sudip
-
టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. 2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది. కాగా కునాల్ ఘోష్ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. -
సంగీతం నేపథ్యంలో...
సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్‌సింగ్ ముఖ్య తారలుగా ఆర్.ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగ్రహం’. ఎస్.ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. సురేష్ మాట్లాడుతూ– ‘‘సంగీతానికి ప్రాధాన్యం ఉన్న విభిన్న కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే ఆఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం. మా సినిమా మోషన్ పోస్టర్ని విడుదల చేసిన పూరి జగన్నాథ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.కె, సంగీతం: ఆర్.ఆర్.రవిశంకర్. -
ఉయ్యాలవాడలో... ‘ఈగ’ విలన్!
సుదీప్‌కు ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. అందులో విలన్‌గా నటించారీ కన్నడ హీరో. మళ్లీ మరో తెలుగు సినిమాలో ఈయన కీలక పాత్రలో నటించనున్నారని టాక్. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తొలి తరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అందులో సుదీప్ విలన్‌గా చేయనున్నారట. కొన్ని రోజుల క్రితమే ‘ఉయ్యాలవాడ...’లో మరో కన్నడ హీరో ఉపేంద్ర విలన్‌గా నటించనున్నారనే వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఆయనతో పాటు సుదీప్నూ ఎంపిక చేశారట! ఆగస్టు 15న ఈ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తారట. ఇందులో విలన్లు ఎవరు? హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఆ రోజే చెబుతారేమో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే... మొన్నటి వరకు ఈ సినిమా టైటిల్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనుకున్నారంతా. ఇప్పుడు తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషలు, హిందీ ప్రేక్షకులు... అందరికీ అర్థమయ్యేలా ‘మహావీర’ అని పెడితే ఎలా ఉంటుందని చిత్రబృందం ఆలోచిస్తోందట. చివరకు ఏ టైటిల్ కన్ఫర్మ్ అవుతుందో... వెయిట్ అండ్ సీ!! -
హాలీవుడ్‌కి...
మాతృభాష శాండల్‌వుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న సుదీప్ ఇప్పుడు హాలీవుడ్‌కి వెళ్లడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం కన్నడంలో రెండు మూడు చిత్రాల్లో నటిస్తోన్న ఆయన హిందీ చిత్రం ‘టైగర్ జిందా హై’లో విలన్‌గా చేస్తున్నారు. త్వరలో ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్ ఇడై ఆర్య దర్శకత్వం వహించనున్న ‘రైజెన్’ అనే హాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారట. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్లో సుదీప్ పాల్గొంటారట. -
సుదీప్ అత్తారింటికి దారేది
కన్నడ అగ్రశ్రేణి నటుడు సుదీప్‌కు దక్షిణాది అంతటా అభిమానులున్నారు. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సుదీప్ సిద్ధం. ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’, తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన. ఇతర భాషల్లో ఎంత బిజీగా ఉన్నా... కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య’ పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు సుదీప్. ఇదే జోష్‌లో మరో రీమేక్‌కి కూడా ఆయన పచ్చ జెండా ఊపేశారు. తెలుగులో రికార్డులు తిరగరాసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కన్నడంలో ఆయన చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయ్యాక సినిమాకు సంబంధించిన వివరాలు తెలుపుతానని సుదీప్ చెప్పారు.