ఆయన నన్నిక్కడకు ‘రా’...‘రా’ అని పిలుస్తున్నారు - ఉపేంద్ర | Upendra's Directorial Comeback 'Uppi 2' | Sakshi
Sakshi News home page

ఆయన నన్నిక్కడకు ‘రా’...‘రా’ అని పిలుస్తున్నారు - ఉపేంద్ర

Published Tue, Aug 11 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

ఆయన నన్నిక్కడకు ‘రా’...‘రా’ అని పిలుస్తున్నారు - ఉపేంద్ర

ఆయన నన్నిక్కడకు ‘రా’...‘రా’ అని పిలుస్తున్నారు - ఉపేంద్ర

‘‘నల్లమలుపు బుజ్జిగారితో ‘రా’ సినిమా చేశాను. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగ తంగా కూడా నా జీవితంలో గుర్తుండి పోయే సినిమా అది. ఎందుకంటే ఆ సినిమా సమయంలోనే తొలిసారిగా నా భార్య ప్రియాంకను కలిశాను. బుజ్జిగారు మళ్లీ ‘ఉపేంద్ర-2’తో ఆయన నన్నిక్కడికు ‘రా రా’ అని పిలుస్తున్నారు’’ అని ఉపేంద్ర అన్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఉపేంద్ర-2’.
 
 ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తెలుగులో విడుదల చేస్తున్నారు. పారుల్ యాదవ్, క్రిస్టీనా అకీవా కథానాయికలు. గురుకిరణ్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ -‘‘ ‘ఓం’  సినిమా చూసినప్పటి నుంచి ఉపేంద్ర అంటే నాకు ఇష్టం. నాకే కాదు అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే దర్శకులకు ఉపేంద్ర అంటే  చాలా క్రేజ్.
 
 ఆయన డైరక్షన్ టెన్షన్‌ను పక్కన పెట్ట్టి  సూపర్ స్టార్ అయ్యారు. మళ్లీ ఆయన ఈ ‘ఉప్రేంద-2’ సినిమాతో ఆపేయకుండా  డైరక్షన్‌ను కొనసాగించాలని కోరుతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిషోర్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, ‘ఠాగూర్’ మధు, దామోదర ప్రసాద్, దర్శకులు డాలీ, గోపీచంద్ మలినేని, రచయిత వక్కంతం వంశీ తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement