ప్యారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత్‌కు షూటింగ్‌లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. అయితే ఆఖరిలో మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ విభాగంలో మను భాకర్ ఫైనల్ రౌండ్‌కు ఆర్హత సాధించింది.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మనూ.. తుది పోరు(మెడల్ రౌండ్)కు క్వాలిఫై అయింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్(573 పాయింట్లు) 15వ స్ధానానికే పరిమితమైంది.
దీంతో తొలి రోజు షూటింగ్‌లో భారత్ ఈవెంట్‌లు పూర్తయ్యాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు నిరాశపర్చగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమా కూడా ఫైనల్‌కు ఆర్హత సాధించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment