
బనశంకరి : రియల్ స్టార్ ఉపేంద్ర కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ప్రారంభించే సమయంలో అవినీతిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఇక్కడి శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పార్టీ ప్రారంభ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఉపేంద్ర సమాదానమిస్తూ... ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్ గురువారం శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.