పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనూ బాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.
భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత.
HISTORIC MOMENT. 🇮🇳
MANU BHAKER WINS THE BRONZE IN PARIS OLYMPICS. pic.twitter.com/aN6TPamWco— Johns. (@CricCrazyJohns) July 28, 2024
Indian flag flying high at Paris Olympics 🥺
MANU BHAKER, TAKE A BOW. pic.twitter.com/GeLHFRW4ef— Johns. (@CricCrazyJohns) July 28, 2024
BRONZE FOR MANU BHAKER...!!!! 🇮🇳
- History in the Paris Olympics by Manu in 10m Air Pistol.
ONE OF GREATEST MOMENTS FOR INDIA IN SPORTS 🔥 pic.twitter.com/pwNCszwxk6— Johns. (@CricCrazyJohns) July 28, 2024
Comments
Please login to add a commentAdd a comment