స్టార్ హీరో ఉపేంద్రపై పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉప్పీ.. ఈ మధ్య తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా పలు విషయాలు మాట్లాడారు. అయితే దళితులని అవమానించేలా కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై కర్ణాటక హైకోర్టు ఊరట ఇచ్చింది.
(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)
అసలేం జరిగింది?
స్వతహాగా నటుడు అయిన ఉపేంద్ర.. ప్రజాక్రియా పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. దీని వార్షికోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో శనివారం లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. విమర్శకులని ఓ వర్గంతో పోల్చుతూ సామెత చెప్పాడు. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు కచ్చితంగా ఉంటారని అన్నాడు. వాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి అన్నాడు.
అయితే ఉపేంద్ర వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్ తమని ఆవేదనకు గురిచేశాయని నిరసన తెలియజేశాయి. కొందరైతే బెంగళూరులోని చెన్నమున్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే తన కామెంట్స్‌పై దుమారం రేగడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పాడు. లైవ్ వీడియోని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే ఉపేంద్రపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇది తాత్కాలిక ఊరటకాగా.. భవిష్యత్తులో మాత్రం ఉపేంద్రకి చిక్కులు తప్పవేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్)
Comments
Please login to add a commentAdd a comment