
సినిమాల్లో మారువేషాలు మారుపేరులు కలిగిన పాత్రను చూస్తుంటాం. అయితే నటి శృతిహాసన్ నిజ జీవితంలోనూ మారుపేరుతో తిరగడం విశేషం. సలార్ చిత్రం తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు తెరపై చూడలేదు. అయినప్పటికీ ఈమె పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. అందులో ఒకటి రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ.. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో నటి శృతిహాసన్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు .అదేవిధంగా విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు.
అయితే, విజయ్ దళపతి 69వ చిత్రం జననాయకన్‌లో కూడా ఈ బ్యూటీ కీలకపాత్రలో మెరవబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా శృతిహాసన్ ఏదో ఒక సంచలన ఘటనలనో, లేక ఆసక్తికరమైన విషయాలనో అభిమానులతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి కమల్ హాసన్ లెగిసీని వాడుకోకపోయినా ఆయన గొప్పతనాన్ని తరచూ వ్యక్తం చేస్తూనే ఉంటారు. కాగా తాజాగా తను సినీ రంగ ప్రవేశం చేయకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ఓ భేటీలో తెలిపారు. తాను కమల్ వారసురాలని బయట తెలిస్తే.. స్నేహితులతో తిరగడానికి ఇబ్బంది కలుగుతుందని భావించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
సినీ రంగ ప్రవేశం చేయకముందు నకిలీ పేరుతో కొన్ని రోజులు చాలా స్వేచ్ఛగా తిరిగానని పేర్కొంది. నటుడు కమలహాసన్ కూతురు అని పరిచయం చేసుకుంటే ఎవరితో మాట్లాడిన వాళ్లు పూర్తిగా తన తల్లిదండ్రుల గొప్పతనం గురించే మాట్లాడుతారని, అందుకే తాను నకిలీ పేరు చెప్పి పరిచయం చేసుకునేదానినని, అలా వారితో ఎలాంటి సంశయం లేకుండా కోరుకున్న విధంగా నేను నాలా మాట్లాడగలిగేదాన్ని శృతిహాసన్ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే చిత్రాల్లో నటించడం ప్రారంభించానో అప్పటి నుంచి ఆ నకిలీ పేరును వాడే అవకాశం లేకపోయిందని ఈ భామ పేర్కొన్నారు.