
కేరళలోని వయనాడ్ వరద బాధితులకు రెండు కోట్ల రూపాయలు భారీ విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదల వల్ల భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. సర్వస్వం కోల్పోయిన వారికి చేయూతనిచ్చేందుకు పలువురు నటీనటులు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు.
తాజాగా ప్రభాస్ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఇలాంటి కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలి. వారికి మనమంతా అండగా ఉండాలి’’ అని ప్రభాస్ కోరారు.