
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. నేడు(సోమవారం)సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్‌ను అందిస్తూ సిద్దార్థ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B'day 🥳 & a fabulous year ahead ✨
— Lyca Productions (@LycaProductions) April 17, 2023
🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr