హాలీవుడ్‌కి...
మాతృభాష శాండల్‌వుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న సుదీప్ ఇప్పుడు హాలీవుడ్‌కి వెళ్లడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం కన్నడంలో రెండు మూడు చిత్రాల్లో నటిస్తోన్న ఆయన హిందీ చిత్రం ‘టైగర్ జిందా హై’లో విలన్‌గా చేస్తున్నారు. త్వరలో ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్ ఇడై ఆర్య దర్శకత్వం వహించనున్న ‘రైజెన్’ అనే హాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారట. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌లో సుదీప్ పాల్గొంటారట.