
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గని. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరణ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. జూలై 30న ‘గని’ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్. పాత్ర గురించి వివరించగానే ఉపేంద్ర సంతోషంగా అంగీకరించారట. ఫిబ్రవరి 12న ఉపేంద్ర ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నాడు. అందాల రాక్షసి ఫేమ్… నవీన్ చంద్రకు కీలకమైన పాత్ర దక్కింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.