
సాక్షి, బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతామని ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత, బహుభాషా నటుడు ఉపేంద్ర శనివారం బెంగళూరులో ప్రకటించారు. తమ ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)కి ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందన్నారు. తాను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఎవ్వరైనా పార్టీ ఎంపిక విధానంలో గట్టెక్కితేనే టికెట్ ఇస్తామని తెలిపారు. టికెట్ ఆశిస్తున్న 20 మంది దరఖాస్తులను ప్రస్తుతం పార్టీ పరిశీలిస్తోందని చెప్పారు. 2017లో కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీలో చేరిన ఆయన అంతర్గత విభేదాల కారణంగా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు.