
యశవంతపుర: నటుడు, రాజకీయ నాయకుడు ఉపేంద్ర కించపరిచే విధంగా మాట్లాడారని వివాదంలో పడ్డారు. ప్రజ్ఞావంతుల పార్టీ స్థాపించి ఆరేళ్లు కావస్తున్న సందర్భంగా ఆయన అభిమానులతో ఇన్‌స్టాలో లైవ్‌లో మాట్లాడారు. ఊరు అంటే గలీజు కూడా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో అనేకమంది ఉపేంద్ర మాటలను ఖండించారు. ప్రజలను గలీజుతో పోల్చి మాట్లాడటం ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నించారు.
గలీజు ప్రాంతాలలో బతికే ప్రజలందరూ గలీజువాళ్లనా అని మండిపడ్డారు. ఇది రచ్చ కావడంతో ఉప్పి క్షమాపణలు చెప్పారు. ఆయన మాటలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని సమాజ కళ్యాణ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉపేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం
దొడ్డబళ్లాపురం: నటుడు ఉపేంద్ర వ్యాఖ్యలకు నిరసనగా రామనగరలో ఆదివారం దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఊరు అన్నాక మురికివాడ ఉంటుందని ఇటీవల ఉపేంద్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని భావించి దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి ఉపేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తక్షణం ఉపేంద్ర దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment