రెండు భాగాలుగా కబ్జా | Upendra kabza plans a two parts | Sakshi

రెండు భాగాలుగా కబ్జా

Oct 9 2020 1:28 AM | Updated on Oct 9 2020 1:28 AM

Upendra kabza plans a two parts - Sakshi

ఒక కథను ఒకే సినిమాలో ప్రేక్షకులకు చెప్పలేం అని చిత్రబృందం భావిస్తే అప్పుడు ఆ కథను రెండు భాగాలుగా చెబుతుంటారు. ఇటీవల కాలంలో ‘బాహుబలి, కేజీయఫ్‌’లు అందుకు ఉదాహరణ. తాజాగా ఉపేంద్ర నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కబ్జా’ కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఆర్‌. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఉపేంద్ర మాఫియా డాన్‌లా కనిపించనున్నారు.

ముందు ఒక్క సినిమాగా ప్లాన్‌ చేశారు. అయితే లాక్‌డౌన్‌లో ఈ కథపై ఇంకా వర్కవుట్‌ చేశారు. దాంతో కథ పెద్దదయింది. ఈ కారణంగా సినిమాని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. ‘రెండో భాగం ఐడియా ఉపేంద్రగారికి చాలా నచ్చింది’’ అని దర్శకుడు చంద్రు తెలిపారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమా సుమారు 7 భాషల్లో విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement