ఏకైక సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఒక్కరే: ఉపేంద్ర | Upendra Says One And Only Star is Rajinikanth | Sakshi
Sakshi News home page

Upendra: ఒకే ఒక్క సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. తమిళంలో సినిమా చేయాలనుంది

Mar 13 2023 12:42 PM | Updated on Mar 13 2023 12:50 PM

Upendra Says One And Only Star is Rajinikanth - Sakshi

ఏకైక సూపర్‌ స్టార్‌ రజినీకాంతే అని కన్నడ హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు ఉపేంద్ర. స్వతహాగా కన్నడిగుడు

ఏకైక సూపర్‌ స్టార్‌ రజినీకాంతే అని కన్నడ హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు ఉపేంద్ర. స్వతహాగా కన్నడిగుడు అయిన ఈయన అక్కడ రియల్‌ సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం కబ్జా. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజస్, ఇన్వేనియో ఒరిజిన్‌ సంస్థల సమర్పణలో ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం ఇది. నటి శ్రియ కథానాయికగా నటించిన ఇందులో నటి సుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్‌ కుమార్‌ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అలంకార్‌ పాండియన్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఈ నెల 17వ తేదీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తనకు చెన్నై ఎప్పుడూ స్పెషలేనన్నారు. ఈ చిత్రానికి తనను ఎంపిక చేసిన దర్శకుడు చంద్రుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్ర వంటి అద్భుతమైన నటుడితో కలిసి తెరపై భాగం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శక నిర్మాత చంద్రు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న లైకా ప్రొడక్షన్స్, తమిళ్‌ కుమరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

చిత్ర కథానాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్‌ చూడగానే ఇది సాంకేతిక నిపుణుల చిత్రమని మీకు తెలుస్తుందన్నారు. దర్శకుడు చంద్రు నాలుగేళ్ల కల అని పేర్కొన్నారు. ఇందులో నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో నటించారని తెలిపారు. కాగా నటి శ్రియ మాట్లాడినప్పుడు  ఉపేంద్రను ఇండియన్‌ రియల్‌ సూపర్‌ స్టార్‌ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉపేంద్ర తాను కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించానని.. అదేవిధంగా రియల్‌ రౌడీలతో చిత్రం చేయడంతో అందరూ ఇండియన్‌ రియల్‌ సూపర్‌స్టార్‌ అంటుంటారని, నిజానికి రజినీకాంత్‌  ఒక్కరే సూపర్‌స్టార్‌ అని పేర్కొన్నారు. కాగా తనకు తమిళంలో చిత్రం చేయాలనే కోరిక ఉందని.. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement