
నటుడు ఉపేంద్ర
యశవంతపుర : రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు, నటుడు ఉపేంద్ర అభిమానులు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర ట్వీట్ చేసి కొందరికి చెవులను పిండారు. జరిగిందంత మంచికే జరిగిందంటూ బుధవారం జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేశారు. బీజేపీని ఆహ్వానించటంపై ఆ మాట అన్నారా లేక కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాక పోవటానికి ఆ మాట అన్నారా అనేది గందరగోళం నెలకొంది.