
ఉపేంద్ర అంటేనే మాస్. ‘ఎ’, ‘ఉపేంద్ర’, నేను’ తదితర చిత్రాల్లో మాస్ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన తాజాగా ‘కబ్జా’ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 18న) ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఎస్‌ఎస్‌ఈ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎంటీబీ నాగరాజు సమర్పణలో ఆర్. చంద్రు దర్శకత్వంలో ఆర్. చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు ఉపేంద్ర. టీజర్‌ను దీపావళికి విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
చదవండి: ఆర్జీవీ సంచలన ప్రకటన.. ఆ హీరోతో మూవీ
ఆర్జీవీ–ఉపేంద్ర–ఓ సినిమా... ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) త్వరలో ఆయన కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనీ, అది యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ప్రకటించారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా అన్నారు రామ్‌గోపాల్ వర్మ.
Comments
Please login to add a commentAdd a comment