
బెంగళూరు : పాలకులు సక్రమమైన పాలన సాగించి ప్రజా సమస్యలు పరిష్కరించి ఉంటే తనకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది కాదని ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర అన్నారు. అదివారం ఆయన స్థానిక పాత్రికేయల భవనంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ,జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్పీలు డబ్బు ఏర చూపి ఓటర్లను కొనుగోలు చేసేందుకు తాపత్రయ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు నిజాయితీగా పాలన చేసి ఉంటే తాను ప్రజలు ముందుకు వచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను పార్టీని ఏర్పాటు చేశానన్నారు.
కొద్ది రోజుల క్రితం బెంగళూరు గ్రామీణ లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రజాకీయ పార్టీ అభ్యర్థి మంజునాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అధికారం ఇచ్చి వారి కోసం పనిచేయడమే ప్రజాకీయ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లినా వారి స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారని, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment