బడా నేతలు వద్దు.. ప్రజాసేవకులు కావాలి! | Upendra about his Cashless party Needs | Sakshi
Sakshi News home page

Dec 2 2017 1:21 PM | Updated on Sep 17 2018 5:36 PM

Upendra about his Cashless party Needs  - Sakshi

మైసూర్‌ : ప్రజల కోసం కష్టపడే వారే తన పార్టీలోకి రావాలే తప్ప.. రాజకీయ నేతలుగా ఎదగాలనుకునేవాళ్లు అవసరం లేదని కన్నడ స్టార్ హీరో, కేపీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర చెప్పారు. శుక్రవారం పార్టీ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఎంతో మంది ఎన్నికల ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడతారు. తర్వాత అధికారంలోకి కోట్లు కొల్లగొడతారు. నా పార్టీ మాత్రం అలాంటిది కాదు అని ఉపేంద్ర చెప్పారు.  రాజకీయ నేతలు నాకు అవసరం లేదు. ఉదయం 9 నుంచి 6 గంటల దాకా పౌరుల కోసం పని చేయాలనుకుంటున్న వాళ్లు ఎవరైనా తన పార్టీలోకి రావొచ్చని ఉపేంద్ర చెప్పారు. తనది డబ్బులు తీసుకుని సీట్లు పంచే పార్టీ కాదని.. ఒక్క రూపాయి కూడా ఎన్నికల్లో పంచకుండా ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.

కుల రాజకీయాలకు తాను వ్యతిరేకమన్న ఉప్పీ.. ఎన్నికల్లో గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా కర్ణాటక పగ్న్ర్యావంత జనతా పక్ష ప్రజాకీయ పోటీ చేసి తీరుతుందని చెప్పాడు.  మైసూర్ మహారాజ్‌తోపాటు మరికొందరు స్టార్లు కూడా తన పార్టీకి మద్దతు ప్రకటించారని.. అయితే వారు పార్టీలో చేరే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. త్వరలో వారి పేర్లను వెల్లడిస్తానని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటామని చెప్పిన ఆయన.. త్వరలో రాష్ట్రంలో ఇంటింటి పర్యటన చేపడతానని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement