ఉయ్యాలవాడకు ఊ కొట్టారా? | upendra in uyyalawada narasimha reddy | Sakshi
Sakshi News home page

ఉయ్యాలవాడకు ఊ కొట్టారా?

Published Thu, Jul 13 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

ఉయ్యాలవాడకు ఊ కొట్టారా?

ఉయ్యాలవాడకు ఊ కొట్టారా?

చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనడిగితే... ఆయన బర్త్‌డే (ఆగస్ట్‌ 22) నాడు అని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. దాంతో పాటు ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేయనున్నారని కూడా ఆ ఏరియా చెబుతోంది. ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. ‘రా’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా, రెండేళ్ల క్రితం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సుపరిచితుడే.

మరి.. గాసిప్పురాయుళ్లు చెబుతున్నట్లు ఆయన ఉయ్యాలవాడకు ఊ కొట్టారో? లేదో తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. అయితే భోజ్‌పురి నటుడు రవికిషన్‌ విలన్‌గా ఫైనలైజ్‌ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement