RAPO 22: మోహన్‌లాల్‌ కాదు...ఉపేంద్ర? | RAPO 22: Actor Upendra To Play Key Role In Ram Pothineni Upcoming Movie, Check Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

RAPO 22 Latest Update: మోహన్‌లాల్‌ కాదు...ఉపేంద్ర?

Published Sun, Apr 27 2025 12:31 PM | Last Updated on Sun, Apr 27 2025 1:24 PM

RAPO 22: Upendra Play Key Role In Ram Pothineni Latest Movie

రామ్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఉపేంద్ర ఓ లీడ్‌ రోల్‌ చేయనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్‌ హీరోగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఫేమ్‌ పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 ఈ చిత్రంలో సాగర్‌ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ బోర్సే కనిపిస్తారు. కాగా.. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్‌ మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో, కన్నడ స్టార్‌ ఉపేంద్రను సంప్రదించారట. ఈ పాత్ర చేసేందుకు ఉపేంద్ర సుముఖంగా ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. 

ఈ  సినిమాలో ఉపేంద్ర చేయనున్నది  సినిమా హీరో క్యారెక్టర్‌ అని సమాచారం.  మరి... రామ్‌ సినిమాలో సినిమా హీరోగా ఉపేంద్ర నటిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 15న రామ్‌ బర్త్‌ డేకి  ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ సినిమా గురించిన అప్‌డేట్‌ రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement