోకి ప్రవేశించి ఏడో స్థానంలో నిలిచాడు. అనుభవం పతకం తెస్తుందా... టోక్యో ఒలింపిక్స్ వైఫల్యాన్ని పక్కనబెడితే ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఏకంగా 21 మంది భారత షూటర్లు అర్హత సాధించారు. 21 మందిలో నలుగురు మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ వాళ్లున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్), ఇలవేనిల్ వలారివన్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), అంజుమ్ మౌద్గిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్) పారిస్ ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగనున్నారు. మనూ భాకర్ మాత్రం ఈసారి రెండు ఈవెంట్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ నలుగురు కాకుండా మిగతా 17 మంది షూటర్లు తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై మిల్లీమీటర్ల వ్యత్యాసంలో పతకాలు, ఫలితాలు తారుమారవుతాయి. షూటర్లకు చెక్కు చెదరని ఏకాగ్రత, మానసిక దృఢత్వం అత్యవసరం. గత ఒలింపిక్స్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒలింపిక్ బెర్త్‌లు సాధించిన షూటర్లకు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు పంపించకూడదని నిర్ణయించింది. నాలుగు దశల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించి ట్రయల్స్‌లో నిలకడగా రాణించిన షూటర్లనే పారిస్‌కు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌లో నూ రాణించి ఫామ్‌లో ఉన్న మనూ, అంజుమ్, ఇలవేనిల్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ అసలైన వేదికపై కూడా మెరిపించి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం. అరంగేట్రంలోనే మెరిపిస్తారా! తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న 17 మంది షూటర్లు ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో వ్యవహరిస్తేనే పతకాల రేసులో నిలుస్తారు. ముఖ్యంగా అందరి దృష్టి 23 ఏళ్ల పంజాబ్ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రాపై ఉంది. 2022 ఆసియా క్రీడల్లో సిఫ్ట్ కౌర్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.తెలంగాణ షూటర్ ఇషా సింగ్ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. 19 ఏళ్ల ఇషా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పిస్టల్ టీమ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అదే జోరును ఆమె పారిస్‌లో కొనసాగించాలని ఆశిద్దాం. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ‘పారిస్’లో భారత షూటర్లుపురుషుల విభాగం: సందీప్ సింగ్, అర్జున్ బబూటా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), అనీశ్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధూ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), పృథ్వీరాజ్ (ట్రాప్), అనంత్‌జీత్ సింగ్ నరూకా (స్కీట్). మహిళల విభాగం: ఇలవేనిల్ వలారివన్, రమితా జిందాల్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), ఇషా సింగ్, మనూ భాకర్ (25 మీటర్ల పిస్టల్), సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ (ట్రాప్), రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (స్కీట్). -
విశ్వ క్రీడలకు భారత్ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల జాబితాలో షాట్ పుట్టర్ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్ ర్యాంకింగ్ కోటాలో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్ అథ్లెటిక్స్ , ఒలింపిక్ పార్టిసిపెంట్స్ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు, సెయిలింగ్, స్విమ్మింగ్ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్ , వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్ -
పెరిగిన ట్రంప్ క్రేజ్.. ‘ఫైట్ ఫైట్’ టీషర్ట్‌లకు ఫుల్ డిమాండ్
న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. బుల్లెట్ కొంచెం పక్కకు తాకి ఉంటే ట్రంప్ ప్రాణాలు పోయేవి. ఇంత జరిగిన తర్వాత కూడా కొద్దిసేపటికే తేరుకున్న ట్రంప్ అదే వేదికపై చేయి పైకి లేపి ఫైట్ఫైట్ అని నినదించడం అందరినీ ఆకర్షించింది.ర్యాలీకి హాజరైన వారంతా ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు సరిగ్గా శనివారం(జులై13) సాయంత్రం 6.30 గంటలకు జరిగాయి.ఘటనపై అధ్యక్షుడు బైడెన్ 8 గంటలకు స్పందించారు. ఇదంతా ఇలాఉంటే చైనాలోని రిటైలర్ కంపెనీలు కాల్పుల తర్వాత ట్రంప్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని డిసైడయ్యాయి.100% of profits from this shirt go to Trump’s campaignhttps://t.co/AUeoyZ6XPT pic.twitter.com/eS18aZNl2o— Hodgetwins (@hodgetwins) July 13, 2024 కాల్పులు జరిగిన రెండు గంటల్లోనే చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ తొవాబో ట్రంప్ చేయి పైకెత్తి ఫైట్ఫైట్ అని నినాదాలు చేసే ఫొటోతో కూడిన టీషర్ట్లను అమ్మకానికి పెట్టింది. ఈ ఉదంతంపై అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీనిపై తొవాబో స్పందించింది.‘కాల్పులు జరగ్గానే టీషర్ట్లను ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి పెట్టాం. అసలు మేము వాటిని ఇంకా ప్రింట్ కూడా చేయలేదు.అప్పుడే 2000కుపైగా టీషర్ట్‌లకు ఆర్డర్ వచ్చింది’అని తొవాబో తెలిపింది. -
స్క్రీన్ మారలేదు, సీనే మారింది!
కథ చదవడం, వినడం పాత ప్రక్రియ! చూడటం వన్నె తగ్గని వెండితెర పంచే వింత వినోదం! కథను ఆడించే ఆ వెండితెర ఇంద్రజాలం నేర్చుకుంటే? మెదడు ఊహించని లోకాలకు తీసుకెళ్తుంది, నిజమే నమ్మలేని దృశ్యాలను చూపిస్తుంది. అదొక నయనానందం, అదొక మనోల్లాసం! మొత్తంగా మనిషిని మునివేళ్ల మీద నిలబట్టే సరికొత్త ప్రక్రియ! స్క్రీన్ మారలేదు, సీనే మారింది! బిహైండ్ ద స్క్రీన్ టోటల్‌గా చేంజ్ అయింది!కెమెరా కంటే ఎఫెక్ట్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఔట్ డోర్ కంటే గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎడిట్ సూట్స్ కంటే వీఎఫ్ఎక్స్ పవర్ ప్రదర్శిస్తున్నాయి. అవే మొన్న బాహుబలిని ప్రెజెంట్ చేశాయి. ఈరోజు కల్కిని క్రియేట్ చేశాయి. టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాయి. ఆ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్ను కంపాక్ట్‌గా చూద్దాం..అనాథ అయిన హీరో– అంతరిక్షం నుంచి భూమ్మీదకు పడే వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఒక రోజు విజిటింగ్ వీసా మీద వేరే గ్రహం నుంచి వచ్చిన హీరోయిన్ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సుదూరంలో ఉన్న ఆమె గ్రహానికి వెళ్తాడు. అక్కడ ఆమె తండ్రి మొదట వాళ్ల ప్రేమను కాదంటాడు. అక్కడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బ్లాక్ హోల్ దగ్గర ఉన్న తమ వారసత్వ సంపద టెక్నాలజీని తెస్తే పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెడతాడు. దీంతో హీరో స్పేస్‌లో సాహసాలు చేయాల్సి వస్తుంది.ఆ ప్రయత్నంలో తన తల్లిదండ్రులు మరో గ్రహంపై బందీలుగా ఉన్నారనే షాకింగ్ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకుని విలన్ల భరతం పడతాడు. వాళ్లను విడిపించుకుని, చాలెంజ్‌లో నెగ్గి హీరోయిన్ను దక్కించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేమ, ప్రతీకారం, లోక కల్యాణం కోసం విలన్‌ను హీరో అంతం చేయడం అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న స్టోరీ లైన్. కాకపోతే మారింది సినిమా పరిధి. నాటి ‘పాతాళ భైరవి’ నుంచి నేటి ‘కల్కి’ దాకా సినిమా అంటే కళ్లు చెదిరేలా ఉండాల్సిందే!ఎక్కడి మహాభారతం? ఎక్కడి 2898 సంవత్సరం? ఇతిహాసాన్ని ఆరువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముడిపెట్టి తీసిన కల్పితగాథ ‘కల్కి’కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మార్వెలస్‌గా ఉందని, మరో ప్రపంచంలో విహరింపజేశాడంటూ దర్శకుడిని పొగుడుతున్నారు. ఇక్కడ కథ కంటే భవిష్యత్తులో దర్శకుడి ఊహకు, అందులోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.నాటి కేవీరెడ్డి ‘మాయాబజార్’ నుంచి నేటి నాగ అశ్విన్ ‘కల్కి’ దాకా సినిమాలో కథ ఉంటుంది. కానీ, కథ కంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌కి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. దానికి కారణం గ్రాఫిక్స్ మాయాజాలం. ఒక హీరో క్లైమాక్స్‌లో విలన్ తో భూమ్మీదే ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం వినీలాకాశంలోనో, సాగర గర్భాంలోనో ఉంటే ఎలా ఉంటుందనే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మొత్తంగా ఒక సినిమా ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రేక్షకుడి కోరికను దర్శకులు తీర్చేస్తున్నారు.కథ కొంచెం.. గ్రాఫిక్స్ ఘనం..సినిమాలో కథ ఉంటుంది. కథకు తగ్గట్లు పాత్రలు కదులుతుంటాయి. కానీ, తెర వెనుక జరిగేదంతా వేరే ఉంటుంది. మొత్తం కంప్యూటర్ మీదనే మాయచేస్తారు నిపుణులు. సీన్లను నార్మల్‌గా తీసి దానికి కంప్యూటర్లో మెరుగులు అద్ది నిజంగా ఫలానా చోట తీశారా అనే భ్రమను కలిగిస్తారు. అలా కథ కంటే గ్రాఫిక్స్ ఘనంగా మారిపోతున్నాయిప్పుడు. గ్రీన్ మ్యాట్ మీద తీసిన సీన్లకు సినిమాలో చూసిన సీన్లకు తేడా గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.పాత్రధారి లేకున్నా..తెరపై కనిపించకున్నా, నటీనటులు తమ గొంతుతో సినిమాను నడిపించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే టెక్నాలజీకి ముడిపెట్టి వాయిస్ ఓవర్‌తో మ్యాజిక్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అమెజాన్, అలెక్సా, యాపిల్ సిరి, గూగుల్ నౌలను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగన్నమాట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సతో ఆలోచించే అడ్వాన్్సడ్ వెహికిల్‌గా ‘బుజ్జి’ కల్కి చిత్రంలో అదనపు ఆకర్షణ. నటి కీర్తి సురేష్ ఆ ఆకర్షణకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. తెరపై కనిపించకున్నా, ఈ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.అయితే 2013లోనే ఆ తరహా ప్రయోగం ఒకటి జరిగింది. హాకిన్ ఫీనిక్స్ లీడ్ రోల్లో ‘హర్’ అనే చిత్రం వచ్చింది. అందులో సమాంత అనే వాయిస్ టెక్నాలజీతో భావోద్వేగమైన బంధంలో మునిగిపోతాడు హీరో! నటి స్కార్లెట్ జాన్సన్ ఆ టెక్ వాయిస్ ఇవ్వడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. విశేషం ఏమిటంటే ఏఐ అనే ప్రస్తావన లేకుండా సాగుతుందీ పాత్ర. ఇలా తెర మీద కనిపించకున్నా, ఆర్టిస్టులు ప్రభావం చూపిస్తున్నారు.కేరాఫ్ హాలీవుడ్..ఎలాంటి సాంకేతికతనైనా త్వరగా అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలానికి పుట్టినిల్లు అది. మన సినిమాల్లో టెక్నాలజీ వాడకం కొంత మేర ఉంటే, వాళ్లు పూర్తిగా సినిమానే దాంతో నింపేస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా గ్రాఫిక్స్ మాయాజాలంతో బోలెడు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి.అవతార్, మ్యాట్రిక్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, జురాసిక్ పార్క్, 2012, కింగ్ కాంగ్, ది అవెంజర్స్, గ్రావిటీ, ది డార్క్ నైట్, పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్, ఇన్సెప్షన్, ఏలియన్, టెర్మినేటర్, మమ్మీ, గాడ్జిల్లా, అనకొండ, ది జంగిల్ బుక్, లయన్ కింగ్– చెబుతూ పోతే కోకొల్లలు. అందుకే మన దర్శకులు అక్కడి టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకుంటుంటారు. అయితే, వాటికి పనిచేసే టెక్నీషియన్లలో ఎక్కువ మంది అక్కడున్న భారతీయులే. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడి గ్రాఫిక్స్ సంస్థలనూ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ఇక్కడి మనవాళ్లకూ తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.కంప్యూటర్ గ్రాఫిక్స్ మొదలు..చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్ పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట్లో సెట్టింగుల కోసం, లొకేషన్ల కోసం హ్యాండ్ ప్రింటెడ్ బ్యాక్ డ్రాప్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆప్టికల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. 80, 90వ దశకంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, 2000లో వీఎఫ్ఎక్స్.. వాటికి సంబంధించి స్టూడియోలే ఏర్పడటం మొదలైంది. సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) భూమిక ప్రధానమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు కచ్చితంగా వీఎఫ్ఎక్స్ ఉండాల్సిందే! ఇప్పుడు విజువల్స్ అంటే దృశ్య విన్యాసమే కాదు, కథలో అంతర్భాగం కూడా.ఇలా వచ్చిన రోబో, బాహుబలి చిత్రాలు భారతీయ చిత్రాల సత్తాను అంతర్జాతీయంగా చాటాయి. అయితే సాంకేతికంగా ఇంత అడ్వాన్స్మెంట్ లేని కాలంలో కూడా కేవి రెడ్డి, సింగీతం శ్రీనివాస్, శంకర్ షణ్ముగంలాంటి సినీ ఉద్దండులు ఈ తరహా ప్రయోగాలకు ఏడు దశాబ్దాల కిందటే క్లాప్ కొట్టారు ‘మాయాజబార్’తో! తర్వాత కాలంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘జీన్ ్స’, అమ్మోరు’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘దేవి’, ‘ఇండియన్’ మొదలు ‘రోబో’, నిన్నటి ‘బాహుబలి’, నేటి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అలాంటి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అలా టెక్నాలజీ ఏదోరకంగా తన విజువల్ గ్రాండ్యూర్‌తో దేశీ వెండితెర మీద సందడి చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి.సజీవంగా లేకున్నా..సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా దక్షిణాది హాలీవుడ్‌తో పోటీపడుతోంది. ఏఐని విరివిగా వినియోగిస్తోంది. ఏఐ సాయంతో దివంగత గాయనీ గాయకుల గాత్రాలను వినిపిస్తోంది. నటీనటుల అభినయాన్ని చూపిస్తోంది. గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’లో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్‌ను ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. ‘లాల్ సలామ్’ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా అలాంటి ప్రయోగమే చేశారు.2022లో వచ్చిన ‘టాప్ గన్: మావెరిక్’ సినిమాలో లెఫ్టినెంట్ టామ్ ఐస్ మ్యాన్ కజన్ స్కై పాత్రధారి వల్ కిల్మర్ కోసం ఏఐ వాయిస్‌ను సృష్టించారు. 2014లో గొంతు కేన్సర్ బారినపడి మాట పడిపోయింది ఆయనకు. అయితే ఏఐ సాయంతో అచ్చం ఆయన గొంతునే క్రియేట్ చేశారు. అలా దివంగత నటులనూ తెరపై చూపిస్తోంది ఏఐ. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తను నటిస్తున్న ‘జేమ్స్’ సినిమా సెట్స్ మీద ఉండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు.మాయల బజార్..ఏఐతో అప్డేట్ అయిన సినిమాల యుగంలో కూడా మరువకుండా మరీ మరీ ప్రస్తావించుకోవాల్సిన మూవీ ‘మాయాబజార్.’ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని విజువల్ వండర్స్ వచ్చినా.. ఆ చిత్ర సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకూంటూనే ఉంటారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఊహే లేని .. అంతెందుకు కంప్యూటర్ ఉనికే లేని కాలంలో లాప్టాప్ని పోలిన ప్రియదర్శిని అనే పేటికను, స్కైప్ కాల్ని తలపించేలా అభిమన్యుడు–శశిరేఖల వీడియో కాలింగ్‌ని ఎవరైనా ఊహించగలరా? కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆ ఊహకు వెండితెర రూపమిచ్చారు.అందమైన చందమామను చూస్తూ.. లాహిరి లాహిరిలో అంటూ సాగే అందులోని పాటను వాస్తవానికి ఓ ఎర్రటి ఎండలో తీశారంటే నమ్మగలమా? ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ మాయా విన్యాసాలను ఇమాజిన్ చేయగలమా? ఆశ్చర్యం! రెట్రో రీల్, ఆంగ్లో–ఇండియన్ కెమెరామన్ మార్కస్ బార్టే› కెమెరా అద్భుతం అది! వివాహ భోజనంబు పాటనైతేతే నాలుగు రోజులపాటు శ్రమించి.. కెమెరా టెక్నిక్స్, స్టాప్ మోషన్ యానిమేషన్ టెక్నాలజీతో దాన్ని చిత్రీకరించారట.ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాంశంగా ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్.. విజువల్స్ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఒక మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇదే జరిగింది. ప్రీ–ప్రొడక్షన్ కి సరైన సమయం ఇవ్వకుండా మేకర్స్ చాలా తొందరపడ్డారు.ఫలితంగా ఆ చిత్రం విజువల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అలాగే టైమ్ తీసుకున్న చిత్రాలు మంచి అవుట్ ఫుట్‌ను ఇచ్చాయి. కాబట్టే ఆ సినిమాల కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్ అయింది. ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ సక్సెస్‌నూ సాధించాయి. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. అలాగని వీఎఫ్ఎక్స్తో ప్రయోగాలు చేసినా.. తొందర పెట్టినా.. బడ్జెట్ అంతకంతకూ పెరగడంతో పాటు అవుట్ ఫుట్ కూడా దెబ్బ తింటుంది. – పి. లక్ష్మీనారాయణ, వీఎఫ్ఎక్స్ నిపుణుడుఇదీ చిత్రమే..‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కమల్‌ను అలా ఎలా చూపించారనే ఆసక్తికరమైన చర్చ నడిచింది అప్పట్లో. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం తొలిసారి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది.. విజువల్ ఎఫెక్ట్ డిజైనర్ ఎస్టీ వెంకీకి తొలి చిత్రం.అందులోని పాటలు, సర్కస్ పోర్షన్‌కి ఈ టెక్నాలజీని వాడారు. అయితే పొట్టి కమల్ హాసన్ కోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్ ఉపయోగించకపోవడం గమనార్హం. డిఫరెంట్ టెక్నిక్స్.. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం మోకాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన షూ వాడడం, స్టడీ షాట్లో గుంతలు తీసి మోకాళ్ల దాకా కమల్ హాసన్‌ను అందులో పాతిపెట్టడం వంటివి చేశారట.డీ–ఏజ్ క్లిక్కు.. లుక్కుతో కిక్కు..మేకప్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేకప్ అనే మాట ఏనాడో పాతదైపోయింది. ప్రోస్తటిక్, త్రీడీ మేకప్‌లతో అది కథలో భాగమైంది. ఇదింత మేకప్ అయి వచ్చినా టెక్నాలజీ ఎఫెక్ట్‌కి ఫేడ్కాక తప్పట్లేదు. దాన్నలా ఫేడ్ అవుట్ చేస్తోంది డీ–ఏజింగ్ డిజిటల్ మేకప్. ఇది సిల్వర్ స్క్రీన్ ౖపై చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. వయసు పైబడిన హీరో, హీరోయిన్లను యంగ్‌గా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్టులు ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ను వాడుతున్నారు. దీనిద్వారా ఆర్టిస్ట్ ముఖంతో పాటు బాడీ షేపుల్లోనూ మార్పులు చేసుకునే వీలుంటుంది.2006లో ‘ఎక్స్‌మెన్ : ది లాస్ట్ స్టాండ్’లో ప్యాట్రిక్ స్టీవార్ట్, ఇయాన్ మెకెల్లెన్ ల కోసం ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ని ఫస్ట్ టైమ్ పక్కాగా వాడారు. హెచ్‌బీవో నిర్మించిన ‘ది రైటస్ జెమ్‌స్టోన్ ్స’ టీవీ సిరీస్‌లో నటుడు జాన్ గుడ్మన్ కోసం ఒక ఎపిసోడ్ మొత్తం డిజిటల్లీ డీ–ఏజ్డ్ టెక్నాలజీనే ఉపయోగించారు. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’లో క్రియేటర్ సాన్లీ గెస్ట్ అపియరెన్ ్స కోసం రెండు వందల షాట్స్‌తో ఒక సీన్ రూపొందించారు.‘టెర్మినేటర్: డార్క్ ఫేట్, ఇట్– చాప్టర్2’లో ఈ టెక్నిక్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ‘కెప్టెన్ మార్వెల్’, ‘జెమినీ మ్యాన్ ’, ‘ది ఐరిష్‌మ్యాన్ ’– ఈ మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. ‘కెప్టెన్ మార్వెల్’లో నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ కోసం శామ్యూల్ జాక్సన్ ని కొద్దిసేపు యంగ్‌స్టర్‌గా చూపించారు. ‘జెమినీ మ్యాన్ ’ కోసం విల్ స్మిత్‌ను ఏకంగా ఇరవై మూడేళ్ల యువకుడిగా చూపించారు. మార్టిన్ స్కార్సిస్.. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో ‘ది ఐరిష్ మ్యాన్ ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో డెబ్బైతొమ్మిదేళ్ల రాబర్ట్ డి నీరో.. నలభై తొమ్మిదేళ్ల క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఈ మూడు సినిమాలూ ఆస్కార్ 2020 బరిలో విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఇంతకాలం హాలీవుడ్‌కే పరిమితం అనుకున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మన చిత్రాల కోసం కూడా వినియోగిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్‌ని అలాగే తీర్చిదిద్దారు. అందులో ఆమె గుండ్రటి మొహం కాస్త కోలగా మారి ఆ సినిమాలో ఆమె వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.ధైర్యంగా ముందుకు..కథాంశాన్ని బట్టి బడ్జెట్ మారుతుంది. కానీ, భారీ హంగులే ప్రధానాంశమైతే సినిమా బడ్జెట్ బరువు పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్ యాక్టర్స్, భారీ సెట్లు, ఫారిన్ లొకేషన్ల కోసం బడ్జెట్ భారీగా మారేది. ఇప్పుడు ఆ జాబితాలో తారాగణం పారితోషికాలను మినహాయిస్తే మిగిలిన వాటి స్థానాలను ఒక్క గ్రాఫిక్సే భర్తీ చేస్తున్నాయి భారీగా. దీనివల్ల ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలనే హాలీవుడ్ తీరూ మనకూ అనివార్యమైంది. ఇప్పుడు మన సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలు ఉండటం, అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా చేరుతుండటం సాధారణమైంది.దీనివల్ల విజువల్ వండర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా అంటాయి సినీ వర్గాలు. కావచ్చు. ఈ బడ్జెట్‌తోనే వీఎఫ్ఎక్స్ సామాజిక అంశాలతో పాటు చరిత్ర, పురాణేతిహాసాలు, టైమ్ ట్రావెల్, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో కన్నులకు కడుతోంది. అందుకే కథను బట్టి గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్‌ని బట్టే కథను రాసుకుంటున్నారు దర్శకులు. దాన్ని భరించే నిర్మాతలను వెదుక్కుంటున్నారు. దాంతో వీఎఫ్ఎక్స్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్‌గా మారింది. దీనికి భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది.గంటల నుంచి నెలలు..సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)కు అయ్యే ఖర్చు ఎంతమంది నిపుణులు పని చేస్తారు, వాళ్ల అనుభవం, ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తారు, వాటి నిడివి, అలాగే వాళ్లు ఉపయోగించే సాఫ్ట్వేర్లను బట్టి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్ కేటాయిస్తుంటారు నిర్మాతలు. కంపెనీ ప్రతినిధులను గంటల లెక్క నుంచి రోజులు, నెలల లెక్కన కేటాయిస్తాయి అవసరాలన్ని బట్టి. కేవలం కంపెనీలు మాత్రమే కాదు, ఫ్రీలాన్ ్సగా పని చేసే నిపుణులూ ఉన్నారు.మన దేశంలో వీఎఫ్ఎక్స్ నాణ్యత, నిడివి ప్రాతిపదికన నిమిషానికి రూ.500 నుంచి రూ. 2000 దాకా తీసుకునే వీడియో ఎడిటర్లు ఉన్నారు. వీఎఫ్ఎక్స్లో షాట్స్‌ను బట్టి పని లెక్క ఉంటుంది. పది కంటే తక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే దాన్ని మినిమమ్ వర్క్‌గా భావిస్తారు. 10–50, 50–100, వంద కంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను అవసరానికనుగుణంగా వినియోగిస్తుంటారు.అయితే ఒక నిమిషం నిడివి ఉన్న వీఎఫ్ఎక్స్ వీడియో తీయాలంటే రూ. 80 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో.. ఇంటర్మీడియట్, అడ్వాన్ ్సడ్, హైలీ కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ స్థాయిలు ఉంటాయి. ఒక్కొ లెవెల్ ముందుకు వెళ్లేకొద్దీ.. అంతకు మించే(రెట్టింపు) ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడయ్యాక ఇది మరింత ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది. కానీ, ఇందులోనూ రకాలున్నాయి. తేలికగా అయ్యే వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే షార్ట్ ఫిల్మ్, యానిమేషన్, షూటింగ్ లైవ్ యాక్షన్ లార్జ్ స్కేల్ వీఎఫ్ఎక్స్– ఇలా ఒక్కో కేటగరీలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చు పెరుగుతూ పోతుంది.ఉదాహరణకు ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ చిత్రం కోసం 4 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను క్రియేట్ చేశారట! కానీ, అందులో 3,289 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను మాత్రమే తీసుకున్నాడట దర్శకుడు జేమ్స్ కామెరూన్ . ఆ ఒక్కో వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 62,500 డాలర్ల ఖర్చు అయ్యింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసమే 250 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టారట! అయితే సినీ చరిత్రలో ఇప్పటి దాకా సీజీఐ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టింది మాత్రం ‘ది అవెంజర్స్–ఎండ్‌గేమ్.’ వీటికోసం 356 మిలియన్ల డాలర్లను కుమ్మరించారంటే అతిశయోక్తికాదు. అలాగే, విజువల్స్ కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయించిన టాప్ 3 చిత్రాలు కూడా మార్వెల్ సినిమాలే కావడం మరో విశేషం! ఇదీ స్క్రీన్ మీద ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్లు క్రియేట్ చేసే సీన్! – భాస్కర్ శ్రీపతి -
శ్రీలంకలో అడుగుపెట్టిన రౌడీ హీరో.. ఆ సినిమా కోసమేనా?
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. అయితే విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. వర్కింగ్ టైటిల్ వీడి12 పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న రౌడీ హీరోకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబోలో మరో చిత్రం రానుంది. వీడీ13 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. View this post on Instagram A post shared by Telugu FilmNagar (@telugufilmnagar) -
రామ్ చరణ్ నిర్మాణ సంస్థలో టాలీవుడ్ హీరో.. షూటింగ్ ప్రారంభం!
టాలీవుడ్ హీరో హీరో నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ' ది ఇండియా హౌస్'. ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ మూవీ షూటింగ్‌ను హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ శివుని ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను 1905లో జరిగిన పీరియాడిక్ కథాచిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝙏𝙝𝙚 𝙨𝙥𝙖𝙧𝙠 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙧𝙚𝙫𝙤𝙡𝙪𝙩𝙞𝙤𝙣 𝙞𝙨 𝙞𝙜𝙣𝙞𝙩𝙚𝙙 🔥#TheIndiaHouse commences on an auspicious note with a pooja ceremony at the Virupaksha Temple, Hampi with the blessings of Lord Shiva 🔱Stay tuned for more updates ❤️🔥#JaiMataDi #RevolutionIsBrewing pic.twitter.com/qZyTjqIP62— V Mega Pictures (@VMegaPictures_) July 1, 2024 -
బిగ్‌బాస్ అమర్దీప్ కొత్త సినిమా.. షూటింగ్ సెట్లోనే సన్మానం!
బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్, సుప్రీత సురేఖవాణి జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏం3 మీడియా అండ్ మహా మూవీస్ బ్యానర్లో మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.అయితే ఇటీవల ఓ డాన్స్ షోలో అమర్దీప్ చౌదరి, తేజు విజయం సాధించారు. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమర్దీప్ మూవీ షూటింగ్ లోకేషన్లోనే టీం సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అమర్‌దీప్‌ను సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ..'నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే విజయం వస్తుందని అనడానికి నిదర్శనం ఇదే. ప్రేక్షకుల సపోర్ట్ వలనే ఇదంతా సాధ్యమైంది. అలాగే మా సినిమా ని సైతం ప్రేక్షకులు ఆదరించాని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల ,డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత, టేస్టీ తేజ పాల్గొన్నారు. -
ఒలింపిక్స్‌కు భారత షాట్‌గన్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో కూడిన భారత షాట్‌గన్ జట్టును ప్రకటించారు. జట్టులోకి ఎంపికైన ఐదుగురూ తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. పురుషుల ట్రాప్ విభాగంలో పృథ్వీరాజ్ తొండైమన్... మహిళల ట్రాప్ విభాగంలో రాజేశ్వరి కుమారి... పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరూకా... మహిళల స్కీట్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. స్కీట్ మిక్స్డ్ విభాగంలో అనంత్, మహేశ్వరి పోటీపడతారు. 37 ఏళ్ల పృథ్వి రాజ్ ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీల్లో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో కలిపి భారత్ నుంచి మొత్తం 21 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు. -
పుష్ప-2 తో పాటు పుష్ప-3
-
యాక్షన్ కుబేర
‘కుబేర అండ్ కో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్లో ధనుష్–నాగార్జున పాల్గొంటుండగా, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్‌తో ‘కుబేర’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ‘‘చాలా వరకు టాకీ పార్టును పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు. -
గుడ్ బ్యాడ్ సెట్లో...
అజిత్ కుమార్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అజిత్ కుమార్‌తో తమ కొత్తప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలోప్రారంభమైంది.ఈ కీలక షెడ్యూల్ కోసం ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అజిత్‌తో పాటు కీలక పాత్రధారులు ఈ షూట్లో పాల్గొంటున్నారు. ‘‘ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ప్రాజెక్ట్లలో ఒకటిగా రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అభినందన్ రామానుజం. -
కన్నప్ప సెట్స్‌లో...
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. -
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్‌లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్‌తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. -
తలైవా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం పేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్‌ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వంటి ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్‌బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024 -
షూటింగ్లో భారత్‌కు 21వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది. దాంతో భారత్‌కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. దోహాలో ఆదివారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. -
షూటింగ్లో భారత్‌కు 20వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు 20 బెర్త్ ఖరారైంది. రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ పలక్ గులియా కాంస్య పతకం సాధించింది. తద్వారా భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 18 ఏళ్ల హరియాణా అమ్మాయి పలక్ 217.6 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన మరో షూటర్ సంయమ్ 176.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. -
షూటింగ్‌లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?
కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్‌లు మానేసి, హైదరాబాద్‌లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
హైదరాబాద్‌లో తండేల్
నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్’. ‘లవ్ స్టోరీ’ వంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్యతో రెండోసారి ‘తండేల్’లో నటిస్తున్నారు సాయి పల్లవి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూట్ డైరీస్ పేరుతో సెట్స్‌లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ ‘తండేల్’. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. పాత్రలకు అనుగుణంగా నాగచైతన్య–సాయిపల్లవి డీ –గ్లామర్‌గా కనిపిస్తారు. నటీనటుల గెటప్, క్యాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చందు మొండేటి’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్‌దత్. -
USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్ విల్లా బీచ్ నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్‌టౌన్ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్ విల్లే బీచ్‌లో 24వేల మంది జనాభా ఉంటారు. కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు. దేశంలో వేళ్లూనుకుపోయిన గన్ కల్చర్ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు -
Pune:హోటల్లో దారుణం.. పాయింట్ బ్లాంక్‌లో కాల్చి హత్య
పుణె: మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. పుణె-సోలాపూర్ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరుగా స్నేహితులతో కూర్చున్న దాన్వే వద్దకు వెళ్లి తలపై పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి కాల్చారు. తలపై కాల్చగానే దాన్వే కిందపడిపోయాడు. అతని స్నేహితులు రెస్టారెంట్ నుంచి పారిపోయారు. ఇంతటితో ఆగకుండా మరో నలుగురైదుగురు దుండగులు రెస్టారెంట్ లోపలికి వచ్చి కాల్పులకు గురై పడిపోయిన దాన్వేను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ హత్య హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి -
హైదరాబాద్‌లో పాకిస్తాన్ జైలు!
హైదరాబాద్‌లో పాకిస్తాన్ జైలు ఏంటి? అనే సందేహం తలెత్తడం ఖాయం. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా కోసం హైదరాబాద్‌లో పాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆ జైలు సెట్లోనే జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేపల వేటలో భాగంగా పోరపాటున పాకిస్తాన్ సముద్రంలోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల వాస్తవ ఘటనలతో ‘తండేల్’ రూపొందుతోంది.పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించిన వారిలో ఓ వ్యక్తిపాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్లోపాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్లో షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగేపాకిస్తాన్ జైలు నుంచి విడుదలై భారతదేశానికి వచ్చిన మత్స్యకారులు ఒక రైల్వే స్టేషన్లో దిగే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారట మేకర్స్. హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లో ఈ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. -
డ్యాన్సింగ్ మూడ్‌లో స్టార్ హీరోలు.. 1997 తర్వాత 'చిరు' మళ్లీ ఇలా
ఫ్యామిలీ సాంగ్ ఆనందోత్సాహలతో ఫ్యామిలీ పాట పాడుతున్నాడట ‘విశ్వంభర’. చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి హాయిగా డ్యాన్స్ చేస్తున్నాడట. ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్‌కు కారణమైన హ్యాపీ మూమెంట్స్ ఏంటో ‘విశ్వంభర’ సినిమాలో చూడాలి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ‘స్టాలిన్’ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు త్రిష. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర భీమవరం దొరబాబు అని, కథ రీత్యా దొరబాబుకు ఐదుగురు చెల్లెళ్లు ఉంటారనే ప్రచారం సాగుతోంది. చిరంజీవి చెల్లెళ్లుగా మీనాక్షీ చౌదరి, మృణాల్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కనిపిస్తారని భోగట్టా. కాగా ‘విశ్వంభర’ తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముందుగా కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ ఆరంభించారని తెలిసింది. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి స్వరకర్త. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘హిట్లర్’ (1997) సినిమాలో హీరో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్లకు చిరంజీవి మళ్లీ ఐదుగురు చెల్లెళ్లతో ‘విశ్వంభర’ చేస్తున్నారు. రొమాంటిక్ కల్కి ఇటలీ బీచ్‌లో ప్రేమ పాట పాడుతున్నారు ప్రభాస్. ఈ రొమాంటిక్ పాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పుష్పరాజ్ పాట మంచి ఫైర్ మీద ఉన్నాడు పుష్పరాజ్. తన సత్తా ఏంటో పాట రూపంలో మరోసారి చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఓ మాస్ సాంగ్ ఉంటుంది. ఈ తరహా సాంగ్ ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ ఉందట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడి యోలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటకు ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిన్నారు. తొలి భాగంలో శ్రీవల్లి పాత్రలో ప్రేయసిగా నటించిన హీరోయిన్ రష్మికా మందన్నా మలి భాగంలో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
మెగా డాటర్ రీ ఎంట్రీ.. షూటింగ్ ప్రారంభం!
మలయాళ హీరో షాన్ నిగమ్, కలైయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం మెడ్రాస్ కారన్. చాలా ఏళ్ల తర్వాత మెగా డాటర్ నిహారిక ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్రామ్ మాట్లాడుతూ దర్శకుడు వాలిమోహన్ దాస్ మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. తాము ప్రతి చిత్ర షూటింగ్‌కు ముందు స్క్రీన్‌పై గురించి చర్చించుకుంటామని చెప్పారు. ఆయన మంచి ప్రతిభావంతుడని అన్నారు. ఈయన ఎదుగుదల తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. షాన్ నిగమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటుడు కలైయరసన్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మెడ్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు పొన్రామ్ అన్నారు. మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్, డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు వాలిమోహన్దాస్ పే ర్కొన్నారు. చిత్ర షూటింగ్ చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ బ్రాంక్స్ సబ్వే స్టేషన్లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా అయిదుగురు గాయపడ్డారు. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఇద్దరు టీనేజర్ల మధ్య వాగ్వాదమే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఏ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగిందో తెలియదని చెప్పారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత నెంబర్ 4 రైలులో ప్రారంభమైన గొడవ రైలు మౌంట్ ఈడెన్ ఎవెన్యూ స్టేషన్ చేరుకున్న తర్వాత పెద్దదైందని, ఇంతలో ఒక వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. Watch as @NYPD1stDep Tania Kinsella makes a law enforcement announcement on an ongoing investigation in The Bronx within the confines of the @NYPD44Pct. https://t.co/YiOCsvt1FI — NYPD NEWS (@NYPDnews) February 13, 2024 ఇదీ చదవండి.. ఇండోనేషియాలో ఒకే రోజు ఐదు ఎన్నికలు -
తండ్రి, కొడుకుల బంధమే 'లవ్ యువర్ ఫాదర్'!
శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ యువర్ ఫాదర్'. ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీకి మెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..'గతంలో కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు వర్క్ చేశా. కిషోర్ రాఠీ నన్ను పిలిచి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్‌పై అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. ఈ సినిమాను కచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. '1983 నుంచి ఇప్పటివరకు మా నిర్మాణ సంస్థ సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ చూపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ..' ఇదే నా మొదటి సినిమా. వందశాతం కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నా' అన్నారు.ఈ చిత్రంలో ఎస్పీచరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
అమెరికాలోని డెన్వర్‌లోని నివాస ప్రాంతంలో ఆదివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒక యువకునితో పాటు ఒక బాలుడు ఉన్నట్లు పోలీసుశాఖ అధికార ప్రతినిధి సీన్ టోవెల్ మీడియాకు తెలిపారు. Two people have died following an early morning shooting on February 4 in a residential area of #Denver that left four other people injured, police said.https://t.co/dma1vdrviA — The Hindu (@the_hindu) February 5, 2024 ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గ్రీన్ వ్యాలీ రాంచ్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉదయం ఆరు గంటల సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
ISSF World Cup: సోనమ్ మస్కర్కు రజత పతకం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ఐదో పతకం లభించింది. కైరోలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సోనమ్‌కు ఇదే తొలి ప్రపంచకప్ టోర్నీ కావడం విశేషం. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సోనమ్ 252.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అనా జాన్సెన్ (జర్మనీ; 253 పాయింట్లు) స్వర్ణం, అనెటా స్టాన్కివిజ్ (పోలాండ్; 230.4 పాయింట్లు) కాంస్యం గెలిచారు. -
కారైకుడిలో మిస్టర్ బచ్చన్
కారైకుడికి వెళ్లారు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ తమిళనాడులోని కారైకుడిలో ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. -
Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి!
స్ప్రింగ్ఫీల్డ్: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్‌కల్చర్ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇల్లానాయిస్ స్టేట్ చికాగో జోలియట్ ప్రాంతంలోని 2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతుండగా.. స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC — Joliet Police Department (@JolietPolice) January 22, 2024 మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్‌గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. -
‘పుష్ప’ మళ్లీ షురూ
మళ్లీ యాక్షన్ షురూ చేశాడు పుష్పరాజ్. తనకు ఎదురొచ్చిన శత్రువుల బెండు తీస్తున్నాడు. అది ఏ రేంజ్లో అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’కి మలి భాగంగా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. కాగా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. పదిహేను రోజులకు పైగా ఈ షెడ్యూల్ సాగుతుందట. అల్లు అర్జున్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
పాపం లక్ష్య.. పతకం సాధించినా దక్కని ఒలింపిక్స్ బెర్త్
ఆసియా ఒలింపిక్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ లక్ష్య షెరోన్ కాంస్య పతకం సాధించాడు. కువైట్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో లక్ష్య మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో లక్ష్య పతకం సాధించినప్పటికీ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సంపాదించలేకపోయాడు. ఒలింపిక్స్ బెర్త్‌ను లక్ష్య తృటిలో కోల్పోయాడు. ఆరుగురు షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో 25 ఏళ్ల లక్ష్య 33 పాయింట్లు స్కోరు చేశాడు. ఇరాన్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు మొహమ్మద్ బెరాన్వంద్ స్వర్ణం, 32 ఏళ్ల చైనా షూటర్ గువో యుహావో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. -
Asia Olympic Qualifiers: భారత షూటర్ల పసిడి వేట
జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత షూటర్ల ఖాతాలోకి రెండు స్వర్ణ పతకాలు చేరాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ యోగేశ్ సింగ్ (572 పాయింట్లు) పసిడి పతకం నెగ్గాడు. యోగేశ్, అమిత్, ఓం ప్రకాశ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1690 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. -
భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారు.. షూటర్ నంబర్ 17
జకార్తా: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేశాడు. దీంతో భారత్ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో విజయ్‌వీర్ శనివారం రజత పతకం గెలుచుకున్నాడు. అయితే పతకం గెలుచుకోవడానికి ముందే అతనికి ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. క్వాలిఫయింగ్ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్‌వీర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్ లభించింది. చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల వీర్ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. మరో వైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఈ ఈవెంట్లో సిఫ్ట్‌కౌర్ రజతం గెలుచుకోగా, ఆషి చౌక్సీకి కాంస్యం దక్కింది. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్‌ఫాఫుమ్ (థాయ్‌లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఒలింపిక్ బెర్త్ నంబర్ 16
జకార్తా: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి షూటింగ్ క్రీడాంశంలో అత్యధిక మంది పోటీపడనున్నారు. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు అర్హత పొందగా... ఈసారి ఆ సంఖ్య 16కు చేరుకుంది. ఇంకా షూటింగ్లో మరో మూడు క్వాలిఫయింగ్ టోర్నీలు మిగిలి ఉండటం, మరో ఎనిమిది బెర్త్‌లు ఖాళీగా ఉండటంతో భారత్ నుంచి మరింత మంది షూటర్లు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో గురువారం భారత్‌కు 16వ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రిథమ్ సాంగ్వాన్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో హరియాణాకు చెందిన 20 ఏళ్ల రిథమ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. రిథమ్, తెలంగాణ షూటర్ ఇషా సింగ్, సిమ్రన్ప్రీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 1743 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. -
మెహులీ–రుద్రాంక్ష్ జోడీకి స్వర్ణం
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో మంగళవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో మెహులీ ఘోష్–రుద్రాంక్ష్ పాటిల్ జోడీ బంగారు పతకం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో రిథమ్ సాంగ్వాన్–అర్జున్ జంట రజత పతకం గెలిచింది. ఫైనల్స్‌లో మెహులీ–రుద్రాంక్ష్ 16–10తో షెన్ యుఫాన్–జు మింగ్షుయ్ (చైనా)లపై నెగ్గగా... రిథమ్–అర్జున్ 11–17తో ట్రిన్–క్వాంగ్ (వియత్నాం)ల చేతిలో ఓడింది. -
సీనియర్ నటుడి కుమారుడు హీరోగా కొత్త చిత్రం!
ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్‌పై మొదటి చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా.. దేవరాజ్ కెమరా స్విఛ్ ఆన్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. 'సినిమా అంటే చాలా ప్యాషన్ ఉండాలి. హరి క్రియేషన్స్ బ్యానర్‌ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. దేవరాజు ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ల అబ్బాయి ప్రణం దేవరాజ్ ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. శంకర్ చాలా ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్‌కు ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ పరిసర తెరకెక్కించనున్నాం' అని తెలిపారు. హీరో ప్రణం మాట్లాడుతూ.. 'ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి' అని కోరారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
యాక్షన్ ఎంటర్టైనర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బీఎస్ఎస్ 10’(వర్కింగ్ టైటిల్). ‘భీమ్లా నాయక్’ మూవీ తర్వాత సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తయింది. ‘‘యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘బీఎస్ఎస్ 10’. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ని గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు సాగర్ కె.చంద్ర. ఈ సినిమాలోని కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 3న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్. -
నాన్న ఎక్కుపెట్టిన గన్!
(బోణం గణేష్, సాక్షి ప్రతినిధి) : ఐదు కేజీల తుపాకీని చేత్తో పట్టుకుని.. 20 కేజీల బరువును ఒంటిపై మోస్తూ.. యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను గురి చూసి కొట్టడమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్‌కు ఉన్నంత పవర్ దానిని పట్టుకున్న వ్యక్తికీ ఉండాలి. అత్యంత ఏకాగ్రతతో కఠోర సాధన చేస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. షూటర్‌గా 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో ఒకేసారి ఇరవై ఈవెంట్లలో పాల్గొని వరల్డ్ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన మద్దినేని ఉమా మహేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే.. నాన్న ప్రోత్సాహంతో తొలి అడుగు ఆరేడేళ్ల వయసు నుంచే నాన్న రామకృష్ణ ప్రోత్సాహంతో క్రీడలను సీరియస్‌గా తీసుకున్నాను. తొలుత క్రికెట్, కరాటే, బాస్కెట్‌బాల్ నేర్చుకున్నాను. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. విజేతగా కూడా నిలిచాను. మా నాన్న సూచనతో 2017 నుంచి షూటింగ్‌పై దృష్టి సారించాను. మొదట గుంటూరులో శిక్షణ తీసుకున్నాను. 2018లో ఢిల్లీ వెళ్లి దీపక్ దూబియా వద్ద శిక్షణ మొదలుపెట్టాను. అప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాను. జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్ మెడల్.. ప్రముఖ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పూణేలో నిర్వహించే శిక్షణకు ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురినే ఆయన ఎంపిక చేసుకుంటారు. అప్పటి నుంచి నేహా దూబియా నాకు పర్సనల్ కోచ్‌గా ఉన్నారు. ఆమె శిక్షణలో 2022 షూటింగ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్‌మెడల్ సాధించాను. నాలుగు సార్లు ‘ఖేలో ఇండియా’లో పాల్గొన్నాను. యూనివర్సిటీలు, స్కూల్ నేషనల్స్‌లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 15 ఏళ్ల వయసులో భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 20 ఈవెంట్స్‌లో పాల్గొని వరల్డ్ రికార్డ్ సాధించాను. వరల్డ్ చాంపియన్‌షిప్, ఏసియన్ చాంపియన్íÙప్లోనూ మెడల్స్ వచ్చాయి. షూటింగ్ క్రీడలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ ఆటగాడిని నేనొక్కడినే. ఇంటి కష్టం కన్నా గన్ బరువే ఎక్కువని తెలుసు ఈ ఆట కోసం 25 కేజీల బరువును దాదాపు గంటన్నర పాటు మోయాలి. గన్ బరువే 5 కేజీలుంటుంది. నా ప్రతిభ వెనుక అమ్మ మంజుల, నాన్న రామకృష్ణ కష్టం చాలా ఉంది. చిన్న వ్యాపారం చేసుకునే మా నాన్నే దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ చూసుకునేవారు. షూటింగ్‌కు ఏకాగ్రత చాలా ముఖ్యం. అది దెబ్బతినకూడదని ఇంటి ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితి గురించి నాకు చెప్పేవారు కాదు. ఆటల్లో పడి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నాను. జర్మనీలో బొండెస్లేగా లీగ్‌లు జరుగుతుంటాయి. ఒక్కో క్లబ్ ఒక విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకుంటాయి. ఈ ఏడాది భారత్ నుంచి నన్ను ఒక్కడినే తీసుకున్నారు. ఐదు ఒలింపిక్స్ ఆడిన హంగేరీ కోచ్ పీటర్ సీడీ నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. తమ దేశం తరఫున ఆడాలని జర్మనీ క్లబ్‌లు అడిగాయి. కానీ మన దేశం తరఫున ఆడి గెలవడమే నాకు ఇష్టం. ‘ఆడుదాం ఆంధ్రా’ గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు భారీగా బహుమతులను అందించడం, క్రీడా సామగ్రిని సమకూర్చడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక చేయూతనిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తా 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ శిక్షణకు రోజుకు కనీసం రూ.10 వేలు ఖర్చుయ్యేది. నాకు గన్ కూడా లేదు. కొత్తది కొనాలంటే రూ.15 లక్షల వరకు అవసరం. దీంతో పోటీలకు పది రోజుల ముందే వెళ్లి గన్ను అద్దెకు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. ఓల్డర్ కంపెనీ గన్స్నే షూటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ కంపెనీ సీఈవో జర్మనీలో తమ సంస్థను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు. ఆ కంపెనీ వాళ్లు నా కోసం ప్రత్యేకంగా గన్ను సిద్ధం చేశారు. కానీ దాన్ని కొనగలిగేంత ఆరి్థక స్థోమత మాకు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరి్థకంగా చేయూతనిస్తే మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తాను. భారత్ తరపున ఒలింపిక్స్ ఆడి గెలవాలనేది నా లక్ష్యం. -
90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 3 నెలల క్రితం న్యూజిల్యాండ్‌లో మొదలైంది. ‘‘న్యూజిల్యాండ్‌లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో 90 రోజుల మొదటి షెడ్యూల్ చేశాం. అక్కడి అద్భుతమైన లొకేషన్స్‌లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వస్తున్నాం. ఈ సినిమాకు థాయ్‌ల్యాండ్, న్యూజిల్యాండ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోహన్‌బాబు. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
సెట్స్‌లో నా సామిరంగ
నా సామిరంగ... డ్యాన్స్ అంటూ సెట్స్‌లో రెచ్చిపోతున్నారు నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ సెట్లో నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్‌లతో పాటు 300మంది డ్యాన్సర్స్ పాల్గొంటుండగా, టైటిల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. -
మరో సినిమాతో వస్తోన్న గుడ్ నైట్ హీరో!
జై భీమ్ చిత్రంతో ఫేమస్ అయిన హీరో మణికంఠన్. ఇటీవలే గుడ్ నైట్ సినిమాతో హిట్ అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై ఎంత మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఆయన కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. నటి శాన్వి మేఘన నాయకిగా నటిస్తున్న ఇందులో గురు సోమసుందరరాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కారం పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కోయంబత్తూర్‌లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్వర్ కలిసామి మాట్లాడుతూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొనే సవాళ్లను.. ఎదుర్కోవడానికి చేసే సాహసాలను చూపే కథంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. కోయంబత్తూర్‌లో ఫ్లెక్స్ అనే ముద్రణ కార్యాలయంలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక చిరు ఉద్యోగి ఇతి వృత్తంతో సాగే కథ కావడంతో ఈ చిత్రంలో చక్కని వినోదంతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇది కుటుంబ సమేతంగా ఆదరించే కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను ప్రసన్న బాలచంద్రన్, రాజేశ్వర్ కాలిసామిలు, కథనం, సంభాషణలను ప్రసన్న బాలచంద్రన్ అందించారు. ఈ సినిమాకు సుజిత్ సుబ్రహ్మణ్యం ఛాయా గ్రహణం, వైసాగ్ సంగీతమందిస్తున్నారు. -
మారుతినగర్లో నవ్వులు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్‌గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్‌గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో దారుణం జరిగింది. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రాంలోని సాల్వటియెర్రా నగరంలో జరిగింది. నగరంలో కిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో హాజరైన వ్యక్తులపై ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తులను వేడుకకు ఆహ్వానించలేదని, అయినప్పటికీ పార్టీకి వచ్చిన వారిని ప్రశ్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు -
పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్లో స్టార్ హీరోకు గాయాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్‌ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్‌లో కనిపించనున్నారు. -
అల్లుడితో షూట్ చేయించుకున్న మామ..ఎందుకంటే..?
న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రీ తాహీర్‌పూర్‌లో జరిగింది. కాల్పులు జరిగాయని ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్ కనిపించాడు. 315 బోర్ తుపాకీకి చెందిన ఖాళీ షెల్ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్‌తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్‌కు కొన్ని అప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్‌లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్‌తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
ఆస్పత్రి లాబీలో కాల్పులు.. ఇద్దరు మృతి
న్యూహాంప్‌షైర్: అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు బలగాల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. కాల్పుల ఘటన ఆసుపత్రి లాబీ వరకే పరిమితం అయిందని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. తమ ట్రూపర్ జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సుమారు 185 పడకలున్న న్యూహాంప్‌షైర్ సైకియాట్రిక్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ఏకైక ఆస్పత్రి. -
సందేశంతో హెచ్చరిక
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్ హంగులు మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్‌ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
జీబ్రాకి బైబై
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులు బై బై చెప్పుకున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ హాంప్‌షైర్‌లోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. నగరంలో మానసిక రోగులకు చికిత్సనందించే ఆస్పత్రి అది. శుక్రవారం ఆస్పత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఆస్పత్రి లాబీలో మొదట కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ అనుమానిత వ్యక్తిని హతమార్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది బాధితులున్నారో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆస్పత్రి పోలీసుల పర్యవేక్షలో ఉంది. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఇదీ చదవండి: Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష -
Niharika Konidela New Movie Launch: నిహారిక మూవీ ప్రారంభం...సందడి చేసిన వరుణ్- లావణ్య (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత తొలిసారి జంటగా సందడి చేసిన వరుణ్- లావణ్య!
ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తొలిసారి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా.. హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. నిహారిక మాట్లాడుతూ.. 'మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం. కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను.' అని అన్నారు. అయితే వరుణ్- లావణ్య తమ పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈనెల 1న ఇటలీలోని టుస్కానీలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఇండియాకు తిరగొచ్చాక హైదరాబాద్‌లోనూ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. -
ఇటలీ నుంచి ఇంటికి...
దాదాపు రెండు నెలల ఇటలీ ట్రిప్‌ను ముగించుకుని బుధవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాస్. ఇక ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సలార్’ చిత్రం తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారట ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం డిసెంబరు 22న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలోని ‘రాజాడీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా ΄ాల్గొనేలా ప్రభాస్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం. -
మాస్ జాతర
జాతరలో మాస్ ఫైట్ చేస్తున్నారు పుష్పరాజ్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘పుష్ప’ మలిభాగం ‘పుష్ప: ది రూల్’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ చిత్రంలో పుష్పరాజ్ ΄ాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ప్రజెంట్ ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. జాతర నేపథ్యంలో వచ్చే ఓ ΄ాట, ఆ జాతరకు ముడిపడి ఉన్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ జాతర బ్యాక్‌డ్రాప్ సీన్స్ అన్నీ ఇంట్రవెల్ సమయంలో రానున్నాయని భోగట్టా. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
విజయవాడకు భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే రూపొంది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్ కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్ 2’కు కొనసాగింపుగా ΄్లాన్ చేసిన ‘ఇండియన్ 3’ షూటింగ్‌ను కూడా ఆల్రెడీ శంకర్ ఆరంభించారని, ఇందుకు కమల్ అదనంగా 40 రోజుల కాల్షీట్స్ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, ‘ఇండియన్ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. -
సరికొత్త జోనర్లో వస్తోన్న 'మహార్ యోధ్ 1818'!
మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ హీరో రజత్ రాఘవ్, ముంబై భామ ఐశ్వర్య రాజ్ బకుని జంటగా నటిస్తోన్న చిత్రం' మహర్ యోధ్ 1818'. ఈ చిత్రాన్ని రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో డిఎస్ఆర్ ఫిల్స్మ్ బ్యానర్‌పై సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్నారు. సోషల్ థ్రిల్లర్, ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ.పి.యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టరు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, దర్శకుడు నక్కింటి త్రినాథరావు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి మహా-శశాంక్ ద్వయం సంగీతమందిస్తున్నారు. -
గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి
స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందే సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించారు. బుల్లితెర నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది. (ఇది చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!) అయితే తాజాగా క్యుంకీ.. సాస్ భీ కభీ బహు థీ సీరియల్ సహానటి అపరా మెహతా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ తన పిల్లలు జోర్, జోయిష్ పుట్టే సమయంలో ఒకరోజు ముందు కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నారని మెహతా వెల్లడించారు. అయితే ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. అపరా మెహతా మాట్లాడుతూ.. ' స్మృతికి తన కుమారుడు జోర్ పుట్టే ముందు రోజు వరకు మాతో షూటింగ్లో ఉంది. డెలివరీ తర్వాత నాల్గవ రోజే షూట్ చేయడానికి తిరిగి వచ్చింది. రెండోసారి ఆమె కుమార్తె జోయిష్ జన్మించినప్పుడు కూడా అదే పని చేసింది. అయితే ఒకసారి ఆమెకు గర్భస్రావం జరిగినట్లు నాతో చెప్పింది. ఈ విషయాన్ని క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ టీమ్‌కు చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజే షూటింగ్లో పాల్గొందని.' తెలిపింది. టీవీ పరిశ్రమలో పనిచేయడం చాలా కష్టమని.. అయితే దీనికి ఏ ఒక్క వ్యక్తిని నిందించలేమని పేర్కొంది. ఈ పరిశ్రమలో నిబద్ధత, అంకితభావం అవసరమని వెల్లడించింది. కాగా.. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ తులసి విరానీ పాత్రను స్మృతి ఇరానీ పోషించగా.. సవితా మన్సుఖ్ విరానీ పాత్రలో అపరా మెహతా కనిపించింది. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) -
కొత్త సినిమా షురూ
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మురళీ మోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, విజయశాంతి క్లాప్ కొట్టారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు. ‘‘భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూ΄పొందుతున్న చిత్రమిది. కల్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సి. రామ్ ప్రసాద్. -
హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... రోమాలు నిక్కబొడిచే వీడియో!
ఎటువంటి కర్మకు అటువంటి ఫలితమే వస్తుందని అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో దీనికి రుజువుగా మారింది. వీడియోలోని దృశ్యం ప్రకారం.. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్‌తో నాగుపాముకు గురిపెట్టి కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మరుసటి క్షణంలో కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. వీడియో ప్రారంభంలో ఒక కింగ్ కోబ్రా(నాగు పాము) మట్టి రహదారిపై ఉండటాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఒక కారు ఆ కోబ్రా ముందు ఆగి ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న వ్యక్తి తన రివాల్వర్ని తీసి, కోబ్రాపై కాల్పులు జరుపుతాడు. ఆ వ్యక్తి పలుమార్లు నాగుపాముపై కాల్పులు జరుపుతాడు. అయితే ప్రతిసారీ గురి తప్పుతుంది. ఆ నాగుపాము కోపంతో తన పడగ విప్పి, ఆ వ్యక్తిపై దాడికి ఉపక్రమిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడం వీడియోలో వినిపిస్తుంది. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో @Instantregretss అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లెక్కకు మించిన వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది కూడా చదవండి: చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా? Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu — Klip Entertainment (@klip_ent) December 16, 2022 -
ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!
అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సీఎం పెళ్లాం(కామన్ మ్యాన్ పెళ్లాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, సురేశ్ కొండేటి, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ..'ఇది వెరైటీ సినిమా అని కానీ చూశాక ప్రేక్షకులే చెబుతారు. డిఫరెంట్ యాంగిల్‌తో పాటు పొలిటికల్ పాయింట్స్ నేపథ్యంలో ఉంటుంది. నిజంగా పదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనే భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం.'అని అన్నారు. -
Asian Games 2023: పదిహేను పతకాలతో పండుగ
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం... తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిదో రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలను అందుకున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు కూడా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఆదివారం ఒక్క అథ్లెటిక్స్‌లోనే 9 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది. సత్తా చాటిన సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్‌కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్ కేహని (ఇరాన్: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ మహిళల విభాగంలో మాత్రం భారత్ నుంచి 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. తజీందర్ తడాఖా పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్ సింగ్ తూర్ సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్‌ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు. ఐదో ప్రయత్నం కూడా ఫౌల్ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు. పర్దుమన్ సింగ్, జోగీందర్ సింగ్, బహదూర్ సింగ్ చౌహాన్ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్‌గా తజీందర్ నిలిచాడు. సిల్వర్ జంప్ పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్ వాంగ్ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు. వహ్వా హర్మిలన్ 1998 జనవరి... పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్‌లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయే హర్మిలన్ బైన్స్. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్మిలన్ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. అజయ్‌కు రజతం, జాన్సన్‌కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ సరోజ్, కేరళ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్లో ఖతర్‌కు చెందిన మొహమ్మద్ అల్‌గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. సీనియర్ సీమ జోరు మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్‌ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు పృథ్వీరాజ్ తొండైమాన్, క్యానన్ చెనై, జొరావర్ సింగ్ సంధు గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 12వ గోల్డ్ మెడల్ చేరింది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో ప్రస్తుతం 44 మెడల్స్ (12, 16, 16) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 229 పతకాలతో (121 గోల్డ్, 71 సిల్వర్, 37 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 121 పతకాలతో (30, 33, 58) రెండో స్థానంలో, జపాన్ 108 మెడల్స్‌తో (29, 39, 40) మూడో స్థానంలో ఉన్నాయి. 🥇 Gold Rush Alert! 🥇 #AsianGames2022 🇮🇳 Shooters @tondaimanpr, #KheloIndiaAthlete @KynanChenai, and Zoravar Singh Sandhu have shot their way to GOLD in the Men's Trap Team event! 🎯🇮🇳 with an Asian Games record of 361 ⚡ Their precision, focus, and teamwork have brought glory… pic.twitter.com/7pAakYlsaj — SAI Media (@Media_SAI) October 1, 2023 ఇదిలా ఉంటే, మెన్స్ ట్రాప్-50 టీమ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ తొండైమాన్, క్యానన్ చెనై, జొరావర్ సింగ్ సంధు త్రయం స్వర్ణం సాధించడానికి ముందు మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.. మనీశా కీర్, ప్రీతి రజక్, రాజేశ్వరి కుమారి టీమ్ భారత్‌కు 16వ సిల్వర్ మెడల్ అందించింది. దీనికి ముందు అదితి అశోక్ గోల్ఫ్‌లో భారత్‌కు రజత పతకం అందించింది. అదితి ఆసియా క్రీడల్లో గోల్ఫ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కింది. అంతకుముందు 1982లో లక్ష్మనన్ సింగ్ భారత్‌కి గోల్ఫ్‌లో స్వర్ణం అందించాడు. -
పసిడి టెన్నిస్ శభాష్ స్క్వాష్...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత కొనసాగుతోంది. శనివారం కూడా నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి. స్క్వాష్ టీమ్ విభాగంలో, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో మన ఆటగాళ్లు పసిడి పంట పండించారు. షూటింగ్లో సాంప్రదాయం కొనసాగిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో రజతం మనకు దక్కింది. ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత అథ్లెట్లు 10 వేల మీటర్ల పరుగులో రజత, కాంస్యాలు అందించారు. వీటికి తోడు మహిళల టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ చాంపియన్ చైనాకు షాక్ ఇచ్చి మన ప్యాడ్లర్లు సంచలనం సృష్టించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత బృందం తొలిసారి ఫైనల్ చేరింది. ఎప్పటిలాగే హాకీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా అదనపు ఆనందాన్ని అందించింది. పాకిస్తాన్‌ను పడగొట్టి... ఎనిమిదేళ్ల తర్వాత స్క్వాష్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్‌పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్‌తో అభయ్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఐదు గేమ్‌ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్‌ను ఓడించాడు. నాలుగో గేమ్‌లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్‌లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు. అంతకు ముందు తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్కర్పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరో సారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్‌లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌఆసియా క్రీడలు ‘సిల్వర్’ సరబ్జోత్ – దివ్య భారత షూటర్ సరబ్జోత్ సింగ్ శనివారం తన 22వ పుట్టిన రోజున మరో ఆసియా క్రీడల పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిక్సడ్ టీమ్ ఈవెంట్లో అతనికి రజతం దక్కింది. మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ – దివ్య టీఎస్ జోడి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ జోడి జాంగ్ బోవెన్ – జియాంగ్ రాంగ్జిన్ 16–14 తేడాతో సరబ్జోత్ – దివ్యలను ఓడించింది. గురువారమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సరబ్జోత్ మరోసారి పసిడిపై గురి పెట్టినా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. దివ్యకు ఇది రెండో రజతం. తాజా ప్రదర్శన తర్వాత ఈ ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ పతకాలు సంఖ్య 19కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. సత్తా చాటిన కార్తీక్, గుల్విర్ 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగులో భారత్‌కు చెందిన గులాబ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐదు ఆసియా క్రీడలు జరిగినా ఈ లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్లో మనకు మెడల్ దక్కలేదు. కానీ శనివారం ఆ లోటు తీరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. రజత, కాంస్యాలు రెండూ మన అథ్లెట్లే గెలవడం విశేషం. కార్తీక్ కుమార్‌కు రజతం దక్కగా, గుల్విర్ సింగ్ కాంస్యం సాధించాడు. కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 17.21 సెకన్ల టైమింగ్‌తో గుల్వీర్ మూడో స్థానం సాధించాడు. వీరిద్దరికీ ఈ టైమింగ్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు కావడం గమనార్హం. ఈ ఈవెంట్లో బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను యమతావ్ (28 నిమిషాల 13.62 సెకన్లు) స్వర్ణపతకం గెలుచుకున్నాడు. మెరిసిన బోపన్న–రుతుజ ద్వయం ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. శుక్రవారం భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం దక్కగా...శనివారం మన జట్టు ఖాతాలో పసిడి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి రోహన్ బోపన్న – రుతుజ భోస్లే ద్వయం ఈ ఘనత సాధించారు. పోటాపోటీగా సాగిన ఫైనల్లో బోపన్న – రుతుజ 2–6, 6–3, 10–4 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ హవో – షువో లియాంగ్‌పై విజయం సాధించారు. భారత్ స్వీయ తప్పిదాలతో భారత్ తొలి సెట్ కోల్పోయినా...ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శనతో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. రుతుజ పేలవ సర్వీస్‌తో పాటు లియాంగ్ చక్కటి రిటర్న్‌లతో తైపీ 5–1తో దూసుకుపోయింది. ఏడో గేమ్‌లో బోపన్న ఎంత ప్రయత్ని0చినా లాభం లేకపోయింది. అయితే రెండో సెట్లో రుతుజ ఆట మెరుగవడంతో పరిస్థితి మారిపోయింది. బోపన్న సర్వీస్‌తో సెట్ మన ఖాతాలో చేరగా...మూడో సెట్ సూపర్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడా భారత జోడి చక్కటి ఆటతో ముందుగా 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆపై దానిని నిలబెట్టుకుంది. బోపన్నకు ఇది రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, రుదుజకు మొదటిది. -
సత్తా చాటుతున్న భారత షూటర్లు.. మరో సిల్వర్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షుటర్లు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సరబ్జోత్ సింగ్ ,దివ్యతో కూడిన భారత ద్వయం రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో భారత్ 14 పాయింట్లు సాధించి రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. 16 పాయిట్లతో అగ్రస్ధానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడీ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్లో భారత్ మొత్తంగా 19 పతకాలు గెలుచుకుంది. అందులో 6 గోల్డ్, 8 సిల్వర్, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. -
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. మరో గోల్డ్‌మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతుంది. శుక్రవారం మన షూటర్లు మరో గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్తో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే విధంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్లో భారత్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. 1731 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఈషా, దివ్య,పాలక్‌తో కూడిన భారత త్రయం రజత పతకం సొంతం చేసుకుంది. ఇక భారత్‌కు ఇది ఏడో గోల్డ్‌మెడల్. అందులో ఐదు పతకాలు షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్‌గా 27 పతకాలతో భారత్ 4 స్థానంలో ఉంది. 🥇 1️⃣𝙨𝙩 𝙂𝙊𝙇𝘿 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙙𝙖𝙮🔥 🇮🇳's M 50m Rifle 3Ps team, featuring the trio - Aishwary Pratap Singh Tomar, @KusaleSwapnil, and Akhil Sheoran, secured the 𝙂𝙊𝙇𝘿 𝙈𝙀𝘿𝘼𝙇 today, beginning the day on a golden note! 🏆🎯 Let's shower our champions with applause and… pic.twitter.com/YxcsvLXuSG — SAI Media (@Media_SAI) September 29, 2023 -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. అదరగొడుతున్న షూటర్లు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్లు సత్తాచాటుతున్నారు. గురువారం మరో బంగారు పతకాన్ని మన షూటర్లు సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమాలో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్ , శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమా 1734 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్ధానంలో నిలిచారు. దీంతో భారత ఖాతాలో ఆరో గోల్డ్‌మెడల్ వచ్చి చేరింది. ఇక 1733 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఆతిథ్య చైనా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇక ఓవరాల్‌గా భారత్‌కు ఇది ఆరో గోల్డ్‌మెడల్. అందులో నాలుగు పతకాలు షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్‌గా 24 పతకాలతో భారత్ ఐదో స్థానంలో ఉంది. -
ఆసియా గేమ్స్ లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్
-
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్
హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్ (2 రోయింగ్, ఒకటి షూటింగ్), 2 బ్రాంజ్ మెడల్స్ (షూటింగ్లో ఒకటి, రోయింగ్‌లో ఒకటి) ఉన్నాయి. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్ ఘోష్, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ రోయింగ్‌లో భారత జోడీ అర్జున్ లాల్ ఝట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. రోయింగ్ మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబు లాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్ మెన్స్ 8 ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత స్టార్ షూటర్ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈసారి ఏషియన్ గేమ్స్‌లో భారత్ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్ (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
వాస్తవ ఘటనలతో...
నికిత శ్రీ, పృథ్వీరాజ్ (పెళ్లి), థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్ చక్రవర్తి. -
సాక్షి అగర్వాల్ కొత్త మూవీ .. సరికొత్త కాన్సెప్ట్‌తో!
సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సాక్షి అగర్వాల్. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తాజాగా సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సారా. ఈ మూవీ షూటింగ్ వినాయక చవితి సందర్భంగా చైన్నెలోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోలో ప్రారంభించారు. విజయ్ విశ్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్.విజయలక్ష్మి, చెల్లమ్మాళ్ గురుస్వామి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. (ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్.. స్టార్ హీరో సంబరాలు!) తనకి అవకాశాన్ని కల్పించిన దర్శకుడికి సాక్షి అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తీక్‌రాజా సంగీత దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందని నటుడు విజయ్ విశ్వ పేర్కొన్నారు. చిత్ర దర్శకకుడు వివరాలను తెలుపుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక యువతి తన కోసం అన్ని వదులుకొని వచ్చిన ప్రేమికుడిని కాపాడుతుందా? లేక తన కోసం త్యాగం చేసిన స్నేహితుడిని కాపాడుతుందా? అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమని తెలిపారు. హీరోయిన్ ఇతివృత్తంతో యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ఈ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. తాజాగా షూటింగ్లో పాల్గొన్న ఓ హీరోయిన్‌కు అలాంటి సంఘటనే ఎదురైందిృ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సినిమా సెట్స్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో వెంటనే షూటింగ్ నుంచి వచ్చేశానని తెలిపింది. (ఇది చదవండి: టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!) కోల్‌కతాకు చెంది బెంగాలీ నటి, రాజకీయవేత్త అయిన సయంతిక బెనర్జీ ఇటీవలే బంగ్లాదేశ్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. అయితే సెట్స్‌లో తనపట్ల కొరియోగ్రాఫర్ మైఖేల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే చేతులు పట్టుకున్నాడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించింది. నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షూట్ మధ్యలోనే ఆపేసి ఇండియాకు తిరిగొచ్చానని పేర్కొంది. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) అయితే ఈ ఘటనపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన సయంతిక తన రాబోయే చిత్రం 'చాయాబాజ్' షూటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె షూటింగ్లో జరిగిన సంఘటనను వివరించింది. కాగా.. ప్రస్తుతం తాజు కమ్రుల్ దర్శకత్వం వహిస్తోన్న 'ఛాయాబాజ్' చిత్రంలో జయేద్ ఖాన్ సరసన సయంతిక నటిస్తోంది. View this post on Instagram A post shared by Sayantika Banerjee (@iamsayantikabanerjee) -
అక్టోబరులో ఆరంభం
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రం రూ΄పొందుతున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, ఈ తొలి షెడ్యూల్ దాదాపు ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లోని విభిన్నమైన లొకేషన్స్‌లో జరుగుతుందని సమాచారం. వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా అప్పటి వైజాగ్‌ను తలపించేలా సెట్‌ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన పుష్ప బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాతో శ్రీవల్లిగా టాలీవుడ్ అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకుంది భామ రష్మిక. ఈ షెడ్యూల్లో బన్నీ, రష్మికపైనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా? ) ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ నుంచి ఓ ఫోటో లీక్ కాగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోను హీరోయిన్ రష్మిక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు పుష్ప రేంజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సైతం ట్వీట్ చేసింది. పుష్ప సెట్ నుంచి శ్రీవల్లి లీక్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. గతంలో బన్నీ సైతం తన ఇంటివద్దనుంచి షూటింగ్ స్పాట్‌కు వెళ్తున్న వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో చూస్తే అచ్చం ఇంద్రభవనం తలపించేలా కనిపిస్తోంది. అంతే కాదు పుష్ప-2లోనూ ఇలాంటి ఇంట్లోనే బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. (ఇది చదవండి: విక్కీ నువ్వు చాలా లక్కీ.. ఆ ఒక్క సినిమానే రూ.340 కోట్లు!) Our #Srivalli @iamRashmika shares her excitement with a pic from the lavish sets of #Pushpa2TheRule ❤️ Icon Star @alluarjun @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @TSeries pic.twitter.com/D4YYN67QDj — Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2023 -
యాక్షన్ థ్రిల్లర్ మూవీతో వస్తోన్న 'అర్జున్'.. క్రేజీ అప్డేట్ ఇదే!
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, నటి ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జంటగా నటించిన చిత్రం తీయవన్ కులైగళ్ నడుంగా. బిగ్‌బాస్ అభిరామి, రామ్‌కుమార్ జీకే రెడ్డి, లోగు, వేల రామమూర్తి, తంగదురై, బ్రేకింగ్ స్టార్ రాహుల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జీఎస్ఆర్ పతాకంపై జి.అరుణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా దినేష్ లక్ష్మణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంబురాలు చేసుకున్నారు చిత్రబృందం. (ఇది చదవండి: ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత) ఇప్పటికే రిలీజైన తీయవన్ కులైగళ్ నడుంగా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర టీజర్, మోషన్ పోస్టర్, సింగిల్ సాంగ్ ఆడియో విడుదల కార్యక్రమాలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు.. దీనికి శరవణన్ అభిమన్సు ఛాయా గ్రహణం, భరత్ అసీవగన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ కాంబోలో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. (ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?) It's a wrap for Aishwarya Rajesh’s upcoming crime thriller #TheeyavarKulaigalNadunga! Teaser coming soon! pic.twitter.com/0VvHN8HEis — Christopher Kanagaraj (@Chrissuccess) September 4, 2023 -
కల్యాణ్‌రామ్ 'డెవిల్'.. ఆ సీన్ల కోసం భారీ సెట్స్!
అమిగోస్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం డెవిల్. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్) ఈ మూవీ షూటింగ్ కోసం భారీ సెట్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1940 కాలం స్టోరీ కావడంతో అందుకు తగినట్లుగానే షూటింగ్ సెట్‌ను రూపొందించారు. ఆ కాలం నాటి పరిస్థితులు కళ్లముందు కనిపించేలా డిజైన్ చేశారు. బ్రిటీష్ కాలంలో సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. మన దేశం ఉన్నసయమానికి చెందిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ కోసం కావాల్సిన సామాగ్రిని ప్రత్యేకంగా తెప్పించారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. 'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు... * 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్ * బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు * బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు * 1940 కాలానికి చెందిన కార్గో షిప్ * 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో) అయితే ఈసెట్స్ వేయడానికి మొత్తం 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ను ఉపయోగించారు. -
కశ్మీర్లో ‘జపాన్’ షూటింగ్.. కార్తీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్
పొన్నియిన్ సెల్వన్ – 2 వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. కథ చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్ బాబు, ఏస్సార్ ప్రభు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి అనూ ఇమ్మానుయేల్ కథానాయకగా నటిస్తున్న ఇందులో నటుడు సునీల్, విజయ్ మిల్టన్, వాగై చంద్రశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కాగా చిత్రంలోని ఓ పాటను ఇటీవల కశ్మీర్లో చిత్రీకరించారు. అప్పుడు పలువురు అభిమానులు చూడడానికి చుట్టుముట్టారు. దీంతో కార్తీ వారందరినీ అభిమానంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను కార్తీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ వుతున్నాయి. కాగా కార్తీ నటిస్తున్న 25వ చిత్రం జపాన్. ఇందులో ఆయన దొంగగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తోన్న 'రావెన్'!
అజయ్ కార్తీక్, అంజనా జంటగా నటిస్తోన్న చిత్రం 'రావెన్'. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేష్ కె బాబు శిష్యుడు కళ్యాణ్ కె జగన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని ఎంజీ స్టూడియోస్ అధినేత ఏపీవీ.మారన్‌తో కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్ ధాను ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వినూత్న కథాంశంతో కొత్త తరానికి చెందిన కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్త షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో దర్శకుడు భాగ్యరాజ్, ఈటీవీ గణేష్, వీర, హిందూమతి, పి.అరుణాచలేశ్వరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శక్తి చాయాగ్రహణం, మనం రమీశన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ లలిత్ కుమార్, ఫైవ్ స్టార్ కదిరేసన్, ఫైవ్ స్టార్ సెంథిల్, రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ మురుగానందం, అరుణ్ విశ్వ, డిస్ట్రిబ్యూటర్ కోవై అరవింద్, పోర్ తొళిల్ చిత్ర దర్శకుడు విగ్నేష్ రాజా, యాత్తిశై చిత్ర దర్శకుడు ధరణి రాజేంద్రన్, గుడ్ నైట్ చిత్ర దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. #Dada fame director #GaneshKBabu has penned the story and screenplay of a film called #Raven, which went on floors today! The film features newcomer Ajay Karthik and actor Nethra 's daughter Anchana in the lead. The film is being directed by Kalyan K Jegan. Produced by :-… pic.twitter.com/wsEZyUenfM — Cineobserver (@cineobserver) August 21, 2023 -
' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్ ఆంటోని. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రీతూ వర్మ కనిపించనుంది. ఎస్జే సూర్య ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి! ) విశాల్ మాట్లాడుతూ..'మార్క్ ఆంటోని షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరిగింది. ఓ ఫైట్ సీన్ చేసి విశ్రాంతి తీసుకుంటున్నా. అదే సమయంలో ఓ పెద్ద ట్రక్కు నా వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో దాన్ని నేను చూశా. అందువల్లే తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా. నా అదృష్టం కొద్ది అది సెట్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో చావును దగ్గరి నుంచి చూశా. ఆ సంఘటనతో షాక్‌కు గురయ్యా. నిజంగా నాకు ఆరోజు పునర్జన్మే. పది నిమిషాలు ఒంటరిగా ఉన్నా. చాలా సేపు ఏం తోచని స్థితిలో ఉండిపోయా.' అంటూ విశాల్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన కోస్టార్ ఎస్జే సూర్య పై విశాల్ ప్రశంసలు కురిపించారు. అతన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడని తెలిపారు. ప్రేక్షకులంతా హీరో కోసం వెయిట్ చేస్తే.. తాను మాత్రం సూర్య కోసం వెతికేవాన్ని అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ) -
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భగవతి భవానికి కాంస్యం
చెంగ్డూ (చైనా): ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు పతకాలు లభించాయి. షూటింగ్లో ఇలవేనిల్ వలారివరన్–దివ్యాంశ్ సింగ్ పన్వర్ జోడీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రజతం సాధించారు. అథ్లెటిక్స్‌లో మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భగవతి భవాని యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ ద్వయం 13–17తో యు జాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక లాంగ్‌జంప్ ఫైనల్లో విజయవాడకు చెందిన భవాని యాదవ్ 6.32 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..?
జైపూర్: జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సహోద్యోగులతో సహా తోటి ప్రయాణికులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితుడు చేతన్ సింగ్‌తో పాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఘన్‌శ్యామ్ ఆచార్య.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగిందో సవివరంగా పోలీసులకు వివరించాడు. కాల్పులకు ముందు కానిస్టేబుల్ చేతన్ సింగ్ తనకు ఆరోగ్యం సరిగా లేదని సీనియర్ అధికారికి తెలిపినట్లు ఘన్‌శ్యామ్ వెల్లడించారు. రైలు దిగిపోతానని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే.. షిఫ్ట్ పూర్తి చేసుకునే వెళ్లమని సీనియర్ అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కోపోద్రిక్తుడైన చేతన్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. అంతకు ముందే చేతన్ సింగ్‌తో వాగ్వాదం జరిగిందని, అక్కడ తన గొంతును నులిమే ప్రయత్నం చేశాడని ఘన్‌శ్యామ్ పేర్కొన్నాడు. 'దిగిపోతా..' ఘన్‌శ్యామ్, సీనియర్ అధికారి టిమారమ్ మీనా(58), కానిస్టేబుల్ నరేంద్ర పర్మార్(58), చేతన్ సింగ్(33)లు డ్యూటీలో ఉన్నారు. అర్ధరాత్రి 2.53 సమయంలో మీనా, చేతన్ సింగ్‌లు ఏసీ కోచ్‌లో పర్యవేక్షిస్తున్నారు. పర్మార్, శ్యామ్ స్లీపర్ కోచ్‌లో ఉన్నారు. ఘన్‌శ్యామ్ రిపోర్టును ఇవ్వడానికి వెళ్లిన క్రమంలో చేతన్, మీనాతో సహా మరో ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఉన్నారు. అయితే.. చేతన్ ఆరోగ్యం బాగులేదని రైలు దిగిపోతానని మీనాకు చెప్పారు. కానీ కేవలం రెండు గంటలు డ్యూటీ మాత్రమే మిగిలి ఉందని మీనా చేతన్‌ను సముదాయించారు. 'డ్యూటీ పూర్తి చేయాలని..' కానీ చేతన్.. మీనా మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అయితే చేతన్ విషయాన్ని ఎన్స్‌పెక్టర్‌కు తెలిపాడు మీనా. అటు నుంచి కంట్రోల్ రూమ్‌కు కూడా సమాచారం అందించాడు. కానీ డ్యూటీ పూర్తి చేసుకుని ముంబయి ఆస్పత్రిలో చికిత్స తీసుకోమని ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని చేతన్‌కు చెప్పగా ఆయన వినిపించుకులేదు. అయితే.. చేతన్ వద్ద గన్ తీసుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. పక్కనే ఉన్న బెడ్‌పైన పడుకోమన్నారు. గొంతు నులిమి.. కొద్ది సేపటికే తిరిగి వచ్చిన చేతన్ తన గన్ను తనకు ఇచ్చేయమని అడిగాడు. వద్దని వారించిన ఘన్‌శ్యామ్ గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. ఘన్‌శ్యామ్, చేతన్ల గన్లు తారుమారు అయ్యాయి. ఎవరి గన్లు వారికి ఇప్పించడానికి వచ్చిన సీనియర్ అధికారి మీనాపై చేతన్ తిరగబడ్డాడు. వాగ్వాదం సాగింది కాసేపు. ఆ తర్వాత ఘన్‌శ్యామ్ అక్కడి నుంచి వెళ్లాడు. కాసేపటికే చేతన్ ఫైరింగ్ మొదలుపెట్టాడు. మీనాతో సహా మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన జరిగే సమయంలో గన్ పేలుడు శబ్దాలు విని బాత్రూంలో దాక్కున్నట్లు ఘన్‌శ్యామ్ తెలిపారు. మిగిలిన కానిస్టేబుళ్ల క్షేమాన్ని కనుకుని, కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. అనంతరం రైలును చైన్ లాగి నిందితుడు పారిపోయాడని ఘన్‌శ్యామ్ తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం!