
మసూద సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పటికే ఈ బ్యానర్ నుంచి మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించారు.
మసూద సినిమా కొత్త రకమైన హారర్ డ్రామాతో రూపొందడంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల్ని భయపెడుతూ, థ్రిల్‌ని పంచడంతో ఈ మూవీకి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆహా (AHA) తెలుగు ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)లో కూడా మసూద స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథేంటంటే..
నీలం(సంగీత) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్త అబ్దుల్(సత్య ప్రకాశ్)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే గోపీ(తీరువీర్) ఓ సాఫ్ట్‌వేర్. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్(సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా(శుభలేఖ సుధాకర్)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే.