
బిగ్ బాస్ షోలో ప్రతిసారి 15 మందికి పైగా పాల్గొంటారు. కానీ అందులో ఒకరో ఇద్దరో మాత్రం పాపులారిటీ సంపాదిస్తాడు. అలా ఏడో సీజన్ లో పాల్గొని తనదైన మాటలతో గుర్తింపు తెచ్చుకుంది శోభాశెట్టి. 'కార్తీకదీపం' మోనితగా ఎంత విలనిజం చూపించిందో.. షోలోనూ అలానే కనిపించింది.
శోభాశెట్టి స్వతహాగా కన్నడ అమ్మాయి. అయితేనేం సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. మంచి ఫేమ్ సంపాదించుకుంది. అదే ఊపులో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో పాల్గొంది. షో వల్ల ఈమెపై బాగా నెగిటివిటీ పెరిగిపోయింది. తర్వాత తెలుగులో కొత్తగా సీరియల్స్ ఏం చేయలేదు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
షోలో ఉన్నప్పుడే ఈమె ప్రేమ విషయం బయటపడింది. తనతో పాటు సీరియల్స్ చేసిన తెలుగు నటుడు యశ్వంత్ రెడ్డితో ఈమె చాలాకాలంగా ప్రేమలో ఉంది. కానీ బిగ్ బాస్ షోలో నాగార్జున దీన్ని బయటపెట్టాడు. అలా శోభా లవ్ స్టోరీ అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే గతేడాది వీళ్లిద్దరికీ నిశ‍్చితార్థం జరిగింది. శోభా కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంది.
తాజాగా తన నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మరోసారి ఆ ఫొటోలు పోస్ట్ చేసింది. తొలి వార్షికోత్సవం అని రాసుకొచ్చింది. ఐదేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనే విషయాన్ని బయటపెట్టింది. అంతా బాగానే ఉంది కానీ పెళ్లెప్పుడు చేసుకుంటారనేది మాత్రం చెప్పలేదు. మరి ఈ ఏడాది ఏమైనా శుభవార్త చెబుతారా? లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్)


