ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్‌! | Another Kannada hero Upendra is a villain in 'Uyalavada Narasimha Reddy' | Sakshi
Sakshi News home page

ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్‌!

Published Fri, Aug 4 2017 11:53 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్‌!

ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్‌!

సుదీప్‌కు ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. అందులో విలన్‌గా నటించారీ కన్నడ హీరో. మళ్లీ మరో తెలుగు సినిమాలో ఈయన కీలక పాత్రలో నటించనున్నారని టాక్‌. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తొలి తరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

అందులో సుదీప్‌ విలన్‌గా చేయనున్నారట. కొన్ని రోజుల క్రితమే ‘ఉయ్యాలవాడ...’లో మరో కన్నడ హీరో ఉపేంద్ర విలన్‌గా నటించనున్నారనే వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఆయనతో పాటు సుదీప్‌నూ ఎంపిక చేశారట! ఆగస్టు 15న ఈ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తారట.

ఇందులో విలన్లు ఎవరు? హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఆ రోజే చెబుతారేమో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే... మొన్నటి వరకు ఈ సినిమా టైటిల్‌ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనుకున్నారంతా. ఇప్పుడు తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషలు, హిందీ ప్రేక్షకులు... అందరికీ అర్థమయ్యేలా ‘మహావీర’ అని పెడితే ఎలా ఉంటుందని చిత్రబృందం ఆలోచిస్తోందట. చివరకు ఏ టైటిల్‌ కన్ఫర్మ్‌ అవుతుందో... వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement