
ప్రముఖ నటుడు ప్రభు గణేశన్ (Prabhu Ganesan)కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అతడి సర్జరీ విజయవంతమవగా, ప్రస్తుతం తనను డిశ్చార్జి చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని అతడి టీమ్ వెల్లడించింది. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరాడు.
మెదడులో వాపు
ఆయన్ను పరిశీలించిన వైద్యులు మెదడులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు గర్తించారు. దీంతో చిన్నపాటి సర్జరీ చేశారు. లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ తనయుడే ప్రభు. చిన్న తంబి, మనసుక్కుల్ మతప్పు, అగ్ని నక్షత్రం, అరువడై నాళ్, చార్లీ చాప్లిన్ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు.
తెలుగువారికీ సుపరిచితుడే
చంద్రముఖి, డార్లింగ్, ఆరెంజ్, దరువు, ఒంగోలు గిత్త, దేనికైనా రెడీ, పొన్నియన్ సెల్వన్, వారసుడు వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. దాదాపు 200 సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా (Good Bad Ugly) చేస్తున్నాడు. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో త్రిష కథానాయికగా యాక్ట్ చేస్తోంది.
చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్