Upendra
-
నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్( Shiva Rajkumar), రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుమతి ఉమా రమేష్‌రెడ్డి, ఎం. రమేష్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ్ వెర్షన్ టీజర్‌ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నిర్మాత రమేష్ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్ జన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్ ,అమితాబచ్చన్‌లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు. తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్ సినిమా అని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి పేర్కొన్నారు. -
కీమో థెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను
‘‘45’ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను. మీరు అది చేయొద్దు... ఇది చేయొద్దు అని మా మూవీ టీమ్ అన్నారు. కానీ, నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా పాత్రకి సంబంధించిన అన్ని రకాల సన్నివేశాలు చేశాను’’ అని శివ రాజ్‌కుమార్ చె΄్పారు. ఉపేంద్ర, శివ రాజ్‌కుమార్, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘45’. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు మేం ముగ్గురం కాదు... కథే హీరో. అర్జున్ జన్యాకి మంచి పేరొస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్‌గారి ‘జైలర్ 2’, రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు అర్జున్ జన్యా. ‘కూలీ’ సినిమాలో రజనీకాంత్, నాగార్జునగార్లతో నటించడం సంతోషంగా ఉంది’’ అని చె΄్పారు. ‘‘సనాతన ధర్మం గురించి ఈ చిత్రంలో చాలా అంశాలుంటాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎం. రమేశ్ రెడ్డి. అర్జున్ జన్యా మాట్లాడుతూ– ‘‘ఈ మూవీకి ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు.ప్రొడ్యూసర్స్‌కు బడ్జెట్ ఆదా అవుతుంది’’ అని తెలిపారు. -
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra).. డిఫరెంట్ సినిమాలకు ఈయన కేరాఫ్ అడ్రస్. ఏ, ఉపేంద్ర లాంటి విచిత్రమైన సినిమాలతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపేంద్రకు సీక్వెల్‌గా ఉప్పి 2 కూడా తీశారు. హీరోగా, దర్శకరచయితగా ఈయన తెరకెక్కించిన చివరి చిత్రం యూఐ. గతేడాది రిలీజైన ఈ సినిమా చాలామందికి అసలు అర్థమే కాలేదు. దీంతో ఎంత ప్రమోషన్స్ చేసినా చివరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.ఐదారేళ్లయ్యాక అర్థమవుతుందిఈయన ప్రస్తుతం శివరాజ్ కుమార్‌తో కలిసి 45 మూవీలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో యూఐ సినిమా రిజల్ట్ గురించి స్పందించారు. యూఐ సినిమా అర్థమవడం చాలా కష్టమని నాకు తెలుసు. నేను ఏడేళ్ల నుంచి చెప్తున్న విషయాన్నే ఈ మూవీలో స్ట్రాంగ్‌గా చెప్పాను. ఇంకో ఐదారేళ్లు అయ్యాక మీకు సినిమా అర్థమవుతుంది. నేను చేసిన ప్రయోగం ఏంటంటే.. థియేటర్లో సినిమా చూసేవాళ్లే అసలైన విలన్లు. అర్థం అయినా కానట్లే..దాన్ని మీరు జీర్ణించుకోవడం కష్టం. మీరెప్పుడూ స్క్రీన్‌పై కనిపించే విలన్నే చూస్తారు కదా.. కానీ యూఐ సినిమాలో ఉండే విలన్ మీరే. సినిమా చూస్తున్నప్పుడు ఆ విలన్ మీరే అని తెలుస్తుంది. అందుకే అంతా అర్థమయినా కూడా ఏమీ అర్థం కానట్లు నటిస్తారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర కన్నడలో బుద్ధివంత 2, త్రిశూలం, 45 సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న కూలీలోనూ యాక్ట్ చేస్తున్నారు.చదవండి: దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే! -
ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ‘45’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. ఈ షెడ్యూల్లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అమెరికాలో క్యాన్సర్ చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు.అయితే తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారాయన. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటిస్తోన్న 45 మూవీలో శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సమావేశంలో ఉపేంద్రతో పాటు శివరాజ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.(ఇది చదవండి: 'మనిషి చనిపోయాక చూపించే ప్రేమ.. ప్రాణాలతో ఉన్నప్పుడే చూపించండి')శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం 2 రోజులు షూట్ చేశా. ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది. నాకు కీమో థెరపీ కంప్లీట్ చేసిన 4 రోజులకే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాను.. టీమ్ అందరూ ఇచ్చిన సపోర్ట్ తోనే షూట్ చేయగలిగాను' అని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బెంగళూరు కప్ కొట్టాలని కోరుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ సాలా కప్ నమ్దే అని శివరాజ్ కుమార్ తన మద్దతు ప్రకటించారు. ఆర్సీబీకి కూడా ఒక్కసారి కప్ కొట్టే ఛాన్స్ ఇవ్వండని కోరారు. -
'మనిషి చనిపోయాక చూపించే ప్రేమ.. ప్రాణాలతో ఉన్నప్పుడే చూపించండి'
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కనిపించనున్నారు. బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన తాజా చిత్రం 45. ఈ మూవీలో శివరాజ్‌కుమార్ సైతం నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను శివరాజ్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్ చూస్తే భారీగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాయి. మార్కండేయ మహర్షి పౌరాణిక కథను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. శివుడు తన భక్తుడైన మార్కండేయుడిని మృత్యు దేవుడైన యముడి నుంచి ఎలా రక్షించాడనే కథగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ.. వాళ్లు బతికి ఉన్నప్పుడే చూపించండి' అనే డైలాగ్ ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తోంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు.ఈ సినిమాకు అర్జున్ జన్యా దర్శకత్వం వహిస్తున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ రెడ్డి నిర్మించారు . అంతేకాకుండా దర్శకుడు అర్జున్ జన్య సంగీతమందించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మరోవైపు శివ రాజ్‌కుమార్ ఎ ఫర్ ఆనంద్, రామ్ చరణ్ పెద్దిలో నటిస్తున్నారు. ఆలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీలో ఉపేంద్ర కనిపించనున్నారు. -
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఇప్పుడు డైరెక్ట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు రానుంది. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.యూఐ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఉపేంద్ర ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘యూఐ’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారైనట్లు ఒక ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ‘యూఐ’ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ హీట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరి యూఐ చిత్రం కూడా జీ5 ఓటీటీలో ఉగాది నాడే రావచ్చని చెబుతున్నారు. ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ రెండూ కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. -
ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే.. జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
దీని గురించి ఎవరూ మాట్లాడరేంటి?: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఉపేంద్ర చెప్పినట్లుగానే ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రారంభంలో కొన్ని చిత్రవిచిత్ర డైలాగులు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అందులో.. 'తెలివైనవాళ్లు తెలివితక్కువవాళ్లుగానే కనిపిస్తారు. కానీ తెలివి లేనివాళ్లు మాత్రం పైకి తెలివైనవాళ్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు' అన్న డైలాగ్ కూడా ఉంది.ఇప్పుడిది అవసరమా?దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఉపేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థియేటర్లో సినిమా వీక్షించిన ఏ ఒక్కరూ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఇందుకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఇప్పుడిది అవసరమా సర్? మీ సినిమా అందరి కంట్లో పడింది. అందుకు సంతోషించండి అని కామెంట్ చేశాడు. మరికొందరేమో.. 'మేము అంత ఇంటెలిజెంట్ కాదు సర్..', 'అసలు యూఐ సినిమాను థియేటర్లో చూడనివారు నిజమైన మేధావులు..', 'అక్కడ కనిపిస్తున్న డైలాగ్‌లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అబ్బో.. ఇలాంటి డైలాగులకు కొదవే లేదుయూఐ సినిమాలో ఇలాంటి వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. నువ్వు మేధావివైతే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్లిపో.. తెలివితక్కువవాడితైనే సినిమా అంతా చూడు.. వంటి వింత కొటేషన్లు దర్శనమిస్తాయి. రేష్మ నానయ్య, సన్నీలియోన్, జిష్షు సేన్‌గుప్తా, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Why is no one talking about this that was seen on screen ? ! pic.twitter.com/ZzrOJJsuUK— Upendra (@nimmaupendra) December 23, 2024 చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన -
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ
హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?) -
ప్రపంచాన్నే టాలీవుడ్ షేక్ చేస్తోంది: ఉపేంద్ర
‘‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను ఇంకా గుర్తుపెట్టుకుని, ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ,ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలనే తపన కలుగుతోంది. ఈ గొప్పదనం అంతా తెలుగు ప్రేక్షకులదే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండియానే కాదు... ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. వెయ్యి కోట్లు, రెండువేల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు.ఉపేంద్ర నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘యూఐ’ రెగ్యులర్ సినిమా కాదు. ఓ ఊహాత్మక ప్రపంచంలా ఈ సినిమా కనిపిస్తుంది. ఆడియన్స్ ఓ కొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు (ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ..) మైథలాజికల్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చూశారు.కానీ ‘యూఐ’ సినిమా సైకలాజికల్ కల్కి. ‘యూఐ’ సినిమాలోని అంశాలను ఆడియన్స్ డీకోడ్ చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను. కేపీ శ్రీకాంత్‌గారికి ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు, ఆయన లహరిలాంటి గొప్ప సంస్థను తీసుకొచ్చారు. ఇక ‘యూఐ’ సినిమాను అల్లు అరవింద్‌గారు తెలుగులో రిలీజ్ చేయడాన్ని నేను ఎంతో స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు రేష్మ. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాతలు ఎస్కేఎన్, అంబికా రామచంద్రరావు, ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ తులíసీ రామ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ చంద్రు మనోహరన్, కోప్రోడ్యూసర్ నవీన్ మనోహరన్, డైలాగ్ రైటర్ పార్థసారథి, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల మాట్లాడి, ‘యూఐ’ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. -
గ్లామర్ డాల్‌లా ఉపేంద్ర ‘యూఐ’ మూవీ హీరోయిన్ రీష్మా నానయ్య (ఫొటోలు)
-
ఉపేంద్ర ‘యూఐ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు సినిమా స్థాయి మారిపోయింది: ఉపేంద్ర
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వేదికపై టాలీవుడ్ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.1995లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాదిపాటు స్క్రిప్టుతో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థం అయింది. అందుకే ఆయన మేగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది. టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. 'ఉప్పెన' సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు.' అని అన్నారు. -
సందేశాలు ఇవ్వను... తీసుకోను: ఉపేంద్ర
‘‘ఆడియన్స్ వినోదం కోసం థియేటర్స్‌కు వస్తారు. వారిని అలరించే అన్ని కమర్షియల్ హంగులు ‘యూఐ’ సినిమాలో ఉన్నాయి. నార్మల్‌గా చూసినప్పుడు ‘యూఐ’ ఓ సినిమాగా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే కథలో మరో లేయర్ కనిపిస్తుంది. పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్‌గా వెళితే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాలో అన్నీ కొత్తగా ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే నా దృష్టిలో ప్రేక్షకులే సూపర్ స్టార్స్. ఈ విషయాన్ని నా తొలి సినిమాతోనే గ్రహించాను. వాళ్లు ఫిల్మ్‌మేకర్స్ కంటే పైనే ఉంటారు’’ అని ఉపేంద్ర అన్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంటాను.ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక ఫూల్ వెళ్తాడనేది సామెత. బహుశా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో(నవ్వుతూ). అయితే నేను ఫీలయ్యే కథనే ఆడియన్స్ కూడా ఫీలవుతున్నారనుకుని, కొందరితో చర్చించి, ‘యూఐ’ సినిమా తీశాను. ‘యూఐ’ అంటే ఏమిటో థియేటర్స్‌లో చూడండి. ‘యూఐ’ వార్నర్ అంటూ వచ్చిన ఈ సినిమా వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోని కాంప్లెక్స్ తరహా విజువల్స్ కనిపించాయంటున్నారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మైథలాజికల్. ‘యూఐ’ మూవీ సైకలాజికల్. ఒక సినిమాతో మరొక దానికి సంబంధం లేదు.‘యూఐ’కిపార్టు 2 లేదు. ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టిన నిర్మాతలకు థ్యాంక్స్. టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఇప్పుడున్న టెక్నాలజీతో రూమ్‌లోనే సినిమా తీయొచ్చు. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నేను ఏం మార్చలేను. నన్ను నేనే మార్చుకోలేకపోతున్నాను. అందుకే సందేశాలు ఇవ్వను. తీసుకోను. సినిమా అంటే వ్యాపారమే. సినిమా సక్సెస్ వేరు... పొలిటికల్ సక్సెస్ వేరు’’ అని అన్నారు.అల్లు అర్జున్ మంచి పెర్ఫార్మర్. ఆయనకు నేను ఫ్యాన్. త్రివిక్రమ్ అంటే కూడా ఇష్టమే. వారి కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో నటించడం హ్యాపీ. ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్లే తెలుగులో చేయలేకపోయాను. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.. ఆయన బయటకు వచ్చారు. సమస్య లేదు.రజనీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా కల నిజమైనట్లుగా ఉంది. దాదాపుపాతిక సంవత్సరాల క్రితం రజనీకాంత్‌గారిని కలిశాను. ఆయన అప్పుడు నాకు చెప్పిన విషయాల అర్థం ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. -
'ట్రైలర్ చూడగానే షాకయ్యా'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు!
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘యుఐ: ది మూవీ’. ఈ మూవీని ఇంతకు ముందెన్నడు రాని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఉపేంద్ర నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూడగానే షాకయ్యానని తెలిపారు. అద్భుతంగా ఉందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. హిందీ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని అమిర్ ఖాన్ కొనియాడారు. అమిర్ మాట్లాడిన వీడియోను ఉపేంద్ర తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.కాగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రస్తుతం జైపూర్ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో వీరిద్దరు కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.Dear Aamir sir, it was a dream come true moment to meet and seek your blessings for UI The Warner Movie 🙏thanks for your love and support ❤️#UiTheMovieOnDEC20th#Aamirkhan#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth… pic.twitter.com/EcPcIVgS8z— Upendra (@nimmaupendra) December 11, 2024 -
2040లో ఏం జరుగుతుంది?
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ: ది మూవీ’. రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్యపాత్రలుపోషించారు. లహరి ఫిల్మ్స్, జి. మనోహరన్ – వీనస్ ఎంటర్టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ‘‘ప్రపంచంలో 2040లో ఏం జరుగుతుంది? అనే నేపథ్యంలో ‘యుఐ: ది మూవీ’ కథ ఉంటుంది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
రజినీకాంత్ కి విలన్ గా ఉపేంద్ర..?
-
రజనీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ..?
సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో తెరపైకి వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించనున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, తాజాగా కన్నడ సూపర్ స్టార్ 'ఉపేంద్ర' ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగింది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. -
కంచర్ల సందేశం
‘ఉపేంద్రగాడి అడ్డా’ ఫేమ్ కంచర్ల ఉపేంద్ర బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ జైస్వాల్ హీరోయిన్. సుమన్, అజయ్ ఘోష్ ఇతర పాత్రలు చేశారు. ఎస్ఎస్ఎల్వీ క్రియేషన్స్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. అరకులో చిత్రీకరించిన తాజా షెడ్యూల్‌తో ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది.ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ–‘‘మా ఇంటి పేరైన ‘కంచర్ల’ టైటిల్‌తో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 15 తర్వాత సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో తీసిన మా చిత్రం గొప్ప విజయం అందుకుంటుంది’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర బాబు. ‘‘కంచర్ల’ సినిమాలో మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు యాద్ కుమార్. ‘‘మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకుంటుంటుంది’’ అన్నారు మీనాక్షీ జైస్వాల్. -
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 'కబ్జ' చిత్రానికి అభినందనలు
కన్నడలో భారీగా ప్రేక్షకాధరణ పొందిన చిత్రం 'కబ్జ'. ఇందులో ఉపేంద్ర , సుదీప్ , శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మల్టీస్టారర్ చిత్రంగా 2023 మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయనప్పటికీ నష్టాలు అయితే రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు అయిన ఆర్. చంద్రుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రంతో సత్కరించింది.శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై కబ్జ సినిమాను ఆర్. చంద్రు నిర్మించారు. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను పూర్తిగా ఆయన క్లియర్ చేశాడు. దీంతో ఆర్.చంద్రు నిర్మాణ సంస్థకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రం జారీ చేసింది. పన్ను బకాయిలు పెట్టకుండా ఆ శాఖకు రికార్డు స్థాయిలో డబ్బు చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఆర్.చంద్రు నిర్మించి, దర్శకత్వం వహించిన 'కబ్జా' దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ సినిమా నిర్మాత శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఇప్పుడు అత్యధిక పన్ను కట్టిన ఘనత దక్కింది.ఈ బ్యానర్‌పై ఐదు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.చంద్రు కన్నడ సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకరిగా పేరు పొందారు. చిక్కబళ్లాపూర్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రు ఈరోజు సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ కాలంలో దర్శకుడిగా విజయం సాధించడం అనేది చాలెంజింగ్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ, అతను ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించాడు. తమ సొంత బ్యానర్ ద్వారా కూడా కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు.ఇటీవల జరిగిన కన్నడ సినీ అవార్డ్స్‌లో 'కబ్జా' ఉత్తమ VFX పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. 1960 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ కబ్జ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. -
ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022–2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశీ్మర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ పతకాలు పొందారు.ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్మేట్స్ దేశ సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్మీకి, నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరూ క్లాస్మేట్స్ కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో సహాధ్యాయులు. 1970లలో వీరిద్దరూ అక్కడ ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా దగ్గరదగ్గరగా ఉన్నాయి. జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ త్రిపాఠీ నంబర్ 938. పాఠశాల దశలో మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ వీరి మైత్రి చెక్కుచెదరలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏడాది మేలో అడ్మిరల్ త్రిపాఠీ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అయ్యారు. -
ఇన్నేళ్లు అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: హీరోయిన్
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఆ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని (41) హీరోయిన్గా నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్లో కూడా ఇప్పటికీ ఈ సినిమాకు గుర్తింపు ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తాజాగా తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ అయింది. ఈ నేపంథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.ఉపేంద్రతో నటించిన 'ఏ' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చాందిని తెలిపింది. తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్ దక్కినట్లు గుర్తుచేసుకుంది. ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారని ఆమె తెలిపింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్ చేశారని చెప్పింది. కానీ తెలిసిన వారి నుంచి తన ఫోటోలు 'ఏ' సినిమా మేకర్స్ చేతికి వెళ్లాయని, ఆ సమయంలో తనను చూడకుండానే వారు సెలక్ట్ చేశారని తెలిపింది. ఇదే సమయంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. 'వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అది మన చేతుల్లో లేదు. దానిని దేవుడు నిర్ణయించాలి. పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను. నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్ మ్యారేజ్లు బాగుంటాయి.' అని చాందిని తెలిపింది. -
జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు లింగం యాదవ్. ‘‘ఏ’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. -
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు. -
మళ్లీ ఏ
ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఏ’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. 1998లో దాదాపు రూ. 1 కోటీ 25 లక్షలతో రూపోందిన ఈ చిత్రం రూ. 20 కోట్లు వసూలు చేసింది. కొత్త తరహా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని తాజాగా 4కేలో ఉపేంద్ర ఉప్పి క్రియేషన్స్, లింగం యాదవ్ చందు ఎంటర్టైన్మెంట్ విడుదల చేయనున్నాయి. ఈ నెల 21న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.ఈ సందర్భంగా లింగం యాదవ్ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఏ’ ఒక సంచలనం. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాం. ఇక మేం 4కేలో విడుదల చేసిన ప్రభాస్ ‘ఛత్రపతి, యోగి’ చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ‘ఏ’కి కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఉపేంద్ర కల్ట్ సినిమా రీరిలీజ్.. కోటి బడ్జెట్‌తో విడుదల చేస్తే..
కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్‌గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్‌లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్‌లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్‌లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్‌గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి. క్లైమాక్స్‌ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్‌కుమార్‌తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్‌కు పెద్ద ఫ్యాన్‌ను అంటూ ఆయన చెప్పడం విశేషం. -
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్. -
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర వివాహా వార్షికోత్సవ వేడుక (ఫొటోలు)
-
‘ఉపేంద్ర గాడి అడ్డా’ మూవీ రివ్యూ
టైటిల్: ఉపేంద్ర గాడి అడ్డా నటీనటులు: కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, మురళీధర్ గౌడ్, అప్పారావు, కిరీటి దామరాజు, సంధ్య జనక్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఎల్ ఎస్ క్రియేషన్స్ నిర్మాత: కంచర్ల అచ్యుతరావు దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్. కె విడుదల తేది: డిసెంబర్ 1, 2023 కథేంటంటే.. ఉపేంద్ర(కంచర్ల ఉపేంద్ర) బంజారాహిల్స్ ని ఓ బస్తీ కుర్రాడు. డిగ్రీ వరకూ చదువుకున్నా... ఈజీగా మనీ సంపాధించి సెటిల్ అయిపోవాలనునుకునే కుర్రాడు. అందుకోసం ఓ ధనవంతురాలిని పెళ్లి చేసుకోవాలని అప్పులు చేసి... పబ్ ల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సావిత్రి(సావిత్రి కృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె గొప్పింటి అమ్మాయి అనుకుని... తాను కూడా రిచ్ కిడ్ అని చెప్పి... ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే తన గురించి ఆమెకు నిజం చెప్పాలని అనుకుని... తాను ధనవంతుడిని కాదని... బంజారాహిల్స్ లో ఓ బస్తీ కుర్రాడిని అని చెబుతాడు. మరి ఆ బస్తీ కుర్రాడిని... సావిత్రి పెళ్లి చేసుకుందా? అసలు సావిత్రి ఎవరు? వీరిద్దరికీ పెళ్లి అయిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. యువతను ఆకట్టుకునే అంశాలతో మంచి సందేశం అందించిన చిత్రమిది. నేడు సోషల్ మీడియా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో... దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో తెలిసిందే. దాన్ని బేస్ చేసుకుని దర్శకుడు ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు. ముఖ్యంగా అమ్మాయిలు సోషియల్ మీడియా ప్రభావంతో తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే దానిని చాలా బాగా చూపించారు. సోషియల్ మీడియాలో అబ్బాయిలు... అమ్మాయిలను ఎలా మోసం చేసి... చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు? దాని వల్ల వారు చేసే క్రైం ని ద్వితీయార్థంలో దర్శకుడు చక్కగా చూపించారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ ప్రభావం పిల్లల జీవితాలను ఎంత ప్రమాదంలోకి నెడుతోందనేదాన్ని చూపించారు వారి తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా చూపించడం బాగుంది. రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం సరదాగా సాగిపోతుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక సెకండాఫ్‌లో కథ స్లోగా సాగుతుంది. మంచి సందేశం ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. సోషియల్ మీడియా ప్రభావంతో యువతులు ఎలా మోసపోతున్నారనే దాన్ని ఈ చిత్రం ద్వారా చూపిస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు. ఎవరెలా చేశారంటే.. కంచర్ల ఉపేంద్ర కొత్త కుర్రాడైనా చాలా చక్కగా నటించారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసి... మాస్ ను ఆకట్టుకున్నాడు. ఓ బస్తీ కుర్రాడు ఎలా ఉంటారో అలాంటి మాస్ లుక్ తోనూ... మరో వైపు రిచ్ కిడ్ గానూ రెండు వేరియేషన్స్ లో బాగా నటించాడు.. ఉపేంద్రకు జోడీగా నటించిన సావిత్రి కృష్ణ కూడా బాగా చేసింది. బాధ్యత గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. హీరో చుట్టూ స్నేహితులుగా ఉండే జబర్దస్థ్ బ్యాచ్ కూడా బాగా నవ్వించారు. అలాగే జబర్దస్థ్ కమెడియన్ అప్పారావు కాసేపు ఉన్నా నవ్వించారు. బలగం మురళీధర్ గౌడ్, నటి ప్రభావతి హీరో తల్లిదండ్రులుగా ఆకట్టుకున్నారు. సోషియల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా... అమ్మాయిలను మోసం చేసే పాత్రలో కిరీటి దామరాజు పాత్ర పర్వాలేదు. హీరోయిన్ తల్లిదండ్రులుగా సంధ్య జనక్, బస్ స్టాప్ కోటేశ్వరరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. సంగీతం మాస్ ను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం 'క్యాప్చర్' విడుదలకు సిద్దం
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం క్యాప్చర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ప్రయోగాత్మక చిత్రమిదని యూనిట్ తెలిపింది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. శివ రాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
వినోదం.. సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్ శ్రీలేఖ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో మంచిని పెంపొందిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని ఈ సినిమాలో చూపిస్తాం. అలాగే 75 శాతం వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్. అచ్యుత రావుతో పాటు చిత్ర సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
మాస్ స్టెప్స్‌తో..
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పోకిరీ జులాయిలు...’ అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. కంచర్ల ఉపేంద్ర, వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా ఈ మాస్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఊటీలో చిత్రీకరించే మరో పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘హీరో కావాలన్న మా అబ్బాయి ఆసక్తిని గమనించి, ఐదు చిత్రాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి. -
ముందు నేనే వెళ్ళి ప్రపోజ్ చేశా..!
-
ప్రజలు మారాలి లేకపోతే చాలా కష్టం అంటున్న ఉపేంద్ర
-
ఎంత మంచి విషయాలు చెప్పారు : ఉపేంద్ర
-
ఒక్క విజువల్ లేకుండా స్టార్ హీరో సినిమా టీజర్
ఉపేంద్ర.. ఇప్పటిజనరేషన్కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్‌ని అడిగితే ఈ హీరో గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే సినిమా అంటే అలానే ఉండాలి, ఇలానే తీయాలి అనే రూల్స్ పెట్టుకోకుండా తీసిన వన్ అండ్ ఓన్లీ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర. చాన్నాళ్లుగా దర్శకత్వాన్ని పక్కనపెట్టిన ఇతడు.. ఓ క్రేజీ మూవీతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా, అది విచిత్రంగా ఉంది. డిఫరెంట్ టీజర్ సాధారణంగా స్టార్ హీరో సినిమాల టీజర్, ట్రైలర్.. ఏదైనా సరే ఎలివేషన్స్, ఊరమాస్ డైలాగ్స్ లాంటివి ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఉపేంద్ర కొత్త మూవీ 'UI' టీజర్ మాత్రం అలా అస్సలు లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విజువల్ లేకుండా 137 సెకన్ల టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో కేవలం సౌండ్ మాత్రమే వినబడుతూ ఉంటుంది కాబట్టి మీరు కళ్లు మూసుకుని ఈ టీజర్ చూడాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ విశేషం. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) టీజర్లో ఏముంది? చీకటి అంతా చీకటి, అసలు ఇది ఎలాంటి చోటు అని ఉపేంద్ర వాయిస్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత నీళ్ల శబ్దం, గుర్రం పరుగెత్తడం, ఆకలి అని కొందరు మనుషులు ఆర్తనాదాలు పెట్టడం, తలుపు తెరుచుకోవడం, పావురం రెక్కల్ని టపటప కొట్టుకుని పైకి ఎగరడం, పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ మనిషి చనిపోవడం, వెలుతురు పడ్డ, సౌండ్ వినిపించినా ఎటాక్ చేస్తారని ఉపేంద్ర వాయిస్ తనకి తానే చెప్పుకోవడం, ఓ గొట్టం కింద పడటం, కొందరి మధ్య ఫైట్ జరగడం లాంటి సౌండ్స్ ఈ టీజర్ లో వినిపించాయి. అయితే ఈ టీజర్ చూడాలంటే కళ్లు తెరిచి కాదు మూసుకుని చూడాల్సి ఉంటుంది. అప్పుడే ఆ సీన్స్ ఏంటనేవి ఎవరి ఊహకి తగ్గట్లు వాళ్లకు మైండ్‌లో విజువలైజ్ అవుతాయి. ఇప్పటివరకు ఇలాంటి టీజర్ అయితే సినీ చరిత్రలో ఇప్పటివరకు రాలేదన చెప్పొచ్చు. టీజరే ఇలా ఉందంటే.. సినిమా ఇంకెలా ఉండబోతుందో అని అంచనాలు పెరుగుతున్నాయి. (ఇదీ చదవండి: యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) -
ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?
యాక్షన్ మాత్రమే కాదు.. కొందరు స్టార్స్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్.. డైరెక్షన్ బ్యాక్ సీట్లో ఉంటుంది. అందుకే డైరెక్షన్‌కి గ్యాప్ ఇచ్చి, యాక్షన్‌కి మాత్రం నో గ్యాప్ అంటారు. అలా కొందరు హీరోలు డైరెక్షన్ సీట్‌కి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ అంటున్నారు. కొందరు స్టార్స్ ఇటు కెమెరా వెనకాల డైరెక్షన్ చేస్తూ అటు కెమెరా ముందు యాక్షన్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఆరేళ్లకు... కెరీర్లో 50వ సినిమా అంటే ఏ ఆర్టిస్టుకైనా ప్రత్యేకమే. కోలీవుడ్ హీరో ధనుష్ కూడా తన 50వ సినిమాని చాలా స్పెషల్ అనుకున్నారు. అందుకే తన హాఫ్ సెంచరీ సినిమాలో తానే నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హీరోగా దాదాపు 30 సినిమాల్లో నటించిన తర్వాత ‘పా. పాండి’ (2017) చిత్రం కోసం తొలిసారి దనుష్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. దీంతో 2019లో దర్శకుడుగా ధనుష్ మరో మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. అయితే ఈ ఏడాది జూలైలో తన దర్శకత్వంలోని రెండో చిత్రం సెట్స్‌పైకి వెళ్లినట్లుగా ధనుష్ వెల్లడించారు. ఇలా దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడిగా మరోసారి మెగాఫోన్ పట్టారు. ఇక నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, ఎస్జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శర కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్. ఏడేళ్ల తర్వాత... యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకూ అంతే క్రేజ్ ఉంది. ‘ష్..! (1993)’, ‘ఓం (1995)’, ‘ఉపేంద్ర (1999)’ వంటి సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించారు ఉపేంద్ర. కన్నడంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదపై, ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే 2015లో వచ్చిన ‘ఉప్పి 2’ తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర గ్యాప్ తీసుకున్నారు. ఏడేళ్ల తర్వాత 2022లో ‘యూఐ’ సినిమా వర్క్స్‌ను మొదలు పెట్టారు ఉపేంద్ర. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఉపేంద్ర అండ్ టీమ్ పేర్కొంది. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పదేళ్లకు... కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన సుదీప్ దర్శకుడిగా ఆరు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ ఆరూ రీమేక్ చిత్రాలే కావడం విశేషం. తమిళ ‘ఆటోగ్రాఫ్’ని కన్నడంలో ‘మై ఆటోగ్రాఫ్’ (2006)గా రీమేక్ చేసి, నటించారు సుదీప్. అలాగే దర్శకుడిగా తెలుగు హిట్ ఫిల్మ్ ‘మిర్చి (2013)’ కన్నడ రీమేక్ ‘మాణిక్య (2014)’లో టైటిల్ రోల్ చేసి, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సుదీప్. ఈ సినిమా తర్వాత సుదీప్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత అంటే... 2024లో సుదీప్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కేకే’ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘దేవుడు క్షమిస్తాడు.. నేను కాదు...!’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథతో సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడిగా ఇప్పటివరకూ రీమేక్ చిత్రాలే చేసిన సుదీప్.. ఈ ఏడవ సినిమాని స్ట్రయిట్ కథతో తీయనున్నారా లేక రీమేకా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘ఈగ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాలతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. పుష్కర కాలం తర్వాత... ‘దిల్ చాహ్ తా హై’ (2001) చిత్రంతో రచయితగా, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు ఫర్హాన్ అక్తర్. ‘డాన్: ది చేజ్ బిగిన్స్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన పేరు సంపాదించారు. అయితే 2011లో వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రం తర్వాత నటుడిగా కాస్త బిజీ అయిన ఫర్హాన్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. పదేళ్ల తర్వాత 2021 ఆగస్టులో ‘జి లే జరా’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఫర్హాన్ వెల్లడించారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో తన డైరెక్షన్లోనే ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు ఫర్హాన్. అయితే ఈ సినిమాలో ఆయన నటించడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇలా ఫర్హాన్ దర్శకత్వంలోని మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి పుష్కరకాలం అంటే పన్నెండేళ్లు పట్టిందని చెప్పొచ్చు. ‘డాన్ 3’ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇలా కొంత విరామం తర్వాత దర్శకులుగా మెగాఫోన్ పట్టిన స్టార్స్ ఇంకొందరు ఉన్నారు. -
‘ఉపేంద్ర గాడి అడ్డా’తో యువతకి సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో ‘ఉపేంద్ర గాడి అడ్డా’ సినిమా సోమవారం ఆరంభమైంది. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్‌కి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ ఇచ్చారు. ఆర్యన్ సుభాన్ ఎస్కే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం వరుణ్ సందేశ్‌తో ‘కానిస్టేబుల్’ చిత్రం చేస్తున్నాను. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటూనే యువతకు సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా అబ్బాయి ఉపేంద్రతో తొమ్మిది చిత్రాలు తీయాలనుకున్నాం. ఇప్పటికే నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ ఐదో సినిమా’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. -
నటుడు, దర్శకుడు ఉపేంద్ర ఉక్కిరిబిక్కిరి
నటుడు ఉపేంద్ర సినిమాలలో కొత్త కొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటూ, నిజ జీవితంలోనూ విలక్షణంగా ప్రవర్తిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నా నాలుకకు– మెదడుకు మధ్య ఫిల్టర్ లేదు, ఏది అనుకుంటే అది మాట్లాడడం నా నైజం అని ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు. అదే మాదిరిగా ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడి ఇబ్బందుల పాలయ్యారు. కర్ణాటక : వివాదాస్పద వ్యాఖ్యలపై తనపై రెండు చోట్ల నమోదైన కేసులను రద్దు చేయాలని ప్రముఖ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టు మెట్లెక్కారు. మరోవైపు రాష్ట్రంలో వివిధ చోట్లలో ఆయనపై పలు సంఘాలవారు ఫిర్యాదులు చేస్తున్నారు. బెంగళూరులో రెండుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు కాగా మండ్య, కోలారులో కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఉప్పికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా జరిగాయి. శనివారం రాత్రి ఫేస్బుక్/ ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఉపేంద్ర ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. దీనిపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉపేంద్ర క్షమాపణలు కోరారు. సోమవారం ట్విటర్ ఖాతాను లాక్ చేసుకొన్నారు. ఆయన ప్రస్తుతం యూఐ అనే సినిమాలో నటిస్తున్నారు. ఉపేంద్ర ఇళ్లు, వాట్సాప్‌లకు నోటీసులు మొదట చెన్నమ్మ అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు రాగా, వారు విచారణ కోసం ఉపేంద్రకు నోటీస్ ఇవ్వగానే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని తెలిసింది. వేరేవారి ద్వారా ఉపేంద్రను పోలీసులు సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఉపేంద్రకు చెందిన రెండు ఇళ్లు, మొబైల్ వాట్సాప్‌లకు నోటీస్‌లు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణకు రావాలని బెంగళూరులోని ఉపేంద్ర ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన లేరని తెలిసింది. హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా ఏసీపీ వీవీ పురానికి బదిలీ చేశారు. ఉపేంద్రకు ఇది తగదు: మంత్రి యశవంతపుర: పేదరికం వేరు, కుల అసమానతలు వేరు, ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా నటుడు ఉపేంద్ర మాట్లాడటం మంచిది కాదని సామాజిక సంక్షేమ మంత్రి మహదేవప్ప అన్నారు. ఉపేంద్ర వ్యాఖ్యలపై మొదట ఈ శాఖ అధికారులు బెంగళూరులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. మంత్రి స్పందిస్తూ రాజకీయ జీవనం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఉన్నవారు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కూడా జాతి పేరుతో అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపేంద్ర హొలగేరి అనే పదాన్ని ఉపయోగించడమే తప్పు అన్నారు. హైకోర్టులో ఉపశమనం చిక్కుముడి బిగుసుకుంటోందని తెలిసి ఉపేంద్ర హైకోర్టులో పిటిషన్ వేసి తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఉపేంద్ర అన్ని వర్గాలను గౌరవించే మంచి మనిషి. హొలగేరి అనే నానుడిని మామూలుగా వాడారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదు అని ఉప్పి న్యాయవాది పేర్కొన్నారు. వాదనలను ఆలకించిన జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌడర్.. ఎఫ్ఐఆర్పై స్టే విధించారు. సర్కారుకు, ఇతర పక్షాలకు వైఖరి తెలపాలని నోటీసులు జారీ చేశారు. -
స్టార్ హీరో ఉపేంద్రకు తాత్కాలిక ఊరట!
స్టార్ హీరో ఉపేంద్రపై పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉప్పీ.. ఈ మధ్య తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా పలు విషయాలు మాట్లాడారు. అయితే దళితులని అవమానించేలా కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై కర్ణాటక హైకోర్టు ఊరట ఇచ్చింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) అసలేం జరిగింది? స్వతహాగా నటుడు అయిన ఉపేంద్ర.. ప్రజాక్రియా పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. దీని వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో శనివారం లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. విమర్శకులని ఓ వర్గంతో పోల్చుతూ సామెత చెప్పాడు. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు కచ్చితంగా ఉంటారని అన్నాడు. వాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి అన్నాడు. అయితే ఉపేంద్ర వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్ తమని ఆవేదనకు గురిచేశాయని నిరసన తెలియజేశాయి. కొందరైతే బెంగళూరులోని చెన్నమున్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే తన కామెంట్స్‌పై దుమారం రేగడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పాడు. లైవ్ వీడియోని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే ఉపేంద్రపై నమోదైన ఎఫ్ఐఆర్పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇది తాత్కాలిక ఊరటకాగా.. భవిష్యత్తులో మాత్రం ఉపేంద్రకి చిక్కులు తప్పవేమో అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Upendra (@nimmaupendra) (ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
ఉపేంద్ర గలీజు మాటలపై కేసు
యశవంతపుర: నటుడు, రాజకీయ నాయకుడు ఉపేంద్ర కించపరిచే విధంగా మాట్లాడారని వివాదంలో పడ్డారు. ప్రజ్ఞావంతుల పార్టీ స్థాపించి ఆరేళ్లు కావస్తున్న సందర్భంగా ఆయన అభిమానులతో ఇన్‌స్టాలో లైవ్‌లో మాట్లాడారు. ఊరు అంటే గలీజు కూడా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో అనేకమంది ఉపేంద్ర మాటలను ఖండించారు. ప్రజలను గలీజుతో పోల్చి మాట్లాడటం ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నించారు. గలీజు ప్రాంతాలలో బతికే ప్రజలందరూ గలీజువాళ్లనా అని మండిపడ్డారు. ఇది రచ్చ కావడంతో ఉప్పి క్షమాపణలు చెప్పారు. ఆయన మాటలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని సమాజ కళ్యాణ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం దొడ్డబళ్లాపురం: నటుడు ఉపేంద్ర వ్యాఖ్యలకు నిరసనగా రామనగరలో ఆదివారం దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఊరు అన్నాక మురికివాడ ఉంటుందని ఇటీవల ఉపేంద్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని భావించి దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి ఉపేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తక్షణం ఉపేంద్ర దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. -
Kannada Real Star Upendra: దమ్మున్న దర్శకనటుడు ఉపేంద్రను ఇలా ఎప్పుడైనా చేశారా?
-
స్టార్ హీరోతో లవ్.. వందల కోట్ల ఆస్తులు.. కానీ: ప్రేమ
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ప్రేమ. ఎయిర్ హోస్టెస్ అవుదామనుకుని అనుకోకుండా హీరోయిన్గా మారింది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. కన్నడకు చెందిన ప్రేమ.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ప్రేమ మాట్లాడుతూ.. 'నాకు చాలా సింపుల్‌గా ఉండడమే ఇష్టం. యాటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టం. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. డబ్బులే ముఖ్యం కాదు. అదే శాశ్వతం కాదు. అవసరమైన డబ్బు ఉంటే చాలు. నేను చాలా బోల్డ్‌గా మాట్లాడతా. ఉపేంద్రతో ప్రేమ గురించి రాసిన వారినే అడగాలి. అది ఒక గాసిప్. అప్పుడు నా ఫోకస్ కేవలం సినిమాలే పైనే. ఒకసారి సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి వస్తాయి. ప్రతి విషయానికి నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. ఎలా వచ్చినా వాటిని ఎదుర్కొవాలి. నేను బీకామ్ చదివేదాన్ని. చదువు మధ్యలో ఉండగానే ఇండస్ట్రీలోకి వచ్చా. నేను ఎక్కువగా ఆలోచించే దాన్ని కాదు. అప్పట్లో నేను సౌందర్యతో ఎక్కువగా టచ్‌లో ఉండేదాన్ని. ' అని అన్నారు. -
ఓటీటీలోకి ఉపేంద్ర ‘కబ్జ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జ’. శ్రియ హీరోయిన్గా నటించింది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏప్రిల్ 14 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెసాన్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. 1960 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథ ఇది. కేజీయఫ్ సినిమా తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విడుదలైన తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంది. అయితే కర్ణాటక విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. a tale of unforeseen circumstances transforming an innocent young man into the most dreaded gangster ever! 🔥#KabzaaOnPrime, Apr 14 pic.twitter.com/wCRRyIDeAI — prime video IN (@PrimeVideoIN) April 11, 2023 -
ఓటీటీకి వచ్చేస్తున్న పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియాశరణ్ హీరోయిన్గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. కేజీఎఫ్, కాంతార హిట్ చిత్రాల్లాగే అలరిస్తుందని ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ‘కబ్జ’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కబ్జ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
కబ్జ ట్విటర్ రివ్యూ
కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్ హీరోయిన్గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి పురస్కరించుకొని నేడు(మార్చి 17) తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై అంచాలను పెంచేసింది. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో కబ్జ ఒకటి. కేజీయఫ్ తరహాలో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దీంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారితో పాటు ఉపేంద్ర ఫ్యాన్స్ కబ్జ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కబ్జ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #Kabzaa is another Eldorado of Kannada cinema🔥.R.Chandru's direction was fantastic🔥. #Upendra's acting was next level⭐.#Kicchasupeep's on-screen presence was lit🔥#Shivanna surprising entry gave me goosebumps.surely this is first blockbuster of 2023 Rating:4.5/5#kabzaareview pic.twitter.com/LD6jfZWcvI — Amith A (@AmithA59767744) March 16, 2023 కన్నడ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ చిత్రం కబ్జ. చంద్రు డైరెక్షన్ అదిరిపోయింది. ఉపేంద్ర యాక్టింగ్ నెక్ట్లెవల్. కిచ్చా సుదీప్ స్క్రీన్ ఫెర్మార్మెన్స్ బాగుంది. శివరాజ్‌కుమార్ ఎంట్రీ గూస్బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా 2023లో మొదటి బ్లాక్ బస్టర్‌గా కబ్జ నిలుస్తుందని చెబుతూ 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. Walkout feels.. Watched kgf 1,2? you can AVOID #Kabzaa Cheap version of KGF, same screenplay , same editing pattern. Not engaging at all. Bad dubbing n bad performance from upendra. Sudeep just cameo, other actors, nothing great. 2/5 FINALLY WATCH KGF AT HOME#Kabzaareview pic.twitter.com/L4Pa0YPiXv — Raghu436 (@436game) March 17, 2023 కబ్జ అస్సలు బాగాలేదు. కేజీయఫ్ 1,2 చూసినవాళ్లు కబ్జను అవైడ్ చేయ్యొచ్చు. కేజీయఫ్‌కి చీప్ వెర్షన్ ఈచిత్రం. అదే తరహా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్. ఉపేంద్ర నటన కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిదంటూ 2 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్. #Kabzaa What's wrong with Darshan fans! It's clear that KFI's only back draw is Darshan and his fans... — Thor (@HemsworthStarc) March 17, 2023 #KabzaaReview Mass Entertainment Mass Comeback Of #Upendra and introduction of #KicchaSudeep𓃵 & #ShivarajKumar VereLevel Entry Goosebumps Treat for Fans Story Lineup is More exited with return Gift for fans.. Overall Rating - 4/5 ⭐⭐⭐⭐@nimmaupendra @KicchaSudeep #Kabzaa — SOUTH DIGITAL MEDIA ™ (@SouthDigitalM) March 17, 2023 You have worked very hard for this @rchandru_movies .. wishing you to be blessed wth the success you deserve. Best wshs team #Kabzaa and @nimmaupendra sir . 🥂 pic.twitter.com/PJqRIBGCr8 — Kichcha Sudeepa (@KicchaSudeep) March 17, 2023 KABZAA MOVIE MADE SANDALWOOD PROUD AGAIN 😍🔥 DON'T BELIEVE IN ANY NEGATIVITY🔥 KICCHA BOSS CAMEO🥵💥💥 + INTERVAL BANG & CLIMAX😻😻 FIRE HAI BHAI MOVIE 😎#KabzaaFromTomorrow #Kabzaa #BlockBusterKabzaa pic.twitter.com/29C36MPTQ8 — Vinay (@Thapaswe) March 17, 2023 As Kannada Cinema continues its spectacular journey to mark its footprint across the world, #Kabzaa looks like another Grandeur & Raw attempt. All the best @nimmaupendra Garu @KicchaSudeep sir #ShivaRajkumar sir @shriya1109 Garu @rchandru_movies Garu & @RaviBasrur Garu & team. pic.twitter.com/lLFT7AtzuZ — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 16, 2023 #Kabzaa (Kannada|2023) - THEATRE. Upendra’s show. Kiccha’s 10Mins Cameo disappoints. Shreya gud. Shivanna 1 scene. Has heavy KGF flavour. Dull color tone. Music ok. Poor VFX. Narration s not so gripping. Usual Gangster Action stuff. Cliffhanger climax with a Part2 lead. AVERAGE! pic.twitter.com/FD7fHc61EA — CK Review (@CKReview1) March 17, 2023 -
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ఉపేంద్ర (ఫొటోలు)
-
నా నుంచి ‘ఉపేంద్ర’ లాంటి సినిమా ఆశిస్తున్నారు: ఉపేంద్ర
‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కబ్జ’. సెంటిమెంట్ కూడా ఉంది. విజువల్ గ్రాండియర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో ఉపేంద్ర అన్నారు. ఆర్.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. శ్రియా శరణ్ హీరోయిన్. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. నిర్మాత ఎస్.. సుధాకర్ రెడ్డి సమర్పణలో లక్ష్మీకాంత్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా నుంచి ‘ఉపేంద్ర’ లాంటి సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘యుఐ’ సినిమా ‘ఉపేంద్ర’ లాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘కబ్జ’ నా మనసుకి ఎంతో దగ్గరైన చిత్రం’’ అన్నారు శ్రియ. ‘‘ఉపేంద్రగారి ‘బుద్ధిమంతుడు’ చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఇప్పుడు మళ్లీ ‘కబ్జ’ తో రీ ఎంట్రీ ఇస్తున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. చిత్ర సహనిర్మాత ‘ఆర్కా’ సాయికృష్ణ పాల్గొన్నారు. -
ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కరే: ఉపేంద్ర
ఏకైక సూపర్ స్టార్ రజినీకాంతే అని కన్నడ హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు ఉపేంద్ర. స్వతహాగా కన్నడిగుడు అయిన ఈయన అక్కడ రియల్ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం కబ్జా. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజస్, ఇన్వేనియో ఒరిజిన్ సంస్థల సమర్పణలో ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం ఇది. నటి శ్రియ కథానాయికగా నటించిన ఇందులో నటి సుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఈ నెల 17వ తేదీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తనకు చెన్నై ఎప్పుడూ స్పెషలేనన్నారు. ఈ చిత్రానికి తనను ఎంపిక చేసిన దర్శకుడు చంద్రుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్ర వంటి అద్భుతమైన నటుడితో కలిసి తెరపై భాగం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శక నిర్మాత చంద్రు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న లైకా ప్రొడక్షన్స్, తమిళ్ కుమరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర కథానాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్ చూడగానే ఇది సాంకేతిక నిపుణుల చిత్రమని మీకు తెలుస్తుందన్నారు. దర్శకుడు చంద్రు నాలుగేళ్ల కల అని పేర్కొన్నారు. ఇందులో నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారని తెలిపారు. కాగా నటి శ్రియ మాట్లాడినప్పుడు ఉపేంద్రను ఇండియన్ రియల్ సూపర్ స్టార్ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉపేంద్ర తాను కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించానని.. అదేవిధంగా రియల్ రౌడీలతో చిత్రం చేయడంతో అందరూ ఇండియన్ రియల్ సూపర్‌స్టార్ అంటుంటారని, నిజానికి రజినీకాంత్ ఒక్కరే సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. కాగా తనకు తమిళంలో చిత్రం చేయాలనే కోరిక ఉందని.. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
రిషబ్ శెట్టి బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. కూతురి బర్త్‌డేలో కన్నడతారల సందడి (ఫొటోలు)
-
పల్లి.. పల్లి.. బెల్లంపల్లి...
‘‘చంద్రు ఇదివరకే అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్. ఉపేంద్ర హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కబ్జా’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ‘పల్లి.. పల్లి.. బెల్లంపల్లి..’ అంటూ సాగే మూడో పాటను కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ విడుదల చేశారు. ఉపేంద్ర, తాన్యా హోప్‌పై ఈ మాస్ సాంగ్‌ని చిత్రీకరించారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా హరిణి ఇవటూరి, సంతోష్ వెంకీ పాడారు. దర్శక–నిర్మాత ఆర్. చంద్రు హోమ్ టౌన్ షిడ్ల గట్ట (కర్నాటక)లో జరిగిన ఈ పాట విడుదల వేడుకలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం. రెవన్న, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీయఫ్ స్ఫూర్తితోనే ఉపేంద్ర ‘కబ్జా’
నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. సుదీప్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహానంతరం నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత చంద్రు, నటి శ్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమని చెప్పారు. కేజీఎఫ్ చిత్రం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ చిత్ర స్ఫూర్తితోనే కబ్జా చిత్ర కథను తయారు చేసినట్లు చెప్పారు. తను ఇంతకుముందు 11 చిత్రాలు రూపొందించానని ఇది తనకు 12వ చిత్రం అని చెప్పారు. నటుడు ఉపేంద్ర అంటే అభిమానమని, ఆయన చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా సుదీప్ పాత్ర చిన్నదైనా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నటి శ్రియ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తమిళనాడు చాలా నచ్చిందని.. చెన్నై అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించడం మంచి అనుభవం అని తెలిపారు. ఆయన నటన, నిరాడంబరత, అందరితో కలిసి మెలిసి నడుచుకునే ప్రవర్తన స్పూర్తిదాయకమన్నారు. లైట్‌మ్యాన్ నుంచి అందరికీ నమస్కారం పెట్టే సంస్కారం రజనీకాంత్దే అన్నారు. అలాంటి వారితో నటించడానికి ఎవరికైనా ఇష్టమేనని తెలిపారు. తానూ మళ్లీ రజనీకాంత్‌కు జోడీగా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇప్పుడు భాష భేదం లేదని.. మంచి కథా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఈ కబ్జా చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుందని, ఇందులో నటించటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
ఉపేంద్ర కంచర్ల హీరోగా ‘అనగనగా కథలా’
ఉపేంద్ర కంచర్ల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా కథలా’. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉపేంద్ర సరసన శుభశ్రీ, నేహాదేశ్ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. పసలపూడి ఎస్.వి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని సిబిసి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’అని దర్శకుడు పసలపూడి ఎస్.వి అన్నారు. -
తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకున్నా
‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. దర్శకుడు చంద్రు మూడేళ్లు కష్టపడి ‘కబ్జ’ చిత్రాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారు’’అని ఉపేంద్ర అన్నారు. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర, శ్రియ జంటగా సుదీప్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 17న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్ .సుధాకర్ రెడ్డి సమర్పణలో హీరో నితిన్ రుచిరా ఎంటర్టైన్ మెంట్స్, ఎన్. సినిమాస్ పతాకాలపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఆర్.చంద్రు మాట్లాడుతూ–‘‘మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్‌గారి జయంతి.. ఆ రోజు మా ‘కబ్జ’ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఉపేంద్రగారితో వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శ్రియ. కాగా ఆస్కార్ ముంగిట నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య, ‘నాటు నాటు..’ పాట రాసిన చంద్రబోస్‌ను ఉపేంద్ర అండ్ టీమ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయినాథ్, హనుమంత రెడ్డి, లగడపాటి శ్రీధర్, హీరో విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
పునీత్ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్‌ల కబ్జా రిలీజ్
తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు. -
కన్నడ స్టార్ ఉపేంద్ర ఆరోగ్యంపై వదంతులు.. క్లారిటీ ఇచ్చిన నటుడు
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. దీంతో ఉపేంద్ర ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో స్వయంగా ఉపేంద్ర ఓ వీడియోను రిలీజ్ చేశారు.ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి షూటింట్‌లో పాల్గొన్నాడయన. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని తెలిపారు. షూటింగ్ లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డానని, అందుకే దగ్గర్లోని హాస్పిటల్‌కి వెళ్లి వచ్చినట్లు వివరించారు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కబ్జా’, ‘త్రిశూలం’, ‘యూఐ’ వంటి సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. Amidst rumours that Kannada actor #Upendra has been hospitalized due to sudden illness, the actor himself clarified that he is doing fine and is continuing to shoot for #UI pic.twitter.com/4AEHwkDovg — FilmKraft (@FilmKraft24) November 25, 2022 ನಾನು ಆರಾಮಾಗಿ ಇದ್ದೀನಿ ಯಾರು ಭಯಪಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ Upendra | uppi | SK news Kannada #uppi #upendra #sknewskannada #sknews #kannada #media #socialmedia #Karnatakanews #viralnews #news #viral YouTube :-https://t.co/H8vCtVxQEU pic.twitter.com/rw4iHZ8xL3 — SK News Kannada (@SKNewsKannada) November 24, 2022 -
షూటింగ్లో అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం ఆయన శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డస్ట్ అలర్జీ ఉన్న ఉపేంద్ర యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం తిరిగి సినిమా సెట్స్‌లో పాల్గొన్నాడు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందడంతో ఉపేంద్ర ఫేస్బుక్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్ స్పాట్లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ఆస్పత్రిలో కమల్ హాసన్, హెల్త్ బులెటిన్ రిలీజ్ ఓటీటీలో నవీన్‌చంద్ర రిలీజ్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
25M వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'కబ్జా' టీజర్
థ్రిల్లర్ కబ్జా ఉపేంద్ర హీరోగా, శ్రియా శరన్ హీరోయిన్గా ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కబ్జా’. హీరోలు కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఆర్. చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ని హీరో రానా విడుదల చేశారు. ‘‘కబ్జా’ మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 1942 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఇందులో పవర్‌పుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. టీజర్ నెక్ట్స్ లెవల్లో ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: ఏజే శెట్టి. Thank you 🙏 pic.twitter.com/ENOHR3L6nq — Upendra (@nimmaupendra) September 19, 2022 -
లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ‘కంచర్ల’
ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘కంచర్ల’. ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ బేనర్‌పై కె. అచ్యుతరావు సమర్పణ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్, ప్రణీతలపై తొలి షాట్‌ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్ చిత్రీకరించగా , సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అనంతరం చిత్ర సమర్పకులు కె. అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ...‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కంచర్ల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకులు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ .. ‘యువకులు రాజకీయాల్లోకి రావాలి. సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్ తో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ ప్రారంభించాం. విశాఖ ప్రాంతంలోనే మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ జరుపుతాం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ` అన్నారు. హీరో ఉపేంద్ర, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ...‘కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్, డీఓపీ గుణశేఖర్, క్యాలు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
బన్నీ అలా అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర
Upendra Comments On Allu Arjun In Latest Interview: హీరో ఉపేంద్ర.. ఒకప్పుడు తెలుగులోనూ హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిద్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇక్కడ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సహా నటుడి పాత్రలు చేస్తున్న ఆయన అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యామూర్తి’ చిత్రంలో ప్రతికథానాయకుడిగా కనిపించాడు. తాజాగా గని మూవీలో ఓ కీ రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పెద్దపల్లి జిల్లా గొదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్ ఈ సందర్భంగా ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి మూవీని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెట్లో బన్నీ చాలా సరదాగా ఉండేవాడన్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి మూవీ సెట్ బన్నీ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. నాకు రోజు ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడు. నాకు ఇష్టమైన వంటకాలు ఏవో తెలుసుకుని స్పెషల్‌గా చేయించి తీసుకువచ్చేవాడు. ఆ సినిమా పూర్తయ్యేవరకు బన్నీ నన్ను ఒక గిప్ట్లా చూసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు! అలాగే ‘‘ఓ రోజు బన్నీని ఇలా అడిగాను. మీకు అంత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏది.. ఖరీదైన కార్ల? టూర్ల? అని అడిగాను. దానికి అతను ‘అసలు నాకు దేనిపై పెద్దగా ఆసక్తి ఉండదు. నాకు సంతోషాన్ని ఇచ్చేది సినిమాలు మాత్రమే. షూటింగ్ ఉంటే నాకు ఆరోజు పండగ రోజులా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు’ అని ఉపేంద్ర పేర్కొన్నారు. అనంతరం బన్నీ నోట నుంచి అలాంటి సమాధానం ఊహించలేదని, వర్క్ పట్ల అతడు చూపించే అంకితభావం చూసి ఆశ్చర్యం వేసిందన్నాడు. కొత్త ఇండస్ట్రీకి వచ్చేవారు బన్నీని చూసి నేర్చుకోవాలి అని ఉపేంద్ర పేర్కొన్నారు -
Ghani Movie Review: ‘గని’ పంచ్ అదిరిందా?
-
‘గని’ మూవీ రివ్యూ
టైటిల్ : గని జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్ చంద్ర, నరేశ్ తదితరులు నిర్మాతలు : అల్లు బాబీ, సిద్దు ముద్ద దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి సంగీతం : తమన్ ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్ విడుదల తేది : ఏప్రిల్ 8, 2022 మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘గని’ కథేంటంటే ‘గని’(వరుణ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. మరోవైపు జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లొద్దని గని అమ్మ(నదియ) ఒట్టు వేయించుకుంటుంది. గని మాత్రం తల్లికి తెలియకుండా బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పటికైనా నేషనల్ చాంపియన్‌గా నిలవాలనేదే అతని ఆశయం. అసలు గని బాక్సింగ్‌లో నేషనల్ చాంపియన్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ల నాన్న విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి? తండ్రి గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత గని ఏం చేశాడు? తన తండ్రికి ఈశ్వర్(జగపతి బాబు)చేసిన అన్యాయం ఏంటి? ఈశ్వర్ అసలు రూపాన్ని గని ఎలా బయటపెట్టాడు? గని చివరకు నేషనల్ చాంపియన్‌గా నిలిచాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్, తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాలేడు. కమర్షియల్ సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఫస్టాఫ్ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ సీన్‌తో సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్ ఇండియన్ బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్ గతంలో స్టోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో, గనిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది. ఎవరెలా చేశారంటే.. బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్ పాత్రకు సునీల్ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈశ్వర్ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఉపేంద్ర డైరెక్షన్లో మెగాస్టార్ చిత్రం.. కానీ!
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కన్నడ నటుడు ఉపేంద్ర ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాను నటించిన 'A', ఉపేంద్ర వంటి చిత్రాల ద్వారా 24 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసని కాని దానికంటే ముందు ఓ చిన్న ఫ్లాషబాక్ ఉంది. 'నాకు మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పాలి. 24 సంవత్సరాల క్రితం నేను డా. రాజశేఖర్‌తో 'ఓంకారం' అనే చిత్రాన్ని డైరెక్షన్ చేశాను. ఆ సమయంలో అశ్వినీదత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది. కానీ నాకు అదృష్టం లేక ఆ సినిమా చేయలేకపోయాను. అయితే ఇప్పటికీ ఆ చిత్రం చేయలేకపోయినందుకు బాధపడుతుంటాను' అని ఉపేంద్ర తెలిపారు. -
తెలుగు సినిమాలపై కన్నడ స్టార్ ఫోకస్.. నెక్ట్స్ మహేశ్ సినిమాలోనే
కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన ఉపేంద్ర మళ్లీ తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు తెరపై కనిపించనున్నారు. ఇటీవలె ఆర్జీవీతో ఓ సినిమా అనౌన్స్ చేశారు ఉపేంద్ర. ఇందులో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక వరుణ్‌తేజ్ గని చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. తాజాగా మహేశ్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ఉపేంద్రను ఎంపిక చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఓ కీలకమైన పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదించగా, ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. ఇక మహేశ్‌బాబు నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ అనంతరం మహేశ్- త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనుంది. -
మళ్లీ సింగిల్ లెటర్‌తో ఉపేంద్ర సినిమా.. ఏడేళ్ల తర్వాత
Upendra Returns To Direction With Single Letter Movie U: ఉపేంద్ర విలక్షణ నటుడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఓంకారం, ఎ, ఉపేంద్ర’ తదితర చిత్రాల ద్వారా దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్నారు. అయితే ‘ఉప్పి 2’ (2015) తర్వాత మళ్లీ ఉపేంద్ర మెగాఫోన్ పట్టలేదు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సింగిల్ లెటర్ టైటిల్‌ను పెట్టారు. ఒక అక్షరంతో సినిమా తీయడం ఉపేంద్రకు బాగా అలవాటు. ఇదివరకూ ఎ, రా చిత్రాలు కన్నడతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. ఒక సినిమాకు అయితే టైటిలే లేకుండా కేవలం సింబల్‌ను వాడి సూపర్ అనే మరో మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు 'యూ' అనే భిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం (మార్చి 11) విడుదల చేశారు. కన్నడంలో ‘టగరు’, ‘సలగ’ వంటి సినిమాలను నిర్మించిన వీనస్ ఎంటర్టైన్మెంట్స్తో కలసి లహరి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘భారీ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉపేంద్ర ‘ఎ’ చిత్రం నుంచి ఆయనతో మాకు మంచి అసోసియేషన్ ఉంది’’ అన్నారు లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. మనోహరన్. ‘‘దేశవ్యాప్తంగా ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుంది’’ అన్నారు వీనస్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకాంత్. In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT — Upendra (@nimmaupendra) March 11, 2022 -
'మధుమతి'గా శ్రియా కొత్త లుక్.. నెట్టింట వైరల్
Shriya Saran First Look Released From Kabzaa Movie: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. సుమారు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందుతూనే ఉంది. అయితే వివాహం అనంతరం మాత్రం అరకొర సినిమాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రస్తుతం బడా హీరోలా సరసన నటించికపోయిన పెద్ద చిత్రాల్లో మాత్రం కనిపించి అలరిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ 'దృశ్యం 2'లోనూ అజయ్ దేవగణ్‌కు జంటగా యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రియా మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రియా లీడ్ రోల్లో అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. 'కబ్జా' సినిమాలో శ్రియా మధుమతి అనే పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించి మహరాణిలా సింహాసనంలో కూర్చున్న శ్రియా మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, కబీర్ సింగ్ దుహా, బోమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో పాన్ ఇండియాగా త్వరలో విడుదల కానుంది. Unveiling the first look of our 1’st queen..Welcoming Shirya Saran aboard.. happy to have you on set @shriya1109 💐✨#Kabzaa#Indianrealstarupendra#KichchaSudeepa#Rchandru#ShriyaSaran#Panindiamoviekabzaa pic.twitter.com/vP2z6eW81i — R.Chandru (@rchandru_movies) March 7, 2022 -
పక్కా మాస్ చూపిస్తానంటున్న ఉపేంద్ర
ఉపేంద్ర అంటేనే మాస్. ‘ఎ’, ‘ఉపేంద్ర’, నేను’ తదితర చిత్రాల్లో మాస్ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన తాజాగా ‘కబ్జా’ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 18న) ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఎస్ఎస్ఈ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎంటీబీ నాగరాజు సమర్పణలో ఆర్. చంద్రు దర్శకత్వంలో ఆర్. చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు ఉపేంద్ర. టీజర్‌ను దీపావళికి విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: ఆర్జీవీ సంచలన ప్రకటన.. ఆ హీరోతో మూవీ ఆర్జీవీ–ఉపేంద్ర–ఓ సినిమా... ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) త్వరలో ఆయన కాంబినేషన్లో సినిమా ఉంటుందనీ, అది యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రకటించారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా అన్నారు రామ్‌గోపాల్ వర్మ. View this post on Instagram A post shared by Upendra (@nimmaupendra) -
ఆర్జీవీ సంచలన ప్రకటన.. ఆ హీరోతో యాక్షన్ ఎంటర్టైనర్!
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఓ సంచలనం. ప్రతీ విషయంలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంటాడు. ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలో ఏదో ఒక ట్రెండ్ సెట్టింగ్ అంశం ఉండేది. అలాంటి దర్శకుడు కొంతకాలంగా మాత్రం కాంట్రవర్సీనే తన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాలో కాంట్రవర్సీ ఉండేలా జాగ్రత్త పడతాడు ఈ వివాదస్పద దర్శకుడు. (చదవండి: ఏడేళ్లు.. 100 రోజుల సినిమాలు ఏడు! డైలాగులు రాసినా.. డైరెక్ట్ చేసినా సెన్సేషనే!) మరోపైపు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన సినిమాల్లో ఎవరూ ఊహించని విధమైన స్క్రీన్ ప్లేతో పాటు.. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే విధంగా కూడా ఉంటాయి. ఇలాంటి విభిన్న దర్శకుడు, నటుడు కాంబినేషన్లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.త్వరలోనే ఈ సరికొత్త కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. ఉపేంద్ర పుట్టిన రోజు(సెప్టెంబర్ 18)సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన ఆర్జీవీ.. త్వరలోనే ఆయనతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వస్తాయి అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇరి వీరిద్దరిలో సినిమా ఎప్పుడు రానుందా అని వర్మ, ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సొసైటీపై విరక్తితో డైరెక్షన్ చేస్తున్న స్టార్ హీరో
సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు.. ఇలాంటి సినిమాలా తీసేది అనే విమర్శలు ఉపేంద్రనెప్పుడూ గాయపర్చలేదట. కానీ, ‘తేడా దర్శకుడు’ అనే మాట విన్నప్పుడల్లా కోపం నషాలానికి అంటుందట. కారణం.. వాస్తవ పరిస్థితుల్ని యథాతథంగా అలాంటి ట్యాగ్ లైన్‌ను అంటగడుతున్నారనే ఆయన ఫీలింగ్. ఉపేంద్ర సినిమాల్ని మెచ్చుకునేవాళ్లకంటే.. అందులోని ప్లాట్లైన్లను, కథనాల్ని తిట్టేవాళ్లు కూడా అదే రేంజ్లో ఉంటారు. అయినప్పటికీ ఆయనొక స్టార్ మేకర్. సెప్టెంబర్ 18న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (ఉపేంద్ర రావు) పుట్టినరోజు.. ఉడుప్పీ కొటేశ్వర గ్రామంలో 1968లో జన్మించారాయన. కన్ననాటే కాదు.. తెలుగులోనూ ఉప్పీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ►సినీ పరిశ్రమలో ఉపేంద్రలా ఆలోచించేవాళ్లు ఇంకెవరూ ఉండరు. ఉపేంద్ర ఒక్కడే గొప్పగా ఆలోచించగలడు : రజినీకాంత్ ►కన్నడ దర్శకుడు, నటుడు కాశీనాథ్.. ఉపేంద్రకి దగ్గరి బంధువు. అందుకే ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. ►కాశీనాథ్ స్టయిల్లోనే తీసిన మొదటి సినిమా ఆడకపోవడంతో.. తన స్టైల్లో ‘ష్’ తీసి మంచి దర్శకుడనే పేరు దక్కించుకున్నాడు. ►తన నిజజీవితంలో ఎదురైన.. ఎదురవుతున్న ఘటనలనే ‘పచ్చి’గా సినిమాగా చూపించడం ఉప్పీ స్టయిల్. ►సామాజిక స్పృహను తెరపై చూపించినప్పటికీ.. అందులోని బోల్డ్నెస్ వల్ల విమర్శలు ఎదురవుతుంటాయి ►ఉపేంద్ర చిన్నతనంలో కంటి సమస్య ఎదుర్కొన్నాడు. అందుకే కొన్ని సినిమాల్లో కళ్లను అటు ఇటు తిప్పుతూ ఓ స్పెషల్ సిగ్నేచర్‌ను చూపిస్తుంటారు. ‘‘నావి ఫిలసాఫికల్ సినిమాలేం కాదు. మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నమూ చేయను. ప్రతీ మనిషి తానే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. నేను దేవుడ్ని భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ, ఎదుటివారి ఆలోచనల్లోని ఒడిదుడుకులు పట్టుకోవాలనుకున్నప్పుడు, మనిషి గందరగోళంగా మారతాడు. స్వార్థంతో నిండిపోయిన ఈ సొసైటీ తీరే అంతా. అలాంటి వాళ్లపైన విరక్తితోనే డైరెక్షన్ చేస్తున్నా - ఓ ఇంటర్వ్యూలో ఉప్పీ చెప్పిన మాటలివి. ►ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ఓం’.. కన్నడనాట ఓ సెన్సేషన్. శివరాజ్‌కుమార్-ప్రేమ లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ కల్ట్ క్లాసిక్ జాబితాలో చోటు దక్కించుకుంది. ►హీరో కమ్ డైరెక్టర్‌గా ఉపేంద్ర తొలి భారీ సక్సెస్ ‘ఏ’. ఇది ఉప్పీ గతంలో ఓ నటితో జరిపిన ‘ప్రేమ’ వ్యవహారం ఆధారంగా తీసిన సినిమాగా ఓ ప్రచారం వినిపిస్తుంటుంది. ఈ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ తన ప్రొడక్షన్ హౌజ్‌లో ఓ సినిమా తీయాలంటూ ఉప్పీతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ►ఆ శాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ లీడ్ రోల్లో ‘ఆపరేషన్ అంత’ డైరెక్ట్ చేశాడు ఉపేంద్ర. కానీ, అది అంతగా ఆడలేదు. రాజకీయ కోణంలో వివాదాల్లో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉపేంద్ర’ భారీ సక్సెస్ అందుకుంది. ►ఉపేంద్ర సినిమా ముగింపును.. తన సినిమాను ఓపెనింగ్ షాట్‌గా వాడుకోవాలనే కోరికను స్టార్ దర్శకుడు శంకర్ గతంలో ఓ ఈవెంట్లో బయటపెట్టాడు కూడా. ►ముగ్గురు హీరోయిన్లను మనిషిలోని డబ్బు, అహం, డబ్బు-బాధ్యతలు అనే వాటితో పోలుస్తూ.. నేను అనే స్వార్థం ఉండకూడదనే ఉద్దేశంతో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ►షారూక్ ఖాన్ హిట్ మూవీ ‘డర్’ కన్నడ రీమేక్ ‘ప్రీత్సే’లో ఉప్పీ నటనకు ప్రశంసలు ►ఏ, ఉపేంద్ర, ప్రీత్సే, కుటుంబ, రక్త కన్నీరు, గోకర్ణ, గౌరమ్మా, ఆటో శంకర్.. 1998-2005 మధ్య ఏడు వంద రోజుల హిట్ సినిమాలు. ►రక్తకన్నీరుకు బెస్ట్ డైలాగ్ రైటర్‌గా అవార్డు ► వరుస సూపర్ హిట్లతో కన్నడ సూపర్ స్టార్‌గా గుర్తింపు ►తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ‘కన్యాదానం’తో యాక్టింగ్ డెబ్యూ ►విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు.. విలక్షణమైన నటుడిగా అలరించడం ఉప్పీకి ఉన్న ప్రత్యేకత ►డిఫరెంట్ సినిమాలు తీసినా.. కొంతకాలం సక్సెస్‌కి దూరం ► రోబో క్యారెక్టర్లో నటించిన తొలి నటుడు ఈయనే(హాలీవుడ్) ►2008లో ‘బుద్ధివంత’(బుద్ధిమతుడు)తో బ్యాక్ టు ఫామ్. ►దశాబ్దం గ్యాప్ తర్వాత 2010లో సూపర్ సినిమా డైరెక్షన్ ► రీమేక్‌లతో ఉప్పీకి అంతగా అచ్చీరాని సక్సెస్ ► ఉప్పీ 2తో మరోసారి డైరెక్టర్‌గా బాధ్యతలు ► తెలుగులో ఓంకారంతో దర్శకుడిగా డెబ్యూ. ఆ సినిమాకు నారేటర్ కూడా. ఆపై కన్యాదానం, రా, ఒకేమాట, నీతోనే ఉంటా, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తిలో నటించారు. త్వరలో వరుణ్‌తేజ్ ‘గనీ’తో కనిపించనున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం
బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను టార్గెట్ చేసి యంగ్ హీరో చేతన్ చేసిన వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మధ్యే ‘నన్ను సీఎంను చేస్తారా?’ అని ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసిన ఉప్పీ.. కులరాజకీయలపై ప్రజాకీయ పార్టీ అభిప్రాయం వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఉపేంద్ర స్టాండ్‌పై సెటైర్లు వేస్తూ యువ నటుడు చేతన్ అహింసా ఓ వీడియోను రిలీజ్ చేయడం దుమారం రేపుతోంది. ‘‘మా సెలబ్రిటీలలో కొంతమంది కులం, వివక్ష గురించి చర్చించకుండా ఉండడం వల్ల సమస్యలు శాశ్వత్వంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఇది నవ్వులాట కాదా? ఒక రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే పరిష్కారించడమే. అలాగే కుల వివక్ష ఈ సొసైటీలో ఒక జబ్బులాంటిది. తన వ్యాఖ్యల ద్వారా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంతగా పరిణితి చెందాడో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ చేతన్ వీడియోలో పరోక్షంగా ఉపేంద్రపై సెటైర్లు వేశాడు. దీంతో ఉప్పీ ఫ్యాన్స్ చేతన్‌పై మండిపడుతున్నారు. చేతన్‌కు అంత అర్హత లేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో చేతన్, అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడాన్ని మరో స్టార్ హీరో దర్శన్ తప్పుబడుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కులరాజకీయాల గురించి మాట్లాడుతూ.. చివర్లో వాటికి తన పార్టీ దూరమని ఉప్పీ ఆ వీడియోలో తెలిపాడు. ಜಾತಿ / caste (1/2) pic.twitter.com/nHnTnF3Qyc — Chetan Kumar / ಚೇತನ್ (@ChetanAhimsa) May 27, 2021 కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన 38 ఏళ్ల చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. -
Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర
యశవంతపుర: కరోనా సమయంలో నటుడు ఉపేంద్రకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పుట్టింది. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను ప్రజలకు రాశారు. ఆ లేఖ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నాకు సీఎం కావాలని ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపిస్తారా’ అంటూ లేఖ రాశారు. తాను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని పేర్కొన్నారు. సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని ఆ లేఖలో ఉప్పి పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్ Upendra CM of Karnataka? pic.twitter.com/OkgPfgm9ab— Upendra (@nimmaupendra) May 22, 2021 -
వరుణ్ ‘గని’లో కన్నడ స్టార్ హీరో
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గని. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరణ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. జూలై 30న ‘గని’ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్. పాత్ర గురించి వివరించగానే ఉపేంద్ర సంతోషంగా అంగీకరించారట. ఫిబ్రవరి 12న ఉపేంద్ర ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నాడు. అందాల రాక్షసి ఫేమ్… నవీన్ చంద్రకు కీలకమైన పాత్ర దక్కింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
రెండు భాగాలుగా కబ్జా
ఒక కథను ఒకే సినిమాలో ప్రేక్షకులకు చెప్పలేం అని చిత్రబృందం భావిస్తే అప్పుడు ఆ కథను రెండు భాగాలుగా చెబుతుంటారు. ఇటీవల కాలంలో ‘బాహుబలి, కేజీయఫ్’లు అందుకు ఉదాహరణ. తాజాగా ఉపేంద్ర నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కబ్జా’ కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఉపేంద్ర మాఫియా డాన్‌లా కనిపించనున్నారు. ముందు ఒక్క సినిమాగా ప్లాన్ చేశారు. అయితే లాక్డౌన్లో ఈ కథపై ఇంకా వర్కవుట్ చేశారు. దాంతో కథ పెద్దదయింది. ఈ కారణంగా సినిమాని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. ‘రెండో భాగం ఐడియా ఉపేంద్రగారికి చాలా నచ్చింది’’ అని దర్శకుడు చంద్రు తెలిపారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమా సుమారు 7 భాషల్లో విడుదల కానుంది. -
నవంబర్‌లో షురూ
కొత్త సినిమా కోసం బాక్సర్‌గా మారారు వరుణ్ తేజ్. ఒక్క షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది. నవంబర్‌లో మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నారు వరుణ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా బ్రేక్ తర్వాత నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. నవంబర్ 2 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. నవంబర్ నుంచి మార్చి వరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరపాలన్నది ప్లాన్ అట. ఈ సినిమా కోసం ప్రపంచప్రఖ్యాత బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్ మెళకువలు నేర్చుకోవడంతోపాటు బాడీలాంగ్వేజ్ మీద దృష్టిపెట్టారు వరుణ్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు. -
ఉపేంద్ర కబ్జా
ఉపేంద్ర పుట్టినరోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’ థీమ్ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేయించారు. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లాంకో శ్రీధర్ సమర్పిస్తున్నారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కబ్జా’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో సుధీర్‌బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్.చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బాక్సర్‌కు విలన్?
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌తేజ్. ఇందుకోసం విదేశాల్లో వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర విలన్ పాత్ర చేయబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమా తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో ఉపేంద్ర క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. మరి.. బాక్సర్‌కు విలన్‌గా మారతారా? వెయిట్ అండ్ సీ. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
అండర్‌వరల్డ్ కబ్జా
‘‘ఇప్పటివరకూ ఎన్నో గ్యాంగ్‌స్టర్ కథలు విన్నారు.. చూశారు. కానీ మా సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. అండర్ వరల్డ్‌లోనే కొత్త కోణాన్ని చూపించబోతున్నాం’’ అంటోంది ‘కబ్జా’ చిత్రబృందం. ఉపేంద్ర ముఖ్య పాత్రలో ఆర్. చంద్రు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర డాన్‌గా కనిపించబోతున్నారు. 1970ల కాలంలో ఈ సినిమా కథ ఉంటుందట. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్న ఈ చిత్రం 7 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఐదేళ్ల తర్వాత...!
‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) చిత్రం తర్వాత స్ట్రయిట్ తెలుగు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేదు ఉపేంద్ర. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఉపేంద్ర ఓ తెలుగు సినిమాలో నటించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు ఉపేంద్రను సంప్రదించారట చిత్రబృందం. మరి... పరుశురామ్ కథకు ఉపేంద్ర ఊ అంటారా? వెయిట్ అండ్ సీ. -
ఉపేంద్ర హీరోగా ‘కబ్జ’ చిత్రం ప్రారంభం
-
ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం
‘‘ఏ’ చిత్రం నుంచి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా వరకూ తెలుగు ప్రేక్షకులు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చేస్తున్న ఈ ‘కబ్జా’లో 1940–80 మధ్య కాలంలో అండర్ వరల్ద్ ప్రపంచాన్ని చూపించనున్నాం’’ అన్నారు ఉపేంద్ర. ఆయన హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జా’. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్. చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేష్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ఆనంద్ గురూజీ కెమెరా స్విచ్చాన్ చేశారు. బి. గోపాల్ తొలి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఓం’తో ఓ ప్రయోగం చేశాం. ‘కబ్జా’ చిత్రం కూడా ఓ ప్రయోగమే. చంద్రుతో ‘బ్రహ్మ, ఐ లవ్ యూ’ సినిమాలు చేశాను. ఈ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా సంతోషం. చంద్రుతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా చేశాను’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘‘సరికొత్త స్టయిల్లో ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు ఆర్. చంద్రు. ‘‘ఉపేంద్రగారితో సినిమా చేయాలని పదేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. చంద్రు చెప్పిన కథ నచ్చింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అన్నారు రాజ్ ప్రభాకర్. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత గోనుగుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉపేంద్ర హత్య కేసు.. నిందితుల కోసం గాలింపు
కర్నూలు,మహానంది: మహానందిలోని ఈశ్వర్‌నగర్‌కు చెందిన బంగి ఉపేంద్ర (21) హత్య కేసు నిందితుల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక పోలీసులు బరిలోకి దిగారు. అలాగే మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాలనీలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు మహానందిలో గతంలో పనిచేసిన పోలీసు కానిస్టేబుళ్లు, ప్రస్తుతం స్పెషల్‌పార్టీలో ఉన్న మరికొందరిని పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. హత్యకు పాల్పడిన మహానంది యువకుడు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో కత్తితో హల్చల్ చేసిన ఘటన పత్రికల్లో రావడంతో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్పీ స్వయంగా మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హత్యకు గురైన ఉపేంద్ర ఇంటి సమీపంలో ఎస్ఐ ఆధ్వర్యంలో ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం పికెటింగ్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారిలో ఓ నిందితుడి స్నేహితుడి కోసం మహానంది పోలీసులు గాలించారు. అతడిని పట్టుకుంటే అసలు నిందితుడు దొరకవచ్చనే కోణంలో గాలిస్తున్నారు. అలాగే ఉపేంద్రపై కత్తితో దాడిచేసిన వసీం తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. నవ్వుతూ కామెంట్లు చేయడంపై ఉద్రిక్తత.. హత్యకు పాల్పడిన వారి బంధువులు కొందరు అదే కాలనీలో, ఉపేంద్ర ఇంటి సమీపంలో ఉంటున్నారు. దీంతో వారు అక్కడివారిని చూస్తూ నవ్వుతూ హేళనగా మాట్లాడుకోవడంపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలిసిన మహానంది ఎస్ఐ వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హేళనగా మాట్లాడిన వారిని మందలించి వారి బంధువుల ఇళ్లకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మహానందిలో యువకుల మధ్య వర్గపోరు.. మహానందిలో యువకుల మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయి. గతంలో పలు ఘటనలు చోటు చేసుకోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతేడాది జూన్‌లో క్యారంబోర్డు ఆట విషయంలో వివాదం తలెత్తడం, జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందడం తెలిసిందే. అలాగే మహానందిలో విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలో ప్రస్తుతం జరిగిన ఉపేంద్ర హత్యలో పాల్గొన్నవారి పాత్ర కీలకంగా ఉంది. దీంతో మహానందిలో యువకులు రెండు వర్గాలుగా తయారవడం, తమ మాటే చెల్లాలంటూ దాడులకు పాల్పడుతుండటంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. -
ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర ట్విటర్లో చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర స్పందిస్తూ.. ఆ నలుగురే దిశపై అత్యాచారం చేసి కాల్చి చంపారా అని ప్రశ్నించారు. ప్రముఖుల విషయంలో ఈ రకమైన ఎన్కౌంటర్లు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. కోర్టు విచారణ పూర్తి కాకపోముందే నిందితులను ఎన్కౌంటర్ చేయడం సరికాదన్నారు. ఒకప్పుడు ఎన్కౌంటర్ల ద్వారా రౌడీయిజం తగ్గిపోయిందని అని అన్నారు. నిజాయితీ కలిగిన అధికారులు దృష్టిపెడితే ఎన్కౌంటర్ల ద్వారా మహిళలపై అత్యాచారాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ధనవంతులు, ప్రముఖులు దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఉపేంద్ర ట్వీట్‌కు కొందరు మద్దతు తెలుపుతుండగా, చాలా మంది ఆయన మాటలను ఖండిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ రాజకీయ నటుడిగా, స్టార్ హీరోగా ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మెజారిటీ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. -
కాజల్ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది
చెన్నై: కాజల్‌అగర్వాల్‌ను తాజాగా కర్ణాటక ఆహ్వనించింది. కళాకారులకు భాషా బేధం ఉండదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సౌలభ్యం ఎక్కువన్నది విధితమే. ఒక భాషలో నటించిన చిత్రం విజయం సాధిస్తే వెంటనే ఇతర భాషా దర్శకులు ఆ చిత్రాలపై, అందులో నటించిన హీరోయిన్లపైనా దృష్టిసారిస్తారు. అలా ప్రస్తుతం హీరోయిన్లుగా నటిస్తున్న వారందరూ బహుభాషా నటీమణులగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. నటి కాజల్‌అగర్వాల్ కూడా బహుభాషా నటినే. బాలీవుడ్లో రంగప్రవేశం చేసి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రవేశించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. అయితే దక్షిణాది భాషల్లో ఒకటైన కన్నడంలో ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది తాజాగా అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కన్నడంతో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న ఉపేంద్రతో జతకడుతోంది. కబ్జా అనే చిత్రంలో ఈ జంట నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. తమిళంలో కమలహాసన్‌కు జంటగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు భాషల్లోనూ మరో అవకాశం లేకపోవడంతో కన్నడ పరిశ్రమపై దృష్టి సారించింది. అయితే అక్కడ త్రిష, నయనతార వంటి వారు నటించినా పేద్దగా పేరుతెచ్చుకోలేకపోయారు. మరి కాజల్‌అగర్వాల్‌కు శాండిల్‌వుడ్‌లో భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఒక రౌండ్ కొడుతుందా లేక ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకుంటుందా అన్న ఆసక్తి మాత్రం సినీ వర్గాల్లో నెలకొంది. కాగా శాండిల్‌వుడ్ ఎంట్రీ గురించి కాజల్ మాట్లాడుతూ తాను నటించే ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తానని చెప్పింది. ఇప్పుడు కన్నడంలో మొదటి సారి నటిస్తున్నాను. ఈ అనుభవం కొత్తగా ఉంది అని పేర్కొంది. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేయనున్నారని తెలిపింది. ఇప్పటికి 50 చిత్రాలను పూర్తి చేశానని, వంద చిత్రాలను పూర్తి చేయడమే తన లక్ష్యమని కాజల్‌అగర్వాల్ పేర్కొంది. అయితే లక్ష్యంపెద్దదిగానే ఉంది. అందుకు మరో 10, 15 ఏళ్లు పడుతుందే. అప్పటికి వయసు ప్రభావం చూపదా? అయినా నూరు చిత్రాల్లో నటించడమే తన లక్ష్యం అంటోంది గానీ, హీరోయిన్‌గానే అని అనలేదు కాబట్టి అక్కగా, వదినగా అయినా తన టార్గెట్‌ను పూర్తి చేసుకుంటుందేమో. అన్నట్టు ఈ జాణ నటించిన ఏకైక హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా, విడుదలకు మోక్షం కలగలేదు. -
అందుకే ఎన్నికలకు దూరం: ఉపేంద్ర
సాక్షి బెంగళూరు: సినిమాల్లో బిజీగా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కావడం లేదని నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) నుంచి పోటీ చేసే అభ్యర్థులను పరిచయం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండిందని, కానీ కొన్ని సినిమాలతో తీరిక లేకుండా ఉండడం వల్ల పోటీ చేయలేకపోయాయని తెలిపారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నానని, అందుకే ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కచ్చితంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రస్తుత రాజకీయాలపై తానేమీ మాట్లాడబోనని, ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. -
కన్నడనూ కబ్జా చేస్తారా?
పదేళ్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేసి పడేశారు కాజల్ అగర్వాల్. హీరోయిన్గా పదేళ్లు పూర్తి చేసినా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు కాజల్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు కాజల్. కానీ ఇంతవరకూ కన్నడ సినిమా చేయలేదు. ఉపేంద్ర చేయబోతున్న ‘కబ్జా’ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారట కాజల్. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కనున్న గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘కబ్జా’. ఇందులో ఉపేంద్ర సరసన హీరోయిన్గా కాజల్ కనిపిస్తారట. ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు నటించనున్నారు. ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. -
కబ్జా చేస్తా
అండర్ వరల్డ్ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. అందుకోసం కత్తి పట్టుకొని రెడీ అయిపోయారు కూడా. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం
బెంగళూరు : కన్నడ చిత్రరంగానికి చెందిన ముగ్గురు నటీనటుల పుట్టినరోజు బుధవారమే కావడంతో అభిమానుల సందడి మిన్నంటింది. సాహససింహ, దివంగత నటుడు విష్ణువర్ధన్, స్టార్ నటునిగా పేరున్న ఉపేంద్ర, నటీమణి శృతిల అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరిపారు. విష్ణు అభిమానులు, వివిధ సంఘ సంస్థలు అభిమాన్ స్టూడియోలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. చిత్ర ప్రముఖులు ట్విట్టర్లో ఆయనను స్మరించుకున్నారు. నిరాడంబరంగా ఉప్పి జన్మదినం మరో నటుడు ఉపేంద్ర 52వ పుట్టినరోజును బెంగళూరులో తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకొన్నారు. కేక్, పూల బొకేలు తీసుకురావద్దని అభిమానులకు ఆయన ముందుగానే మనవి చేశారు. పరిసర సంరక్షణ కోసం మొక్కలను తీసుకురావాలని కోరటంతో చాలామంది అభిమానులు మొక్కలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. నటి, బీజేపీ నాయకురాలు శృతి 44వ జన్మదినంను బెంగళూరులో కేక్ కట్ చేసి ఆచరించారు. విష్ణుకు సీఎం యడ్డి, సుదీప్ నివాళులు దివంగత నటుడు విష్ణువర్ధన్‌కు సీఎం బీఎస్ యడియూరప్ప నివాళులరి్పంచారు. కన్నడ చిత్రరంగానికి అనేక సేవలందించిన్నట్లు ట్విట్టర్ ద్వారా కొనియాడారు. ఆయన సినిమాలు, వ్యక్తిత్వం ద్వారా ప్రజల మన్ననలను పొందుతున్నారని తెలిపారు. విష్ణువర్థన్ తండ్రి మాదిరిగా ఎంత ప్రీతిని చూపించేవారో, తప్పు చేస్తే అంతే కోప్పడేవారని హీరో సుదీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన దూరమై అనాథమలయ్యామని ఆవేదనను వ్యక్తం చేశారు. -
ఉపేంద్రకు అరుదైన గౌరవం
యశవంతపుర : నటుడు ఉపేంద్ర నటనలోనే కాకుండా ప్రపంచ స్థాయి 50 మంది ఉత్తమ దర్శకులలో ఉపేంద్ర కూడా ఒకరు. కన్నడంలో ఏ, ఓం లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం చేయడంతో పాటు మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. బీఎండీబీ అనే సంస్థ ఉత్తమ దర్శకుల జాబితాను విడుదల చేసింది. అందులో 50 మంది పేర్లలో ఉపేంద్రకు 17వ స్థానం దక్కింది. దక్షిణ భారతదేశంలో ఏకైన దర్శకుడిగా ఉపేంద్ర పేరు తెచ్చింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే సినిమాలను తీసిన దర్శకుడు రాజ్‌కుమార్ ఇరాని రెండో స్థానంలో ఉన్నారు. సత్యజిత్ రేకి 49వ స్థానం దక్కింది. కన్నడంలో ఉపేంద్ర 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. -
ఐ లవ్ యూ చెబుతారా?
కన్నడ, తెలుగు భాషల్లో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్ యూ’ చెప్పించారు దర్శకుడు ఆర్. చంద్రు. ప్రేమలో కొత్తకోణం చూపించాం అంటూ తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ తమిళ రీమేక్‌ను కూడా ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్. చంద్రునే డైరెక్ట్ చేస్తారట. ‘‘ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడం సంతోషంగా ఉంది. ఇంకా నటీనటులను ఫైనలైజ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్‌లో కార్తీ నటిస్తే బావుంటుంది అనుకుంటున్నాను. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో చేస్తాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. మరి తమిళంలో కార్తీ ‘నాన్ ఉన్నై కాదలిక్కరేన్’ అని చెబుతారా? అదేనండీ... తమిళంలో ఐ లవ్ యూ చెబుతారా? వేచి చూడాలి. -
‘ఐ లవ్ యూ’ ప్రీ రిలీజ్ వేడుక
-
జూన్ 14న ‘ఐ లవ్ యు’
ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంచలనం సృష్టించిన ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఐ లవ్ యు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు ఉపేంద్ర సిద్ధమౌతున్నాడు. తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 8న విశాఖ సముద్రతీరంలో ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఉపేంద్ర ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ మూవీలో రచిత రామ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో ఆ అంశాలతో పాటు లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. -
బుద్ధిమంతుడు
ఉపేంద్ర బుద్ధిమంతుడిగా మారిపోయారు. నిజాలను ముక్కుసూటిగా, మొహమాటం లేకుండా చెప్పే పాత్రలనూ, అప్పుడప్పుడు కొంచెం తిక్క పాత్రలనూ పోషిస్తారు ఉపేంద్ర. కానీ తాజా చిత్రంలో మాత్రం బుద్ధిమంతుడిగా కనిపించబోతున్నారట. ఉపేంద్ర హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి ‘బుద్ధివంతా 2’(బుద్దిమంతుడు 2) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 2013లో ‘బుద్ధివంతా’ అనే చిత్రంలో ఉపేంద్ర యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘బుద్ధిమంతుడు’ టైటిల్‌తో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మౌర్య దర్శకత్వం వహిస్తున్న ‘బుద్ధివంతా 2’ ఇటీవలే ప్రారంభమైంది. మరోవైపు ఉపేంద్ర నటించిన ‘ఐ లవ్ యూ’ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. -
నేనే నేను
ఉపేంద్రని తెర మీద చూసినమొదటిసారి నుంచి ఇప్పటిదాకా ఇదే లొల్లి!వెయ్యి ఇజమ్‌లలో ఈయనది ‘నేనిజమ్’.కథ ఎలా ఉన్నా స్క్రీన్‌ప్లే మాత్రంఎప్పుడూ ఇలాగే నేస్తాడు.ఎవరు ఏమన్నా నేవర్ మైండ్.నేను ఉంటే పెయిన్ ఉంటుంది...గెయిన్ ఉంటుంది అంటాడు.ఆ సినిమాలో ఉన్న నేనేరాజకీయాల్లో ఉన్న ఈ నేను అంటాడు. కొన్ని రోజులుగా మీ పార్టీ ‘యుపీపీ’ (ఉత్తమ ప్రజాకీయ పార్టీ) తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ప్రచారం ఎలా సాగింది? ఉపేంద్ర: ఆర్గానిక్‌గా ప్రచారం చేశాం. అంటే సహజసిద్ధంగా. ప్రచారం అంటే ర్యాలీ, రోడ్ షోలా కాకుండా కేవలం మీడియా, సోషల్ మీడియా ద్వారా ఓటర్స్‌ను అప్రోచ్ అయ్యాం. విచారమే (వివరణ) ప్రచారం అవ్వాలనుకున్నాను. అన్ని జిల్లాల ప్రజలను కలిశాను. వెళ్లిన ప్రతిచోటా ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాం. అక్కడ ఎవరెవరు మా ప్రజాకీయను సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్లే వచ్చి మాతో కలసి ప్రచారం చేశారు. మీ అభ్యర్థులను ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని విన్నాం.. అవును. మూడు స్టేజీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించాం. ఫస్ట్ క్వొశ్చన్ రౌండ్, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్. వాటిలో ఎంపికైన వాళ్లతో ఫైనల్ ఇంటర్వ్యూ నిర్వహించాం. మా గైడ్ లైన్స్ అన్నింటినీ వాళ్లు అంగీకరిస్తేనే తీసుకున్నాం. జీతం కోసం మాత్రమే పని చేయాలి. సేవ చేస్తాను, లీడర్ అవుతానని రాకూడదని స్పష్టంగా చెప్పేశాను. ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. నువ్వు (రాజకీయాల్లో ఉన్నవాళ్లు) కేవలం జీతం తీసుకుంటున్న ఉద్యోగివి మాత్రమే. కార్పొరేట్ ఎంప్లాయ్‌లానే పదవుల్లో ఉన్నవాళ్లు కూడా తామేం చేస్తున్నారనే రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకపోయినా, వాళ్ల పనితో ప్రజలు సంతృప్తిగా లేకపోయినా వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇదీ మా పార్టీ నిబంధన. కొత్తవాళ్లకు, అంతగా పాపులార్టీ లేనివాళ్లకు కూడా టికెట్ ఇచ్చారు. వాళ్లు గెలుస్తారనుకుంటున్నారా? మన రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవ్వరైనా అభ్యర్థిగా నిలబడొచ్చు. గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టి 2, 3 లక్షల జీతం కోసం ఎవరైనా పనిచేస్తారా? అంత ఖర్చు పెట్టి ఓట్లు కొని, రాజకీయాన్ని బిజినెస్ చేసేశారు. 100, 200 కోట్లు ఖర్చు పెడతాను. దానికి డబుల్ సంపాదిస్తాను అన్నట్టు ఉంటారు. పార్టీ ఫండ్స్ కూడా అలానే ఉంటాయి. వాళ్లనుంచి అవినీతి లేని రాజకీయం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? బేసిక్ ప్రాబ్లమ్ ఈ స్ట్రక్చర్, మనీ. నా ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ ద్వారా అవన్నీ పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేకపోయినా ఎవ్వరైనా వచ్చి రాజకీయాల్లో నిలబడ వచ్చని మన రాజ్యాంగం చెప్పింది. మనకు కావాల్సింది ఓ రిపోర్టర్లా పని చేయాలి. కానీ మన మైండ్‌ని ఎలా సెట్ చేశారంటే... ఇక్కడికి వచ్చేవాళ్లు పెద్ద మనిషి అయ్యుండాలి, అనుభవం కలిగి ఉండాలని. రాజకీయాల్లోకి రావడం ద్వారా మీరు ప్రజలకు చెప్పాలనుకున్నదేంటి? నేను గెలవడం, నా అభ్యర్థి గెలవడం కాదు. మీరు (ప్రజలు) గెలవాలి. సర్వెంట్స్‌ను తీసుకోండి మీరు. లీడర్స్ వద్దు మీకు. పెద్ద మనిషిని గెలిపిస్తే వాళ్ల ఇంటికి మీరు వెళ్లాలి. చిన్నవాళ్లను గెలిపిస్తే వాళ్లు మీ ఇంటికి వచ్చి, సమస్యలు తెలుసుకుంటారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే రాజులు. ఇప్పుడు రాష్ట్రం మన ఇల్లు అనుకుంటే.. మన ఇంటి పనుల కోసం వర్కర్స్‌ని పెట్టుకుంటాం. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సెక్యూరిటీ.. వీళ్లతో ఎలా పనులు చేయించుకుంటామో రాజకీయాల్లో ఉన్నవాళ్లతో కూడా అలానే పనులు చేయించుకోవాలి. కానీ మనం ఓట్లు వేసి గెలిపించి, మనం ట్రాఫిక్‌లో ఉండిపోయి వాళ్లను జీరో ట్రాఫిక్‌లో పంపిస్తాం. దీన్ని మించిన ట్రాజెడీ ఉందా? బ్రిటీష్ వాళ్లు పరిపాలించినప్పుడు మనపైన కూర్చున్నారు. వాళ్లు వెళ్లి, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు వీళ్లు కూడా పైన కూర్చుంటా అంటే? ఇంకా మనం రోడ్డులోనే ఉన్నాం. యూత్‌కి రాజకీయాలంటే అసహ్యంగా ఉంది. అందుకే వాళ్లకు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాను. డబ్బు ఖర్చు పెట్టకపోతేనే సరైన పాలన జరుగుతుంది. డబ్బులు పెట్టుబడిగా పెడితే నేనూ ఆ డబ్బు వెనక్కి తెచ్చుకునే మార్గం ఆలోచిస్తాను. అందుకే మా పార్టీలో ఎవర్నీ ఖర్చు పెట్టొద్దన్నాను. నేనూ మినిమమ్ ఖర్చే పెట్టా. పోలింగ్ అయిపోయింది. మీ పార్టీ రిజల్ట్ గురించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? బాగా సపోర్ట్ చేశారు. అయితే గెలుపోటముల గురించి ఆలోచించలేదు. ఓడిపోతే తలెత్తుకొని జీవిస్తాను. గెలిస్తే తల దించుకొని పనిచేస్తానని డిసైడ్ అయి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే గెలుపోటములు కానే కాదు. పాల్గొనడం.. అంతే. నేను కర్మణ్యే వాదికారస్తే...ని ఫాలో అవుతాను. మీ పార్టీలో వాళ్లకి డ్రెస్ కోడ్ పెట్టాలన్నది ఎవరి ఆలోచన? మదర్ థెరిస్సాగారు ఏదీ ఆశించకుండా సేవ చేశారు. కానీ డబ్బులు తీసుకొని వీళ్లు చేసింది సేవ ఎలా అవుతుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. నాయకులు ‘లీడర్స్’ అంటే వాళ్ల ఇంటి నుంచి డబ్బులు తెచ్చి ఫ్లై ఓవర్, రోడ్స్ కట్టలేదు. జనం డబ్బు అది. నో సర్వీస్.. నో లీడర్స్. అక్కడున్నది ఓన్లీ వర్కర్స్ మాత్రమే. అందుకే ఖాకీ పెట్టాం. మీరు ప్రచారానికి ఖాకీ డ్రెస్‌లోనే వెళ్లారా? లేదు. నేను ఎంపీగా పోటీ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి నేను రాజా (నవ్వుతూ). ఎమ్మెల్యేగా గెలిచాక వర్కర్ని అవుతాను. పాలిటిక్స్‌ను మారుద్దాం అనుకున్నవాళ్లల్లో చాలామందిని పాలిటిక్స్ మార్చేస్తుందని, పొల్యూట్ చేస్తుందని అంటుంటారు. మీరు అలా పొల్యూట్ అయిపోతారన్నది కొందరి ఊహ? ఇక్కడ ఒక మాట చెప్పనా.. ‘ఏ ఫర్ అంటే యాపిల్’ అని మనల్ని ట్రైన్ చేశారు. అలా కాకుండా ఏ ఫర్ ఏంటి? అని మీ అంతట మీరు ఆలోచించండి చెప్పండి అంటే అమెరికా అనో అంటార్కిటికా అనో చెప్పేవాళ్లు. ఇప్పుడు 20 పర్సంట్, 80 పర్సంట్ సైకాలజీ గురించి వివరిస్తాను. మన దగ్గర 20 శాతం మందిమి మాత్రమే మాట్లాడతాం. మిగిలిన 80 శాతం మందికి వాయిస్ లేదు. ఆ 20 శాతం మంది రాజకీయాలంటే ఇలా ఉంటాయి, ఇక్కడికి రాకూడదు అని 72 ఏళ్లుగా చెప్పినదే చెప్పీ చెప్పీ ఓ అభిప్రాయాన్ని రుద్దేశారు. రాజకీయాలు డబ్బులు ఉండేవాళ్లవి అని మన బ్రెయిన్‌కు ఫీడ్ చేశారు. పొల్యూట్ అయిపోతారనే భావనను కూడా బలపరిచారు. నేను ఓ కొత్త ప్రయత్నం చేయడానికి వచ్చాను. నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఏమవుతుందో చూద్దాం. సినిమాల్లోంచి వచ్చిన వారిలో తెలుగు నాట ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా రూల్ చేశారు. భవిష్యత్తులో మీరు కన్నడ రాష్ట్రాన్ని రూల్ చేస్తారని అనుకుంటున్నారా? లేదు. నేను ఇక్కడ రూల్ చేయడానికి రాలేదు. మీరు (ప్రజలు) రూల్ చేయండి అని చెప్పడానికి వస్తున్నాను. నేను చేసేది రాజకీయం కాదు, ప్రజాకీయం. మీరు (ప్రజలు) కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఒక్కరోజు ప్రజాస్వామ్యం మనకు వద్దు. స్విట్జర్లాండ్‌లో జనాల అభిప్రాయాలు తీసుకుంటారు. అక్కడ అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా జీతానికి పని చేస్తున్న వర్కర్లా చేస్తారు. ఇక్కడ కూడా నాతో సహా ఒక వర్కర్లా మారిపోవాలి. వర్క్ చేయాలి. అన్నీ పారదర్శకంగా జరగాలి. ఓటర్స్ కూడా ఇందులో భాగం అవ్వాలి. నేను చేయబోయేది రెగ్యులర్ పాలిటిక్స్ కాదు. అసలెందుకు పాలిటిక్స్‌లోకి రావాలనుకున్నారు? జనాలకు మంచి చేయాలని కాదు. నేనో సిటిజన్ని. బాధ్యత గల పౌరుడిగా నా సొసైటీని బాగు చేయాలని వస్తున్నాను. అది పొలిటికల్ పార్టీ పెట్టకుండా కుదరదా? పవర్ కావాలా? ఇది ఒక మైండ్‌సెట్. ఇందాక ‘ఏ ఫర్ యాపిల్’ కథ చెప్పాను కదా. ఇది కూడా అలాంటిదే. మనం ఎలా ఆలోచించాలో నిర్ధేశించేశారు. అలాగే పాలిటిక్స్ అనేది సోషల్ వర్క్ కాదని డిసైడ్ చేసేశారు. మరి రాజకీయాలంటే ఏంటి? వ్యాపారమా? ఇది సమాజ సేవ కాదా? నేను సోషల్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్ వర్క్ అంటే ఏదో ఊళ్లో బస్టాండ్ కట్టించుకో, నీళ్ల ట్యాంక్ కట్టించుకో అంటున్నారు లేదా ఊరినే అడాప్ట్ చేసుకో అంటున్నారు. అసలు రాజకీయం అంటేనే సోషల్ వర్క్ కదా. మనం అందరం ట్యాక్స్ కడుతున్నాం. మీరు ట్యాక్స్ రూపంలో ఖర్చు చేసిన డబ్బుని మళ్లీ మీకు ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మెయిన్ ఎజెండ్ అవ్వాలి. నా లక్ష్యం అదే. దీనివల్ల యంగ్‌స్టర్స్ వస్తారు. విద్యావేత్తలు, అట్టే చదువుకోనివాళ్లు.. ఇలా అందరూ సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తే అందరం కలసి అద్భుతాలు సృష్టించవచ్చు. సినిమా, పాలిటిక్స్ రెండు పడవల ప్రయాణమా? ఇది ఇంకో మైండ్‌సెట్. మీరు వస్తే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి, అప్పుడప్పుడు వచ్చి పోతే కష్టం అని అంటుంటారు. నేను బతకడానికి సినిమాలు చేయాలి. దాంతోపాటు రాజకీయాలకు ఓ టైమ్ కేటాయిస్తాను. సినిమాలు చేసుకుంటూ, ఇక్కడ ఏదైనా పని ఉందంటే వచ్చి పూర్తి చేస్తాను. ప్రజాకీయాల్లో నాకు పని కలిపిస్తే నేను పూర్తి స్థాయిలో రావొచ్చు. కానీ ఇంకా నాకు ఓట్ వేయలేదు. నేను పవర్లోకి రాలేదు. అప్పుడే సినిమాలు మానేస్తా అనకూడదు. నా ఇండస్ట్రీలో నేను కింగ్ అయ్యుండొచ్చు. రూలింగ్‌లోకి వచ్చాక వర్కర్ని. కానీ ప్రస్తుతం మాత్రం గెలిచే వరకూ వర్కర్లా ఉండి గెలిచాక నాయకుడు అయిపోతున్నాడు. ఓట్ వేసిన తర్వాత వర్కర్ అనే ‘మైండ్‌సైట్’ పోకూడదు. ఓకే.. ‘ఐ లవ్ యూ’ అనే టైటిల్‌తో.. ‘నన్నే ప్రేమించు’ అనే ట్యాగ్‌లైన్‌తో త్వరలో స్క్రీన్ మీదకు రానున్నారు... మీ కాలేజ్ రోజుల్లో ఎవరితో అయినా ‘నన్నే ప్రేమించు’ అని చెప్పారా? (పెద్దగా నవ్వుతూ). ప్రేమను చెప్పడానికే భయపడేవాణ్ణి. ఇక ప్రేమించు అని చెబితే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో, స్నేహం ఎక్కడ కట్ అవుతుందో అని భయపడేవాణ్ణి. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో సునాయాసంగా నటించేస్తాను. రియల్ లవ్‌లో మన లోపల చాలా భయం ఉంటుంది. ఒకవేళ లవ్ ఎక్స్‌ప్రెస్ చేశాక తను మాట్లాడకపోతే? దూరం పెడితే? డిజప్పాయింట్ అయిపోతాను. యంగ్ ఏజ్‌లో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అందులో దురుద్దేశాలేమీ ఉండవు. ఆ ప్రేమలో నిజాయతీ ఉంటుంది. కానీ చెప్పేంత ధైర్యం ఉండేది కాదు. అందుకే చెప్పకుండా నేను కవితలు రాసేవాణ్ణి. మీది లవ్ మ్యారేజే కదా.. ప్రియాంకాగారితో చెప్పడానికి ఎలా ధైర్యం వచ్చింది? ఇక తను లేకపోతే మన జీవితం లేదు అనేంతగా ప్రేమించేశాను. ఆ ప్రేమే నాకు ధైర్యం ఇచ్చింది. అయినప్పటికీ ‘ప్రేమిస్తున్నాను’ అని ప్రియాంక దగ్గర చెప్పడానికి ఏడాదిన్నర సమయం తీసుకున్నాను. చెప్పాలా వద్దా? అనుకుంటూ చివరికి చెప్పేశా. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ లాంటి ఇప్పటి బోల్డ్ సినిమాలను 20 ఏళ్ల క్రితమే మీరు తీశారు. ఆ టైమ్‌లో వివాదాలు కూడా ఎదుర్కొన్నారు? మంచి విషయమే చెప్పాంగా! ఎందుకు వివాదం అవుతోంది? అనుకునేవాణ్ణి. అర్థం అయ్యేది కాదు. సమాజానికి చెప్పాల్సిన విషయం చెబితే ఇలా రివర్స్‌గా తీసుకుంటున్నారేంటి? అనే ఫీలింగ్ కలిగేది. సినిమాల్లో నన్ను నేనే తిట్టుకుంటూ మంచి విషయాలు చెప్పేవాణ్ణి. అయితే ఓ 20 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయాలను ముందుగానే చెప్పేసరికి షాకయ్యారు. విడిగా నన్ను చూసినవాళ్లూ షాకయ్యారు. నాతో మాట్లాడాక ‘మీరు మీ సినిమాల్లో పాత్రల్లానే ఉంటారేమో? అనుకున్నాం. మరీ ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి?’ అని ఆశ్చర్యపోయేవాళ్లు. ‘లేదండీ.. సినిమాల్లో చూపించేవి జస్ట్ నా ఆలోచనలు మాత్రమే’ అనేవాణ్ణి. అప్పట్లో మీరు ‘ఏ’ సినిమాలోనే ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి డిస్కస్ చేశారు. ఆ ఇష్యూ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అలాంటివి ఏమైనా సంఘటనలు విని లేదా చూసి ఆ సినిమా తీశారా? ‘మీటూ’ అనేది ఇప్పుడు మొదలైంది కాదు కదా. స్త్రీలను వేధించడం అనేది రాజుల కాలం నుంచీ ఉన్నదే. ‘రేప్’ అన్న పదం ఈనాటిది కాదు. ఎప్పుడో ఉంది. ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ స్త్రీకి వేధింపులు తప్పవు. నేను అంటున్నది తప్పుడు మనస్తత్వం ఉన్న పురుషుల గురించి. సినిమా ఇండస్ట్రీ ప్రభావంతో మాత్రమే ‘ఏ’ తీయలేదు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నవాటిని కూడా దృష్టిలో పెట్టుకునే ‘ఏ’ కథ రాశాను. దర్శకుడిగా నా ఆలోచనలను స్క్రీన్ మీద చూపించాను. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఓపెన్ అవుతున్నారు. ఇప్పుడొస్తున్న కొన్ని సినిమాల్లో విచ్చలవిడితనం పెరిగినట్లనిపిస్తోంది. మీ అభిప్రాయం? గుట్టుగా ఉండటం అనేది ఇప్పుడు దాదాపు లేదు. కుతూహలం ఉంటేనే అక్కడ ఏదో ఉందన్న ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా చూడొచ్చు. చూసిన తర్వాత ఇంతేనా అని వదిలేస్తాం. ఏదైనా మోతాదు మించితే ప్రమాదమే. సైన్స్ అనేది మనల్ని సత్య యుగంలోకి తీసుకుపోతోంది. ఇప్పుడు నా భార్యతో నేను ముంబైలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడానికి కుదరదు. వీడియోకాల్ చేస్తుంది. ఎక్కడున్నావు చెప్పు అని? ఫ్యూచర్లో అబద్ధం చెప్పలేం. మన రోజుల్లో స్కూల్ బంక్ కొడితే ఓకే. ఇప్పుడు స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. టెక్నాలజీ మనల్ని నిజం వైపు తీసుకువెళ్తుంది. అయితే అదే టెక్నాలజీ మనుషులను దూరం చేస్తోంది కదా? కాదన్నది నా అభిప్రాయం. ఫ్యూచర్ జనరేషన్ వాళ్లు దూరంగా ఉన్నా ఫేస్ టైమ్‌లో లైవ్‌లో మాట్లాడుకుంటారు. దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మనకు కారు లేదు. ఇప్పుడు చూడండి అందరూ కారులో తిరుగుతున్నారు అనుకుంటే కుదరదు. హల్లో... సాంకేతికాభివృద్ధిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటాను. ఇంతకు ముందు ఫ్యామిలీని మిస్ అయ్యేవాళ్లం. ఇప్పుడు ఎక్కడున్నా వీడియోకాల్ చేస్తే చాలు.. భార్యాపిల్లలు హాయిగా మాట్లాడతారు. అప్పట్లో అవుట్డోర్ అంటే.. ఇంటిని మిస్సయినట్లే. ఇప్పుడు వీడియో కాల్ వల్ల మిస్ అయిన ఫీలింగ్ ఉండదు. సో.. టెక్నాలజీ మనుషులను దగ్గర చేస్తోందంటాను. కమ్యూనికేషన్ బాగా పెరిగినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు ఒకేచోట ఉన్నా ఎవరి ఫోన్లతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల నేరుగా మాట్లాడుకోవడం తగ్గింది కదా? మీరు మొబైల్ లేకుండా ఒక్కరోజుని ఊహించుకోండి. పిచ్చి లేచిపోతుంది. అట్లీస్ట్ ఏదో ఓ దాంట్లో మునిగిపోతారు. భార్య–భర్త, అత్తా–కోడలు ఏదో పనిలో బిజీగా ఉంటారు. గొడవల్లోకి వెళ్లరు కదా (నవ్వుతూ). ఏది జరిగినా మంచి కోసమే. మన ఐడియాలజీని మన కిడ్స్ మీద రుద్దుతూ ఉంటాం. అది తప్పు ఇది తప్పు అని. నిజమేంటంటే వాళ్ల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అలాగే పిల్లలకు కష్టం నేర్పాలి. ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపో, లేదంటే మరోలా సెటిల్ అయిపో అని చెబుతుంటాం. నేను చాలా కష్టపడి బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ నడిపే కిక్ ఎలా ఉంటుంది? కానీ ఆ హ్యాపీనెస్‌ని మనం కష్టం తెలియకుండానే మనం మన పిల్లలకు ఇచ్చేస్తాం. ఆ హ్యాపీనెస్ సులువుగా లభిస్తుంటే కష్టపడకుండా కొత్త కొత్త అలవాట్లు అలవాటు చేసుకునే అవకాశం ఉంది. రేపు వాళ్లు కూడా నేనింత కష్టపడి ఇది సొంతం చేసుకున్నాను అని ఫీల్ అవ్వాలి. కానీ మీ పిల్లలు హైఫై లైఫే లీడ్ చేస్తుంటారు కదా? కొన్నిసార్లు మనం అనుకున్నది కుదరకపోవచ్చు. అవును.. వాళ్లు కంఫర్ట్బుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ వాళ్లకు ప్రైవసీ అనేది ఉండదు కదా. బయటకు ఎక్కువగా రాలేరు. అవన్నీ వాళ్లు మిస్ అవుతారు. కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్లీ... ఒకప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదించాలని వచ్చుంటారు. ఇప్పుడు డబ్బు, ఫేమ్ ట్రాష్ అనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? నేను డబ్బు సంపాదించాలని రాలేదు. డబ్బులు సంపాదించాలనుకుంటే డబ్బులు సంపాదించలేం. నేను బతకాలని వచ్చాను. నాకు ఎవరైనా భోజనం పెడితే అదే నా హ్యాపీనెస్. జీరో నుంచి స్టార్ట్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే సంతోషం. నేను రాసింది వింటే ఇంకో రేంజ్ హ్యాపీనెస్. అదే నేను రాసింది తీసుకుంటే మహానందం. డబ్బు కూడా ఇస్తే అయ్యో... ఇంక చెప్పలేను. ఆనందం.. ఆనందం.. జీరోలో ఉంటే ఎన్ని కిక్కులో చూడండి. అదే మా నాన్న బాగా ధనవంతుడు అయితే... నేను రాసిందానికి ఐదొందలే ఇస్తారా? ఏంట్రా నా వేల్యూ తెలుసా నీకు? అనుకుంటాను. నటుడు అర్జున్ తనను వేధించాడంటూ కథానాయిక శ్రుతీ హరిహరన్ ఆరోపించారు. ఈ ఇద్దరితో మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏమనిపించింది? నాకు ఇద్దరి గురించి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలు విన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. అర్జున్ అలా చేస్తాడని ఊహించలేను. శ్రుతి అన్నా నాకు నమ్మకమే. ఇలాంటి పరిస్థితిలో మనకేమీ అర్థం కాదు. నేను అలానే అయ్యాను. ఆ ఇష్యూ మీద చాలా గొడవ జరిగింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. ఒకప్పుడు బతుకు తెరవు కోసం ‘పేపర్ కవర్స్’ తయారు చేసేవారు. ఇప్పుడు కోటీశ్వరుడు. డబ్బు, పేరు ఉన్నాయి. ఇంకా ఏదైనా అచీవ్ చేయాలని ఉందా? నేను అచీవ్ చేయాల్సింది ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ వరకూ వచ్చింది ‘ప్రజాకీయ పార్టీ’ పెట్టి, రాజకీయాల్లోకి రావడానికే అనుకుంటున్నాను. ఇంత ఎత్తుకి ఎదగడానికి ‘జీరో’ నుంచి మొదలయ్యాను. ఇప్పుడు పాలిటిక్స్‌లో జీరో నుంచి మొదలవుతున్నాను. ‘క్యాష్‌లెస్’ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నా. జీరో నుంచి మొదలుపెడితే ప్యూర్‌గా ఉంటుంది. డి.జి. భవాని -
‘అలా అయితే పార్టీ పెట్టేవాడిని కాదు’
బెంగళూరు : పాలకులు సక్రమమైన పాలన సాగించి ప్రజా సమస్యలు పరిష్కరించి ఉంటే తనకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది కాదని ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర అన్నారు. అదివారం ఆయన స్థానిక పాత్రికేయల భవనంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ,జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్పీలు డబ్బు ఏర చూపి ఓటర్లను కొనుగోలు చేసేందుకు తాపత్రయ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు నిజాయితీగా పాలన చేసి ఉంటే తాను ప్రజలు ముందుకు వచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను పార్టీని ఏర్పాటు చేశానన్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు గ్రామీణ లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రజాకీయ పార్టీ అభ్యర్థి మంజునాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అధికారం ఇచ్చి వారి కోసం పనిచేయడమే ప్రజాకీయ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లినా వారి స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారని, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. -
ప్రజలకే అధికారం మా పార్టీ సిద్ధాంతం
దొడ్డబళ్లాపురం: ప్రజలకు అధికారం ఇచ్చి వారి కోసం పనిచేయడమే ప్రజాకీయ పార్టీ సిద్ధాంతమని సినీహీరో,ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర అన్నారు. రామనగరలో బెంగళూరు గ్రామీణ లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రజాకీయ పార్టీ అభ్యర్థి మంజునాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కోసం విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లినా వారి స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారని, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. డబ్బు, స్వార్థం, స్వజనపక్షపాతం, దౌర్జన్యంతో రాజకీయాలు నడిచినంత కాలం ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అధికారం దక్కదన్నారు. మొదట ప్రజలు మారితే రాజకీయ వ్యవస్థ కూడా మారుతుందన్నారు. రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాల్లోనూ ప్రజాకీయపార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్నారన్నారు. గెలుపు, ఓటములు తమకు ముఖ్యం కాదని, వంద ఓట్లు పడ్డా వందమంది తమ పార్టీని ఆదరించారని సంతోషిస్తా మన్నారు. పార్టీ సిద్ధాంతాలతో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అనివీతి అరికట్టడానికి లోక్‌పాల్ అవసరమని, అయితే అదే లోక్‌పాల్‌లోని అధికారులే అవినీతికి పాల్పడరని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. కావున ప్రజలే అవినీతిని అంతమొందించాలని పిలుపునిచ్చారు. -
కొత్త సినిమాలకు కోడ్ దెబ్బ?
కొన్నినెలల కిందట శాండల్‌వుడ్‌ను లైంగిక వేధింపుల మీ టూ సంక్షోభం కుదిపేయడం తెలిసిందే. తాజాగా సార్వత్రిక ఎన్నికల నియమావళి చిత్రసీమకు నిద్ర లేకుండా చేస్తోంది. నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే నటీనటుల చిత్రాలను కోడ్ సమయంలో విడుదల చేయడానికి వీల్లేదు. ఫలితంగా ఈ ఏప్రిల్‌లో రాబోయే పలు భారీ సినిమాలు బాక్సుల్లోనే ఉండిపోవచ్చు. సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌కు ఎన్నికల కోడ్ సెగ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయదలచిన నటుల సినిమాల విడుదలకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. ఉపేంద్ర, ప్రకాశ్‌రాజ్, సుమలతా, నిఖిల్ నటించిన సినిమాలు ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీరు నటించిన చిత్రాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఏయే సినిమాలు ♦ ఉపేంద్ర నటించిన ‘ఐ లవ్ యూ’, సుమలతా అంబరీశ్ నటించిన ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’, నిఖిల్ కుమార, దర్శన్ కాంబినేషన్లో‘కురుక్షేత్ర’, ప్రకాశ్ రాజ్ నటిస్తున్న కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది. ♦ ఉపేంద్ర చిత్ర ‘ఐ లవ్ యూ’ చిత్రాన్ని మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు నిర్మాత, దర్శకుడు ఆర్.చంద్రు సిద్ధమవుతున్నారు. కోడ్ నేపథ్యంలో విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. తెలుగులో ఆలస్యమయినా ఫర్వాలేదు కానీ కన్నడలో విడుదల ఆసల్యమైతే ఇబ్బందులు తప్పవని నిర్మాత యోచనలో పడ్డారు. ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ ద్వారా ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీని నిలపబోతున్న సంగతి తెలిసిందే. ♦ సీఎం తనయుడు నిఖిల్ మండ్య లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీకి నిలబడడం దాదాపు ఖాయమైంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కురుక్షేత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. ♦ సుమలత నటించిన ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. ఆమె ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. పోటీపై సందిగ్ధం కొనసాగుతోంది. దీంతో చిత్ర విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రకాశ్‌రాజ్ సినిమాలు సైతం బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్నారు. ఆయన నటించిన కొన్ని తెలుగు, తమిళ ప్రముఖ చిత్రాలు విడుదలపై జాప్యం నెలకొంది. చాలా చిత్రాల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలు నటించినవే కావడం విశేషం. ఆ చిత్రాలు కర్ణాటకలోనూ విడుదలయ్యేవే. ఎన్నికల నియమావళితో వీటికి బ్రేక్‌పడే అవకాశముంది. -
జీరో నుంచి మొదలయ్యా
‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి, పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అవుతున్న టైమ్. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత ‘ఆర్య’ స్క్రిప్ట్ చూసినప్పుడు ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్ చేశారు? అనేది చూశాను. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన చిత్రం ‘ఐ లవ్ యు’. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్. రచితారామ్ హీరోయిన్. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘పెద్ద మనుషులు ఉంటేనే ఇండస్ట్రీ మరింత పెద్దది అవుతుంది. ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకులు, రచయితలు మా ఫంక్షన్‌కి వచ్చి, నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్స్పైర్ అవుతున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. నా సీక్రెట్ ఒక్కటే... నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశా. రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 80 శాతం మంది ఇన్నోసెంట్ పీపుల్ని 20 శాతం మంది రూల్ చేస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను’’ అన్నారు. ‘‘నన్నే.. ప్రేమించు’ లాంటి ట్యాగ్ ఉపేంద్రగారికి మాత్రమే సరిపోతుంది. ‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ మూవీస్ జాబితాలోకి ఈ సినిమా చేరుతుంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ‘‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలకి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలిగేది. ఉపేంద్ర, పూరి జగన్నాథ్‌గార్ల ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది’’ అని దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి అన్నారు. ‘‘నన్ను తెలుగుకు పరిచయం చేసిన లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. ఇండియాలో టాప్ టెన్ దర్శకుల్లో ఉపేంద్రసార్ ఉంటారు అని డైరెక్టర్ శంకర్‌గారు ఓ సందర్భంలో చెప్పారు. అటువంటి గొప్ప దర్శకుణ్ణి రెండోసారి దర్శకత్వం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కథ విన్న ఉపేంద్రగారు ‘ఇది ఒక ‘గీతాంజలి’ అవుతుంది’ అన్నారు’’ అన్నారు ఆర్. చంద్రు. హీరో సుధాకర్ కోమాకుల, నటి సంజన, హైకోర్టు లాయర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మునీంద్ర కె. పుర, కెమెరా: సుజ్ఞాన్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ సూర్య, సంగీతం: డా. కిరణ్. -
ఉపేంద్ర 'ఐ లవ్ యూ' టీజర్ విడుదల
-
ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు స్వస్తి
యశవంతపుర: లోకసభ ఎన్నికలలో గెలిస్తే సినిమాలకు స్వస్తి చెబుతానని ప్రముఖ నటుడు, ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర తెలిపారు. ఆయన ఆదివారం దావణగెరెలో విలేకర్లతో మాట్లాడారు. గెలిచిన తరువాత తను ప్రజల సేవకుడిని అవుతానన్నారు. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలలో మాత్రమే నటిస్తాన్నారు. గెలిచిన తరువాత తాను సినిమాలలో నటించటం సాధ్యంకాదన్నారు. రాజకీయాల కోసం సినిమాలను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 28 స్థానాలలో పోటీ చేయాలని అనేక మంది ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్న రాజకీయాలలో మార్పులు తెచ్చి నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు.రిటైర్డు ఐఎఎస్, కెఎఎస్ అధికారులతో ఒక సమితి రచించి మేనిఫెస్టోను తయారు చేస్తామన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం
సాక్షి, బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతామని ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత, బహుభాషా నటుడు ఉపేంద్ర శనివారం బెంగళూరులో ప్రకటించారు. తమ ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)కి ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందన్నారు. తాను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఎవ్వరైనా పార్టీ ఎంపిక విధానంలో గట్టెక్కితేనే టికెట్ ఇస్తామని తెలిపారు. టికెట్ ఆశిస్తున్న 20 మంది దరఖాస్తులను ప్రస్తుతం పార్టీ పరిశీలిస్తోందని చెప్పారు. 2017లో కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీలో చేరిన ఆయన అంతర్గత విభేదాల కారణంగా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. -
యూపీపీ.. ఉపేంద్ర కొత్త పార్టీ
సాక్షి బెంగళూరు: విలక్షణ నటుడు ఉపేంద్ర కొత్త పార్టీని ప్రారంభించారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)తో సరికొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కేపీజేపీ)కి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ ఏర్పాటుపై ఉపేంద్ర దృష్టి సారించారు. పాలనలో జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ఉత్తమ ప్రజాకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రియల్‌స్టార్ ఉపేంద్ర మంగళవారం తన 51వ పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ తన నివాసంలో పార్టీని, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కులం, డబ్బు, వర్గం, ఆయుధాలను విడిచి జావాబుదారితనంతో కూడిన పాలన అందించడమే తమ పార్టీ ఆశయమని ఉపేంద్ర చెప్పారు. పల్లె, గ్రామం, నగరం తదితర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను మొబైల్‌తో చిత్రీకరించి పార్టీ వెబ్‌సైట్‌కు పంపించాలని సూచించారు. తాము ఆ వీడియో చూసి మేధావులతో చర్చించ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరేవారికి పరీక్ష దూరదృష్టి కలిగి, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతామని తెలిపారు. పార్టీలో చేరేవారికి తొలుత లిఖిత పరీక్ష నిర్వహిస్తామని ఉప్పి చెప్పారు. త్వరలోనే యాప్ విడుదల చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఆలోచించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు ముగ్గురి పుట్టినరోజు.. మంగళవారం కన్నడ చిత్రసీమలో ఒకేరోజు ముగ్గురు నటుల పుట్టినరోజు. దివంగత విష్ణువర్ధన్, రియల్‌స్టార్ ఉపేంద్ర, నటి శృతి పుట్టినరోజులు జరిగాయి. బెంగళూరులో విష్ణువర్ధన్ సమాధి వద్ద అభిమానులు పెద్దెత్తున పుష్పాంజలి ఘటించారు. రక్తదానం, అన్నదానం నిర్వహించారు. -
నటుడు ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, యశవంతపుర : రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావిస్తున్న ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు, నటుడు ఉపేంద్ర రాష్ట్ర బడ్జెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యుత్, పెట్రోల్ వంటి వాటిపై పన్నులు వేసి సీఎం కుమారస్వామి ప్రభుత్వం పేదలపై నేరుగా భారం మోపిందని విమర్శించారు. కొత్త బడ్జెట్‌తో సామాన్యులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు చేశారు. 20 శాతం బుద్ధిఉన్న మూర్కులు మాత్రమే బడ్జెట్‌పై మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి సమస్యలపై నోరు విప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ అనేది రాజకీయ పార్టీనే. మార్పును కోరుకునే ఎవరైనా ఇందులో చేరవచ్చు. ప్రజాకీయ పార్టీ కోసం విలువైన సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తానని’ ఉపేంద్ర ట్వీట్ చేశారు. ఆయన చేసిన మరిన్ని ట్వీట్లు వైరల్‌గా మారాయి. ఓవైపు రాజకీయ అరంగేట్రం అంటూనే మరోవైపు ఉపేంద్ర మళ్లీ సినిమాల్లో తలమునకలయ్యారు. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలని, డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలని ఉపేంద్ర ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాని వ్యక్తులు ఇలా అవగాహనా లేని ఆరోపణలు, విమర్శలు చేస్తారని కూటమి నేతలు అంటున్నారు. ఉపేంద్ర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అధికార నేతలు సూచిస్తున్నారు. Please don’t think that UPP UTTAMA PRAJAAKEEYA PARTY is one more political party. This is your platform. Anybody wants to bring complete change use this. Give your valuable suggestions for PRAJAAKEEYA. — Upendra (@nimmaupendra) 6 July 2018 -
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
యశవంతపుర : రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు, నటుడు ఉపేంద్ర అభిమానులు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర ట్వీట్ చేసి కొందరికి చెవులను పిండారు. జరిగిందంత మంచికే జరిగిందంటూ బుధవారం జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేశారు. బీజేపీని ఆహ్వానించటంపై ఆ మాట అన్నారా లేక కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాక పోవటానికి ఆ మాట అన్నారా అనేది గందరగోళం నెలకొంది. -
రక్తికట్టని హీరో ఉపేంద్ర రాజకీయ అరంగేట్రం
సాక్షి, బెంగళూరు : ఉపేంద్ర అనగానే వెండితెరపై మనిషి మనస్తత్వాన్ని వివిధ కోణాల్లో విప్పిచెప్పే వినూత్న నటుడు గుర్తుకొస్తాడు. కన్నడనాట తనదైన సినిమాల ద్వారా రియల్ స్టార్‌గా పేరు పొందాడు. నిజజీవితంలోనూ హీరో అనిపించుకోవాలని ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడితే అది కాస్తా ఫ్లాప్ షో అయ్యిందని విమర్శలు మూటగట్టుకున్నాడు. అభిమానులు ఉప్పి అని ప్రేమగా పిలుచుకునే ఉపేంద్ర.. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష (కేపీజేపీ) పార్టీని గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించి అంతేవేగంగా పార్టీ నుంచి బయటకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజలకు సుపరిపాలన అందజేయాలనేదే తన పార్టీ లక్ష్యమని, ఈ 224 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని అప్పట్లో ధీమాగా ప్రకటించారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడతో కుమ్ములాటలు మొదలయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల పంపకంలో వీరి మధ్య వివాదం రాజుకుంది. పార్టీలో టికెట్లను కొంతమంది అమ్ముకుంటున్నారని ఉపేంద్ర ఆరోపించారు. ఉపేంద్ర నియంత మాదిరి వ్యవహరిస్తున్నారని, తనకు నచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మరో వర్గం నాయకులు ఆరోపించారు. ఈ విధంగా ఒకరినొకరు ఆరోపణల నేపథ్యంలో మార్చి 6న ఉపేంద్ర పార్టీకి రాజీనామా చేశాడు. విలువలు లేని చోట తానుండలేనని, త్వరలోనే కొత్త పార్టీ స్థాపిస్తానని ప్రకటించాడు. ప్రజాకీయ పార్టీకి పేరు నమోదు ఇటీవలే ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిసిన ఉపేంద్ర ప్రజాకీయ పేరుతో కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఏప్రిల్ నెలాఖరుకు రిజిస్ట్రేషన్ పూర్తి అయి తమ పార్టీ అందుబాటులోకి వస్తుందని ఆయన చెబుతున్నాడు. తమ పార్టీకి గుర్తింపు లభిస్తే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నాడు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని, ఎవరికీ ప్రచారం చేయబోనని ప్రకటించాడు. తమ అభిమాన నాయకుడు పోటీ చేస్తారని వేయికళ్లతో వేచిచూసిన అభిమానులకు నిరాశే ఎదురయింది. ఉప్పి తమ పార్టీలో చేరితే స్వాగతిస్తామని అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించాయి. సినిమాల్లో బిజీబిజీగా.. తరువాత ఉపేంద్ర మళ్లీ సినిమాల్లో తలమునకలయ్యాడు. వచ్చే వారం తన కొత్త సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన నటించిన ‘హోం మినిస్టర్’ చిత్రం చివరి దశలో ఉంది. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలని, డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలని ఉపేంద్ర ఇటీవల వ్యాఖ్యానించాడు. రియల్ స్టార్ పార్టీ ఇలా మంచి వినోదాన్నే పంచింది. -
ఆ పార్టీకో దండం
అంతా అనుకున్నట్లుగానే అయ్యింది. రాజకీయాల్లో ప్రజలే ప్రభువులని, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని, ప్రజా రాజకీయాలే నడపాలని ప్రకటిస్తూ కేపీజేపీని ఆరంభించిన హీరో ఉపేంద్ర ఆ పార్టీకో దండం పెట్టి బయటకు వచ్చారు. ఆ వెంటనే ప్రజాకీయ అనే మరో పార్టీకి ప్రాణం పోశారు. సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు ఉపేంద్ర కేపీజేపీ పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే చీలికలు ఏర్పడ్డాయి. గత ఏడాది అక్టోబర్ 31న బెంగళూరులో పార్టీ పురుడు పోసుకోవడం తెలిసిందే. వ్యవస్థాపకుడు మహేశ్‌గౌడ, పార్టీ అధ్యక్షుడు ఉపేంద్రల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో మంగళవారం నటుడు ఉపేంద్ర కేపీజేపీకి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికతో పాటు అనేక విషయాల్లో ఉభయుల మధ్య తీవ్ర పొరపొచ్ఛాలు వచ్చినట్లు తేలింది. మీరు సూచించిన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపితే కనీసం 20 ఓట్లు కూడా రాలవని మహేశ్‌గౌడ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నేతల వైఖరితో ఆవేదన చెందిన ఉప్పి గతకొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతర్గత విభేదాలు సోమవారం బహిర్గతం కావడంతో ఉపేంద్ర రాజీనామాకే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉపేంద్ర నగరంలోని రుప్పీస్ రిసార్ట్‌లో మీడియాతో మాట్లాడారు. కేపీజేపీ పార్టీతో ఇక తనకు ఎలాంటి సంబంధం లేదు, నేటితో కేపీజేపీతో బంధం తెగిపోయిందంటూ వాఖ్యానించారు. చివరిసారిగా మహేశ్‌గౌడకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించామని అయితే ఆయనకు పార్టీ శ్రేయస్సు, ప్రజాసేవ కంటే పబ్లిసిటీనే కావాలన్నట్లు అర్థమయిందని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, సొంతంగా ‘ప్రజాకీయ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించనున్నామని నేటి నుంచే ప్రజాకీయ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. తమతో పాటు తమ సిద్ధాంతాలు నచ్చిన మరికొంత మంది నేతలు,కార్యకర్తలు కూడా కేపీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ పార్టీలో చేరారన్నారు. మహేశ్‌గౌడపై ప్రియాంక విమర్శలు ఉపేంద్ర సతీమణి, నటి ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ఈ పరిణామాలతో ఉపేంద్ర ఇమేజ్ దెబ్బతింటుందని భయపడ్డామన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ అనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించడం ద్వారా ఉపేంద్ర మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. మహేశ్‌గౌడ ప్రవర్తన ఉపేంద్రతో పాటు తమను,పార్టీకి రాజీనామా చేసిన నేతలను కూడా ఎంతగానో బాధించిందన్నారు. కేపీజేపీ రాజీనామా చేసిన అనంతనం ఉపేంద్రకు కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని అయితే ఎటువంటి రాజకీయ చట్రంలో చిక్కుకోకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే కొత్త పార్టీని స్థాపించారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో దర్శకురాలు రూపా అయ్యర్, ముఖ్య అభిమానులు పాల్గొన్నారు. రూపా మాట్లాడుతూ మహేశ్‌గౌడ ఈ విధంగా ప్రవర్తించడం తమను కలచివేసిందని, అతని మనసులో ఇంత కుట్ర దాగి ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని అన్నారు. -
కన్నడ సూపర్ స్టార్‌తో...
‘అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తాన్యా హోప్. లేటెస్ట్గా కన్నడ ఇండస్ట్రీకు కూడా పరిచయం కాబోతున్నారీ మంగళూర్ భామ. అది కూడా మామూలు ఎంట్రీ కాదు కన్నడ టాప్ స్టార్ ఉపేంద్ర నటిస్తోన్న ‘హోమ్ మినిస్టర్’ సినిమా ద్వారా. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారు తాన్య. కన్నడ డెబ్యూ గురించి తాన్య మాట్లాడుతూ – ‘‘నేను సౌత్ ఇండియన్ అమ్మాయిని కాబట్టి సౌత్ లాంగ్వేజెస్‌లో కంఫర్టబుల్‌గా ఉండగలుగుతున్నాను. ‘హోమ్ మినిస్టర్’ సినిమాలో నేనో ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తాను. ఉపేంద్రగారి సినిమాలు చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. అలాంటి సూపర్ స్టార్ పక్కన నటించటం చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. షూటింగ్ మొదట్లో చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను కానీ ఉపేంద్ర గారు నన్ను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అయ్యేలా చూసుకున్నారు. నా డైలాగ్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి’’ అన్నారు. -
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా
సాక్షి,బెంగళూరు: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రము ఖ నటి హరిప్రియ స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ధర్మగిరి మంజునాథస్వామి దేవాలయంలో ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హరిప్రియ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే నిర్ణయించుకున్నామని ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి తరపున ప్రచారం చేయాల్లో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బహుభాష నటుడు ఉపేంద్ర స్థాపించిన ప్రజా పక్ష పార్టీ తరపున కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని, దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం మాత్రమే నిర్వహిస్తామని, తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన సొంత పట్టణం చిక్కబళ్లాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. -
టీజర్ టాక్ : ఎంటర్టైనింగ్ ఎమ్మెల్యే
సాక్షి, సినిమా : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’ కాగా.. మరొకటి ‘నా.. నువ్వే’ . ఇక సంక్రాంతి కానుకగా ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి... అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్, పృథ్వీ మధ్య డైలాగ్ ఫన్నీగా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా ‘ఎమ్మెల్యే’ రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మార్చిలో ఎమ్మెల్యే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
గుర్తుపట్టారా?
ఈ ముసుగు వెనకాల దాక్కున్న ఆ ముఖం ఎవరిది? ఏ హీరోయిన్ అయ్యుంటుందా? అని ఆలోచనలో పడ్డారా? జస్ట్ ఎ మినిట్. ఆ బ్యూటిఫుల్ ఫేస్ హీరోయిన్‌ది కాదు.. హీరోది. నమ్మలేకపోతున్నారా? ఒట్టండి బాబూ. ఇంతకీ ఈ హీరోగారు ఎవరంటే.. చెబుతున్నాం.. చెబుతున్నాం.. చెప్పేస్తున్నాం. ఆయనెవరో కాదు.. విలక్షణ నటుడు ‘ఉపేంద్ర’. లేడీ గెటప్‌లో భలే అందంగా ఉన్నారు కదూ. కన్నడంలో ‘హోమ్ మినిస్టర్’ అనే చిత్రంలో నటిస్తున్నారాయన. అంటే.. పొలిటికల్ మినిస్టర్ కాదు... ఇంటి మినిస్టర్ అన్నమాట. రాజకీయాలతో సంబంధం లేదు. సినిమాలో ఓ కామెడీ సీన్ కోసం ఉపేంద్ర ఈ వేషం వేశారు. సార్.. ఇరగదీసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
బడా నేతలు వద్దు.. ప్రజాసేవకులు కావాలి!
మైసూర్ : ప్రజల కోసం కష్టపడే వారే తన పార్టీలోకి రావాలే తప్ప.. రాజకీయ నేతలుగా ఎదగాలనుకునేవాళ్లు అవసరం లేదని కన్నడ స్టార్ హీరో, కేపీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర చెప్పారు. శుక్రవారం పార్టీ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడతారు. తర్వాత అధికారంలోకి కోట్లు కొల్లగొడతారు. నా పార్టీ మాత్రం అలాంటిది కాదు అని ఉపేంద్ర చెప్పారు. రాజకీయ నేతలు నాకు అవసరం లేదు. ఉదయం 9 నుంచి 6 గంటల దాకా పౌరుల కోసం పని చేయాలనుకుంటున్న వాళ్లు ఎవరైనా తన పార్టీలోకి రావొచ్చని ఉపేంద్ర చెప్పారు. తనది డబ్బులు తీసుకుని సీట్లు పంచే పార్టీ కాదని.. ఒక్క రూపాయి కూడా ఎన్నికల్లో పంచకుండా ప్రచారం చేస్తానని ఆయన అన్నారు. కుల రాజకీయాలకు తాను వ్యతిరేకమన్న ఉప్పీ.. ఎన్నికల్లో గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా కర్ణాటక పగ్న్ర్యావంత జనతా పక్ష ప్రజాకీయ పోటీ చేసి తీరుతుందని చెప్పాడు. మైసూర్ మహారాజ్‌తోపాటు మరికొందరు స్టార్లు కూడా తన పార్టీకి మద్దతు ప్రకటించారని.. అయితే వారు పార్టీలో చేరే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. త్వరలో వారి పేర్లను వెల్లడిస్తానని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటామని చెప్పిన ఆయన.. త్వరలో రాష్ట్రంలో ఇంటింటి పర్యటన చేపడతానని పేర్కొన్నారు. -
ఇది చదవొద్దు!
... హెడ్డింగ్ చూడగానే కచ్చితంగా చదివే తీరాలనిపిస్తోంది కదూ! ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? అందరిదీ ఓ దారి... నాదో దారి అనేట్లుగా ఉండే క్యారెక్టర్లు చేసే ఉపేంద్ర. ఆయన సినిమాలను చూసి, ‘తిక్క మేళం’ అనుకున్నా, ఆ సినిమాలను ఏంజాయ్ చేసేవాళ్లు చాలామందే ఉంటారు. ‘తిక్క మనిషి’ అని అభిమానంగా ఉపేంద్రను అంటుంటారు. ఈ తిక్క మనిషి జీవితంలో ఉన్న షేడ్స్‌ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఒక్క బుక్ కొంటే తెలుసుకోవడం వెరీ ఈజీ. ఆ పుస్తకం పేరు ‘ఇదన్ను ఓదబీడు’. అంటే.. ‘ఇది చదవొద్దు’ అని అర్థం. ఈ పుసకాన్ని స్వయంగా ఉపేంద్రే రాశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటి సంఘటనలు, ఆ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులు వంటి విశేషాలను ఉప్పీ ఈ బుక్ ద్వారా పంచుకున్నారు. అన్నట్లు ఇది ‘మినీ ఆటోబయోగ్రఫీ’ మాత్రమే. ఫుల్ బయోగ్రఫీని భవిష్యత్తులో రాస్తారేమో. ఆ సంగతి పక్కన పెడదాం. ఉపేంద్ర ‘చదవొద్దు’ అని చెప్పినా... కొని, మరీ చదువుతున్నారట. మార్కెట్లో ఈ బుక్ ఇప్పుడు హాట్ కేక్ అని సమాచారమ్. -
అందుకేనా? ఈ దూకుడు
ఇప్పటికే రమ్య, పూజాగాంధీ, రక్షిత, జయమాల, ఉమాశ్రీ తదితర అనేకమంది సినీ హీరోయిన్లు, నటీమణులు వెండితెరపై తళుకులీనడం పాత విషయమే. బాలనటిగా సినీ రంగంలో అడుగిడి, ఇటీవలే ఒక ఇంటిదైన 24 ఏళ్ల బెంగళూరు అమ్మాయి, అందాలతార అమూల్య రాజకీయాల్లో హిట్ కొట్టాలని చూస్తున్నారా?, లేదా భర్త రాజకీయ జీవితంలో చేదోడువాదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారా? ఆమె ఉత్సాహం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బొమ్మనహళ్లి: ఇప్పటికే కన్నడ సినిమా రంగంలో చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తున్నారు. కొంతమంది రాజకీయాల్లో కొనసాగుతుండగా మరికొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఇటీవలే రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తానని ప్రకటించడంతో అందరి కళ్లు సినీ–రాజకీయాలపై పడ్డాయి. కొంతకాలం కిందటే పెళ్ళి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కన్నడ ప్రముఖ నటి అమూల్య ఆ తరువాత సినిమాల వైపు చూడలేదు. అయితే ఆ అందగత్తె రాజకీయాల వైపు ఆసక్తిగా ఉన్నట్లు గాంధీనగరలో వినిపిస్తోంది. సోషల్ మీడియాలో హల్చల్ చెలువిన చిత్తార సినిమాతో హీరోయిన్గా పేరుపొందిన అమూల్య ప్రస్తుతం రాజకీయాల్లోకి రాకపోయినా, భర్త జగదీష్‌తో కలిసి అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటోంది. భర్తది రాజకీయ కుటుంబం. ఆయన బీజేపీ నాయకుడన్నది తెలిసిందే. వీరి నివాసం బెంగళూరు ఆర్ఆర్ నగర. అమూల్య తాను పాల్గొంటున్న అన్ని సేవా కార్యక్రమాలను తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. వీటన్నింటినీ చూస్తుంటే అమూల్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంది అని సన్నిహితులు కొందరు గట్టిగా చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ ఏదో ఒకచోట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే భార్య అమూల్యను అయినా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. అందుకే దంపతులు ఇద్దరు కలిసి ఇలా రాజకీయ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు గాంధీనగర పెద్దలు అంటున్నారు. ఒకవేళ భర్త జగదీష్ పోటీ చేసినా ఆయన కోసం, పార్టి కోసం అమూల్య పాటుపడక తప్పదు. అందుకే ఇప్పటినుంచే రాజకీయ, సేవా కార్యక్రమాలతో అనుభవం సంపాదిస్తోంది. -
నటుడు ఉపేంద్రపై కేసు
బనశంకరి : రియల్ స్టార్ ఉపేంద్ర కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ప్రారంభించే సమయంలో అవినీతిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఇక్కడి శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పార్టీ ప్రారంభ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఉపేంద్ర సమాదానమిస్తూ... ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్ గురువారం శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
రాజకీయ తెరపైకి ఉపేంద్ర
సాక్షి, బెంగళూరు: కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు. అన్ని సీట్లలో పోటీ చేస్తాం వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఉపేంద్ర తెలిపారు. ‘ఇక్కడ మీరు ఉపేంద్రను నమ్మాల్సిన అవసరం లేదు. నా సిద్ధాంతాన్ని నమ్మండి. ఇతర పార్టీల వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి. ఎందుకంటే అది మీ డబ్బే కాబట్టి. నేను ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్‌కళ్యాణ్ కాలేను. నేను ఉపేంద్ర లాగే ఉంటాను’ అని ఉపేంద్ర ఉద్వేగంగా మాట్లాడారు. -
రాజకీయ పార్టీ పెట్టిన కన్నడ స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తన రాజకీయ పార్టీ మంగళవారం ప్రారంభించారు. కర్ణాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష(కేపీజేపీ) పేరుతో తన పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. బెంగళూరులోని గాంధీ భవన్లో తన పార్టీని ఆవిష్కరించారు. పార్టీ పేరును ప్రకటించిన ఉపేంద్ర, ఇది కేవలం పార్టీ కాదని, ప్రజల కోసం తమ పార్టీ అని తెలిపారు. ''నేను కేవలం మీకోసం ఓ ప్లాట్‌ఫామ్‌ను సృష్టిచాను. ఇందులో చేరాలని ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వొచ్చు. మార్పు తీసుకురావడమే నా డ్రీమ్'' అని ఉపేంద్ర తెలిపారు. తమ పార్టీ వ్యక్తిత్వాలపై దృష్టిపెట్టదని, మంచి సమాజాన్ని ఏర్పాటుచేయడానికే తాము కృషి చేయనున్నట్టు చెప్పారు. ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే వాటిపైనే తమ కేపీజేపీ దృష్టిసారించనుందని వెల్లడించారు. విద్య, అందరికీ ఆరోగ్య బీమా, మంచి మౌలిక సదుపాయాలు, చిన్న గ్రామాలు, వ్యవసాయభివృద్ధి, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తమ జాబితాలో చేర్చారు. నవంబర్ 10న పార్టీ వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. సమాజాన్ని, రాష్ట్రాన్ని ఎలా మెరుగుపరచాలో తెలుపుతూ తమ ఆలోచనలతో ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ వంతు సహకరించాలన్నారు. 2018 లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేపీజేపీ పార్టీ పోటీ చేయనుందని, ఈ ఎన్నికలకు కేవలం ఆరు నెలలే సమయం ఉందన్నారు. మనం గెలవకపోవచ్చు కానీ మార్పు తీసుకురావడం మనం ప్రధాన ధ్యేయమని తెలిపారు. గత కొన్ని రోజులుగా తన రాజకీయ రంగ ప్రవేశంపై ఉపేంద్ర పలు ప్రకటనలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరే ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీ పేరు, ఇతర వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఆయన, మంగళవారం ఆ ప్రకటన చేసేశారు. -
ఉప్పీ రూపీ... క్లబ్లో పెప్పీ!
బ్యాంకాక్‌లో బ్రహ్మాండమైన క్లబ్ అది. క్లబ్‌లోకి ఎంటరైన ఉప్పీ... అదేనండీ ఉపేంద్రకు సాంగ్ సింగాలనిపించింది. డ్యాన్స్ చేయాలనిపించింది. అక్కడే బోలెడంత మంది రష్యన్ డ్యాన్సర్లు ఉన్నారు. ఉప్పీతో కాలు కదపడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. అంతే.. క్లబ్లో పెప్పీ సాంగ్ స్టార్టయింది. ఇంతకీ ఉపేంద్ర బ్యాంకాక్ వెళ్లడం ఏంటి? క్లబ్లో చిందేయడం ఏంటి? అనుకుంటున్నారా! ‘ఉప్పీ రూపీ’ అనే సినిమా కోసమే ఇదంతా. కె. మాధేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో ఓ క్లబ్ సాంగ్, ఉప్పీ, చిత్రకథానాయిక రచితా రామ్ పాల్గొనగా ఒక డ్యూయెట్ సాంగ్ తీశారు. అక్కడే ఒక మేజర్ ఫైట్ కూడా షూట్ చేశారు. ఇందులో ఉపేంద్ర కామన్ మాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. నెగటివ్ షేడ్ నుంచి హీరోగా మారే పాత్ర ఇది. అవినీతి అధికారులకు అద్దంలా ఉప్పీ పాత్ర ఉంటుంది. ఈ రేసీ పొలిటికల్ డ్రామా ఉప్పీ కెరీర్లో మరో మరపు రాని సినిమాగా నిలిచిపోతుందట. ‘ఉప్పీ రూపీ’ షూటింగ్ బ్యాంకాక్ లో ముగించుకుని, అక్కణ్ణుంచి ఉప్పీ స్ట్రైట్‌గా హైదరాబాద్ వచ్చేస్తారు. ఆయన నటిస్తోన్న మరో చిత్రం ‘హోమ్ మినిస్టర్’ షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది. టైటిల్‌ని బట్టి ఇది పొలిటికల్ మూవీ అనుకునేరు. ప్రతి భర్తకీ అతని భార్యే హోమ్ మినిస్టర్. ఈ నేపథ్యంలోనే సినిమా ఉంటుందట. శ్రీహరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పండి : స్టార్ హీరో
శివాజీనగర: పుట్టినరోజును జరుపుకోవటానికి దుబారా ఖర్చులు చేయరాదని, నేరుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఉపేంద్ర అభిమానులకు విన్నవించారు. పుట్టిన రోజంటూ అభిమానులు కేక్‌లకు, పూలదండలకు, ఫ్లెక్సీ బోర్డులకు డబ్బులు ఖర్చులు చేయరాదని ఉప్పి అన్నారు. తన ఇంటికి వచ్చి నేరుగా శుభాకాంక్షలు చెప్పవచ్చని ట్విట్టర్లో ఆహ్వానం పలికారు. ఈ నెల 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఇటీవల పుట్టినరోజును జరుపుకున్న హీరో కిచ్చ సుదీప్.. అభిమానులు ఆడంబరాల కోసం కాకుండా ఆ సొమ్మును పేదల సహాయానికి ఉపయోగించాలని కోరారు. అదే రీతిలో ఉపేంద్ర కూడా స్పందించడం విశేషం. For all my loving fans request not to spend money on cakes garlands and flex boards. Please come and meet me with your wishes on my birthday — Upendra (@nimmaupendra) September 10, 2017 -
నా బర్త్ డేకి దుబారా చేయొద్దు : నటుడు
శివాజీనగర : పుట్టినరోజును జరుపుకోవటానికి దుబారా ఖర్చులు చేయరాదని, నేరుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఉపేంద్ర అభిమానులకు విన్నవించారు. పుట్టిన రోజంటూ అభిమానులు కేక్‌లకు, పూలదండలకు, ఫ్లెక్సీ బోర్డులకు డబ్బులు ఖర్చులు చేయరాదని ఉప్పి అన్నారు. తన ఇంటికి వచ్చి నేరుగా శుభాకాంక్షలు చెప్పవచ్చని ట్విట్టర్లో ఆహ్వానం పలికారు. ఈ నెల 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఇటీవల పుట్టినరోజును జరుపుకున్న హీరో కిచ్చ సుదీప్.. అభిమానులు ఆడంబరాల కోసం కాకుండా ఆ సొమ్మును పేదల సహాయానికి ఉపయోగించాలని కోరారు. అదే రీతిలో ఉపేంద్ర కూడా స్పందించడం విశేషం. -
గుర్తుపెట్టుకోండి!
సమ్సారం సంసారంలో సినిమా ‘‘ఏమంటున్నాడూ.. నీ ఫ్రెండ్?’’ సాగదీసి అడిగింది.‘‘పెళ్లి చేసుకుంటే అంతా వింతగా ఉంది అన్నాడు.’’ ‘‘వింతగా ఉండడమంటే?’’ ‘‘ఇదివరకు రాత్రి ఎన్నింటికి వెళ్లినా ఏదోలా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు అస్సలు కుదరట్లేదట. కాస్త లేట్ అయితే ఫోన్ వస్తదట. గొడవలు జరిగిపోతాయట. బయట... వాడికంటూ ఒక స్పేస్ ఉండట్లేదు అన్నాడు.’’ ‘‘పెళ్లయితే ఉండదు మరి!’’ ‘‘అంతేనంటావా?’’ ‘‘అంతే మరి! ఇంట్లో పెళ్లాం వెయిట్ చేస్తదని తెలీదా? నీ ఫ్రెండ్‌కి’’ ఆదివారం రోజది. వాడికి సెలవు. నాకూ సెలవే. ‘ఇంకేదన్నా చెప్పు!’ అని ఎవ్వరూ అడుక్కోవాల్సిన అవసరం లేకుండా మా మాటలు సాగుతున్నాయి. సాయంత్రం ఏడున్నరయింది. వాడికి ఫోనొచ్చింది. ఫోన్ ఎత్తిన తర్వాత స్పీకర్‌కు చెయ్యి అడ్డం పెట్టి చెప్పాడు.. ‘‘వైఫ్ వైఫ్..’’ అని. నేను ‘సరే’ అన్నట్టు నవ్వా. నిమిషం కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడి ఉంటాడోనన్నది నాకిప్పటికీ తెలియలేదు. అది తర్వాత్తర్వాత నేనే తెలుసుకోవాలేమో! ‘‘నేనొస్తా మరి!’’ అంటూ తొందర పడుతూ లేచి వెళ్లిపోయాడు. వాడి భార్య తిట్టి ఉండొచ్చు. పాపం నేనే ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కూడా! వాడు అలా వెళ్లిపోగానే నా అమ్మాయి ఫోన్ చేసింది. ‘‘ఏంటి ఇందాక ఫోన్ ఎత్తలేదు?’’ అడిగింది.‘‘ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉండేరా!’’ సమాధానమిచ్చా.‘‘అచ్చా కూల్!’’‘‘పాపం వాడి వైఫ్ కాల్ చేసింది. పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు’’‘‘హహహ.. రమ్మనా?’’‘‘యా! ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. పాపం కదా!’’‘‘పూర్ ఫెలో!’’‘‘ఆల్ హజ్బెండ్స్ ఆర్ పూర్ ఫెలోస్!’’ స్టేట్మెంట్ ఇచ్చేశా.‘‘అలా ఎందుకు అనుకుంటావ్?’’ గట్టిగా అడిగింది.‘‘అదే నిజం కాబట్టి!’’‘‘అదేం లేదు. జనరలైజ్ చేయడం తప్పు.’’ మందలించింది.‘‘సరే!’’‘‘ఏమంటున్నాడూ.. నీ ఫ్రెండ్?’’ సాగదీసి అడిగింది. ‘‘పెళ్లి చేసుకుంటే అంతా వింతగా ఉంది అన్నాడు.’’ ‘‘వింతగా ఉండడమంటే?’’‘‘ఇదివరకు రాత్రి ఎన్నింటికి వెళ్లినా ఏదోలా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు అస్సలు కుదరట్లేదట. కాస్త లేట్ అయితే ఫోన్ వస్తదట. గొడవలు జరిగిపోతాయట. బయట... వాడికంటూ ఒక స్పేస్ ఉండట్లేదు అన్నాడు.’’‘‘పెళ్లయితే ఉండదు మరి!’’‘‘అంతేనంటావా?’’‘‘అంతే మరి! ఇంట్లో పెళ్లాం వెయిట్ చేస్తదని తెలీదా? నీ ఫ్రెండ్‌కి’’‘‘తెలీదని కాదు.’’‘‘మరి! మళ్లీ నీకొచ్చి ఇవన్నీ చెప్పుకుంటాడు. నాకది నచ్చదు.’’‘‘ఏది?’’‘‘ఇలా ఇంట్లోవన్నీ బయటచెప్పుకోవడం’’‘‘నేనేం బయటివాడిని కాదు.’’‘‘నువ్వు ఎవ్వడివైనా! చెప్పుకోవద్దు.’’ ‘‘ఇప్పుడేమంటావ్?’’‘‘మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయ్! అమ్మ అవన్నీ తీసుకెళ్లి తన ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటుంది. నాకు నచ్చదు. అదే నాన్న మెచ్చుకున్నవి, అడిగిందల్లా చేసి పెట్టినది చెప్పుకుంటుందా?’’‘‘అలాంటివి మా అన్న కూడా మాకు చెప్పడు. ఎవ్వరైనా గొడవలే చెప్పుకుంటారు.’’‘‘ఆ గొడవలు కూడా చెప్పుకోవద్దు. వైఫ్ అండ్ హజ్బెండ్ అన్నాక వాళ్ల మధ్యవి వాళ్ల మధ్యలోనే ఉండాలి.’’‘‘కానీ ఇలా బయట కాసేపు కూడా ఉండనివ్వకపోతే ఎలా?’’‘‘అదీ నీక్కావల్సింది. ఆల్ మెన్ ఆర్ సేమ్!’’‘‘నువ్వు జనరలైజ్ చెయ్యొచ్చు అయితే!’’‘‘హహహ.. నువ్వు భయపడిపోతున్నావ్?’’‘‘నాకేం భయం! నేనేందుకు భయపడాలి?’’ నిజానికి నిజంగానే భయమేసింది. ‘‘అలా కాదు. నీ టోన్ బట్టి అనిపించింది. నీకొకటి చెప్పనా?’’ స్వీట్‌గా అడిగింది.‘‘చెప్పు..’’‘‘మన పెళ్లయ్యాక నువ్వు రాత్రి ఎన్నింటికి వచ్చినా నేనడగను.’’‘‘హహ.. నువ్వే ఇందాకేదో అన్నావ్?’’‘‘అది తన కేస్. నేనైతే నువ్వు పదిరోజులు రాకున్నా ఏమీ అనుకోను’’ గట్టిగా నవ్వుతూ అంది.ఆదివారం రోజది. తనకు సెలవు. నాకూ సెలవే. సాయంత్రం ఎనిమిది అయింది.గుర్తుపెట్టుకొండి. పెళ్లయ్యాక ఇక్కడే మాట్లాడుకుందాం. అదే! మేము పెళ్లి చేసుకొని వచ్చాక!! సినిమాలో సంసారం దేవరాజ్ (ఉపేంద్ర) ఊరి పెద్ద. ఊర్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయనకు చెప్పుకుంటారంతా. మంచోడే కానీ తాతల కాలం నుంచి వచ్చిన పగలను వదిలిపెట్టడు. అతడి భార్య లక్ష్మి (స్నేహ) ముందు మాత్రం ఏ గొడవలకు వెళ్లనట్టే కనిపిస్తాడు. ‘ఒక్క పనైనా సరిగ్గా చేయరు’ అంటూ లక్ష్మి దేవరాజ్‌ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. అంత పెద్ద మనిషైనా భార్య ముందు మాత్రం మామూలోడే! ఆమెకు భయపడి మెల్లిగా ఫ్యాక్షనిజం కూడా పక్కన పెట్టేస్తాడు. చివర్లో ఏయే కారణాల వల్ల మారినా, భార్య ముందే తన తప్పులన్నీ ఒప్పేసుకొని మంచి వాడైపోతాడు దేవరాజ్. ఇలాంటి దేవరాజ్‌లు మన జీవితాల్లోనూ ఉంటారు కదూ! భార్య మీద ఇష్టమైన భయంతో మంచిగా బతికేవారు, మంచిగా మారిపోయేవారు!! త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్–లక్ష్మిల సంసారాన్ని చూడొచ్చు. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – వి. మల్లికార్జున్ -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..!
నేడు అమిత్ షాతో భేటీ బీజేపీలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా? సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో రియల్‌స్టార్‌గా పేరుగాంచిన ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై కన్నడనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉపేంద్ర తన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత రాజకీయాలపై తన వైఖరిని తెలియజేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనా తీరుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరతారా? లేదంటే సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నేడు( శనివారం) తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదే రోజు బెంగళూరు రానున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సాయంత్రం 6.15 గంటలకు భేటీ అయ్యేందుకు ఉపేంద్రకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరతారని, లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉపేంద్ర బీజేపీలో చేరతారా లేక ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తరహాలో సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి సురేష్‌కుమార్ మాట్లాడుతూ... ఉపేంద్ర రాజకీయాల్లోకి రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన ఒక ప్రగతిశీల విధానాలున్న ఓ కళాకారుడు. అయితే ఉపేంద్ర బీజేపీలో చేరడంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై ఉపేంద్ర , బి.ఎస్.యడ్యూరప్పతో చర్చించారో లేదో కూడా నాకు తెలియదు అని పేర్కొన్నారు. -
ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్!
సుదీప్‌కు ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. అందులో విలన్‌గా నటించారీ కన్నడ హీరో. మళ్లీ మరో తెలుగు సినిమాలో ఈయన కీలక పాత్రలో నటించనున్నారని టాక్. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తొలి తరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అందులో సుదీప్ విలన్‌గా చేయనున్నారట. కొన్ని రోజుల క్రితమే ‘ఉయ్యాలవాడ...’లో మరో కన్నడ హీరో ఉపేంద్ర విలన్‌గా నటించనున్నారనే వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఆయనతో పాటు సుదీప్నూ ఎంపిక చేశారట! ఆగస్టు 15న ఈ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తారట. ఇందులో విలన్లు ఎవరు? హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఆ రోజే చెబుతారేమో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే... మొన్నటి వరకు ఈ సినిమా టైటిల్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనుకున్నారంతా. ఇప్పుడు తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషలు, హిందీ ప్రేక్షకులు... అందరికీ అర్థమయ్యేలా ‘మహావీర’ అని పెడితే ఎలా ఉంటుందని చిత్రబృందం ఆలోచిస్తోందట. చివరకు ఏ టైటిల్ కన్ఫర్మ్ అవుతుందో... వెయిట్ అండ్ సీ!! -
ఉయ్యాలవాడకు ఊ కొట్టారా?
చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనడిగితే... ఆయన బర్త్‌డే (ఆగస్ట్ 22) నాడు అని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. దాంతో పాటు ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేయనున్నారని కూడా ఆ ఏరియా చెబుతోంది. ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. ‘రా’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా, రెండేళ్ల క్రితం ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుపరిచితుడే. మరి.. గాసిప్పురాయుళ్లు చెబుతున్నట్లు ఆయన ఉయ్యాలవాడకు ఊ కొట్టారో? లేదో తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. అయితే భోజ్‌పురి నటుడు రవికిషన్ విలన్‌గా ఫైనలైజ్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. -
దెయ్యంతో ఉప్పిగంతులు!
ఉపేంద్ర, ప్రియమణి, తులసి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘కల్పన 3’. ఉదయ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అర్జున్ జన్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య విడుదల చేశారు. ‘‘ఈ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్, కన్నడంలో ఉపేంద్ర చేశారు. నేను తీసిన దెయ్యం సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే భరోసా ఉంది’’ అని రామసత్యనారాయణ అన్నారు. సమర్పణ: సాయి వెంకట్. -
'ఎమ్మెల్యే'గా నందమూరి యంగ్ హీరో..?
నందమూరి యువ కథానాయకుడు ఎమ్మెల్యేగా మారుతున్నాడు. హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్.. త్వరలో ఓ ఇంట్రస్టింగ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఇజం సినిమా తరువాత దాదాపు ఆరు నెలల పాటు కాలీగా ఉన్న కళ్యాణ్ రామ్, ఇటీవల ఉపేంద్ర అనే కొత్త దర్శకుడి కథను ఓకె చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద ఉండగానే తను హీరోగా తెరకెక్కబోయే సినిమాను కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఎమ్మెల్యే' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అనీల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. మరో సారి కొత్త దర్శకుడితో కలిసి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. -
పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్..?
-
పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను ఫైనల్ చేశాడు పవర్ స్టార్. తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో వేదలం రీమేక్‌తో పాటు తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రను స్టార్ ఇమేజ్ ఉన్న నటుడితో చేయించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో నటించిన ఉపేంద్రను పవన్ సినిమాకు తీసుకున్నారన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా ఆ ప్లేస్‌లో మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. ఇటీవల మనమంతా, జనతా గ్యారేజ్, మన్యం పులి లాంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి సక్సెస్‌లు సాధించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పవన్ సినిమాలో కీలక పాత్రలోనటించనున్నాడు. ప్రస్తుతానికి ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా.. పవర్ స్టార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
పవన్ కళ్యాణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో
ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. పవన్ సరసన కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్లను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించిన ఉపేంద్ర మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. -
చిన్నరి ముచ్చట్లు
-
చూస్తే...భయమేస్తుంది!
‘‘హారర్ చిత్రాలంటే నేనంత భయపడను. దెయ్యాలను చూసి నవ్వుకుంటాను. ఈ చిత్రం మామూలు హారర్ కాదు... చాలా భయపెట్టేలా ఉంటుంది. థియేటర్లో సినిమా చూసినప్పుడు నాలుగైదుసార్లు సీట్లో నుంచి ఎగిరిపడ్డా’’ అన్నారు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్ర చేసిన ‘చిన్నారి’ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్. సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లోహిత్ దర్శకుడు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు నేనూ ఓ హారర్ కామెడీ సినిమా చేస్తున్నా. కానీ, ఈ ట్రైలర్ భయపెట్టే విధంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రియాంక ఎక్కువ సినిమాలు చేయాలి. (నవ్వుతూ...) ‘రా’తో తనను నేను తీసుకువెళ్లానంటున్నారు. ఇప్పుడు పొమ్మంటున్నా’’ అన్నారు ఉపేంద్ర. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులకు నచ్చింది. తెలుగులోనూ హారర్ ప్రియులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రియాంక. -
చిన్నారి ఏం చేసింది?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చిన్నారి’. బేబీ యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో నటించారు. లోహిత్ దర్శకత్వంలో కేఆర్కే ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్‌పై కె.రవికుమార్, ఎంఎంఆర్ సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘హారర్ కథాంశంతో వైవిధ్యంగా తీసిన చిత్రమిది. తల్లి, కూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. చాలా బాగుందంటూ పలువురు అభినందించారు. సూపర్ హిట్ కన్నడ మూవీ ‘రంగి తరంగి’కు సంగీతం అందించిన అజినీష్ లోక్‌నాథ్ మంచి పాటలిచ్చారు. నేపథ్య సంగీతం, కెమెరామేన్ వేణు టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి’’ అని తెలిపారు. -
సూపర్ స్టార్ సినిమాలో మోహన్‌లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు పరాభాష సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ స్టార్ హీరో తాజాగా మరో భాషలోనూ అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అన్ని భాషల్లోనూ మల్టీ స్టారర్ సినిమాలతోనే ఎంట్రీ ఇస్తున్నాడు ఈ కంప్లీట్ యాక్టర్. అదే బాటలో త్వరలో ఓ కన్నడ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటుతున్న మోహన్ లాల్ ఈ సినిమాతో తన మార్కెట్ రేంజ్ ను మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
గోవాలో ఏం జరిగింది?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చిన్నారి’. బేబీ యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ఇతర పాత్రల్లో నటించారు. లోహిత్ దర్శకత్వంలో కేఆర్కే ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్‌పై కె.రవికుమార్, ఎంఎంఆర్ తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాముఖ్యం ఉంటుంది. ‘రంగి తరంగి’ చిత్రానికి సంగీతం అందించిన అజినీష్ లోక్‌నాథ్ మా సినిమాకు మంచి పాటలిచ్చారు. కన్నడ టాప్ కెమెరామేన్ వేణు టేకింగ్, అజినీష్ ఆర్.ఆర్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
ఆలోచింపజేసే ‘బ్రాహ్మణ’ చర్చ
కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగునాట ఓ ప్రత్యేక క్రేజు, ఉంది. ‘దండు పాళ్యం’ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు శ్రీని వాస్రాజు కాంబినేషన్లో ఈ ‘ఉప్పి దాదా’ తాజా సినిమా ‘బ్రాహ్మణ’. ఏణ్ణర్ధం క్రితం కన్నడంలో వచ్చిన ‘శివమ్’కు ఇది అనువాదం. కన్నడనాట వివాదం: నిజానికి, కన్నడంలో ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు - ‘హరహర మహా దేవ’. ఆ తరువాత పెట్టినపేరు - ‘బసవణ్ణ’. కానీ, ఆ టైటిల్ తమ ధార్మిక విశ్వాసాలకు భంగం కలిగిస్తోందంటూ కర్ణాటకలోని లింగాయత్‌లు ఆందోళన చేశారు. అసెంబ్లీలో చర్చ వచ్చి, టైటిల్ మార్చాలంటూ ముఖ్యమంత్రి అభ్యర్థిం చారు. ఈ ఒత్తిడికి తలొగ్గి, దర్శకుడు ‘బ్రాహ్మణ’ అని పేరు పెట్టారు. కానీ, ఫిల్మ్ చాంబర్ దానికీ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ‘శివమ్’గా రిలీజ్ చేశారు. కథ ఏమిటంటే... ఏడో శతాబ్దం నుంచి ఇప్పటి దాకా భారత్‌పైన ముష్క రుల దాడులు అందరికీ తెలిసినవే. చిన్నదైన సినిమా పరిధి చాలని ఈ పెద్ద అంశాన్ని అంతర్లీన నేపథ్యంగా తీసుకొని, మాఫియా కథాంశాన్ని కలిపి, ఈ కథ అల్లుకున్నారు. ఒక పురాతన శివాలయం. దండయాత్రీకుల బారి నుంచి ఆ గుడిని కాపాడిన పూర్వీకుల నుంచి అర్చకత్వం హీరో తండ్రికి వస్తుంది. తండ్రి మరణంతో హీరో అనివార్యంగా అర్చకుడౌతాడు. మంత్రి ముఠా ఇచ్చిన సుపారీతో హీరోను చంపడానికి మాఫియా ముఠా వస్తుంది. హీరో అసలెవరన్నది ఫ్లాష్‌బ్యాక్. ఏమైందన్నది మిగతా కథ. సెన్సార్ కత్తెర పోటు! విదేశాల్లో చిత్రీకరణలతో నిర్మాణ విలువలున్న ఈ సినిమాలో కథ, కథనమే అటూ ఇటూ అనిపిస్తాయి. గోమాంస భక్షణ, బీఫ్ ఫెస్టివల్, ఆలయాల్ని ధ్వంసం చేసి వాటిపై వెలసిన పరమత మందిరాల లాంటి వివాదాల్ని సినిమాలో ప్రస్తావించారు. కన్నడంలో సెన్సార్ ఒత్తిడి వల్ల 25 కట్స్‌తో చాలా సినిమానే కోతకు గురైంది. అవి చాలదన్నట్లు, మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడు మరికొన్ని కట్స్ పడ్డాయి. బసవన్న, అలెక్స్, అర్చకుడు - ఇలా విభిన్న కోణాలున్న పాత్రతో బరువు అంతా ఉపేంద్రపైనే. భారత్‌పై దాడికి తెగబడే మాఫియా నేత అమానుల్లా ఖాన్‌గా రవిశంకర్ (సాయికుమార్ సోదరుడు) చేశారు. ఫైట్స్, గాలిలోకి ఎగిరి హీరో చేసే విన్యాసాలు, డైలాగులు, హీరోయిన్ రాగిణి ఐటంసాంగ్, ఫస్టాఫ్‌లో కామెడీకని వచ్చే లవ్ ట్రాక్ లాంటివన్నీ మాస్కు నచ్చుతాయని నమ్మాలి. దర్శక, హీరోల ఇమేజ్ అందుకు శ్రీరామరక్ష కావాలి! - రెంటాల జయదేవ -
విలక్షన్
యాక్షన్ సినిమాల ట్రెండ్... హారర్ సినిమాల ట్రెండ్. రొమాంటిక్ మూవీస్ ట్రెండ్... ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. హీరోలు విలన్లుగా మారడం అనేది ఇప్పటి ట్రెండ్. అప్పటివరకూ హీరోగా చేసిన హీరో మరో హీరో చిత్రంలో విలన్‌గా కనిపిస్తే.. ఆ ప్రాజెక్ట్‌కి వచ్చే క్రేజు.. ఇద్దరు హీరోలు ‘ఢీ’ కొంటే ప్రేక్షకులకు లభించే మజా వేరు. ఈ మధ్య విలన్లుగా కిక్ ఇచ్చిన హీరోల గురించి చెప్పాలంటే... ఇక్కడే మంచి విలన్లను పెట్టుకుని మనమెక్కడికో వెళ్లాం అనే ఫీల్‌ని దర్శకులకు కలగజేసిన హీరో జగపతిబాబు. మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘లెజెండ్’ ద్వారా విలన్‌గా మారి, టాలీవుడ్‌కి పరభాషల విలన్ల అవసరాన్ని కాస్త తగ్గించారు. మనం పరభాషల నుంచి విలన్లను తెచ్చుకుంటున్నట్లుగా మన జగపతిబాబుని అక్కడివాళ్లు తీసుకెళ్లడం విశేషం. ఇప్పుడు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఆయన బిజీ. విలన్‌గా మారి, భేష్ అనిపించుకున్న మరో హీరో సుదీప్ మాతృభాష కన్నడంలో హీరోగా, పరభాషల్లో విలన్‌గా చేస్తున్నారు. ఈ హ్యాండ్సమ్ హీరో ‘ఈగ’లో ప్రదర్శించిన క్రూరత్వం గుర్తుండే ఉంటుంది. సుదీప్‌లో మంచి విలన్ మెటీరియల్ ఉన్నాడని నిరూపించింది తెలుగు పరిశ్రమ. ఆ తర్వాత తమిళ పరిశ్రమ గుర్తించి, ‘పులి’కి సుదీప్‌ని విలన్‌గా తీసుకుంది. భోజ్ఫురిలో తిరుగు లేని హీరో అనిపించుకున్న రవికిషన్లో విలన్ని చూసింది కూడా మన తెలుగు పరిశ్రమే. ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల్లో ఈ భోజ్‌పురి హీరో విలన్‌గా మంచి మార్కులే కొట్టేశారు. అతను హీరోనా? విలనా? అని డౌటు వచ్చే నటుడు ఒకరున్నారు. ఆయనే ఉపేంద్ర. యాంటీ షేడ్స్ ఉన్న హీరో పాత్రలు చేయడం ఉపేంద్ర అలవాటు. ఇక.. పూర్తి స్థాయి విలనిజం పండించడమంటే ఆయనకు పెద్ద కష్టమేం కాదని ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ప్రూవ్ చేసేసింది. ఇప్పటివరకూ చెప్పుకున్నవాళ్లందరూ మిడిల్ ఏజ్డ్ ఆర్టిస్టులే. యంగ్ ఏజ్ లో ఉన్న ఓ హీరో.. విలన్‌గా చేయడమంటే సాహసమే. టైమ్ బాగాలేకపోతే విలన్‌గానే ఫిక్స్ అయిపోవాల్సి వస్తుంది. కానీ, ఆది పినిశెట్టి అదేం ఆలోచించలేదు. అందుకే ‘సరైనోడు’లో విలన్‌గా నటించారు. ఆ చిత్రం ఆదికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘మలుపు’లో హీరోగా కనిపించి, ఆకట్టుకున్నారు. దాంతో ఇతను విలన్‌గానే పనికొస్తాడనో.. హీరోగానే బెస్ట్ అనో ముద్రపడలేదు. తెలుగు తెరకు వచ్చిన మరో స్టైలిష్ విలన్ అరుణ్ విజయ్ సీనియర్ నటుడు విజయ్‌కుమార్ తనయుడు. అరుణ్ విజయ్ తమిళంలో హీరోగా చేస్తుంటారు. కానీ, ‘బ్రూస్లీ’కి విలన్‌గా అడిగితే ‘సై’ అనేశారు. విలన్‌గా మారిన హీరోల జాబితాలోకి త్వరలో రాజశేఖర్ చేరనున్నారని ఫిలిం నగర్ టాక్. ఆవేశపూరితమైన హీరో పాత్రలతో పాటు రొమాంటిక్ పాత్రలు కూడా చేసిన రాజశేఖర్ విలన్‌గా కూడా భేష్ అనిపించుకుంటారని నిస్సందేహంగా చెప్పొచ్చు. దక్షిణాది నుంచి ఉత్తరాది వైపు వెళితే ‘బాజీగర్’, ‘డాన్’ వంటి చిత్రాల్లో యాంటీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో షారుక్ ఖాన్ మెప్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడ హీరోగా చేస్తూ విలన్‌గా కూడా చేస్తున్న యువనటుడు నీల్ నితిన్ ముఖేష్ తెలుగు ‘కత్తి’లో విలన్‌గా నటించారు. ఇప్పుడు అందరి దృష్టీ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ మీద ఉంది. ‘రోబో’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’లో అక్షయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఇన్నాళ్లూ హీరోగా ‘గుడ్‌బాయ్’ పాత్రలు చేసిన తనకు ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌తో ఢీ కొనడం చాలా ఎంజాయబుల్‌గా ఉందని అక్షయ్ పేర్కొన్నారు. ఇప్పుడైతే విలన్లుగా మారుతున్న హీరోల జాబితా ఎక్కువైంది కానీ, ఒకప్పుడు ఇదే సీన్ రివర్స్‌లో ఉండేది. ముందు విలన్లుగా చేసి, ఆ తర్వాత హీరోలుగా మారిన నటులు చాలామంది ఉన్నారు. రజనీకాంత్ ముందు విలన్‌గానే ఎంటరై, ఆ తర్వాత హీరో అయ్యారు.. ఫైనల్లీ సూపర్ స్టార్ అయ్యారు. మోహన్‌బాబుని తీసుకుంటే.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు కోణాలను నిరూపించుకుని, పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. చిరంజీవి కూడా ముందు విలన్.. ఆ తర్వాతే హీరో.. తర్వాత మెగాస్టార్. కమల్‌హాసన్‌ని తీసుకుంటే హీరోగా చేస్తూనే, యాంటీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఆ తరం తర్వాత వచ్చినవాళ్లల్లో శ్రీకాంత్ ముందు విలన్. తర్వాత ఫ్యామిలీ హీరో. గోపీచంద్ రెండు సినిమాల్లో విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయినా ఆ ప్రభావం ఆయన కెరీర్ పై పడలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఒక్కసారి హీరోగా మారాక మళ్లీ విలన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు, పరిశ్రమ విలన్ పాత్రలకే ఫిక్స్ చేసే ప్రమాదం ఉందని భయపడతారు. కానీ, ఇప్పటి హీరోలు అలాంటి భయాలేం పెట్టుకోవడంలేదు. విలన్‌గానూ మెప్పించి, హీరోగానూ కంటిన్యూ అవుతున్నారు. ఇలా విలనిజాన్ని ప్రదర్శించడంలో హీరోయిజమ్ చూపించి, ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అనిపించుకుంటున్నారు. -
'బ్రాహ్మణ' మూవీ స్టిల్స్
-
వివాదానికి తెర తీస్తున్న హీరో
శాండల్ వుడ్‌లోనే కాదు టాలీవుడ్లో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎ, రా, ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా సంచలనాలు నమోదు చేశాయి. అందుకే ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమాలో తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా శివం. ముందుగా ఈ సినిమాకు బసవణ్ణ అనే టైటిల్‌ను నిర్ణయించిన వివాదాలు రావడంతో శివం పేరుతో రిలీజ్ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన రిలీజ్ చేయనున్నారు. శివం సినిమా తెలుగు వర్షన్‌కు బ్రాహ్మణ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఉపేంద్ర ఏకంగా ఓ యాక్షన్ సినిమాకు బ్రాహ్మణ అనే టైటిల్‌ను పెడితే ఊరుకుంటారా..? అయితే కథ కోసం ఈ టైటిల్‌ను పెట్టారా..? లేక వివాదాలతో పబ్లిసిటీ చేసుకోవాలన్న ఆలోచనలో పెట్టారో గాని.. ఉపేంద్ర సినిమా టైటిల్ మరోసారి టాలీవుడ్లో వివాదాలకు కారణం అవ్వటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
పదిహేడేళ్ల తర్వాత!
‘వాస్సి వాడి తస్సాదియ్యా...’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. జోరుగా ఉండే తండ్రి పాత్ర, కూల్‌గా ఉండే కొడుకు పాత్రను నాగ్ అద్భుతంగా పోషించారు. అన్ని ఏరియాల వాళ్లనీ ఆకట్టుకున్న చిత్రం ఇది. ఇప్పుడీ రెండు పాత్రల్లో కన్నడ ప్రేక్షకులు ఉపేంద్రను చూడనున్నారు. విలక్షణమైన పాత్రలతో కన్నడిగులనే కాదు.. తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న ఉపేంద్రకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చాలా నచ్చిందట. అందుకే కన్నడ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలుగులో రమ్యకృష్ణ చేసిన పాత్రను కన్నడంలో ప్రేమ చేయనున్నారు. విశేషం ఏంటంటే... 1999లో ఉపేంద్ర, ప్రేమ జంటగా ‘ఉపేంద్ర’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. పదిహేడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ జతకట్టనున్న చిత్రం ఇదే. మరో విశేషం ఏంటంటే... ఈ చిత్రంతోనే ప్రేమ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. అరుణ్ లోకనాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘మత్తె హుట్టి బా, ఇంతి ప్రేమ’ అనే టైటిల్ నిర్ణయించారు. ఆ సంగతలా ఉంచితే నాగ్ మంచి రొమాంటిక్ హీరో. ఉపేంద్ర ఫుల్ మాస్ హీరో. అందుకే తన ఇమేజ్‌కీ, కన్నడ ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్టుగా ‘సోగ్గాడే..’ కథను మలుస్తున్నారట. -
నాగార్జున పాత్రలో నటించనున్న ఉపేంద్ర
బెంగళూరు: కన్నడ సినీ రంగంలో ఒకానొక కాలంలో హిట్‌పెయిర్‌గా నిలిచిన ఉపేంద్ర, ప్రేమ చాలా విరామం తర్వాత కలిసి నటించనున్నారు. తెలుగులో నాగార్జున నటించిన సోగ్గాడె చిన్ని నాయన చిత్రాన్ని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేయనున్నారు. తెలుగులో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన పాత్రలలో ఉపేంద్ర నటించనుండగా నాగార్జనకు జోడీగా రమ్యకృష్ణ నటించిన పాత్రను కన్నడలో ప్రేమ కనిపించనున్నారు. 17 సంవత్సరాల తర్వాత ప్రేమ, ఉపేంద్ర కలిసి నటించనున్నారనే వార్తతో ఉపేంద్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి తగిన మార్పులు,చేర్పులు,కూర్పులు అన్ని హీరో ఉపేంద్ర స్వయంగా చేస్తుండడడం విశేషం -
అది పిరికితనం...
బెంగళూరు : మత అసహనం పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ఉపేంద్ర నిరసన వ్యక్తం చేశారు. దేశంలో మత అసహనం పెరిగి పోతోందంటూ అమీర్ వ్యాఖ్యలపై ఉపేంద్ర స్పందించారు. అమీర్ వ్యాఖ్యలు పిరికితనాన్ని ప్రతిబింభించేలా ఉన్నాయన్నారు. 'మత అసహనం పెరిగి పోతుంటే దానిని అరికట్టేందుకు పోరాడాలి కాని... భయం వేస్తోంది... దేశం వదిలిపోతానని చెప్పడం సరికాదని ఉపేంద్ర బుధవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు. -
మరోసారి పవన్ సినిమా రీమేక్‌లో..!
కన్నడలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మరో పవన్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సుదీప్. తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు హీరోలుగా తెరకెక్కిన సినిమా గోపాల గోపాల. దేవుడి మీదే కేసు వేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సుదీప్, ఈ సినిమాలో పవన్ పాత్రలో సుదీప్ నటిస్తుండగా వెంకటేష్ కనిపించిన పాత్రలో విలక్షణ నటుడు ఉపేంద్ర అలరించనున్నాడు. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో హిట్ అయిన గోపాల గోపాల, శాండల్‌వుడ్‌లో కూడా సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను!
‘ఉపేంద్ర - 1’లో ‘నేను’ గురించి చెప్పాడు. ‘ఉపేంద్ర - 2’లో ‘నువ్వు గురించి చెబుతానంటున్నాడు. ఉపేంద్ర తీరే అంత. కొంచెం తిక్క తిక్కగా, ఇంకొంచెం గుక్క తిప్పుకోనివ్వకుండా అతని సినిమాల కాన్సెప్టులుంటాయి. ఉపేంద్ర చాలా నిగూఢమైన మనిషి. పైకి కనిపించే ఉపేంద్ర వేరు. లోపలి ఉపేంద్ర వేరు. సన్యాసం తీసుకోని సర్వసంగ పరిత్యాగిలా అనిపిస్తున్న ఉపేంద్రతో స్పెషల్ టాక్. *** చాలా గ్యాప్ తర్వాత ‘ఉపేంద్ర 2’తో తెలుగు తెరపై హీరోగా కనిపించనున్నారు.. ఈ చిత్ర విశేషాలేంటి? ‘నేను’ అనే క్యారెక్టర్‌తో ‘ఉపేంద్ర’ ఉంటుంది. నేను అనే భావనను వదిలేసి, ‘నువ్వు’ అని ఆ క్యారెక్టర్ ఆలోచించడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? అనే ప్రశ్న పదేళ్లుగా వెంటాడుతూ వచ్చింది. అందుకే ‘ఉపేంద్ర 2’ను ‘నువ్వు’ అనే కాన్సెప్ట్‌తో తీశాం. ‘అంతర్గత స్వేచ్ఛ’ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. *** అప్పట్లో నేను అన్నారు.. ఇప్పుడు నువ్వు అంటున్నారు.. అంతర్గత స్వేచ్ఛ అని ఏదేదో చెబుతున్నారు. జనాలకు అర్థమవుతుందంటారా? (నవ్వుతూ...) ‘ఉపేంద్ర’ అందరికీ అర్థమైంది. ఇది కూడా అందరికీ అర్థమవుతుంది. ఆ సినిమా చాలా హార్ష్‌గా ఉంటుంది. ఇప్పుడలా ఉండదు. అంతర్గతంగా ప్రతి ఒక్కరికీ జనరల్‌గా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ‘నువ్వు’ అంటే మనందరం అని అర్థం. *** మీ సినిమాలంటే అదో విధంగా ఉంటాయనీ, లేడీస్ ఇబ్బందిపడతారనీ ఊహాగానాలు ఉంటాయి? అవును. కానీ, థియేటర్‌కి వచ్చి చూస్తే, కచ్చితంగా ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రాన్ని ఆడవాళ్లే ఎక్కువగా చూస్తారు. చాలామంది నాకు అభిమానులు అవుతారని కూడా అనుకుంటున్నా. *** ‘ఉపేంద్ర’ చూడనివాళ్లకు ఈ చిత్రం అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది వేరే కాన్సెప్ట్. ఇది వేరే కాన్సెప్ట్. ఇంటర్నల్ ఫ్రీడమ్ మీద తీసిన ఈ సినిమా లక్కీగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విడుదల కావడం ఆనందంగా ఉంది. *** మీతో నిర్మించిన ‘రా’ ద్వారా నిర్మాతగా పరిచయమైన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ మీతో ‘ఉపేంద్ర 2’ చేయడంపై మీ ఫీలింగ్? బుజ్జి, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనతో నా సినిమా కుదరడం ఆనందంగా ఉంది. ‘ఉపేంద్ర’ సినిమా చాలా ఇష్టమనీ, ‘ఉపేంద్ర 2’ని తెలుగులో నేనే విడుదల చేస్తాననీ, ఈ సినిమా కథ కూడా తెలుసుకోకుండా బుజ్జి విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తను విడుదల చేయడం వల్ల పెద్ద రేంజ్ సినిమా అయ్యింది. *** దర్శకత్వం, నటన... మీకు ఎందులో సంతృప్తి ఉంది? దర్శకత్వం అంటే మొత్తం అన్నీ చేసుకోవాలి. అందులో ఓ పరిపూర్ణత ఉంటుంది. నటుడిగా డెరైక్టర్ చెప్పింది చేసేసి వెళ్లిపోవడమే. అది చాలా తేలిక. కానీ, డెరైక్షన్ చాలా కష్టం. ఎక్కువ కష్టపడిన విషయాలు ఎక్కువ సంతృప్తినిస్తాయి కదా. *** ఇక వరుసగా తెలుగు సినిమాలు చేస్తారా? చేయాలనే ఉంది. దర్శక, నిర్మాతలు పిలవాలిగా (నవ్వులు). *** ఇలా జుత్తు పెంచుతుంటారు.. బాబా పాత్ర ఏమైనా చేయాలని ఉందా? అలా ఏం లేదు. జస్ట్ అలా ఉంటానంతే. *** మీ సినిమాలు విచిత్రంగా, వాటిలో మీ వేషధారణలు కూడా అలానే ఉంటాయి. మంచి వయసులో ఉన్నప్పుడు మీరు లవర్‌బోయ్ పాత్రలు చేయలేదు. ఎందుకని మీ అందం మీద మీకు నమ్మకం లేదా? అందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బతకడం కోసం ఏదైనా చేయాలి. నా జీవితం సినిమాలతో ముడిపడింది. నేను ఫలానా సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏది వస్తే అది చేశాను. బేసిక్‌గా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. అప్పట్లో కాఫీ తాగడానికి కూడా డబ్బులు లేక ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుని తాగేవాణ్ణి. ఆ షేరింగ్‌లో ఎంతో ఆనందం ఉంటుంది. కానీ, ఆ మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేయలేదు. ‘మన దగ్గర ఏమీ లేదే’ అని బాధపడేవాణ్ణి. ఇప్పుడన్నీ ఉన్నాయి. కానీ, ఇంకా ఏదో కావాలి? అని ఉంటుంది. జీవితం అంతే. ఉన్నదాంతో సంతృప్తిపడక ఇంకా ఏదో ఎదురు చూస్తాం. ఎక్కడో చోట ఆగాలి కదా. నేను ఆగాను. ఎందుకంటే, ‘ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఇన్జ్యూరి యస్ టు హెల్త్’ అని ఓ సామెత ఉంది. ఆ ఇన్‌జ్యురీస్ నాకొద్దు. *** స్థిత ప్రజ్ఞత అంటారు. ప్రస్తుతం మీ స్థితి అదే అనిపిస్తోంది. పరాజయాలకు చలించరనుకోవచ్చా? మంచి ప్రశ్న. ఒకప్పుడు నేను సక్సెస్ గురించి టూ మచ్‌గా ఆలోచించేవాణ్ణి. సక్సెస్‌ను విపరీతంగా ఎంజాయ్ చేసేవాణ్ణి. కానీ, ఈ సక్సెస్ శాశ్వతం కాదని తెలుస్తోంది. ‘ఈ విజయం నాది కాదు.. ఏదో జరిపిస్తోంది. జరుగుతున్నదంతా డ్రామా. దాంతో పాటే వెళ్లిపోవాలి. మనం ‘నథింగ్’ అని తెలుసుకున్నాను. ఆ ‘నథింగ్’ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడొస్తే, అప్పుడు ‘యు ఆర్ ఎవ్రిథింగ్’ అని అర్థం. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ‘అయామ్ సమ్‌థింగ్’ అనుకుంటే ‘దెన్ ది ట్రబుల్ స్టార్ట్స్’. *** ఆఫ్ట్రాల్ మనం మనుషులం. ఆకర్షణీయమైన వాటి పట్ల ఆకర్షితులం కావడం సహజం కదా? అవును. చాలా సహజం. కానీ, ఆకర్షణీయమైన వాటి పట్ల ఆకర్షితుణ్ణి కావడం అనే విషయాన్ని నేను ‘స్విచాఫ్’ చేసేశాను. ఈ దశ చాలా ఎంజాయబుల్‌గా ఉంది. *** ఇతరులను కేర్ చేయరా? ‘ఐ రెస్పెక్ట్ ఎవిరీబడీ... బట్ ఐ డోంట్ కేర్ ఎనీ బడీ’ అని రజనీకాంత్ ఓ సందర్భంలో అన్నారని తెలిసింది. కేర్ అంటే.. మీ నుంచి దూరంగా వెళ్లాక కూడా మీ గురించి ఆలోచించడం. కానీ, అది రియాల్టీ కాదు. మీరు నా కళ్లెదుట ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవించాలి. మీలో దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే, ఈ మూమెంట్ నిజం. సో.. రెస్పెక్ట్ కరెక్టా? కేర్ కరెక్టా? *** దేవుడికి, మీకు ఉన్న రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలని ఉంది? చాలా పెద్ద ప్రశ్న. సముద్రం నుంచి ఒక నీటిబొట్టును తీసి, అది కేవలం నీటిబొట్టు అనుకుంటే అలానే అనిపిస్తుంది. కానీ, సముద్రంలోంచి తీసిన ఆ నీటిబొట్టుకి సముద్రంలో ఉండే నీటి బొట్టుకి తేడా ఉండదు. సో.. ఆ నీటిబొట్టు కూడా సముద్రమే. మనిషికీ, దేవుడికీ ఉన్న బంధం చెప్పాలంటే, మనందరం ఆ భగవంతుడిలో భాగమే. ఆ దేవుడు, మనం వేరు కాదని నా ఫీలింగ్. *** అంటే... మిమ్మల్ని మీరు ఆ దేవుడిలా భావిస్తారా? అవును. సముద్రంలోంచి తీసిన నీటిబొట్టులో సముద్ర లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే మనం కూడా. ఆ దేవుణ్ణుంచి మనం వచ్చాం. ఆ లక్షణాలన్నీ మనలో ఉంటాయి. అందుకే ‘నేను దేవుణ్ణి కాదు’ అని ఎవరమూ అనలేం. *** అసలు దేవుడంటే మీ దృష్టిలో ఏంటి? ‘ఇదిగో ఈ ప్రెజెంట్ మూమెంట్’నే దేవుడు అంటాను. ఈ క్షణాలను ఎంజాయ్ చేస్తాను. కానీ, మనం ఎప్పుడూ పూర్తిగా ప్రెజెంట్లో ఉండం. అంతకు ముందు జరిగినవాటి గురించో, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించో ఆలోచిస్తుంటాం. కానీ, ఇప్పుడు జరుగుతున్న విషయాలు నిజం. ఈ రియాల్టీయే గాడ్. అందుకే నేనెప్పుడూ ఆ దేవుడితోనే ఉంటాను. *** మీ మాటలను బట్టి మీరు ‘సోల్ సెర్చింగ్’ (ఆత్మాన్వేషణ) చేస్తుంటా రని అనిపిస్తోంది. అలా ఆత్మాన్వేషణలో నిమగ్నమయ్యేవాళ్లకి బాహ్య ప్రపంచంలోని అశాశ్వత అంశాల మీద ఆసక్తి ఉండదట? ఎస్.. ఆత్మాన్వేషణ చేస్తా. అలాగని బాహ్య ప్రపంచం మీద ఇంట్రస్ట్ లేదని కాదు. సోల్ సెర్చింగ్ అంటే అన్నీ త్యజించడం కాదు. సోల్ సెర్చింగ్ అంటే జీవితం అనే ఈ డ్రామాను ఎంజాయ్ చేయడం. ‘బాహ్య ప్రపంచంలో ఏమీ లేదు.. అంతా వేస్ట్’.. అనుకుంటే అది నెగటివ్ మెంటాల్టీ. ఇప్పుడున్నదంతా సూపర్ అని నేననుకుంటా. ఎందుకంటే, ఇది రియాల్టీ. దీన్ని ఆస్వాదించాలి. *** మీ సినిమాలు కుండబద్దలు కొట్టినట్లుగా ఉంటాయి... సబ్జెక్ట్‌లో కూడా డెప్త్ ఉంటుంది. సొసైటీ మీద ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉందా? అది అందరికీ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫారిన్ వెళ్లారనుకోండి.. అక్కడ రోడ్లన్నీ క్లీన్‌గా ఉండటం చూసి, మన దేశం ఇలా ఎందుకు ఉండకూడదు? అనుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ఆలోచనకు రూపమే నేను చేసిన ‘సూపర్’ చిత్రం. నేను చదివే పుస్తకాలు కూడా నా మీద చాలా ప్రభావం చూపుతుంటాయి. *** ఎలాంటి పుస్తకాలు చదువుతారు? జిడ్డు కృష్ణమూర్తిగారి పుస్తకాలు చదువుతాను. ఆయన పుస్తకాల్లో చాలా డెప్త్ ఉంటుంది. *** రియాల్టీని ఆస్వాదించడమంటే... కష్టాలొచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండాలా? అఫ్కోర్స్.. ‘అవుట్ సైడ్ ఫోర్సెస్’ మన మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ, ఇది కూడా ఓ డ్రామా.. ఈ డ్రామాకి కూడా ముగింపు ఉంటుందని అర్థం చేసుకుని బతకగలిగితే ఈ మూమెంట్లో కష్టం వచ్చినా ఎంజాయ్ చేయగలుగుతాం. *** ఆత్మాన్వేషణ... ఆధ్యాత్మిక బాట.. ఇలాంటి విషయాల పట్ల మనసు మళ్లడం అంటే అంత సులువు కాదు. కానీ, వీటిపై ఆకర్షితులైనవాళ్లు మెల్లి మెల్లిగా ఇక సన్యాసులుగా మారిపోతారనే ఫీలింగ్ ఉంటుంది. మరి భవిష్యత్తులో మీరు? నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్లను వదిలి ఎక్కడికి వెళతాను! ‘నేను’ అంటే ఏంటి? అని తెలుసుకోవాలన్నదే నా తాపత్రయం. (నవ్వుతూ...) ఇన్నర్ సెర్చ్ చేసుకున్నంత మాత్రాన సన్యాసులుగా మారతాం అనడానికి లేదు. - డి.జి. భవాని -
ఆయన నన్నిక్కడకు ‘రా’...‘రా’ అని పిలుస్తున్నారు - ఉపేంద్ర
‘‘నల్లమలుపు బుజ్జిగారితో ‘రా’ సినిమా చేశాను. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగ తంగా కూడా నా జీవితంలో గుర్తుండి పోయే సినిమా అది. ఎందుకంటే ఆ సినిమా సమయంలోనే తొలిసారిగా నా భార్య ప్రియాంకను కలిశాను. బుజ్జిగారు మళ్లీ ‘ఉపేంద్ర-2’తో ఆయన నన్నిక్కడికు ‘రా రా’ అని పిలుస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఉపేంద్ర-2’. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తెలుగులో విడుదల చేస్తున్నారు. పారుల్ యాదవ్, క్రిస్టీనా అకీవా కథానాయికలు. గురుకిరణ్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ -‘‘ ‘ఓం’ సినిమా చూసినప్పటి నుంచి ఉపేంద్ర అంటే నాకు ఇష్టం. నాకే కాదు అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే దర్శకులకు ఉపేంద్ర అంటే చాలా క్రేజ్. ఆయన డైరక్షన్ టెన్షన్‌ను పక్కన పెట్ట్టి సూపర్ స్టార్ అయ్యారు. మళ్లీ ఆయన ఈ ‘ఉప్రేంద-2’ సినిమాతో ఆపేయకుండా డైరక్షన్ను కొనసాగించాలని కోరుతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిషోర్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, ‘ఠాగూర్’ మధు, దామోదర ప్రసాద్, దర్శకులు డాలీ, గోపీచంద్ మలినేని, రచయిత వక్కంతం వంశీ తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
ఉపేంద్ర-2 ఆడియో పంక్షన్
-
సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్!
సదరన్ స్పైస్ మీరు అతణ్ణి ద్వేషించడాన్ని ప్రేమిస్తారు. మీరు అతణ్ణి ప్రేమించడాన్ని ద్వేషిస్తారు. ప్రేమిస్తారు. ద్వేషిస్తారు. కాని- ఎప్పుడూ తీసి పడేయలేరు. అలాంటి పిచ్చ పాపులారిటీ కొట్టేశాడు. సినిమాలు హిట్ కావడానికి పెద్ద హీరో, పెద్ద బడ్జెట్, పెద్ద కథ... ఎట్లీస్ట్ ఒకటైనా ఉండాలి. మూడు లేకుండా హిట్ కొట్టినోడు ఉపేంద్ర. అదే ఉపేంద్ర షాక్ వాల్యూ. ఊహించినదాని కంటే పిచ్చగా, ఊహించనంత పిచ్చగా... ఇదీ ఉప్పి ఫార్ములా. సినిమా స్టార్స్ అంటే స్పెషలే... కొందరు మాత్రం మరీ స్పెషల్. కన్నడసీమలో అందరూ ముద్దుగా ‘ఉప్పి’ అని పిలుచుకొనే ఉపేంద్ర అంతే! ఆయన యాక్టింగే కాదు... ఎంచుకొనే చిత్రమైన స్క్రిప్ట్‌లు... వేసే వేషాలు... చేసే సినిమాలు, పెట్టే పేర్లు, విచిత్రమైన హెయిర్‌స్టైల్స్... ఏవైనా అంతే! అవన్నీ... ఉపేంద్ర మార్కు స్పెషల్. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, పాటల రచయిత, గాయకుడు - ఇన్ని వేషాలూ ఉప్పిదాదా వేస్తాడు. కాకపోతే, ‘ఎడ్డెమంటే తెడ్డెమ’నే తరహా హీరో పాత్రలంటే మొదట గుర్తొస్తాడు. అలాంటి పాత్రలకు సౌతిండియన్ సినిమాలో అతనిదే పేటెంటన్నా తప్పు లేదేమో! ఆ క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్... మరెన్నో కమర్షియల్ పాత్రల సృష్టికి బీజం వేశాయి. కావాలంటే, మన పూరి జగన్నాథ్ ‘ఇడియట్’, ‘పోకిరి’ లాంటి హీరో పాత్రలు... ఉపేంద్ర సినిమాలు ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూడండి! చిన్నప్పటి నుంచీ ఉపేంద్ర అంతే! ‘నలుగురికీ నచ్చినది... నాకసలే ఇక నచ్చదురోయ్...’ టైపు. ఎంతో కష్టపడి పైకొచ్చాడు. నాన్న వంటవాడు. అమ్మ, తను, అన్న. పొట్టకూటి కోసం పళ్ళు, కూరలు తీసుకెళ్ళే కాగితపు కవర్లు తయారు చేశాడు. మిక్స్చర్, బూందీ ప్యాక్ చేసే ప్లాస్టిక్ కవర్లు చేశాడు. చేతిలో వంద రూపాయలుంటే గొప్ప అని బతికినరోజులవి. బంధువు, దర్శకుడు కాశీ నాథ్ (‘అనుభవం’ ఫేం) సాయంతో సినిమాల్లోకొచ్చాడు. అక్కడ నుంచి ఉప్పి జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. శాండల్‌వుడ్‌కు... క్రేజీ ఇమేజ్ 1990లలో ఉపేంద్ర ఎంట్రీ శాండల్‌వుడ్‌లో ఊహించని మలుపు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ల తరం జోరు తగ్గి, కొత్తవాళ్ళకు ఆడియన్స్ తలుపులు తెరుస్తున్న టైమ్‌లో ఉపేంద్ర ఎంటరయ్యాడు. అసలు ఆయన మొదలు పెట్టింది అసిస్టెంట్ డెరైక్టర్‌గా! ఆయన ఆగలేదు... డెరైక్టర్య్యాడు. విజయం సాధించాడు. అక్కడితో ఆగలేదు... హీరో అయ్యాడు. అన్నిసార్లు ఆగనివాడికి ఆ తరువాత ఎక్కడా ఆగాల్సిన అవసరమే రాలేదు. కొత్త మిలీనియమ్కు కాస్తంత ముందు నుంచి కన్నడ సినిమాలకు ఒక కొత్త క్రేజు, ఇమేజ్ వచ్చిందంటే - అది ఉపేంద్ర మ్యాజిక్. మొదట్లో కెమేరా ముందుకొచ్చి, చిన్న వేషాలేసిన ఉపేంద్ర. కాశీనాథ్ మార్క్ కామెడీ తర్లే నాన్ మగ(92)తో దర్శకుడయ్యాడు. అయితే, ఆడియన్స్‌ను ఆకర్షించాలంటే, భారీ బడ్జెటైనా ఉండాలి. షాకింగ్‌గా అనిపించే స్క్రిప్టైనా ఉండాలి. ఉప్పి రెండో రూట్ ఎంచుకున్నాడు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ష్’ (’93) తీస్తే, అదీ హిట్టు. ఆ తరువాత శివరాజ్‌కుమార్‌ను హీరోగా పెట్టి తీసిన ‘ఓం’ (’95) ఒక పెద్ద కుదుపు. బెంగుళూరులోని రియల్ గ్యాంగ్స్టర్స్ జీవితాలను చూపెట్టిన సినిమా అది. అసలు సిసల్ గ్యాంగ్స్టర్స్నీ నటింపజేశాడు. మింగుడు పడనిది చూపెట్టి, అక్కడ నుంచి వెనక్కి వెళ్ళి, ఫ్లాష్‌బ్యాక్‌తో అదెంత సమంజసమో ఒప్పించే విచిత్రమైన స్క్రీన్‌ప్లే ‘ఓం’లో కనిపిస్తుంది. ఆ పద్ధతిలో వెళ్ళాలనుకొనే చాలామందికి ఇప్పటికీ అది టెక్స్ట్బుక్కే కాదు... గైడ్ కూడా! ఆ మూసలో ఇవాళ్టికీ కన్నడ సినిమాలు వస్తూనే ఉన్నాయి. నటి ప్రేమ తెరకు పరిచయమైంది ‘ఓం’తోనే. తెలుగుతో (రాజశేఖర్ ‘ఓంకారం’) సహా అనేకచోట్ల రీమేకైన ఈ ఫిల్మ్ 20 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ కన్నడంలో హాటే. ఇవాళ్టికీ రిలీజైనప్పుడల్లా, కాసులు కురిపిస్తోంది. అతనికి తిక్కుంది... కానీ లెక్కే లేదు! సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్! ఉపేంద్ర ప్రేమ, పెళ్ళి - చాలా పెద్ద కథ. వివాదాస్పదమైన ‘హెచ్2ఓ’ ఘోరంగా ఫెయిలైతే అయింది కానీ, ఆ సినిమా హీరోయినైన బెంగాలీ నటి ప్రియాంకా త్రివేదీతో ఉపేంద్ర ప్రేమ మాత్రం సక్సెసైంది. ‘రా’ సినిమాతో మొదలైన వాళ్ళ స్నేహం... క్రమంగా ప్రేమగా మారి... ఈ సినిమాతో పెళ్ళి పీటలపెకైక్కింది. ముచ్చటైన సంసారం. వాళ్ళకిప్పుడు ఇద్దరు పిల్లలు... అబ్బాయి ఆయుష్ ఆరో తరగతి. అమ్మాయి ఐశ్వర్య అయిదో తరగతి. ఉపేంద్రలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఆయన నటిస్తారు. పాటలు రాస్తారు... పాడతారు. కథ చేస్తారు... సినిమా తీస్తారు... దాన్ని ప్రతిభ అనేవాళ్ళు కొందరు... పిచ్చి అనేవాళ్ళు మాత్రం ఎందరో! అది వేపకాయంతా... గుమ్మడికాయంతా? ఏమో తెలీదు. కానీ, ఏది చెప్పినా ముక్కుసూటిగా కాదు... ముక్కు బద్దలయ్యేలా చెప్పడం ఉపేంద్ర నైజం. విచిత్రమైన ఈ ‘క్రియేటివ్ ఎక్సెంట్రిసిటీ’ కొందరికి మొరటు, కొందరికి వెగటు. సగటు ప్రేక్షకుడు మాత్రం ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే, అభిమాన గణంలో, ఆదాయ గణాంకాల్లో - టాప్ ఫైవ్ కన్నడ హీరోల్లో ఉప్పి ఒకడు. ఉపేంద్ర హీరోయిక్ జర్నీ స్టార్ట్ అయింది ‘ఎ’ (’98) సినిమాతో! హీరోయిన్ ప్రేమలో పడ్డ దర్శకుడు... తీరా పేరొచ్చాక ఆ నటి అతణ్ణి కాదనడం... ఆడవాళ్ళంటే అతను పెంచుకున్న ద్వేషం... ఇలా నడుస్తుందా కథ. అది ఉపేంద్ర సొంత కథేననీ, ఆ హీరోయిన్ నటి ప్రేమ అనీ ఒకటే పుకారు. నిజానిజాలు ఉపేంద్ర కెరుక. సినిమా మాత్రం డబ్ అయిన తెలుగులోనూ డబ్బు చేసుకుంది. తెరపై ఉపేంద్ర నిర్మొహమాటం జనానికీ నచ్చుతూనే వచ్చింది. ఉపేంద్రనగానే తెలుగువారికి ‘ఎ’, ‘రా’, ‘ష్’, ‘ఉపేంద్ర’, ‘సూపర్’ ఇప్పటికీ గుర్తొచ్చేదీ అందుకే! పాలిటిక్స్ వయా సినిమా ఉపేంద్ర తన సినిమాల్లో ఆవేశం చూపిస్తాడు. సమాజంలోని ‘హిపో క్రసీ’పై ఆగ్రహం పలికిస్తాడు. ఆ సినిమాలు జనంతో పాటు ఆయన మీదా ప్రభావం చూపాయి. ఈ వెండితెర ఆగ్రహాన్ని వీధుల్లో ఆచరణగా మార్చాలని పాతికేళ్ళుగా సినీ రంగంలోనే ఉన్న 47 ఏళ్ళ ఉప్పి అభిప్రాయం. కన్నడ ‘సూపర్’లో ముఖ్యమంత్రైన ఈ హీరో ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తానంటాడు. అయితే, ఇంకా టైమ్ ఉందంటాడు. ఆ లోగా తనకున్న సినిమాస్కోప్ కలలు తీర్చుకొనే పనిలో ఉన్నాడు. మరక కూడా మంచిదే! కాంట్రవర్సీకీ, కన్నడ స్టార్ ఉపేంద్రకూ దగ్గరి చుట్టరికం. తమిళ, కన్నడ రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం నేపథ్యంలో ముక్కోణపు ప్రేమకథగా ఆయన రాసి, నటించిన ‘హెచ్2ఓ’ (2002) రోజుల నుంచి ఆ చుట్టరికం మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంది. కానీ, ఆయన కలవరపడలేదు. కామ్‌గా పని చేసుకుంటూ పోయాడు. కన్నడంలో అందరి లానే ఆయనా ఆ మధ్య వరుసగా రీమేక్‌ల బాట పట్టాడు. త్రివిక్రమ్ రాసిన తెలుగు సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’ కన్నడ రీమేక్స్‌లోనూ ఉప్పి హీరో. ఇప్పటికి దాదాపు 50 సినిమాల్లో నటించిన ఉపేంద్ర కొంత గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్‌లోనూ బ్రేక్ టైమ్‌లో తన క్యారవాన్‌లోనే ఎడిటింగ్ చేస్తూ గడిపిన ఆయన తన దర్శకత్వంలో 9వ సినిమా ‘ఉప్పి2’తో రానున్నాడు. సౌత్ అంతా ఫేమసే! ‘‘తిరుపతికి పోయి... ఇదే వెంకన్న సామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినాయనా! మన గురించి ఇక్కడ తెలిస్తే సాలదు... హైదరాబాద్‌లో కూడా తెలవాల! ఫేమస్ అవ్వాల మనం...’’ సమ్మర్ రిలీజ్ త్రివిక్రవ్‌ు ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో దేవరాజ్ పాత్రధారి ఉపేంద్ర పలికే డైలాగ్ ఇది. అవును... పాతికేళ్ళ క్రితం జీరోగా మొదలై ఇవాళ హీరోగా వెలుగుతున్న ఉపేంద్ర ఇవాళ ఇక్కడా ఫేమస్సే! కన్నడ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ల తరువాత తెలుగులో, ఆ మాటకొస్తే ఆల్ ఓవర్ సౌతిండియాలోనూ ఫేమున్న ఏకైక కన్నడ హీరో ఉపేంద్రే! ఏళ్ళ క్రితం వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమాలు ‘ఏ’, ’రా’ చూసి ఈల వేసి, గోల చేసిన జనం మొన్న సమ్మర్ రిలీజ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో విలన్ పాత్రకూ థియేటర్లలో అదే రకంగా వెల్కమ్ చెప్పడం ఉపేంద్ర ఇమేజ్‌కు తాజా నిదర్శనం. లైఫ్ ఫిలాసఫీ బెంగుళూరులోని విద్యాపీఠ్‌లో మధ్యతరగతి కుటుంబాల మధ్య వీధుల్లో సైకిల్ తొక్కుతూ పెరిగి, మధ్య, ఎగువ మధ్యతరగతి మనుషుల ‘హిపోక్రసీ’ని తెరపై చెడుగుడు ఆడిన ఉపేంద్రలో చాలామందికి తెలియని మరో కోణం - స్పిరిచ్యువాలిటీ. సినిమాల్లో ఉపేంద్ర చెప్పిన జీవిత పాఠాలన్నీ కలిపి, ఆ మధ్య ‘ఉప్పిగింత’ అంటూ పుస్తకమే వచ్చింది. ‘‘అల్లిరువుదు నమ్మనే, ఇల్లిరువుదు సుమ్మనే’’ (అసలు ఇల్లు వేరెక్కడో ఉంది. ఇప్పుడిక్కడ మనం ఊరకే ఉంటున్నాం అని అర్థం) అనే లోతైన అర్థమున్న కన్నడ సూక్తిని ఆయన ప్రస్తావిస్తుంటాడు. పదిహేనేళ్ళ క్రితం బనశంకరి థర్డ ఫేజ్‌లో ఇంటికి మారిన ఉప్పి, ఆ ఇంటికి పెట్టిన పేరేమిటో తెలుసా? ‘సుమ్మనే!’ అవును. ఉప్పి జీవితాన్ని కాచివడపోశాడు. ఒకప్పుడు... చదువుకొంటూనే, 15 రూపాయల కోసం పేపర్ కవర్లు చేసిన పిల్లాడు... సినిమాల్లో పేరొచ్చాక లక్ష రూపాయల చెక్ ఇస్తే, జీవితంలో అంత డబ్బు మునుపెన్నడూ చూడక తడబడిపోయిన మిడిల్‌క్లాస్ వ్యక్తి... డబ్బులెక్కడ దాచుకోవాలో తెలియని కుర్రాడు... ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. వచ్చినా, తన మూలాలు మర్చిపోలేదు. ఇవేవీ శాశ్వతం కాదనీ మర్చిపోలేదు. అందుకే, ఉపేంద్ర సిన్మా లానే ఉపేంద్రా స్పెషల్. శాండల్వుడ్లోనే కాదు... మరి ఏ ‘వుడ్’లోనూ కనిపించని స్పెషల్. భాషల గోడలు బద్దలు కొట్టుకొని, మనసుపై ముద్ర వేసిన స్పెషల్ స్టార్. ‘సమ్ మే లవ్ హిమ్. సమ్ మే హేట్ హిమ్. బట్ నో వన్ కెన్ ఇగ్నోర్ హిమ్!’ - రెంటాల జయదేవ -
ఒకటి కాదు.. పది!
ఎక్కడా పెద్దగా అవకాశాలు లేక సతమతమవుతున్న బబ్లీ గాళ్ సలోనీ.. రూటు మార్చినట్టుంది. వచ్చిన ఒక్క చాన్స్‌ను వందగా మార్చుకోవాలని స్కెచ్ గీసినట్టుంది. అందుకే కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రకు గాలం వేసే ప్రయత్నం చేసిందీ సుందరి. వీరిద్దరూ నటించిన చిత్రం ‘శివం’. చాలా కాలం తరువాత మళ్లీ శాండల్‌వుడ్‌లో చేసిన అమ్మడు... ఉపేంద్రతో పది సినిమాలు చేయాలనుందంటూ అతగాడిని ఆకాశానికెత్తేసింది. ‘ఉప్పీతో మూడో చిత్రం ఇది. నాకు దక్కిన గౌరవమిది. గత రెండూ సూపర్ హిట్స్. ఇది కూడా విజయం సాధింస్తుందన్న నమ్మకం ఉంది. ఉపేంద్రతో కనీసం పది సినిమాలు చేయాలనుకుంటున్నా. అంతటి అద్భుతమైన నటుడు, దర్శకుడు ఆయన’ అంటూ ఆకాశానికెత్తేసింది. -
'అల్లు అర్జున్ సినిమాలో నటించట్లేదు'
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నట్టు వచ్చిన వార్తలను సీనియర్ నటుడు అర్జున్ తోసిపుచ్చారు. విలన్ గా చేసే తీరిక లేదని ఆయన తెలిపాడు. 'పస్తుతం హీరోగానే నటిస్తున్నాను. మిగతా పాత్రలు చేయడానికి తనకు సమయం లేదు. కథానాయక పాత్రల్లోనే కొనసాగుతాను. అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా నటించడం లేదు. దీనిపై వార్తలు వదంతులు మాత్రమే' అని అర్జున్ వివరించారు. హీరో పాత్రలు, డైరెక్షన్ తో సంతోషంగా ఉన్నానని.. ఇలాంటప్పుడు నెగెటివ్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. ఆయన రూపొందించిన 'జైహింద్-2' సినిమాను మూడు భాషాల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా త్రివిక్రమన్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కన్నడ ఉపేంద్రను విలన్ చేయనున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. -
ఘనంగా ఉపేంద్ర పుట్టిన రోజు వేడుక