ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు స్వస్తి | No Movies After Elections Won Actor Upendra | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు స్వస్తి: ఉప్పి

Feb 4 2019 12:20 PM | Updated on Feb 4 2019 12:20 PM

No Movies After Elections Won Actor Upendra - Sakshi

యశవంతపుర: లోకసభ ఎన్నికలలో గెలిస్తే సినిమాలకు స్వస్తి చెబుతానని ప్రముఖ నటుడు, ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర తెలిపారు. ఆయన ఆదివారం దావణగెరెలో విలేకర్లతో మాట్లాడారు. గెలిచిన తరువాత తను ప్రజల సేవకుడిని అవుతానన్నారు. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలలో మాత్రమే నటిస్తాన్నారు. గెలిచిన తరువాత తాను సినిమాలలో నటించటం సాధ్యంకాదన్నారు. రాజకీయాల కోసం సినిమాలను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 28 స్థానాలలో పోటీ చేయాలని అనేక మంది ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్న రాజకీయాలలో మార్పులు తెచ్చి నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు.రిటైర్డు ఐఎఎస్, కెఎఎస్‌ అధికారులతో ఒక సమితి రచించి మేనిఫెస్టోను తయారు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement