తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు అప్‌డేట్‌! | Rajinikanth Vettaiyan completes 100 days of shooting goes Viral | Sakshi
Sakshi News home page

Rajinikanth: రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాదిలోనే!

Published Tue, Apr 30 2024 4:19 PM | Last Updated on Tue, Apr 30 2024 7:13 PM

Rajinikanth Vettaiyan completes 100 days of shooting goes Viral

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్‌.  ఈ చిత్రాన్ని జైభీమ్‌ చిత్రం పేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌ మాజీ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత  రజినీకాంత్‌ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది.

అయితే ఇంకా షూటింగ్‌ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్, టైటిల్‌ ప్రకటన, టీజర్‌ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్‌ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్‌ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.

కాగా.. తాజాగా వేట్టైయాన్‌ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్‌ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది‌. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా  వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్‌ చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వంటి ప్రమోషన్‌ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్‌బచ్చన్, ఫాహత్‌ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్‌  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement