Indian 2 Movie
-
93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!
రిలీజైన ప్రతి సినిమా హిట్టవదు. కంటెంట్‌లో దమ్మున్నవి మాత్రమే హిట్టు, సూపర్ హిట్టుగా నిలుస్తాయి. కథలో ఏమాత్రం పస లేకపోయినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అలా తమిళ సినిమాలోనూ వందల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. 2024లో తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలెన్ని? (Kollywood Box Office Report - 2024) లాభనష్టాలేంటి? అనేవి ఓసారి చూసేద్దాం..రూ.1000 కోట్ల నష్టంకోలీవుడ్ (Tamil Cinema Industry)లో గతేడాది 241 సినిమాలు రిలీజయ్యాయి. వీటికోసం తమిళ ఫిలిం మేకర్స్ దాదాపుగా రూ.3000 కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసిన నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గ భంగపాటు ఎదురైంది. ఏకంగా 223 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి. దీంతో వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లింది. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలు సైతం చతికిలపడ్డాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన కంగువా రూ.1000 కోట్లు రాబడుతుందనుకున్నారు. అతి కష్టమ్మీద రూ.100 కోట్లు!తీరా చూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాగే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియన్ 2 సినిమా (Indian 2 Movie)ను రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చివరకు ఇది కూడా కంగువా బాటలోనే పయనించింది. రూ.150 కోట్లకంటే ఎక్కువ రాబట్టలేకపోయింది. రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాన్ని సైతం ప్రేక్షకులు ఇలాగే తిరస్కరించారు.చదవండి: పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన93% సినిమాలు ఫ్లాప్2024లో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ఈ లెక్కన గతేడాది 93% చిత్రాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోగా ఏడు శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జాబితాలో అమరన్ (Amaran Film), ద గోట్, రాయన్ వంటివాటితో పాటు లబ్బర్ పందు, గరుడన్, డిమాంటి కాలనీ 2, వాళై చిత్రాలూ ఉన్నాయి. 2025కి తమిళ ఇండస్ట్రీ శుభారంభం పిలికింది. మదగజరాజ, కుడుంబస్తాన్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. కానీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది.ఆశలన్నీ ఈ ఏడాదిపైనే!2023లో జైలర్, పొన్నియన్ సెల్వన్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కాసులవర్షం కురిపించాయి. కానీ 2024లో మాత్రం ఇండియన్ 2, కంగువా, వేట్టైయాన్ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడ్డాయి. ద గోట్, అమరన్, మహారాజా, రాయన్, అరణ్మణై 4 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే హిట్టందుకున్నాయి. 2024 అత్యంత చెత్త సంవత్సరంగా నిలిచింది. 2025లో ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.- నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జి. ధనాంజనేయన్చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ -
భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్!
కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం. ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సూర్య కంగువాకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.రామ్ పోతినేని- డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.మహేశ్ బాబు- గుంటూరు కారంఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది.మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై, మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
భారతీయుడు 2 ఫ్లాప్ మీద స్పందించిన శంకర్
-
ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు సంతోషం: రేణు దేశాయ్
భారతీయుడు సినిమా ఎంత హిట్టో దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 అంత ఫ్లాప్‌గా నిలిచింది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదలవగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ వీక్షించిన నటి రేణు దేశాయ్ సినిమా టీమ్‌పై ఫైర్ అయింది. ఇటువంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. చాలా సంతోషంఆమె ఇలా మాట్లాడటానికి అందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్ ఉంటుంది. ఆ క్లిప్పింగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రేణు దేశాయ్.. తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు ఏమైంది? అని మండిపడింది. ఇకపోతే ఇండియన్ 2తో ట్రోలింగ్ బారిన పడ్డ శంకర్ తర్వాతి పార్ట్ విషయంలో అయినా జాగ్రత్త వహిస్తే బెటర్ అని నెటిజన్లు సూచిస్తున్నారు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఇండియన్-2ను అధిగమించిన విజయ్ చిత్రం!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌లతో కమల్ హాసన్'ఇండియన్- 2' మూవీని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 12.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. అంతకుముదు ఇండియన్-2 మూవీకి ముందస్తు బుకింగ్స్ ద్వారా రూ. 11.20 కోట్లు మాత్రమే వచ్చాయి. విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉడండంతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశముంది. కేవలం బాక్సాఫీస్ వద్ద ప్రీ టికెట్ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా బిజినెస్ జరగవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే అత్యధిక వసూళ్లతో ది గోట్ కోలీవుడ్‌లో రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ చివరిసారిగా లియో చిత్రంలో నటించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. -
వీకెండ్లో ఓటీటీ చిత్రాలు.. ఆ ఒక్క సినిమాపైనే అందరి చూపులు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. స్టార్ హీరోల సినిమాలన్నీ ఆగస్టు 15న రానున్నాయి. దీంతో ఈ వారం చిన్న చిత్రాలు సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. వాటిలో కమిటీ కుర్రోళ్లు, సింబా, భవనం, తుఫాన్ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు.దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం ఏయే చిత్రాలు రానున్నాయని తెగ ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్లో ఓటీటీలో అలరించేందుకు ఇండియన్-2 వచ్చేస్తున్నాడు. కమల్‌హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కించారు. దీంతో పాటు మలయాళ, తమిళ డబ్బింగ్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.వీకెండ్ ఓటీటీ చిత్రాలునెట్ఫ్లిక్స్భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమాగుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9డిస్నీ ప్లస్ హాట్స్టార్లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఆహాడెరిక్ అబ్రహాం(మలయాళ సినిమా) - ఆగష్టు 107/జీ (తమిళ సినిమా)- ఆగస్టు 9సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9సింప్లీ సౌత్అన్నపూరణి ఆగస్టు 9(ఇండియాలో స్ట్రీమింగ్ లేదు) -
భారతీయుడు 2 ఫ్లాప్.. నా వల్లే అంటున్నారు: హీరోయిన్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్.ముందే తెలిస్తే..హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.వర్కవుట్ కాకపోతే..అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్ 2 హిట్ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్ -శంకర్ సర్ కాంబినేషన్లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..ఒక్కరే కారణం కాదుసినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 జులై 12న విడుదలైంది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.భారతీయుడు 2 సినిమాను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కోలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ధరతో ఈ సినిమా రైట్స్‌ను వారు తీసుకున్నట్లు సమాచారం. విడుదల సమయం నుంచి సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావలనే షరతుతో నెట్‌ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుందట. వారి ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 12 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటి వరకు కనీసం రూ.70 కోట్లు కూడా దాటలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో నిర్మాతలకు కూడా తీరని నష్టాన్ని ఇండియన్ 2 సినిమా మిగిల్చిందనే చెప్పవచ్చు.భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పటికే చాలాచోట్ల తొలగించేశారు. ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. దీంతో ఈ చిత్రాన్ని అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. ఆగష్టు 2న భారతీయుడు 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ మంతనాలు జరుపుతుందట. ఈమేరకు అధికారికంగా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. -
'ప్రతి ఒక్కరూ మేధావులు అనుకుంటారు'.. బాబీ సింహా షాకింగ్ కామెంట్స్!
అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారతీయుడు-2. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీని 1996లో భారతీయుడుకు సీక్వెల్‌గా తీసుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడంతో అందరి చూపు ఇండియన్-2 పైనే ఉంది. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని షాకిచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాబీ సింహాకు నెగెటివ్ రివ్యూలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇండియన్-2కు నెగెటివ్ రివ్యూలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.బాబీ సింహా మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరూ తమకు తాము తెలివైన వారని అనుకుంటారు. సినిమాను విమర్శించడానికి కారణాలను వాళ్లే వెతుక్కుంటారు. మేము అలాంటి వాటిని అస్సలు పట్టించుకోం. కేవలం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను మాత్రమే గుర్తుంచుకుంటాం. రివ్యూలు ఇచ్చే కొందరు మేధావుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతే కాకుండా ఇండియన్-3 చూసే వరకు ఇండియన్ -2ని అంచనా వేయకూడదని సూచించారు. అయితే బాబీ సింహా కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమా నచ్చకపోతే మీ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అయితే మరికొందరు బాబీని సమర్థించారు. ఎప్పుడూ నెగెటివ్ రివ్యూలు ఇచ్చే మేధావుల గురించే ఆయన స్పష్టంగా మాట్లాడారని అంటున్నారు.కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్‌హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్‌గా బాబీ మెప్పించారు. ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్, సముద్రఖని కూడా నటించారు. #BobbySimha rather than you blaming audiences, admit the flaws in the movie and try to entertain audiences genuinely. Please re-watch your brilliant performances in #Indian2 again. Don't underestimate audiences.@actorsimha https://t.co/e8l52b9L9y pic.twitter.com/ndyPJNnYhi— Tharan (@jayshah_my) July 19, 2024Bobby Simha criticize the Audience 😐pic.twitter.com/sCBdXzlrDd— Ayyappan (@Ayyappan_1504) July 18, 2024 -
దారుణంగా ఇండియన్-2 కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. భారతీయుడు సీక్వెల్‌గా తీసుకొచ్చిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రెండు కలెక్షన్స్ ఫర్వాలేదనిపించినప్పటికీ... ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. వీక్ డేస్‌లో ఊహించనా కలెక్షన్స్ రాలేదు. తాజాగా ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఏడో రోజు ఇండియాలో కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు సాధించింది. ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడం కలెక్షన్స్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారం రోజుల్లో రూ. 121.65కిపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. -
ఇండియన్-2 పై నెగెటివ్ టాక్.. మేకర్స్ కీలక నిర్ణయం!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్‌కు రన్ టైన్ తగ్గించిన ఇండియన్-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. పడిపోయిన వసూళ్లుఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe— Lyca Productions (@LycaProductions) July 17, 2024 -
సెప్టెంబరులో స్టార్ట్?
ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్, కల్కి 2898 ఏడీ, కమల్‌హాసన్ ‘విక్రమ్’, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, యశ్ ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా చేసిన అన్బరివ్ (అన్బు, అరివు ద్వయం)దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ మూవీని ప్రకటించారు. అయితే ‘ఇండియన్ 2’, ‘థగ్ లైఫ్’ సినిమాలతో కమల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ‘ఇండియన్ 2’ విడుదలవడం, ‘థగ్ లైఫ్’ చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో అన్బరివ్ల సినిమాపై కమల్ దృష్టిసారించారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు నుంచి మొదలయ్యేలా కమల్ అండ్ కో సన్నాహాలు చేస్తున్నారట. కమల్‌హాసన్ , ఆర్.మహేంద్రన్ నిర్మించనున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్.. డైరెక్టర్‌పై నెటిజన్స్ ఫైర్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇండియన్-2 సినిమాపై ట్వీట్ చేశారు. శంకర్ సార్ నిబద్ధతకు.. కమల్ హాసన్ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్‌కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ లోకేశ్ కనగరాజ్ ట్వీట్‌పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండని లోకేశ్‌కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్-2పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. #Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️Can’t wait for #Indian3 🔥🔥— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024 -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి
కమల్‌హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2 థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వీక్షించిన బిగ్‌బాస్ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతీయుడు-2 మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.భోలే షావలి మాట్లాడుతూ..' ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశా. ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఇండియన్-2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. #Kalki2898AD రేంజ్ లో #Bharateeyudu2 ఎంజాయ్ చేస్తారు - Audience ReactionWatch Full public response here ▶️ https://t.co/rez0iLsFFFRead review here 🔗 https://t.co/8I8RV7o8em#KamalHaasan #Shankar #Indian2 #TeluguFilmNagar pic.twitter.com/XnxlwRPuXr— Telugu FilmNagar (@telugufilmnagar) July 12, 2024 -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్‌కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
భారతీయుడు 2 రిలీజ్.. టెన్షన్లో రామ్ చరణ్ ఫ్యాన్స్!
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది రేపటి టాక్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్ టాక్ వస్తే.. ఆటోమేటిక్‌గా బుకింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.(చదవండి: తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్ ధరల్లో ఇంత తేడాలేంటి?)ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్ అయితే గేమ్ ఛేంజర్‌కి ప్లస్ అవుతుంది. (చదవండి: కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు)ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్‌కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. అసలే శంకర్‌కి సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్‌కి కూడా భారతీయుడు2 హిట్ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
ఇదేంటి భయ్యా?.. ఇండియన్-2 టికెట్స్ అక్కడే చీపా?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 టికెట్‌పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls) -
ఇండియన్-2 బుకింగ్స్.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవ్వగా.. చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్-2 చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుడు2 టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 చొప్పున టికెట్‌పై పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది.కాగా.. ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోను తయారు చేసి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీని కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లాంటి యాంటి డ్రగ్స్‌పై వీడియోను రిలీజ్ చేశారు. దీంతో టికెట్స్ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతులు జారీ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
రిలీజ్ ముందు షాక్.. చిక్కుల్లో ఇండియన్-2!
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఇండియన్-2 చిక్కుల్లో పడింది. తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ చిత్రంలో వాడుకున్నారని మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాను రిలీజ్ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కాగా.. ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివిన డైరెక్టర్ శంకర్ గతంలో వచ్చిన భారతీయుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్‌హాసన్‌కు రాజేంద్రన్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే తాజాగా సీక్వెల్‌గా వస్తోన్న ఇండియన్-2లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ వాడారని రాజేంద్రన్ ఆరోపిస్తున్నారు. -
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
-
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
ఇండియన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వానికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సిద్ధార్థ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని తెలిపారు. వారి కాపాడాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. బెటర్ సొసైటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నా కెరీర్లో సామాజిక బాధ్యతను తనవంతుగా భావిస్తానని పేర్కొన్నారు. కాగా.. సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా పేరు సిద్ధార్థ్. నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నా.. తెలుగు సినిమాలో ఒక చేతిలో కండోమ్ పట్టుకుని బిల్ బోర్డ్స్‌లో నా ఫోటో వచ్చేలా గతంలోనే ప్రభుత్వానికి సహకరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 నుంచి 2011 వరకు ఎక్కడా హోర్డింగ్ కనిపించినా కండోమ్ పట్టుకుని మీకు సిద్ధార్థ్ కనిపిస్తాడు. ఆ సామాజిక బాధ్యత నాది. ఒకరు చెబితే నాకు గుర్తుకు రాదు. ఎవరైనా చెప్తే చేయాల్సిన అవసరం నాకు రాలేదు. మాకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇది చేస్తేనే అది చేస్తాం అని చెప్పలేదు' అని అన్నారు. -
భారతీయుడు సందేశం సమాజానికి చేరాలి: కమల్‌హాసన్
‘‘ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కరప్షన్ పెరిగిపోతోంది. లంచాల నిర్మూలనకు మనం గట్టిగా ప్రయత్నించడం లేదు. ఈ అంశాలతో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాలోని సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలి’’ అని కమల్‌హాసన్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు.ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేస్తున్నాయి. సోమవారం జరిగిన సమావేశంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ ఆరంభంలో తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన హిట్టు పడలేదు. తెలుగులో నాకు ‘మరోచరిత్ర, ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం’ వంటి ఎన్నో హిట్స్ వచ్చాయి.తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ని చేశారు. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు నన్నెంతో ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘భారతీయుడు’కి సీక్వెల్ తీయాలని ముందు అనుకోలేదు. అయితే కరప్షన్ వార్తలు చదివినప్పుడు నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. ఆ ఆలోచనతో ‘భారతీయుడు 2’ తీశాను’’ అన్నారు శంకర్. ‘‘వినోదం, సందేశంతో తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ‘భారతీయుడు’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు. -
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ చూశారా? ఆయన ముందే మిమిక్రీ..
భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందంఈ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్‌లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు. మాటలు రావడం లేదుచాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్‌ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024 చదవండి: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక -
'మా సినిమాను అమ్ముతున్నాం'.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం ఇండియన్-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నేను ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే మేము రూపొందించిన ప్రొడక్ట్ గురించి తెలియాలి. ఏ వ్యాపారి అయినా తన ప్రొడక్ట్ గురించి ప్రజలకు వివరించాలి. అలాగే మా ప్రొడక్ట్ ఇండియన్-2 అమ్ముతున్నా. మంచి క్వాలిటీగా తయారు చేశాం. ఇందులో నాకు ఎలాంటి సిగ్గు, మొహమాటం లేదు. ఇది మా పని.' అని అన్నారు. ఇది విన్న నెటిజన్స్ కమల్ హాసన్ సింప్లీసిటీని మెచ్చుకుంటున్నారు. కాగా.. ఇండియన్-2 ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషించారు. -
Kamal Haasan: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఇకపై నా లక్ష్యం అదే: కమల్‌హాసన్
‘‘యాభై రెండేళ్ల క్రితం నేను హైదరాబాద్‌కు ఓ సాంకేతిక నిపుణుడిలా వచ్చాను. నటుడిగా మూడుతరాలుగా నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంతకాలం నన్ను ప్రేక్షకులు స్టార్డమ్లో ఉంచారు. ఇక నాకు ఏదైనా లక్ష్యం ఉందా? అంటే బాలచందర్గారిలా చాలామందిని చిత్ర పరిశ్రమకు తీసుకురావాలి. నాలాంటి నటులను తయారు చేయాలి. అలా ప్రేక్షకుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను’’ అని కమల్‌హాసన్ అన్నారు.శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్ర ఖని, బాబీసింహా, గుల్షన్ గ్రోవర్ ఇతర రోల్స్‌లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ‘భారతీయుడు 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీలక్ష్మి మూవీస్ దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ–‘‘కమ్‌బ్యాక్ ఇండియన్ ’ అంటే ఇండియన్ తాత గురించి కాదు.. మనవడు రావాలి.. వస్తాడు. ‘ఇండియన్ 2’ను హిట్ చేయండి.. త్వరగా ‘ఇండియన్ 3’ చూస్తారు. ‘భారతీయుడు’ నిర్మించిన ఏఎయం రత్నంగారికి ధన్యవాదాలు. శంకర్గారిలాంటి విజన్ ఉన్న దర్శకులు ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయి సినిమా చేశారు. ఇందులో తెలుగు సినిమాకు పెద్ద భాగం ఉంది. కళాకారులు భాష సరిహద్దులను చేరిపేశారు. అలాంటి వారిలో కె.విశ్వనాథ్, బాలచందర్, శంకర్గార్ల వంటి దర్శకులు, ఆర్టిస్టులు ఉన్నారు’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ–‘‘లంచగొండి వార్తలను చదివిన ప్రతిసారి ‘భారతీయుడు’ మళ్లీ రావాలని నాకు అనిపించేది. కానీ స్టోరీ కుదరలేదు. ‘2.ఓ’ తర్వాత కమల్‌గారికి ‘భారతీయుడు’ సీక్వెల్ కథ చె΄్పాను. నేను రాసిన ఓ సన్నివేశాన్ని తన నటనతో పదింతలు గొప్పగా ఉండేలా చేస్తారు కమల్‌గారు. బ్రహ్మానందంగారికి నేను అభిమానిని. ‘ఇండియన్ 2, గేమ్‌చేంజర్’లో ఆయన అతిథి పాత్ర చేశారు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సునీల్, తిరుపతి ప్రసాద్‌గార్లకు థ్యాంక్స్. రామ్‌చరణ్‌తో ‘గేమ్‌చేంజర్’ చేస్తున్నాను. త్వరలోనే రిలీజ్ డేట్ లాక్ చేస్తాం’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం నాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు’’ అన్నారు ఏస్జే సూర్య. ‘‘నా అభిమాన నటుడు కమల్‌గారితో నటించాలన్న నా కల నిజమైంది.కమల్‌హాసన్ గారికి నేను ఎప్పటికీ విద్యార్థినే. యువతరానికి కోపం వస్తే ఏం జరుగుతుంది? అన్నది ‘భారతీయుడు 2’లో ఉంటుంది’’ అన్నారు సిద్ధార్థ్. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం హ్యాపీ’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ‘‘ఈ విశ్వంలో కమల్గారిలాంటి నటుడు మరొకరు లేరు. ఆయనతో నటించానని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. ఈ వేడుకలో నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్, నటులు బాబీసింహా, సముద్రఖని, గీత రచయితలు సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండియన్-2 బాగాలేదా?.. అసలు కమల్ హాసన్ ఏమన్నారంటే?
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా కమల్ హాసన్ సింగపూర్‌కు వెళ్లారు. తనకు భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 ఎక్కువగా నచ్చిందని అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియన్-2 బాగాలేదా అని చర్చ మొదలెట్టారు. తాజాగా ఈ కామెంట్స్‌పై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.కమల్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. రెండో పార్ట్ కంటే మూడో పార్ట్ బాగుందని చెప్పా అంతే. అంటే ఇక్కడ పార్ట్-2 బాగాలేదని కాదు. మనం సాంబార్, రసం లాంటి వాటితో భోజనం చేస్తున్నప్పుడు ఆ తర్వాత తినే పాయసం గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. నా కెరీర్లో ఇండియన్-2 కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు స్వీకరించా. కొవిడ్ లాక్డౌన్, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యంతో కొందరు నటులు మరణించడం లాంటి ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్ జాగ్రత్తలు తీసుకున్నారు' అని అన్నారు. కాగా.. ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆరు నెలల్లోనే పార్ట్- 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
భారతీయుడు 2 సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా..?
అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై శంకర్ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. అయితే, ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3.04 గంటల పాటు నిడివి ఉంది. ఈ చిత్రం నుంచి కొన్ని అభ్యంతకరమైన సీన్లును తొలగించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఇంత నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలంటే కథ ప్రధాన బలంగా ఉండాలి. ఈ విషయంలో శంకర్ విజయం సాధిస్తాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.రంగస్థలం నుంచి ఈ మధ్య వచ్చిన యానిమల్, సలార్, కల్కి వంటి చిత్రాలు మూడు గంటల నిడివితో వచ్చినవే కావడం విశేషం. ఇప్పుడు తాజాగా భారతీయుడు 2 కూడా ఎక్కువ రన్‌టైమ్ ఉన్న లిస్ట్‌లో చేరిపోయింది. భారీ అంచనాలతో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్మురేపిన కమల్ ఇప్పుడు భారతీయుడు చిత్రంతో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ఉన్నారు. -
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
కమల్ హాసన్ భారీ బడ్జెట్ చిత్రం.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కమల్ హాసన్ నటిస్తోన్న తాజా చిత్రం ఇండియన్- 2(భారతీయుడు-2). ఈ సినిమాను శంకర్ డైరెక్షన్లో భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నుంచి ‘క్యాలెండర్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను చంద్రబోస్ రాయగా.. శ్రావణ భార్గవి ఆలపించారు.కాగా.. 28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఈ చిత్రంలో ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. -
ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
హీరో యిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ది చిత్ర పరిశ్రమలో దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం. 2009లో ‘జిల్లీ’ అనే కన్నడ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా రకుల్‌ప్రీత్ నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ మూవీలో కీలక పాత్ర పోషించారామె. ఈ నెల 12న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘భారతీయుడు 2’ సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ చిత్రం కోసం విలక్షణ నటులు కమల్ హాసన్ సర్‌తో, గొప్ప దర్శకుడైన శంకర్ సర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. షూటింగ్ సమయంలో శంకర్ సర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు. తెరపై కథలని, పాత్రలను ఆయన చూపించే విధానం అద్భుతం. శంకర్సర్ ఆలోచనా విధానం, సృజనాత్మకత గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అన్నారు. ఇదిలా ఉంటే.. రకుల్ ప్రస్తుతం హిందీలో ‘మేరీ పత్నీకా రీమేక్, దే దే ΄్యార్ దే 2’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. కాగా నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఫిబ్రవరి 21న జరిగిన విషయం తెలిసిందే. అటు వ్యక్తిగత జీవితం, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రకుల్‌ప్రీత్. -
రోబో, 2.0 సినిమా ఆఫర్.. అందుకే వెనకడుగు వేశా!
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందింది. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌కి సమయం దగ్గరపడటంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఐ–రోబో’ అనే ఇంగ్లిష్ నవలను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్, రచయిత సుజాత (ఎస్. రంగరాజన్ ) 90ల్లోనే అనుకున్నాం. నా పాత్ర లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కానీ, ఆప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇండస్ట్రీలో బడ్జెట్, పారితోషికం, డేట్స్, మార్కెట్.. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి. అప్పటి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగు వేశా. కానీ, నా స్నేహితుడు శంకర్ మాత్రం వదల్లేదు. సరైన సమయంలో రజనీకాంత్‌తో ‘రోబో’ సినిమా తీసి, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే ‘2.0’ మూవీలో విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు శంకర్. అయితే కొన్నాళ్ల పాటు నేను హీరోగా ఉండాలనుకుంటున్నానంటూ నవ్వుతూ శంకర్‌కు చెప్పాను’’ అన్నారు కమల్ హాసన్. అయితే రజనీకాంత్ హీరోగా నటించిన ‘2.0’ మూవీలో విలన్‌గా అక్షయ్ కుమార్ నటించారు. -
ఇండియన్ 2 సినిమాకు విడుదల చిక్కులు
అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై శంకర్ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 చిత్రానికి విడుదల విషయంలో చిక్కులు ఏర్పడేలా కనిపిస్తున్నాయి.భారతీయుడు సినిమాలో అవినీతిపరులను అంతం చేసేందుకు కమల్ హాసన్ తన రెండు వేళ్ల సాయంతో శత్రువుల మెడ భాగంపై సింపుల్‌గా నొక్కి హతమారుస్తాడు . భారతీయుడు సినిమా కోసం మర్మక్కలై (మర్మకళ) అనే విద్యకు సంబంధించిన కొన్ని ట్రిక్స్‌ను కమల్ నేర్చుకున్నారు. 1996 సమయంలోనే ఆ విద్యను రాజేంద్రన్ అనే వ్యక్తి నుంచి కమల్ నేర్చుకున్నారు. ఇప్పుడు భారతీయుడు 2 సినిమా కోసం తను నేర్పించిన విద్యనే వెండితెరపై చూపించబోతున్నారని, అందుకు సంబంధించి తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని మదురై జిల్లా న్యాయస్థానంలో కాపీరైట్ కేసును రాజేంద్రన్ వేశారు. భారతీయుడు సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు.రాజేంద్రన్ తన పిటీషన్లో ఇలా పేర్కొన్నారు..' 1996 భారతీయుడు సినిమా సెట్లో కమల్‌హాసన్‌కు వర్మక్కలై విద్యకు సంబంధించి కొన్ని ముద్రలు నేర్పించాను. కొన్ని ఫైట్ సీన్స్‌కు అవసరమైన విద్యను నా నుంచే నేర్చుకున్నారు. మర్మకళ కళలోని శాస్త్రీయ పద్ధతులను చిత్ర దర్శకుడు శంకర్‌తో పాటు రచయిత సుజాతకు వివరించాను. అలా భారతీయుడు-1 సినిమాలో పనిచేసిన వ్యక్తుల జాబితాలో నా పేరు కూడా ఉంది.ఈ సందర్భంలో భారతీయుడు 2 సినిమా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలలో నేను కమల్ హాసన్‌కి శిక్షణ ఇచ్చిన మర్మకళ ముద్రలను మళ్లీ ఉపయోగించారు. కానీ సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు లేదు. ఇండియన్ సినిమా కోసం నా నుంచి ట్రైనింగ్ తీసుకున్న వర్మ ముద్రలనే ఇండియన్-2 సినిమాలో కూడా వాడారు కాబట్టి ఈ సినిమాలో కూడా నా పేరు ఎందుకు వేయలేదు. కాబట్టి ఈ సినిమా విడుదలను నిషేధించాలి.' అని పిటిషన్లో రాజేంద్రన్ పేర్కొన్నారు.ఈ కేసు మదురై జిల్లా న్యాయమూర్తి సెల్వ మహేశ్వరి ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఇండియన్ 2 నిర్మాత సుభాస్కరణ్, దర్శకుడు శంకర్, నటుడు కమల్ హాసన్‌లకు కాపీరైట్ నోటీసులు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూలై 9కి వాయిదా వేశారు. జూలై 12న భారతీయుడు సినిమా విడుదల కానుంది. -
Indian 2: 103 ఏళ్ల సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తాడు..? శంకర్ సమాధానం ఇదే
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్‌లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో సేనాపతిగా కమల్‌హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు. ‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా సేనాపతి కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. -
అబ్బ కమలహాసన్ !
-
కమల్‌హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
-
పారిపోలేరు... దాక్కోనూలేరు
‘ఊరారా ఇది... చదువుకు తగ్గ జాబ్ లేదు... జాబ్‌కి తగ్గ జీతం లేదు... కట్టిన ట్యాక్స్‌కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకడం లేదు’, ‘దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’ అంటూ ఓ మహిళ ఆవేదనతో చెప్పే డైలాగులతో ‘భారతీయుడు 2’ ట్రైలర్ ఆరంభమైంది.కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ (1996)కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2, భారతీయుడు 3’ చిత్రాలు రూపొందాయి. సిద్ధార్థ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, గుల్షన్ గ్రోవర్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో జూలై 12న విడుదల కానుంది.కాగా మంగళవారం ముంబైలో ‘భారతీయుడు 2’ ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ట్రైలర్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం... గాంధీజీ మార్గంలో మీరు... నేతాజీ మార్గంలో నేను’, ‘సో పారిపోలేరు... దాక్కోనూలేరు’, ‘టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది’ అంటూ కమల్‌హాసన్ చెప్పే డైలాగులు ట్రైలర్ ఉన్నాయి. ఇదిలా ఉంటే... ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. -
'భారతీయుడు 2' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?
కమల్ హాసన్ వారాల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇందులో ఒకటి 'కల్కి'. జూన్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇక 'భారతీయుడు 2'.. జూలై 12న ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా అన్ని భాషల ట్రైలర్స్‌ని ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?)అప్పుడెప్పుడో 1996లో శంకర్-కమల్ హాసన్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు' మూవీ సెన్సేషన్ సృష్టించింది. రెండు గెటప్పులో కమల్ అద్భుతమైన నటన.. ప్రేక్షకుల మైండే పోగొట్టేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ కుదిరింది. హీరో దర్శకుడు సేమ్. కాన్సెప్ట్ కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లే తీసుకున్నారు.ట్రైలర్ చూసుకుంటే.. సిద్ధార్థ్ ఓ స్టూడెంట్. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని ప్రశ్నిస్తాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విట్టర్లో 'ఆయన మళ్లీ రావాలి' అని ట్రెండ్ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం చేశాడు. ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇకపోతే గతంలో జూలై 12న రిలీజ్ అని ప్రకటించారు. ట్రైలర్లో మాత్రం డేట్ వేయలేదు. బహుశా 'కల్కి' టాక్ బట్టి నిర్ణయం తీసుకుంటారేమో?(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్) -
ట్రైలర్ రెడీ
హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్‌హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.సిద్ధార్థ్, ఎస్జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
ఇంకా సమయం ఉంది
‘‘భారతీయుడు 2(తమిళంలో ఇండియన్ 2)’ చిత్రం నా కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉందనే భావన కలిగించింది. ఈ సినిమా గురించి చాలా విషయాలు జనాలతో పంచుకోవాలనే ఆత్రుతగా ఉంది. కానీ, అందుకు ఇంకా సమయం ఉంది’’ అంటున్నారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. నటుడు, దర్శక–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన విషయం తెలిసిందే.పెళ్లి కోసం కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ జోరుమీదున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందింది. ఈ మూవీలో రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ–‘‘భారతీయుడు 2’ నా కెరీర్లోనే ఎంతో స్పెషల్ మూవీ. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను. నా గత చిత్రాలకంటే ఈ మూవీలోని నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేసినన్ని రోజులు గొప్ప అనుభూతి కలిగింది. శంకర్‌గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
-
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
అప్పుడే ఇండియన్ 2 గురించి శంకర్‌తో మాట్లాడా!: కమల్‌హాసన్
‘‘ఇరవైఎనిమిదేళ్ల క్రితం నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాల్సింది. అదే సమయంలో ‘ఇండియన్’ కథతో దర్శకుడు శంకర్ వచ్చారు. ఈ రెండు చిత్రాల కథలు దగ్గర దగ్గరగా ఉన్నాయని శివాజీగారితో చెప్పాను. ‘శంకర్గారితోనే సినిమా చేయండి. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. శివాజీగారు అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతో శంకర్‌గారితో ‘ఇండియన్ ’ సినిమా చేశాను. నిర్మాత ఏఎం రత్నంగారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ సమయంలోనే ‘ఇండియన్’కు సీక్వెల్ గురించి శంకర్‌గారితో మాట్లాడాను. కథ రెడీగా లేదన్నారు.28 ఏళ్ల తర్వాత ‘ఇండియన్ 2’ చేశాం. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది’’ అన్నారు కమల్‌హాసన్. హీరో కమల్‌హాసన్– దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలు రూపొందాయి. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ‘ఇండియన్ 2’ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో శంకర్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్ వంటి నటులు ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇండియన్ 2’ పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఇండియన్’ సినిమాకు ఏఆర్ రెహమాన్‌గారు గొప్ప సంగీతం ఇచ్చారు. ‘ఇండియన్ 2’కి నేను సంగీతం ఇచ్చాను. శంకర్‌గారు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు అనిరు«ద్ రవిచందర్. -
'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?
'విక్రమ్' సినిమాతో విలక్షణ నటుడు కమల్ హాసన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. దీంతో పలు భారీ చిత్రాల్లో భాగమయ్యారు. వీటిలో ఒకటే 'ఇండియన్ 2'. 'భారతీయుడు' మూవీకి సీక్వెల్ ఇది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దర్శకుడు-హీరో కలిసి పనిచేశారు. ఇలా చూసుకుంటే అంచనాలు ఏ రేంజులో ఉండాలి? కానీ రియాలిటీలో అలా ఉందా?(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)ఇప్పుడు సినిమాల విషయంలో భాషతో ఎవరికీ సంబంధం లేదు. మంచి కంటెంట్ ఎక్కడ ఉందా అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్-శంకర్ కలిసి 1996లో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్ తీశారు. జులై 12న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పర్వాలేదనిపించాయి. పూర్తి ఆల్బమ్ కూడా ఓకే ఓకే అనుకునేలా ఉంది తప్పితే సూపర్ అనే టాక్ రాలేదు. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ కాజల్ సీన్స్ ఏం లేవంట. అంటే సేనాపతికి భార్య క్యారెక్టర్ ఉండదేమో? అలానే తమిళంలో బజ్ ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం పెద్దగా లేదు. ఇప్పటివరకు శంకర్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదు. ఈ మూవీ ఒకటుందని సగటు ప్రేక్షకుడికి ఇంకా రిజిస్టర్ కావట్లేదు. విడుదలకు మరోనెల మాత్రమే ఉన్న నేపథ్యంలో 'భారతీయుడు 2' జోరు పెంచాలి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో సెలబ్రిటీల జోష్ (ఫోటోలు)
-
ఇండియన్ 2 కోసం కష్టపడ్డానన్న కాజల్.. సినిమాలో ఆమె పాత్ర లేదన్న డైరెక్టర్
తల్లయ్యాక హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అంతకుముందున్న క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కత్తిమీద సామే అవుతుంది. కానీ బాలీవుడ్లో మాత్రం అలియా భట్, కరీనా కపూర్, కాజోల్.. ఇలా పలువురూ తల్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సౌత్‌లో నయనతారను మినహాయిస్తే మరెవరికీ తల్లిగా ప్రమోషన్ పొందాక గొప్ప క్యారెక్టర్లు రావడం లేదు. బహుశా అందుకేనేమో చాలామంది బ్యూటీలు పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు.మా కోసం కథలు రాసుకుంటేనే..తాజాగా ఈ ధోరణిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. దక్షిణాదిన ఇంకా కొన్ని పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అది త్వరలోనే మారుతుందని ఆశిస్తున్నాను. పెళ్లయి పిల్లలున్నప్పటికీ మేము ఏ పాత్రనైనా పోషించగలం. మమ్మల్ని శక్తివంతంగా చూపించే పాత్రలు మేకర్స్ డిజైన్ చేయాలి. వీళ్లు అలాంటి కథలు రాసుకుంటేనే కదా ప్రేక్షకులు చూసేది. కొంతవరకు పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే తను సెలక్ట్ చేసుకునే సినిమాలు చాలా బాగుంటాయి. యాక్షన్ రోల్స్, రొమాంటిక్ రోల్స్ ఇలా తనకు నచ్చినవి చేస్తోంది.డెలివరీ అవగానే సినిమాలో..నా విషయానికి వస్తే.. నేను కరోనాకు ముందే కొన్ని సినిమాలకు సంతకం చేశాను. వాటిని దాదాపు పూర్తి చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అవగానే ఇండియన్ 2 సినిమాలో పని చేయాల్సి వచ్చింది. ఇందులో నా జీవితంలోనే కష్టమైన పాత్రను పోషించాను. డైరెక్టర్ శంకర్ సర్ నాకోసం ఎదురుచూసి లాస్ట్ షెడ్యూల్‌కు రమ్మన్నాడు. ఎంతో కష్టంగా ఉన్న నా పాత్రను పూర్తి చేసేశాను అని చెప్పుకొచ్చింది.ఇండియన్ 2లో కాజల్ లేదుశనివారం (జూన్ 1న) జరిగిన ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో డైరెక్టర్ శంకర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కార్యక్రమం వేదికగా భారతీయుడు 2లో కాజల్ లేదని వెల్లడించాడు. తను మూడో భాగంలో ఉంటుందని తెలిపాడు. అసలు తనను తీసేసిన విషయం కాజల్కైనా తెలుసా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ 2లో ఆమె లేదని తేల్చేయడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం జూలై 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.చదవండి: వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు! -
భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
కమల్‌హాసన్- దర్శకుడు శంకర్ కాంబినేషన్లో విడుదలైన భారతీయుడు సినిమా సౌత్ ఇండియాలో భారీ హిట్‌ను అందుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పటికీ భారతీయుడు వారిద్దరి కెరియర్లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1996లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'భారతీయుడు' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ దుమ్మురేపాడు. ఆ పాత్రలో ఆయన చూపిన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ మరిచిపోలేము. అయితే, భారతీయుడు చిత్రాన్ని జూన్ 7న తెలుగు,తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది. 'భారతీయుడు'కు కొనసాగింపుగా ఇండియన్-2 కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు ఇండియన్2 రానుంది. దీంతో తొలి భాగం అయిన భారతీయుడు చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు.Get ready to re-live the blockbuster experience once again! 🤩#Bharateeyudu - 1 Re-Release Trailer Out TOMORROW, Stay Tuned!!💥Releasing worldwide in Telugu & Tamil on June 7th at theatres near you! 🔥@ikamalhaasan @shankarshanmugh @arrahman @mkoirala @UrmilaMatondkar… pic.twitter.com/wC36I7saE6— AM Rathnam (@AMRathnamOfl) May 26, 2024 -
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కమల్‌హాసన్- శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సౌరా అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషళ్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. గతంలో శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.An Indian rides forth with courage & valor! 🔥 Here's a promo of the 1st single #PAARAA from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁Rockstar @anirudhofficial musical 🎹Lyrics @poetpaavijay ✍🏻Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳… pic.twitter.com/dz2JeTiqP8— Lyca Productions (@LycaProductions) May 21, 2024 -
కమల్‌హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
శంకర్ డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్ నటిస్తోన్న చిత్రం ఇండియన్-2. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ట్వీట్ చేశారు.కాగా.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందించిన భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Vanakkam INDIA! 🇮🇳 The 1st single from INDIAN-2 in Rockstar ANIRUDH musical is dropping on May 22nd! 🥁 Get ready to welcome the comeback of SENAPATHY! 🤞🏻 Releasing worldwide in cinemas 12th July 2024! 🎬🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/9xcsaDTVf5— Lyca Productions (@LycaProductions) May 19, 2024 -
మరింత ఆలస్యంగా ‘ఇండియన్ 2’..?
భారతీయుడి రాక మరింత ఆలస్యం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). పాతిక సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌తోనే ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు శంకర్. ‘ఇండియన్ 2’ని ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్ రవిచందర్. -
శంకర్ ఇండియన్ 2 సినిమా పై భారీ ప్లాన్
-
సేనాపతి రాక అప్పుడే...!
జూన్‌లో థియేటర్స్‌కు రానున్నాడు భారతీయుడు. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. 1996లో విడుదలైన ఈ సినిమాకు పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సీక్వెల్స్‌ను రూపొందించారు హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయింది. ‘ఇండియన్ 2’ సినిమాను జూన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘సేనాపతి మళ్లీ వస్తున్నాడు. జూన్‌లో ‘ఇండియన్ 2’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది’’ అని ‘ఎక్స్’లో ఈ సినిమా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు కమల్‌హాసన్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. -
క్రేజీ న్యూస్.. భారతీయుడు 3 షూటింగ్ పూర్తి.. పార్ట్ 2 సంగతేంటి?
తమిళసినిమా: నటుడు కమల్‌హాసన్‌ను సినిమా ఎన్సైక్లోపీడియా అంటారు. ఇక్కడ ఆయనకు తెలియని విషయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలోనూ కమ లహాసన్ ముందుంటారు. అపూర్వ సహోదర్‌గళ్ చిత్రంలో అప్పు పాత్ర సృష్టినే అందుకు ఒక ఉదాహరణ. కాగా ఆధునిక టెక్నాలజీని వాడుకోవడంలో దర్శకుడు శంకర్ కూడా దిట్టే. ఈయన దర్శకత్వంలో కమలహాసన్ నటించిన ఇండియన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా దానికి ఒకేసారి రెండు సీక్వెల్స్‌ను రూపొందించడం విశేషం. లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం దాదాపు 5 ఏళ్లు పట్టింది. మొదట ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌ను ప్రారంభించినా, కాలయాపన, వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఇండియన్ 2, 3 సీక్వెల్స్‌ను ఏకకాలంలో తెరకెక్కించారు దర్శకుడు శంకర్. కాగా ఈ రెండు చిత్రాల షూటింగ్‌ను కమలహాసన్ పూర్తి చేశారు. దీని గురించి ఆయన ఒక భేటీలో తెలుపుతూ ఇండియన్ 2, 3(తెలుగులో భారతీయుడు 2,3) చిత్రాల షూటింగ్ పూర్తి అయ్యాందని, ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆ తరువాత సీక్వెల్ 3కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కాగా ఇందులో నటి కాజల్ అగర్వాల్, ప్రియ భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారన్నది గమనార్హం. ప్రస్తుతం తాను పార్లమెంట్ ఎన్నికల పనిలో ఉన్నానని, ఎన్నికలు పూర్తి అయిన తరువాత థగ్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుటికే కొంత భాగాన్ని పూర్తి చేసుకుంది. -
ఇక ప్రచారం తర్వాతే..!
‘విక్రమ్’ (2022) మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్‌హాసన్ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్’ (భారతీయుడు)కి సీక్వెల్‌గా కమల్ చేసిన ‘ఇండియన్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల షూటింగ్లో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఈ చిత్రం థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్’కి సీక్వెల్ కావడంతో ‘ఇండియన్2’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా కమల్‌హాసన్ అంగీకరించిన మరో చిత్రంపై కూడా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అదే ‘థగ్ లైఫ్’. కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్’ (నాయకుడు) తర్వాత దాదాపు 35 ఏళ్లకు ఈ కాంబినేషన్ ‘థగ్ లైఫ్’తో రిపీట్ అవుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్ పడింది. ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌హాసన్ మాట్లాడుతూ – ‘‘ఇండియన్ 2, ఇండియన్ 3’ చిత్రాల షూటింగ్ పూర్తయింది. రెండో భాగం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మూడో భాగం పనులు కూడా ఆరంభమవుతాయి. ‘కల్కి 2898ఏడీ’లో గెస్ట్ రోల్ చేశాను. ఇక ‘థగ్ లైఫ్’ షూటింగ్‌ని ఎన్నికల ప్రచారం తర్వాత మొదలుపెడతాం’’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకూ ‘థగ్ లైఫ్’ షూటింగ్ కొంత భాగం జరిగింది. ఈ మార్చిలో సెర్బియాలో షెడ్యూల్ ప్లాన్ చేశారు దర్శకుడు మణిరత్నం. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారం తర్వాతే ఈ షూటింగ్లో కమల్‌హాసన్ పాల్గొంటారు. ఈ చిత్రంలో కమల్ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఇక ‘మక్కల్ నీది మయమ్’ పేరిట 2018లో కమల్‌హాసన్ పొలిటికల్ పార్టీ ఆరంభించిన సంగతి తెలిసిందే. -
'కల్కి'లో నా పాత్ర ఇంతవరకే: కమల్ హాసన్
సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రాబోయే మూడు సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి 2898 AD గురించి తాజాగా ఆయన అప్డేట్ ఇచ్చారు. ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్ వివరాలతో పాటు పలు వివరాలను తెలిపారు. శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 పనులు పూర్తి అయ్యాయని చెప్పిన కమల్.. ఇండియన్ 3 షూటింగ్ కూడా పూర్తి అయిందని షాకిచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ 2 విడుదలకు రెడీగా ఉందని చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత దాని సీక్వెల్ పోస్ట్ ప్రోడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కల్కి చిత్రంలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కమల్ పంచుకున్నాడు. 'కల్కి' సినిమాలో కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించినట్లు ఆయన రివీల్ చేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం కూడా పూర్తి అయిందని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంతమేరకు షాక్ అయ్యారు. ఇకపోతే ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం 'థగ్ లైఫ్' చిత్రీకరణ మొదలుపెడతామని కమల్ ప్రకటించారు. కల్కిలో కమల్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించగానే ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశచెందారు. మరికొందరు మాత్రం డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్‌ను గుర్తు చేస్తూ కల్కిలో కమల్ 5నిమిషాలు కనిపించినా తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే పాత్రనే డిజైన్ చేసుంటారని నెటిజన్లు చెబుతున్నారు. కమల్ హాసన్ నేరుగా తెలుగు చిత్రంలో నటించి 29 ఏళ్లైంది. ఆయన నేరుగా టాలీవుడ్లో నటించిన చివరి చిత్రం.. ‘శుభ సంకల్పం’ (1995). కానీ చాలా రీమేక్, డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సుమారు రెండేళ్ల క్రితం విక్రమ్‌తో మెప్పించిన కమల్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’లో అతిథి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ తర్వాత మళ్లీ కల్కితో అతిథి పాత్రలో కనిపించనున్నారు. -
గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 తో బాక్స్ ఆఫీస్ బద్దలు.
-
ఇండియన్ 2 విడుదల ఫిక్స్ అయిందా..?
కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ ఈ ఏడాది మేలో విడుదల కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా స్టార్ట్ చేశారట మేకర్స్. త్వరలోనే ‘ఇండియన్ 2’ సినిమా రిలీజ్ గురించిన అధికారిక ప్రకటన కూడా రానుందని కోలీవుడ్ బోగట్టా. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’(తెలుగులో ‘భారతీయుడు 2’) రూపొందుతోంది. ‘ఇండియన్’ సినిమాకు దర్శకత్వం వహించిన శంకరే ‘ఇండియన్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్‌సింగ్ కీలకపాత్రలు పోషించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్ నిర్మించిన ‘ఇండియన్ 2’ కి అనిరుద్ స్వరకర్త. -
2024.. ఈ సినిమాల కోసం మూవీ లవర్స్ వెయిటింగ్.. (ఫోటోలు)
-
వేసవిలో వస్తున్నాడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. వీరి కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో మొదలైన ‘ఇండియన్ 2’ భారీ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసిందని, ఈ షూటింగ్ షెడ్యూల్‌తో టాకీ పార్టు పూర్తయిందని సమాచారం. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను కూడా చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
భారతీయ చిత్ర పరిశ్రమలో తమదైన క్రేజ్, ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి నటించి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. దాదాపు 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే స్టూడియోలో కలిసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రజినీ–కమల్ కలిసి ఒకే సినిమాలో నటించడం లేదు. కానీ, వారి వారి చిత్రాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో ఇలా కలిశారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ చిత్రీకరణ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది. ఈ స్టూడియో ఆవరణలోనే రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ‘తలైవర్ 170’ షూటింగ్ జరుగుతోంది. ‘తలైవర్ 170’ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి రజినీకాంత్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు కమల్‌హాసన్. 21 సంవత్సరాల తర్వాత ఒకే స్టూడియోలో వీరిద్దరి మూవీస్ షూటింగ్స్ జరుపుకోవటం, అక్కడ వీరు కలుసుకోవడంతో గత స్మృతులను నెమరువేసుకున్నారు. 2002లో రజినీకాంత్ ‘బాబా’, కమల్‌హాసన్ ‘పంచ తంత్రం’ చిత్రాల షూటింగ్స్ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
విజయవాడకు భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే రూపొంది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్ కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్ 2’కు కొనసాగింపుగా ΄్లాన్ చేసిన ‘ఇండియన్ 3’ షూటింగ్‌ను కూడా ఆల్రెడీ శంకర్ ఆరంభించారని, ఇందుకు కమల్ అదనంగా 40 రోజుల కాల్షీట్స్ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, ‘ఇండియన్ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. -
Kamal Haasan Rare Photos: కమల్ హాసన్ మీరు ఎప్పుడు చూడని ఫోటోలు..
-
నేడు కమలహాసన్ జీవితంలో రెండు ప్రత్యేకతలు
లోకనాయకుడు కమలహాసన్ నటుడిగా 65 వసంతాలు పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన కళాకారుడిగా ఎదిగారు విశ్వనటుడు. నటుడిగానే కాకుండా నృత్య కళాకారుడిగా, కథకుడిగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని శాఖల్లోని ఘనాపాటి అయిన కమలహాసన్ చేసిన ప్రయోగాలు బహుశా ఏ నటుడు చేసి ఉండరు. ఈ విశ్వనటుడికి నేడు ఎంతో ప్రత్యేకం.. నటుడిగా 65 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు నేడు (నవంబర్ 7) 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాల నటుడిగా పరిచయం అయ్యి, ఆ తరువాత ప్రతి నాయకుడిగా మెప్పించి, ఆపై కథానాయకుడిగా ఉన్నత శిఖరానికి చేరడం అనితరసాధ్యమే కదా! ఒక్క తమిళ సినిమాకే తన సేవలను పరిమితం చేయలేదు. తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో నటించి బహుభాషా నటుడిగా ప్రకాశిస్తున్నారు. ఇక రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ భావితరాల నాయకుడిగా ఎదగడానికి బాటలు వేసుకుంటున్నారు. అయినా కళామతల్లి సేవలను నిరాటంకంగా కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రం రికార్డులను బద్దలు కొట్టేసింది. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తన 233వ చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో 234వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా మంగళవారం ఈ విశ్వనటుడి 69వ పుట్టినరోజు. అంటే భారతీయ సినిమాకే పర్వదినంగా పేర్కొనవచ్చు. సీనియర్ నటుడు శివకుమార్ కమల్ హాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో తమిళ సినీ పరిశ్రమలో అసహాయ సూర్యులు నడిగర్ తిలకం శివాజీ గణేషన్, విశ్వ నటుడు కమలహాసనే అని పేర్కొన్నారు. వారు చేసిన వైరెటీ పాత్రలు ఇప్పటివరకు మరెవరు చేయలేకపోయారని అన్నారు. శివాజీ గణేష్‌న్ చారిత్రక, సామాజిక, పౌరాణిక పాత్రలో ఎవరు ఊహించని స్థాయిలో చేశారని, అదే విధంగా కమలహాసన్ నటనతో పాటు భరతనాట్య కళాకారుడిగా, గాయకుడిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. 1973 ప్రాంతంలో అరంగేట్రం, సొల్లదాన్ నినైక్కిరేన్, తంగత్తిలే వైరం, మేల్నాట్టు మరుమగళ్ తదితర చిత్రాల్లో మేమిద్దరం కలిసి నటించామని వాటిలో అధిక శాతం ప్రతి నాయకుడిగానే నటించారని పేర్కొన్నారు. అలా విలన్‌గా నటించి ఆ తర్వాత హీరోగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తొలి నటుడు కమల్ మాత్రమేనని అన్నారు. నాయకన్, గుణా, అన్భే శివమ్, అవ్వై షణ్ముగం, హేరామ్ వంటి చిత్రాల్లో నటుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారని, నటుడిగా ఇంకా సాధించడానికి ఏమీ మిగలలేదనీ అన్నారు. రాజకీయ రంగం మీ కోసం ఎదురు చూస్తోందన్నారు. అమెరికా ఆరాధించిన అబ్రహాం లింకన్ కూడా రెండు మూడుసార్లు ఎన్నికల్లో అపజయాన్ని ఎదుర్కొన్న తరువాతే అధ్యక్షుడు అయ్యారని, మీరు కూడా సినిమాలో సాధించినట్లు రాజకీయాల్లో సాధించగలరు అని శివకుమార్ పేర్కొన్నారు. కాగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ నటించనున్న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడుదల చేశారు. దీనికి సినీ వర్గాలు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. -
Bharateeyudu 2: భారతీయుడు 2 మూవీ స్టిల్స్
-
భారతీయుడు ఈజ్ బ్యాక్
‘‘హలో... ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడుకి చావే లేదు’ అంటూ ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం చివర్లో కమల్‌హాసన్ చెప్పే డైలాగ్‌తో ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) ఇంట్రో గ్లింప్స్ మొదలవుతుంది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందిన ‘ఇండియన్’ (1993)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రధారులు. సుభాస్కరన్, ఉదయ నిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఇండియన్ 2’ ఇంట్రో గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఇండియన్ 2’ తెలుగు వెర్షన్ గ్లింప్స్‌ను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి షేర్ చేశారు. ఈ వీడియోలో ‘నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ కమల్‌హాసన్ చెప్పిన డైలాగ్ ఉంటుంది. -
Bharateeyudu 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇండియన్ 2 ఇంట్రో వచ్చేసింది..
విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 1996లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. . శుక్రవారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు. ‘భారతీయుడు’లో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పటంతో కథ ముగిసింది. అయితే ఇప్పుడు దేశంలో మళ్లీ లంచగొండితనం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవరూ ఏ పనులు చేయటం లేదు. దీంతో సామాన్యుడు బతకటమే కష్టంగా మారింది. అప్పుడు భారతీయులందరూ కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగుపెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగు పెడతారు. వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు.. భారతీయుడుకి భయపడి లంచాలు మానేసిన అధికారులు మళ్లీ లంచాలు తీసుకోవటానికి కారణం ఎవరు? పేట్రేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగాయి? అనే విషయాలను గ్లింప్స్‌లో చూపించారు. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి.. ఈ గ్లింప్స్‌లో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులు కనిపించారు. ఈ ఇంట్రో గ్లింప్స్‌ను తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, హిందీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఇంట్రో రెడీ
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄పొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మేజర్ షూట్ పూర్తయింది. తాజాగా ‘ఇండియన్ 2’ సినిమాకు సంబంధించిన వీడియోను ‘ఇండియన్ 2 యాన్ ఇంట్రో’ టైటిల్‌తో నవంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్. -
‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!
కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్–2. ఇది 1996లో కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ఇండియన్ సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్‌న్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ్రహ్మాండ కథాచిత్రాన్ని శంకరే తెరకెక్కిస్తున్నారు. నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం ప్రారంభమై ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇండియన్ 2 చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోందని అనుకుంటున్న సమయంలో తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మరో 30 రోజులు నిర్వహించాల్సి ఉందని తెలిసింది. కారణం ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలను పరిశీలించిన శంకర్ దీని పరిధి పెరిగినట్లు గమనించినట్లు సమాచారం. దీంతో దీనికి మరో సీక్వెల్ కూడా రూపొందించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అంటే ఇండియన్ చిత్రానికి మూడో భాగం కూడా పోతుందన్నమాట. ఇండియన్ చిత్రం మూడో సీక్వెల్ నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు. ఇప్పుడు మరో 30 రోజులు షూటింగ్ నిర్వహిస్తే ఇండియన్–3 చిత్రం కూడా పూర్తి అవుతుందని సమాచారం. ఈ షూటింగ్ కూడా కమలహాసన్ కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కాగా ఇందుకోసం ఆయనకు మరో రూ.120 కోట్లు చెల్లించనున్నారని తెలిసింది. కాగా ఇండియన్–3 చిత్రం కూడా రూపొందడంతో కమలహాసన్ ఇప్పటికే నటించడానికి అంగీకరించిన హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించడం 233వ చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో నటించనున్న 234వ చిత్రాల షూటింగ్ మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కమలహాసన్ మరో పక్క బిగ్‌బాస్ రియాల్టీ గేమ్‌షో 7 సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు. -
ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్.. ఈసారైన కలిసొచ్చేనా?
తమిళ సినిమా: దక్షిణాదిలో పాగా వేసిన ఉత్తరాది బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. శృతి మించిన అందాల ఆరబోతకు కేరాఫ్ ఈ జాణ. గ్లామర్‌తోనే తన సినీ పయనాన్ని లాగించేస్తున్న రకుల్ ప్రీతిసింగ్‌కు మంచి అభినయాన్ని ప్రదర్శించిన ఒక్క చిత్రం కూడా లేదనే చెప్పాలి. అయినా ఇంతకుముందు టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంది. అదే విధంగా తమిళంలో కొన్ని చిత్రాలు చేసినా ఇక్కడ సరైన హిట్ పడలేదు. ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో నటించినా, ఆ సక్సెస్ క్రెడిట్ హీరో కార్తీ, దర్శకుడు హెచ్ వినోద్‌ల ఖాతాలోనే పడింది. ఈ మధ్య అవకాశాలకు దూరమైన రకుల్ ప్రీతిసింగ్ ఆశలన్నీ తమిళ పరిశ్రమపైనే. ఈమె ఇటీవల హిందీ, తెలుగులో భాషల్లో నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో కమల్ హాసన్ సరసన నటిస్తున్న ఇండియన్ 2, శివకార్తికేయన్‌తో జత కట్టిన అయలాన్ చిత్రాలనే నమ్ముకుంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయినా తాను నటిగా చాలా ఉత్సాహమైన స్థానంలో ఉన్నానని రకుల్ ప్రీతిసింగ్ చెప్పుకుంటోంది. ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ భాషలకతీతంగా తనకు అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పింది. సినిమా ద్వారా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవడం మంచి అనుభవం అని పేర్కొంది. తాను ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు విడుదల కానున్నాయని, ఇది తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని చెప్పింది. అయితే తన పాన్ ఇండియా చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రకుల్ ప్రీత్‌సింగ్ పేర్కొంది. -
Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ విడుదల
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఇండియన్– 2 కోసం మరో అవతారం ఎత్తనున్న కమల్ హాసన్
పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవడంలో నటుడు కమలహాసన్ తర్వాతే ఎవరైనా అని పేర్కొనవచ్చు. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించిన నటుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది విశ్వనటుడు కమలహాసన్ ఒకరే. పాత్రకు అవసరమైతే మేకప్ కోసమే గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారాయన. అందుకు దశావతారం చిత్రమే ఒక ఉదాహరణ. అందులో పది పాత్రలు పోషించిన ఆయన ఒక్కో పాత్రలకు ఒక్కో విధంగా తయారైన తీరు అద్భుతమనే చెప్పాలి. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ఆ చిత్రంలో ఒక వృద్ధ మహిళా పాత్ర కోసం కమలహాసన్ మేకోవర్ అయిన విషయం సంచలనమనే చెప్పాలి. కాగా అదేవిధంగా అవ్వై షణ్ముకి (భామనే సత్యభామనే) చిత్రంలో నడివయసు స్త్రీ పాత్రను పోషించి నేర్పించారు. పలువురు హీరోలు స్త్రీ పాత్రలు పోషించినా పూర్తిస్థాయి మహిళా పాత్రల్లో నటించింది మాత్రం కమలహాసనే. కాగా తాజాగా ఆయన ఇండియన్– 2 చిత్రంలో మరోసారి మహిళగా అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి) 28 ఏళ్ల క్రితం కమలహాసన్ కథానాయకునిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్, శంకర్ల కాంబినేషన్లో లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పలు అద్భుతాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథలో భాగంగా కమలహాసన్ స్త్రీ పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో కమల్ స్త్రీ గెటప్ ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది. -
కమల్ మరో సాహసం... ప్రభాస్‌తో పోటీ
-
ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొన్నదో తెలిస్తే
విశ్వ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్– 2. రెండున్నర దశాబ్దాల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకరే ఈ చిత్రాన్నీ కూడా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడెక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై కూడా నాలుగైదు ఏళ్లు గడుస్తోంది. పలు అవరోధాలను అధిగమించి ఇప్పటికి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియ భవానీ శంకర్, సముద్రఖని, బాబీసింహ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే: దిల్ రాజు) నిర్మాణంలో జాప్యం జరిగినా చిత్రంపై మాత్రం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వ్యాపారంలోనూ ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లని సమాచారం. అయితే చిత్ర ఆడియో హక్కులను ఇంతకు ముందే సరిగమ సంస్థ రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్ సంస్థ రూ.220 కోట్లకు పొందినట్లు తాజా సమాచారం. దీంతో ఇప్పటికే ఇండియన్– 2 చిత్రం నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని భావించవచ్చు. ఇకపోతే ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ రెండు భాగాలుగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కమలహాసన్ మరో 25 రోజులు అదనంగా కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉంటుందని శంకర్ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తెలుగు చిత్రం కల్కిలో కమల్ నటిస్తున్నారు. ఆ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్– 3 చిత్రంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
యంగ్ కమల్.. ఓ టెక్నిక్
పాతికేళ్ల క్రితం కమల్‌హాసన్ వయసుకు మించి కనిపించిన పాత్రల్లో ‘ఇండియన్’లో సేనాపతి, ‘భామనే సత్యభామనే’లో వృద్ధురాలి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఆరు పదుల వయసుకి మించి కమల్ కనిపించిన పాత్రలివి. ఇప్పుడు ఇంకో ఏడాదికి కమల్ ఏడు పదుల వయసుని టచ్ చేస్తున్న నేపథ్యంలో యువకుడిలా కనిపించాల్సి వస్తోంది. ‘ఇండియన్’లో కమల్ని యంగ్ అండ్ ఓల్డ్ పాత్రల్లో చూపించిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం సీక్వెల్ ‘ఇండియన్ 2’లో కూడా వృద్ధుడిగా, యువకుడిగా చూపించనున్నారు. యువకుడి పాత్ర కోసం సాంకేతిక సహాయం తీసుకుంటున్నారట. ప్రస్తుతం శంకర్ లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. ‘‘లాస్ ఏంజిల్స్‌లోని లోలా వీఎఫ్ఎక్స్లో అధునాతన సాంకేతికతను పర్యవేక్షిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. కమల్ని యువకుడిగా చూపించడానికే లోలా సంస్థని శంకర్ సంప్రదించి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘డీ–ఏజింగ్’ (యంగ్‌గా చూపించడం) టెక్నాలజీకి లోలా పాపులర్. -
ఎయిర్‌పోర్ట్‌లో ఇండియన్ 2 షూటింగ్.. ఎంత డబ్బు కట్టారంటే?
నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన చిత్రం ఇండియన్. 1996లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కాగా 27 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్– 2 చిత్రం రూపొందుతోంది. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవాని శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌న్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇండియన్–2 సినిమా షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇటీవల చైన్నెలోని విమానాశ్రయంలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందుకుగాను చిత్ర యూనిట్ నుంచి రూ.1.04 కోట్ల విమానాశ్రయం నిర్వాహకం డిపాజిట్‌గా కట్టించుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ఈ చిత్రం కోసం శంకర్ చిత్రీకరించిన ఒక సన్నివేశం కమల్ హాసన్‌ను అబ్బురపరిచింది. దీని గురించి ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ ‘నీ బ్రహ్మాండ చిత్రీకరణ అద్భుతం. అది ఇక్కడితో ఆగి పోకూడదు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా శంకర్‌కు ఆయన ఖరీదైన వాచ్‌ను కానుకగా అందించారు. అదేవిధంగా ఇప్పటివరకు రూపొందిన ఇండియన్–2 చిత్రాన్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతృప్తిని వ్యక్తం చేశారట. ఇకపోతే ఈ చిత్రానికి పార్ట్–3 గురించి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ 3కి కావాల్సినంత కంటెంట్ ఉంది కాబట్టి మరో సీక్వెల్ వచ్చే అవకాశం లేకపోలేదని ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. ‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B — Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023 చదవండి: బ్రహ్మనందం కోసం మహేష్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే.. -
డైరెక్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఎన్ని లక్షలో తెలుసా?
సాధారణంగా సినిమా విడుదలై, అది హిట్ కొట్టిన తర్వాత సదరు దర్శకులకు ఖరీదైన బహుమతులని నిర్మాతలు ఇస్తుంటారు. 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీకవర్మకు అలానే రీసెంట్గా బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్ మాత్రం తన సినిమా విడుదలకు చాలా నెలల ముందే దర్శకుడు శంకర్‌ని సర్ప్రైజ్ చేశాడు. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన కమల్ హాసన్‌కు 'విక్రమ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని ఇచ్చింది. దీంతో అదే ఊపుతో 'ఇండియన్ 2' చేస్తున్నాడు. 2001లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగులోనూ 'భారతీయుడు' పేరుతో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు తీస్తున్న రెండో భాగంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) అందుకు తగ్గట్లే సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాల్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఈ క్రమంలోనే దాదాపు రూ.8.77 లక్షల విలువైన పనేరాయ్ ల్యూమినార్ చేతివాచీని శంకర్ కి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. గతంలో సూర్యకి రోలెక్స్ ఇచ్చిన కమల్.. ఇప్పుడు శంకర్ కి పనేరాయ్ ఇచ్చారు. నెక్స్ట్ నాగ్ అశ్విన్ ఏం వాచ్ ఇస్తారో ఏంటో? 'ఇండియన్ 2 సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ని ఈరోజే చూశాను. శంకర్ కు నా అభినందనలు. ఈ చిత్రం మీ అత్యుత్తమ పని కాకూడదు. మీ క్రియేటివ్ లైఫ్ లో ఇది హైయస్ట్ స్టేజ్. అందుకే దీన్ని తలకు ఎక్కించుకుని గర్వపడొద్దని నా సలహా. ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా' అని కమల్ హాసన్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B — Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023 (ఇదీ చదవండి: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) -
కాజల్‌ను ఇండియన్–2 సినిమానే కాపాడింది
సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదోవిధంగా వార్తల్లో ఉండడానికి ప్రయత్నించే నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూ ఇండియన్ నటిగా గుర్తింపు పొందిన నటి ఈమె. తెలుగు చిత్రం మగధీరతో కాజల్ అగర్వాల్ లక్ మొదలైందనే చెప్పాలి. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు. అలాంటిది మగధీర చిత్రం తరువాత స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అంతేకాకుండా వరుసగా ప్రముఖ నటుల సరసన నటించే అవకాశాలను సంపాదించుకుంది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) అలా అగ్రకథానాయకిగా నటిస్తుండగానే గౌతమ్ కిచ్లుతో ప్రేమలో పడి 2020లో సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిపోవడంతో కాజల్ అగర్వాల్ సినీ కెరియర్‌కు ఫుల్స్టాప్ పడినట్టే అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఈమెను ఇండియన్–2 చిత్రం కాపాడిందని చెప్పాలి. ఈ చిత్రంలో నటిస్తుండగానే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. (ఇదీ చదవండి: Spy Trailer:యాక్షన్ సీన్లతో నిఖిల్ దుమ్ములేపాడు) మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కాజల్ అగర్వాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అందుకు చాలా కసరత్తులే చేసింది. కాగా ఇండియన్–2 చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే కాజల్ అగర్వాల్ తెలుగులో మరో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు వరించాయి. దీంతో కాజల్ గ్రాఫ్ మళ్లీ పెరగడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. -
స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే స్టార్దా వెలుగొందుతున్నారు. ఇక తమిళంలో 2008లో పళని చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తరువాత విజయ్, అజిత్, కార్తీ అంటూ స్టార్ హీరోలతో జతకట్టి అగ్రకథానాయకి వరుసలో చేరారు. అదేవిధంగా తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ కిచ్లూ అనే వ్యక్తిని పేమించి 2020లో పెళ్లి చేసుకున్నారు. దీంతో కాజల్ అగర్వాల్ నటనకు గుడ్‌బై చెప్పినట్లే అనే ప్రచారం జరిగింది. (ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!) కాగా.. 2021లో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అలాంటిది తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అంతకుముందే అంగీకరించిన ఇండియన్- 2 చిత్రంలో కమలహాసన్‌కు జంటగా నటించడం మొదలెట్టడంతో ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే వర్కౌట్స్ చేసి మరింత నాజూగ్గా తయారయ్యారు. దీంతో కాజల్ సెకెండ్ ఇన్నింగ్ మొదలైంది. ప్రస్తుతం కమలహాసన్ సరసన నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ గురించి మరో షాకింగ్ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాజల్ అగర్వాల్ నటనకు స్వస్తి చెప్పబోతున్నారన్నదే ఆ ప్రచారం. కాజల్ రెండోసారి గర్భందాల్చారని.. దీంతో నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కారణం కాజల్ ఇటీవల తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త అవకాశాల కోసం అనే మరో కోణం కూడా అందులో దాగి ఉందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. (ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) ఇలాంటి సమయంలో నటనకు స్వస్తి చెప్పడం నమ్మశక్యం కాని ప్రచారం అనే భావించాలి. అయితే తన బిడ్డ సంరక్షణ కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉండాలని ఆమె భావించవచ్చుననే అభిప్రాయం ఒక వర్గం నుంచి వ్యక్తం అవుతోంది. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఇంకా నోరు మెదపడం లేదు. మరి ఇలాంటి ప్రచారంపై కాజల్ ఏమంటారో చూడాలి. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
గుసగుస.. 'ఇండియన్-2'లో విలన్‌గా ఎస్.జె. సూర్య!
ఎస్.జె. సూర్యలో దర్శకుడు (తెలుగులో ‘ఖుషి నాని, పులి’), హీరో (తమిళంలో పలు చిత్రాలు), విలన్ (తెలుగు ‘స్పైడర్’) ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నారు సూర్య. వాటిలో శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ ఒకటి. మరొకటి ‘ఇండియన్ 2’ అని సమాచారం. అయితే ‘ఇండియన్ 2’ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ చెన్నైలో ముగిసింది. కాగా నెక్ట్స్ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. -
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
ఇండియన్ 2 లో నా క్యారెక్టర్..? ప్రభాస్, నేను పుట్టుమచ్చల గ్యాంగ్!
-
అఫీషియల్: శంకర్ డైరెక్షన్లో ఛాన్స్ కొట్టేసిన హీరో సిద్దార్థ్..
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. నేడు(సోమవారం)సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్‌ను అందిస్తూ సిద్దార్థ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B'day 🥳 & a fabulous year ahead ✨ 🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr — Lyca Productions (@LycaProductions) April 17, 2023 -
కమల్, ప్రభాస్, చరణ్ డబుల్ ధమాకా.. సమంత, ఎన్టీఆర్ ట్రీట్ కూడా ఉందా?
హీరోలు స్క్రీన్‌పై సింగిల్‌గా కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక డబుల్ రోల్స్‌లో కనబడితే పండగే పండగ. ఒకే సినిమాలో డ్యూయల్ రోల్ అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానే. ఇలా ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను అలరించేందుకు రెండు పాత్రల్లో కనిపించే చిత్రాల్లో నటిస్తున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► కమల్‌హాసన్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇండియన్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు కమల్‌హాసన్. ప్రస్తుతం కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా కమల్ రెండు పాత్రలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఇండియన్’లో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ తండ్రీకొడుకుగా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందట. ► ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు లుక్స్ రిలీజయ్యాయి. దీంతో ‘సలార్’లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ► శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ చేంజర్’ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించనున్నారు హీరో రామ్‌చరణ్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఐఏఎస్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ టచ్ ఉన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీకొడుకుగా నటిస్తున్నారని తెలిసింది. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ ఖబర్. అలాగే రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రీట్ ఉందా? అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ సినిమాలో ఎన్టీఆర్, ఒక హిందీ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. ఈ ఇద్దరి నుంచి డబుల్ ట్రీట్ ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. ► దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆంధ్రావాలా’ సినిమాలో తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. మరోసారి తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ► ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియన్స్‌లో క్రేజ్ దక్కించుకున్నారు సమంత. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారామె. ఇక సమంత నటించనున్న తొలి హిందీ చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా హిందీ హిట్ ‘స్త్రీ ’(2018) ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ హారర్ ఫిల్మ్ తెరకెక్కనుందని, ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ టైటిల్‌తో తెరపైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తారని టాక్. ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో సమంత డ్యూయల్ రోల్ చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో సమంత ప్రేతాత్మగా కనిపిస్తారట. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. -
సమ్మర్లో ఫారిన్ షూటింగ్ అంటున్న స్టార్ హీరోలు
సమ్మర్లో కూల్‌గా ఉండే లొకేషన్స్‌ని ఎంచుకుని, వెకేషన్‌కి వెళుతుంటారు కొందరు స్టార్స్. కొందరిని షూటింగే చల్లని ప్రాంతాలకు తీసుకెళుతుంది. అలా ‘కేరాఫ్ ఫారిన్’ అంటూ షూటింగ్స్‌కి, వెకేషన్‌కి విదేశాలు వెళ్లిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► రెండు వారాలుగా ఫారిన్లోనే ఉంటున్నారు ఇండియన్. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తైవాన్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతోంది. కమల్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు శంకర్. ఈ వారం కూడా ‘ఇండియన్ 2’ టీమ్ సౌతాఫ్రికాలోనే ఉంటుందని తెలిసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ► ఇటలీలో ఫైట్స్ చేశారు ప్రభాస్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగ ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత నెలలో ఇటలీ లొకేషన్స్‌లో జరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘సలార్’ సినిమా యూనిట్ మరోసారి ఫారిన్ వెళ్లనుందని సమాచారం. బుడాపెస్ట్ లొకేషన్స్‌లో ‘సలార్’ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగానే ‘సలార్’ కోసం ప్రభాస్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ► లండన్‌లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. గత వారం శర్వానంద్, కృతీపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించారు. ► బాలీవుడ్ ‘బడే మియా చోటే మియా’ లండన్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోరూపొందుతున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను స్కాట్లాండ్లో చిత్రీకరించారు. అట్నుంచి అటు లండన్ వెళ్లారు. మరో పది రోజులపాటు లండన్ షెడ్యూల్ జరుగుతుందట. అలాగే మరో బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ షూటింగ్ కూడా లండన్‌లో జరిగింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్స్‌ను ప్లాన్ చేశాయి. -
రోలెక్స్ Vs విక్రమ్.. ఈసారి థియేటర్లు బద్దలవడం ఖాయం
-
‘ఇండియన్ 2’.. తైవాన్ టు సౌతాఫ్రికా
తైవాన్‌కు బై బై చెప్పాడు భారతీయుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, బెనెడిక్ట్ గారెట్, గుల్షన్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల తైవాన్‌లో మొదలైన ‘ఇండియన్ 2’ షెడ్యూల్ ముగిసింది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కమల్‌హాసన్ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు విదేశీ ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. తైవాన్ షెడ్యూల్ తర్వాత యూనిట్ సౌతాఫ్రికా వెళ్తుందని, అక్కడి లొకేషన్స్‌లో మరో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసిందనికి వినికిడి. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తున్నారు. -
'ఇండియన్-2'పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది. కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఇండియన్ 2 మూవీ టార్గెట్ ఫిక్స్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది. కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నిర్మాతల సంఘానికి లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ విరాళం
భారీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవల మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థతో కలిసి పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రాన్ని ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. వీటితో పాటు మరిన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా మణిరత్నం దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ తరపున తమిళ నిర్మాతల సంఘానికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి రామస్వామికి అందించారు. -
ట్రైన్లో యాక్షన్ సీన్స్.. ఆ కిక్కే వేరప్పా!
తెరపై విలన్ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ట్రైన్లో భారతీయుడు దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’. ఈ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్‌ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్‌ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్‌లో ఇదొకటనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. పది కోట్ల ఫైట్ ఒకవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్‌ని యాక్షన్ సీన్‌తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. నాగేశ్వరరావు దోపిడీ స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్‌లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. డెవిల్ పోరాటం స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్‌పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బొగ్గు దొంగ తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్‌పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. లోకల్ ట్రైన్లో ఏజెంట్ లోకల్ ట్రైన్లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్లో జరిగింది. ట్రైన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఎనిమిది కోట్ల యాక్షన్ సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. -
ఇండియన్-2: యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న కమల్‌హాసన్
ఫారిన్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటుంది ఇండియన్-2. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇటీవల ఆరంభమైన నెలరోజుల షెడ్యూల్లో భాగంగా మొన్నటివరకు నైట్ సీన్స్ తీసిన చిత్ర యూనిట్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసింది. ‘ఇండియన్ 2’ సినిమాకు ఓ హైలైట్‌గా ఉండనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేస్తున్నారు. -
ఇండియన్ 2కు కాజల్ మేకోవర్.. మేకప్‌కు మూడున్నర గంటలు!
మేకప్ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లోక నాయకుడు కమలహాసన్ పేరే. ఆయన పాత్రలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, గెటప్పులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ పాత్రల కోసం ఆయన కేవలం మేకప్ కోసమే నాలుగైదు గంటలు వెచ్చించేవారు. ఇక ఇండియన్ చిత్రంలోని కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా అబ్బురపరిచారు. ఇక అదే చిత్రంలో నటి సుకన్య కూడా ఆయనకు సరి సమాన మేకప్‌తో మేకోవర్ అయ్యి నటించి నప్పించారు. 1996లో విడుదలైన ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ –2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనేక ఒడుదుడుకుల మధ్య నాలుగేళ్లు గడిచిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియాస్నీ శంకర్, నటుడు సిద్ధార్థ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమలహాసన్ నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్ కూడా బామ్మ పాత్ర కోసం మేకోవర్ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనూ మేకప్ కోసం రోజూ మూడున్నర గంటల సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది ఇండియన్ చిత్రంలో నటి సుకన్య నటించిన పాత్రకు సీక్వెల్ అని సినీ వర్గాలు భావిస్తున్నారు. చదవండి: హీరోయిన్ రితికా సింగ్‌కు చేదు అనుభవం తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? -
ఇండియన్ 2లో విలన్‌గా వెన్నెల కిశోర్, ఇదిగో క్లారిటీ!
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ తొలిసారి నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారతీయుడు 2లో వెన్నెల కిశోర్ విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఓ అభిమాని 'ఏంటి కాకా.. ఇది నిజమా?' అని అడిగాడు. దీనికి సదరు కమెడియన్ స్పందిస్తూ.. 'ఇండియన్ 2లో లేను, పాకిస్తాన్ 3లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ రూమర్స్‌కు తెర దించినందుకు థ్యాంక్స్ భయ్యా అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇండియన్ 2 విషయానికి వస్తే.. కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనప్పటికీ వివాదాలు, ప్రమాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG — vennela kishore (@vennelakishore) February 28, 2023 -
‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్లు.. ముగ్గురు హిరోయిన్లు
తమిళ సినిమా: కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ 2 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనా షూటింగ్ స్పాట్లో ప్రమాదాలు, దర్శకుడికి నిర్మాణ సంస్థ మధ్య వివాదం, కరోనా కారణాలతో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. కాగా పలు పంచాయితీలు, కేసులు అనంతరం ఇటీవలే ఇండియన్ 2 చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుపుకుంటోంది. చిత్రంలో సేనాపతిగా కమలహాసన్ గెటప్‌తో కూడిన పోస్టర్ విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందుతోంది. గత వారం రోజులుగా చెన్నై, పనైయూర్లో చిత్ర షూటింగ్‌ను రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో తమిళ్, బ్రిటీష్ స్టంట్ కళాకారులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రంలో కమల్ హాసన్‌కు ఏడుగురు విలన్లు ఉంటారని అందులో ఒకరు సముద్రఖని అని సమాచారం. మొత్తం మీద ముగ్గురు హీరోయిన్లు, ఏడుగురు విలన్లతో కమలహాసన్ ఇండియన్ 2 చిత్రంతో మరోసారి తెరపై విజృంభిస్తున్నారన్నమాట. -
ఇండియన్ 2: నెల రోజులు నాన్‌స్టాప్ షూటింగ్
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, గండికోట లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చాలా కీలకమైనదని తెలిసింది. ఎందుకంటే నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు కమల్‌హాసన్. ముందుగా కమల్‌హాసన్, హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ కాంబినేషన్స్లోని సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్లోనే ఈ చిత్రకథానాయిక కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అయ్యే చాన్స్ ఉందని టాక్. ఇంకా రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
18 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్, కమల్ మధ్య బాక్సాఫీస్ వార్!
లోకనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీరిద్దరూ తమిళ సినిమాకి రెండు ధృవాలు లాంటి వారు. తొలి దశలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత ఎవరి ఇమేజ్ వారికి రావడంతో విడివిడిగా నటించడం మొదలెట్టారు. కాగా ఇటీవల విక్రమ్ చిత్రంతో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చిన కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క నటుడు రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో నటిస్తున్న జైలర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జైపూరులో జరుగుతోంది. కాగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2005 ఏప్రిల్ 14న రజనీకాంత్ చంద్రముఖి, కమలహాసన్ ముంబయి ఎక్స్‌ప్రెస్ చిత్రాలు విడుదలై పోటీపడ్డాయి. అప్పట్లో చంద్రముఖి చిత్రం ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ 18 ఏళ్ల తరువాత రజనీకాంత్ జైలర్ చిత్రం, కమలహాసన్ ఇండియన్–2 ఒకే రోజు విడుదల కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
హెలికాప్టర్లో షూటింగ్‌కి వెళ్లిన స్టార్ హీరో.. ఫోటో వైరల్
హెలికాప్టర్లో షూటింగ్ లొకేషన్‌కు వెళుతున్నారు కమల్‌హాసన్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షటింగ్ ప్రస్తుతం కడపలోని గండికోట విలేజ్‌లో జరుగుతోంది. తిరుపతి నుంచి గండికోట లొకేషన్‌కు రోజూ హెలికాప్టర్లో వెళ్తున్నారు కమల్‌హాసన్. కాగా కమల్ హెలికాప్టర్ రైడ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, కాల్షీట్స్, షూటింగ్ సమయం వృథా కాకుండా చూసేందుకు కమల్ ఇలా హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. #KamalHaasan sir pic.twitter.com/8JzAJIXdH7 — Expendables Bouncers (@Sathya45222505) February 1, 2023 -
అడ్డదారిలో విజయాలు రావని తెలియజేసిన నటుడు ఆయన: రకుల్
తమిళ సినిమా: నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు అర్జెంటుగా ఒక హిట్ అవసరం. ఎందుకంటే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇంతకుముందు తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల చాలా వెనుకబడిందని చెప్పాలి. ఇక తమిళంలో ధీరన్ అధికారం, ఒండ్రు వంటి ఒకటి రెండు మినహా ఈమెకు సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో కలిసి శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2, శివకార్తీకేయన్ సరసన అయలాన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఇటీవల ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇండియన్ 2 చిత్రంలో నటించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. నటుడు కమల్ హాసన్ ఒక విశ్వవిద్యాలయం అని పేర్కొంది. ఆయనతో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపింది. వందేళ్ల సినిమాలో 60 ఏళ్లుగా ఈయన ఉన్నారని, ఇది పెద్ద రికార్డు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అడ్డదారిలో విజయాలు రావని మనకు తెలియజేసిన నటులు వారని, మనం చేసే పనిలో శ్రద్ధ పెట్టాలని, అప్పుడే వాళ్ల మాదిరి మనమూ సాధించగలమని తెలియజేశారన్నారు. ఇకపోతే ఇండియన్ 2, అయలాన్ చిత్రాల్లో తనకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణే మిగిలిందని చెప్పింది. -
తిరుపతిలో భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ని రూపొందిస్తున్నారు. కమల్–శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కాజల్ కొడుకు ఫుల్ ఫోటో చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎక్కువ సమయం కొడుకుతో గడపడానికే కేటాయిస్తుంది. గతేడాది జూన్‌లో ఈ ‘చందమామ’కి పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అతనికి నీల్ కిచ్లూ అని నామకరణం చేసింది. ఈ విషయంతో పాటు కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తల్లిగా తను పొందే ఆనందాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పటి వరకు కుమారుడిని మొత్తంగా చూపించలేదు. సైడ్‌గా చూపిస్తూ.. అతను చేసే అల్లరి పనులను చెప్పుకొచ్చింది. కానీ తాజాగా కొడుకు ఫుల్ పోటోని అభిమానులతో షేర్ చేసుకుంది. కొడుకు పుట్టి 9 నెలలు పూర్తయిన సందర్భంగా గురువారం(జనవరి 19) కాజల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దేవుడు నీ ద్వారా చేయించబోయే పనులను చూడడానికి వేచి ఉండలేకపోతున్నాను. గడిచిన 9 నెలలతో పాటు రాబోయే రోజులకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. . ఏడాదిలో మూడవవంతు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ నీల్ కిచ్లూ నవ్వుతూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ 2020లొ ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 19న ఈ జంటకు కొడుకు పుట్టాడు. ప్రెగ్నెన్సీ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైంది కాజల్. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
కాజల్ న్యూలుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు
సాధారణంగా హీరోయిన్లు స్లిమ్‌గా, నాజూగ్గా తయారు అవడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగిన కసరత్తు కూడా చేస్తుంటారు. బరువు పెంచడం అన్నది అతి తక్కువ మంది నటీమణులే చేస్తుంటారు. కాజల్ అగర్వాల్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ నటనకు స్వస్తి చెప్తారని అందరూ భావించారు. ఆమె ఇంతకుముందు నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్– 2 చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు, ఆ పాత్రలో మరో నటిని ఎంపిక చేయడానికి దర్శకుడు శంకర్ సిద్ధమైనట్టు ప్రచారం కూడా జరిగింది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్ అగర్వాల్ తల్లి అయిన మూడు నాలుగు నెలలకే నటించడానికి సిద్ధమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె మరింత అందంగా తయారవ్వడం విశేషం. ఈమె కమలహాసన్ జంటగా ఇండియన్ – 2 చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. అందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది. తాజాగా కాజల్ అగర్వాల్ కాస్త బరువెక్కింది. ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పొందుపరిచింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇండియన్– 2 చిత్రంలో కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు నటి కాజల్ బరువు పెరగడానికి ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది. -
ఆ లుక్ కోసం ఆహారం మానేసిన కమల్! కేవల పండ్ల రసాలతోనే..
‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్‌హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట. -
కమల్‌హాసన్ చిత్రం ఆగిపోయిందా?
అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్, మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఆదిలోనే ఆగిపోయిందని ప్రచారం సాగుతోంది. విశ్వరపం సినిమా నుంచి వీరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మహేష్ నారాయణన్ మలయాళంలో టేక్ ఆఫ్, సీయూ సన్, మాలిక్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది. అయితే విక్రమ్ సంచలన విజయం సాధించడంతో ప్రస్తుతం కమల్‌హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దర్శకులు హెచ్.వినోద్, మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి కమల్ కమిట్ అయ్యారు. దీంతో మహేష్నారాయణన్ దర్శకత్వంలో నటించే చిత్రం ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వార్తలపై స్పందింన మహేష్ నారాయణన్.. తన దర్శకత్వంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించే చిత్రం డ్రాప్ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమల్ ఇండియన్– 2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ చిత్రం పూర్తి కాగానే తర్వాత కొత్త చిత్రంపై చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. -
కమల్ హాసన్ బర్త్‌డే స్పషల్.. ఇండియన్-2 పోస్టర్ అదుర్స్
విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్ డేట్‌తో ముందుకొచ్చింది చిత్రబృందం. ఈ మూవీలో కమల్ హాసన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: తిరుపతిలో 'ఇండియన్-2' షూటింగ్) కమల్ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పోస్టర్లో కమల్ వృద్ధుడి గెటప్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇటీవలే తిరుపతిలో కొన్ని కీలకమైన సీన్లు కూడా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. To the one who’s versatility is beyond comparison, wishing the legend of Indian cinema a very happy birthday from team #Indian2#Ulaganayagan @ikamalhaasan #HBDKamalHaasan pic.twitter.com/rlwxnJmRbd — Red Giant Movies (@RedGiantMovies_) November 7, 2022 -
Kajal Agarwal: కొడుకు విషయంలో కాజల్ షాకింగ్ నిర్ణయం!
సినిమాల కోసం కాజల్ అగర్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టాలీవుడ్ ‘చందమామ’ కి జూన్ 19న పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమయమంతా కొడుకుకే కేటాయిస్తుంది ఈ బ్యూటీ. తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. మళ్లీ ఇటీవల షూటింగ్‌లకు హాజరవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందట. దీంతో కొడుకు బాగోగులు చూసుకోవడం కాజల్‌కు ఇబ్బంది అవుతుందట. అందుకే కుమారుడి బాధ్యతను తన చెల్లి నిషా అగర్వాల్‌కి అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషాతో పాటు ఆమె తల్లి కూడా నీల్ కిచ్లూ బాగోగులు చూసుకుంటున్నారట. ఇండియన్-2తో పాటు కాజల్ తమిళ్లో మరో సినిమా చేస్తుంది. -
అఫీషియల్: కమల్‌హాసన్ మూవీలో స్టార్ క్రికెటర్ తండ్రి.. పోస్ట్ వైరల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్-2'. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చిది. ఇవాళ చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ నటుడు కనిపించనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. యోగ్ రాజ్.. తన ఇన్‌స్టాలో రాస్తూ...' ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్‌కు థ్యాంక్స్. కమల్ హాసన్ ఇండియన్-2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే తిరుపతిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram A post shared by Yograj Singh (@yograjofficial) -
ఏడాదిన్నర పాటు సైట్ కొట్టాను.. తను కనీసం కన్నెత్తి చూడలే!
ఒక యువకుడికి తాను.. ఏడాదిన్నర పాటు సైట్కొట్టానని నటి ప్రియ భవాని శంకర్ చెప్పింది. ఎదుగుతున్న కథానాయికల్లో ఈమె ఒకరు. కోలీవుడ్‌లో పలు విజయాలను అందుకుని చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె.. కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–2 చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈమె ఓ రహస్యాన్ని బయటపెట్టింది. దీని గురించి ఒక భేటీలో పేర్కొంటూ గత కొన్నేళ్లుగా జిమ్‌కు వెళుతున్నానని చెప్పింది. అదే జిమ్‌కు వస్తున్న ఓ యువకుడి చూసి ఆకర్షణకు లోనైనట్లు చెప్పారు. దీంతో ఏడాదిన్నర పాటు అతనికి సైడ్ కొట్టానంది. వచ్చినపని మాత్రమే చేసుకుని వెళ్లిపోయే అతని ప్రవర్తన ఆకట్టుకుందని చెప్పింది. దీంతో చాలా రోజులు అతనికి సైట్ కొట్టానని అయితే తాను సైట్ కొడుతున్నట్లు అతనికి తెలియదని పేర్కొంది. తనను ఒకసారి కూడా తనవైపు కన్నెత్తి చూడటం గానీ, పలకరించడం గానీ జరగలేదని చెప్పింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల తాను వేరే జిమ్‌కు మారడంతో ఆ యువకుడిని చూడలేదని తెలిపింది. అందరినీ గౌరవించే వ్యక్తులంటే తనకు ఇష్టమని చెప్పింది. అంతేకాకుండా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో బీఎండబ్ల్యూ కారులో తిరిగే యువకుల కంటే స్వసక్తితో ఎదుగుతూ బైక్‌లో తిరిగే యువకులంటే తనకు అభిమానం అని వెల్లడించింది. ఇంతకీ తాను అంతగా సైట్ కొట్టిన యువకుడి వివరాలు మాత్రం ఆమె చెప్పలేదు. -
Indian 2 Movie: శిక్షణ తీసుకుంటున్న కాజల్ అగర్వాల్
-
తిరుపతిలో 'ఇండియన్-2' షూటింగ్
కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభం అయిందని సమాచారం. ఈ కొత్త షెడ్యూల్లో కమల్‌హాసన్, కాజల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రసవం అనంతరం కాజల్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఆ సినిమా కోసమే..!
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలారిపాయట్టును సాధన చేస్తోంది. తాజాగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ చాలా రోజుల తర్వాత తిరిగి షూటింగ్లో అడుగుపెట్టింది. ఇండియన్ 2 సినిమాలో తన పాత్ర కోసం యుద్ధ కళలతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది కాజల్. (చదవండి: Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్) ఇన్‌స్టాలో పోస్టులో "కలరిపాయట్టు ఒక పురాతన మార్షల్ ఆర్ట్స్. షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో క్రీడలు కలరిపాయట్టు నుంచి పుట్టుకొచ్చినవే. ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారు. ఇది శారీరక, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మూడేళ్లుగా అడపాదడపా నేర్చుకుంటున్నా. నాకు చాలా ఓపికగా నేర్పిస్తున్న మాస్టర్‌కు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ ఆతర్వాత కోర్టు కేసులతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో కమల్ హాసన్ సెట్స్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: Rakul Preet Singh: ‘ఇండియన్ 2’ సెట్లో అడుగుపెట్టిన రకుల్) ఈ ఫోటోల్లో దర్శకుడు శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కమల్ సెట్స్‌లో అడుగు పెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అందాల భామ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. #Indian2 from today. @Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE — Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022 -
అంతకు ముందులా లేను.. కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శరీరం సహకరించకపోయినా అనుకున్నది సాధించే విషయంలో రాజీ పడేదే లేదు అంటున్నారు కాజల్ అగర్వాల్. నాలుగు నెలల క్రితం ఆమె ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ షూటింగ్స్‌లో జాయిన్ అయ్యేందుకు కాజల్ సమాయత్తమవుతున్నారు. అయితే ‘శారీరకంగా అంతకు ముందులా లేను... ఎనర్జీ లెవల్స్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయినా తగ్గను’ అని పేర్కొన్నారు కాజల్. బ్రేక్ తర్వాత ఆమె ‘ఇండియన్ 2’ షూట్లో పాల్గొననున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రసవానంతరం తనలో వచ్చిన శారీరక మార్పు గురించి సోషల్ మీడియాలో కాజల్ చేసిన పోస్ట్ సారాంశం ఇలా..... ‘‘ప్రసవానంతరం నాలుగు నెలల తర్వాత మళ్లీ నా వర్క్ స్టార్ట్ చేసినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. కానీ మొదట్నుంచి మళ్లీ మొదలుపెట్టానా? అనే భావన కలిగింది. (చదవండి: సిగ్గూ, శరం ఉండాలి.. కోపంతో ఊగిపోయిన రేవంత్) ప్రసవానికి ముందు ఉన్నట్లుగా నా శరీరం ఇప్పుడు నాకు సహకరించడం లేదు. బిడ్డకు జన్మనివ్వక ముందు లొకేషన్స్‌లో ఎంతో వర్క్ చేసి, ఆ తర్వాత వ్యాయామం కూడా చేసేదాన్ని. కానీ తల్లయ్యాక ఒకప్పుడు ఉన్న నా ఎనర్జీ స్థాయిని అందుకోవడం కష్టంగా ఉంది. ఇక గుర్రపు స్వారీ చేయడం అనేది నాకో పెద్ద టాస్‌్కగా అనిపిస్తోంది. అయినా పట్టుదలగా నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నా శరీరం నా మాట వినేది. పరిస్థితుల ప్రభావం వల్ల మన శరీరం మారొచ్చు కానీ మన ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు కాజల్ అగర్వాల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
కమల్‌హాసన్ విశ్వరూపం.. 14 భాషల్లో అవలీలగా 10నిమిషాల డైలాగ్
పద్నాలుగు భాషలు.. పది నిమిషాల డైలాగ్! సంభాషణలను అలవోకగా చెప్పగల నటుల్లో కమల్‌హాసన్ ముందు వరుసలో ఉంటారు. పాత్రకు తగ్గట్టు నటనలో, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడం, సంభాషణలు పలకడంలో కమల్ సూపర్. ఇప్పడు 65ఏళ్లకు పైబడిన వయసులోనూ కమల్ ఒకప్పటిలా సుదీర్ఘ సంభాషణలు చెప్పడం విశేషం. ఇటీవల ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) కోసం కమల్ పది నిమిషాల డైలాగ్ చెప్పారట. సింగిల్ టేక్‌లో కమల్ ఈ డైలాగ్ చెప్పడం, అది కూడా పద్నాలుగు భాషలు ఉన్న డైలాగ్ కావడంతో యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారని కోలీవుడ్ టాక్. ఈ హై ఓల్టేజ్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. గతంలో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందిన ‘ఇండియన్’ (1996)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ని ఇటీవలే ఆరంభించారు. -
‘ఇండియన్ 2’ సెట్లో అడుగుపెట్టిన రకుల్
సీనియర్ నటీమణుల నుంచి వర్తమాన నటీమణుల వరకు ఇప్పుడు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. దానిని వారు ఒక ప్రమోషన్ సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. తారలు తమ అనుభవాలను, అభిప్రాయాలను, వారి ఆకర్షణీయమైన ఫొటోలను, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయడంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందుకు అతీతం కాదు. ఆది నుంచి గ్లామర్‌ని నమ్ముకున్న ఈ ఉత్తరాది భామ ఆ తరహా పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! అయితే ఈ మధ్య అమ్మడికి దక్షిణాదిలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి సారిస్తోంది. అలాంటి క్రమంలో తాజాగా ఇండియన్–2 చిత్రంతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలిగింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్‌లు ఇందులో కథానాయికలుగా ఎంపికయ్యారు. అయితే కొన్ని సమస్యలు కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి ఈ సినిమా షూటింగ్ సంవత్సరాల తరబడి వాయిదా పడటం, ఇందులో నటించిన వివేక్, మరో మలయాళ నటుడు మరణించడం, నటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. దీంతో చాలా కాలం పాటు షూటింగ్ ఆగిపోగా ఇటీవల మళ్లీ మొదలైంది. ఇది కాస్తా కాజల్, రకుల్‌కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరు దక్షిణాది సినీ తెరకు ఆల్మోస్ట్ సైడ్ అయిపోతున్న తరుణంలో ఇండియన్–2 చిత్రం షటింగ్ మళ్లీ పట్టాలెక్కడంతో వారు ఇందులో నటించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్ర షూటింగ్లో సెట్ అడుగుపెట్టిన రకుల్ కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. -
కమల్‌హాసన్ ఇండియన్-2 ఆగిపోయిందా? పోస్టర్‌తో క్లారిటీ
‘ఇండియన్ 2’ సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన పాతిక సంవత్సరాల తర్వాత లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను ఆరంభించారు కమల్–శంకర్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పెద్ద ప్రమాదం జరగడం, ఆ తర్వాత బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకాకు మధ్య అభిప్రాయభేదాలు రావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ బుధవారం తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ‘‘సెప్టెంబరు నుంచి ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాను’’ అని పేర్కొన్నారు కమల్‌హాసన్. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. Good morning Indians, we are glad to announce that the remaining shoot for Indian 2 is commencing today! Need all of your support and wishes 🙏🧿 https://t.co/s1CjKSGXYM — Shankar Shanmugham (@shankarshanmugh) August 23, 2022 -
వరుసగా మూడు సీక్వెల్స్... కమల్ స్పీడు మామూలుగా లేదు
పార్ట్ వన్ హిట్... హిట్ వన్ సాధించిన జోష్‌తో హిట్ టూ మీద టార్గెట్ ఉండటం కామన్. ఇప్పుడు కమల్‌హాసన్ ‘హిట్ 2’ మీద టార్గెట్ పెట్టారు. అంటే... హిట్ అయిన పార్ట్ వన్‌కి కొనసాగింపుగా పార్ట్ 2లో నటించనున్నారు. వరుసగా మూడు సీక్వెల్స్ చేయనున్నారు కమల్. ఆ విశేషాల్లోకి వెళదాం. కమల్‌హాసన్ మంచి జోష్‌లో ఉన్నారు. దానికి ఒక కారణం ‘విక్రమ్’ ఘనవిజయం సాధించడం. విజయాలు కమల్‌కి కొత్త కాకపోయినా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సంశయిస్తున్న తరుణంలో హిట్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘విక్రమ్’ సుమారు రూ. 500 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కానే కాదు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు. గత జూన్‌లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించనున్నారు. అయితే ఈ సీక్వెల్ ఆరంభం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే కమల్ ప్రస్తుతం ‘ఇండియన్’ (భారతీయుడు) సీక్వెల్ మీద దృష్టి సారించారు. 22నుంచి ‘ఇండియన్ 2’ సెట్లోకి... సేనాధిపతి (ఇండియన్)గా, చంద్రబోస్ (చంద్రు)గా కమల్‌హాసన్ రెండు పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (1996). దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమర యోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ నిర్మాణంలో ఉంది. కరోనా లాక్డౌన్, ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన ప్రమాదం, చిత్రనిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కి ఏర్పడిన వివాదం (రామ్‌చరణ్ హీరోగా శంకర్ పాన్ ఇండియా సినిమా కమిట్ అయ్యారు. అయితే ‘ఇండియన్ 2’ని పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్ చేయకూడదంటూ లైకా సంస్థ కోర్టుకి వెళ్లింది).. ఇలా పలు కారణాల వల్ల ఈ చిత్రానికి బ్రేక్ పడింది. ఈ నెల 22న తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారట. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. 120 పేజీల కథతో ‘రాఘవన్ 2’ రెడీ కమల్‌హాసన్ నటించిన హిట్ చిత్రాల్లో ‘వేట్టయాడు విలైయాడు’ (రాఘవన్) ఒకటి. 2008లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌కి కథ కూడా రెడీ అయిందట. 120 పేజీల బౌండ్ స్క్రిప్ట్‌ని తయారు చేశారు గౌతమ్. రైట్ టైమ్‌లో షూటింగ్ ఆరంభిస్తామని కూడా పేర్కొన్నారు. పార్ట్ వన్‌లో జ్యోతిక, కమలినీ ముఖర్జీ కథానాయికలుగా నటించారు. సీక్వెల్లో ఓ నాయికగా కీర్తీ సురేష్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘ఇండియన్ 2’ తర్వాత కమల్ ‘రాఘవన్’ సీక్వెల్ సెట్స్‌లోనే ఎంటరవుతారని చెన్నై టాక్. ఆ తర్వాత ‘విక్రమ్ 2’ ఆరంభమయ్యే అవకాశం ఉంది. శభాష్ నాయుడు కూడా... ఇలా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ప్లాన్ చేసుకోవడంతో పాటు కమల్ ‘శభాష్ నాయుడు’ చిత్రం కూడా చేయనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడే కమల్ ఇంట్లో జారిపడటంతో పెద్ద గాయమే అయింది. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆగింది. బ్రహ్మానందం, శ్రుతీహాసన్ కీలక పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని కూడా మళ్లీ ఆరంభించాలనుకుంటున్నారు. -
కాజల్ మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఆస్వాదిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో కాజల్ మళ్లీ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే తాజాగా నేహా ధూపియాతో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించిన కాజల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాతో త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్లో ప్రమాదం జరగడంతో సినిమాను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్, ఇతరాత్ర కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ప్రసవం తర్వాత కాజల్ నటిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. -
ఇండియన్ 2: కాజల్ స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ?
లోక నాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). కమలహాసన్‌తో చేసిన ఫొటోషూట్ చిత్రంపై అంచనాలను పెంచింది. అదే జోరులో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత అనూహ్యంగా సెట్లో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కొల్పోవడం. చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు చిత్రంలో హాస్య భూమిక పోషిస్తున్న వివేక్ హఠాన్మరణం, ఆ తరువాత దర్శకుడికి, లైకా ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఇలా ఎన్నో రకాలు అడ్డుంకులు వచ్చాయి. ఈ విషయంలో లైకా సంస్థ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే దర్శకుడికి, నిర్మాతల మధ్య సామరస్య పూర్వక చర్చలు జరిగిన అవి ఫలించకపోవడంతో శంకర్ ఆర్సీ15 మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఎట్టకేలకు ఇటీవల సమస్యలు, విభేదాలు సద్దుమనగడంతో ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. చదవండి: ఉమా మహేశ్వరి అంత్యక్రియలు, పాడే మోసిన బాలయ్య అయితే దీనికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న కాజల్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్ వేటలో పడిందట. ఇండియన్ 2 హీరోయిన్గా కాజల్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ఇటీవల వారితో మూవీ టీం సంప్రదింపులు కూడా జరిగిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉందని వినికిడి. ఇక ఇండియన్ 2 హీరోయిన్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు. -
అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా?
‘విక్రమ్’ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. ఆ చిత్రం హిట్ కావడంతో మరింత ఉత్సాహంగా తర్వాతి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నారాయన. అందులో భాగంగానే శంకర్ దర్శకత్వంలో చేయనున్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమా కోసం మేకోవర్ అయ్యేందుకు అమెరికా వెళ్లారు కమల్‌హాసన్. మూడు వారాల పాటు యూఎస్‌లోనే ఉండి, ఈ సినిమాకి తగ్గట్టు తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారని టాక్. కమల్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ (1996)కి ‘ఇండియన్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోంది. 2020లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. అయితే కరోనా, సెట్స్‌లో నెలకొన్న ప్రమాదం వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. కమల్‌హాసన్ అమెరికా నుంచి రాగానే సెప్టెంబరులో ‘ఇండియన్ 2’ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్
కొబ్బరికాయ కొట్టారు.. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’, ‘శభాష్ నాయుడు’, విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పలు అంచనాల నడుమ ఆరంభమయ్యాయి. అయితే చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు ‘రీ స్టార్ట్’ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘విక్రమ్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బంపర్ హిట్ సాధించారు కాబట్టే కమల్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ని, ఆగిపోయిన చిత్రాలను మళ్లీ ఆరంభించాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘విక్రమ్’ కంటే ముందు కమల్ ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2) రిలీజ్ అయ్యుండేది. కానీ దర్శకుడు శంకర్‌కు, ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు, ‘ఇండియన్ 2’ సెట్స్‌లో ప్రమాదం జరిగి క్రూ మెంబర్స్ చనిపోవడం వంటి కారణాల చేత ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే కమల్ చొరవతో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరులో ఆరంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత కాజల్ అగర్వాల్ ఉన్నారు. కాజల్ తల్లి అయిన విషయం తెలిసిందే. మరి.. ఆమె ఈ చిత్రంలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో కీలక పాత్రధారి వివేక్ చనిపోయారు. ఆయన పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పనిలో ఉందట ‘ఇండియన్ 2’ టీమ్. 1986లో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్’కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక కమల్ చిత్రాల్లో ఆగిన మరో సినిమా ‘శభాష్ నాయుడు’. 2016లో ఈ సినిమా ఆరంభమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కమల్ గాయపడ్డారు. దీంతో ఈ సినిమా ఆగింది. ‘భారతీయుడు 2’ని మళ్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లే ‘శభాష్ నాయుడు’ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట కమల్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ఆరంభం కానున్నట్లు తెలిసింది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ కూడా ఓ నిర్మాత. షూటింగ్‌కి బ్రేక్ పడటానికి ఆర్థిక ఇబ్బందులు ఓ కారణం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను రీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇక ‘ఇండియన్ 2, శభాష్ నాయుడు, ధృవ నక్షత్రం’ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. -
కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా?
ఇండస్ట్రీలోకి కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఎప్పుడు? ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఇంతకు ముందు తెలుగు, తమిళం భాషల్లో టాప్ హీరోయిన్గా దుమ్ము రేపిన ఈ బ్యూటీ గత 2020లో పెళ్లి చేసుకుని ఆమె అభిమానులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్లు వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారు. అలాంటి కాజల్ నటనకు విరామం ఇచ్చి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో పండంటి బిడ్డను కని అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. కొన్ని నెలల పాటు నటనకు దూరమే అని, ఆ తరువాత మంచి కథా చిత్రాలతో రీఎంట్రీ అవుతానని ఓ భేటీలో పేర్కొన్నారు. ఆచార్యలో చిరంజీవి పక్కన మెరిసినా ఆమె నటించిన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించారు. చదవండి: దిల్ రాజు కొడుకు పేరేంటో తెలుసా? కాజల్ నటించిన మరో భారీ చిత్రం ఇండియన్–2. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలారిష్టాలు అన్నట్లు ఆది నుంచి ఆటంకాలతో కొంత భాగం చిత్రీకరణ జరుపుకుని ఆగిపోయింది. ఇందులో ఉన్న కాజల్ అగర్వాల్‌ను తొలగించినట్లు ప్రచారం జరిగింది. కాగా పలువురి ప్రయత్నాలు, రాయబారాల ఫలితంగా తాజాగా ఈ చిత్ర స్క్రిప్టు బూజు దులపడానికి యూనిట్ వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా ద్విభాషా చిత్రం చేస్తున్నారు. దీని తరువాత ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో కాజల్ నటిస్తారా? లేదా? అసలు ఆమె రీ ఎంట్రీ ఎప్పుడు? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అలా చేయాలంటే మేము బయటకు వెళ్లాలి: కమల్ హాసన్
Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie: నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు (ఉలగ నాయగన్) కమల్ హాసన్ వెండితెరపై సందడి చేశాడు. తాజాగా ఆయన నటించిన 'విక్రమ్: హిట్ లిస్ట్' మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కమల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' (ఇండియన్ 2) గురించి మాట్లాడారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమాపై కమల్ స్పందనను యాంకర్ కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అయితే కరోనా, సెట్లో ప్రమాదం ఇలా రకరకాల కారణాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా షూటింగ్ కంటిన్యూ చేశాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఒక చిత్రంపైనే పదేళ్లు పని చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి. అని కమల్ హాసన్ పేర్కొన్నారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
'ఇండియన్ 2' హీరోయిన్ కోసం అన్వేషణ.. మిల్క్ బ్యూటీ పక్కానా ?
Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది. 'ఇండియన్ 2' చిత్రం నుంచి చందమామ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్ 2'లో హీరోయిన్గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్గా చేసేందుకు అంగీకరంచిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్ వార్గాలు. ఇదీ చదవండి: ఇండియన్ 2 నుంచి కాజల్ ఔట్.. మరో స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్? -
ఇండియన్ 2 నుంచి తప్పుకున్న కాజల్.. కారణం అదేనా?
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్ంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా భారీ హిట్ సాధించిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రాబోతుంది. పలు అనివార్య కారణాలతో గత కొన్ని నెలలుగా సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ఆటంకం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని టాక్. అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాజల్ స్థానంలో వర్షం బ్యూటీ త్రిషను తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అన్ని వివాదాలు సద్దుమణిగి తిరిగి డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందనంగా ఈ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, సిద్ధార్థ్, వివేక్ తదితరులు నటిస్తున్నారు. భారతీయుడు సినిమా పలు రికార్డులను సొంత చేసుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చదవండి: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్ -
విశ్రాంత న్యాయమూర్తి చేతికి ఇండియన్–2 పంచాయితీ
కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇండియన్–2. ఈ చిత్ర నిర్మాణం ఆది నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. షూటింగ్ స్పాట్లో ట్రైన్ కుప్పకూలిపోవడంతో ముగ్గురు యూనిట్ సభ్యులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు మళ్లీ మొదలవలేదు. మధ్యలో కరోనా కష్టాలు కూడా ఇండియన్–2 చిత్ర నిర్మాణం జాప్యానికి ఒక కారణం. ఇలాంటి పలు కారణాలతో దర్శకుడు శంకర్ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఇండియన్–2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా తమ చిత్రాన్ని పూర్తి చేయకుండా శంకర్ వేరే చిత్రం చేయడానికి అనుమతించరాదని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో దర్శకుడు శంకర్ కూడా చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఇండియన్–2 చిత్ర షూటింగ్ జాప్యానికి తాను కారణం కాదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నటుడు కమలహాసన్ మధ్యవర్తిత్వం వహించినా ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్ర సమస్యను పరిష్కరించడానికి చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్.భానుమతి నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్.భానుమతి ఇండియన్–2 చిత్ర వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి వివరాలను కోర్టుకు సమర్పించిన తరువాత ఈ కేసులో తుది తీర్పును వెల్లడించను న్నట్లు చెన్నై హైకోర్టు పేర్కొంది. చదవండి: Krithi Shetty: ఇక బిజీబిజీగా మారిపోనున్న కృతీ క్రికెటర్‌తో ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం -
డైరెక్టర్ శంకర్‌కు లైకా సంస్థ షాక్!
సాక్షి, చెన్నై: దర్శకుడు శంకర్‌తో అమీ తుమి తేల్చుకోవడానికి లైకా సంస్థ సిద్ధమైనట్టు సమాచారం. ఈ సంస్థ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2018లో చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. చిత్రం షూటింగ్ ఆలస్యానికి లైకా సంస్థనేనని దర్శకుడు శంకర్ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. కేసు విచారణలో ఉంది. దర్శకుడు శంకర్ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ఒకటి, హిందీలో రణబీర్‌సింగ్‌తో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో లైకా సంస్థ తమ చిత్రా న్ని పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్‌ను తెలుగులో చిత్రం చేయడానికి అనుమ తించరాదని తెలుగు ఫిలిం ఛాంబర్‌కు, హిందీ ఫిలిం ఛాంబర్‌కు కూడా లేఖలు రాసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్
ఇండియన్–2 చిత్ర షూటింగ్ ఆలస్యానికి తాను బాధ్యున్ని కానని.. అందుకు కారణం ఆ చిత్ర నిర్మాణ సంస్థే అని దర్శకుడు శంకర్ కోర్టులో వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్–2. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. కాగా దర్శకుడు శంకర్ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో లైకా సంస్థ చెన్నై హైకోర్టు ను ఆశ్రయించింది. దీంతో శంకర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. శంకర్ తన వివరణ ఇస్తూ.. ఇండియన్–2 చిత్రాన్ని తొలుత దిల్‌రాజు నిర్మించడా నికి సిద్ధమయ్యారని.. అయితే తామే నిర్మిస్తామని అడి గి మరీ లైకా సంస్థ తీసుకుందన్నారు. దీంతో 2018 మేలో మొదలెట్టినట్లు తెలిపారు. చిత్రానికి రూ.270 కోట్లు బడ్జెట్ అవుతుందని, చివరికి రూ.250 కోట్లకు కుదించినా షూటింగ్‌ను ప్రారంభించడానికి జాప్యం చేశారన్నారు. ఆ తరువాత నటుడు కమలహాసన్‌కు మేకప్ అలర్జీ, చిత్రీకరణ సమయంలో క్రేన్ విపత్తు, లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు. సాంకేతిక నిపుణులకు నగదు చెల్లించకపోవడంతో వారు ఇతర చిత్రాలలో నటించడానికి వెళ్లిపోయారన్నారు. చదవండి: అమ్మానాన్నలని డబ్బులు అడగలేను: శృతిహాసన్ గజిని చిత్ర నిర్మాత కన్నుమూత -
Indian 2: కమల్ హాసన్ మధ్యవర్తిత్వం?
‘ఇండియన్ 2’ చిత్రీకరణ విషయంలో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఈ చిత్ర దర్శకుడు శంకర్లకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ 2’ని పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకూడదని లైకా ప్రతినిధులు అంటుంటే, షూటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించకుండా, నా తర్వాతి ప్రాజెక్ట్స్‌ను నియంత్రించే హక్కు లైకా వారికి లేదని శంకర్ అంటున్నారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. అయితే లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు, దర్శకుడు శంకర్ కూర్చుని చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు ఇటీవల ఓ సందర్భంలో సూచించింది కూడా. ఇప్పుడు ఈ బాధ్యతను ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్ తీసుకుని వారధిలా ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసే ఆలోచనలో ఉన్నారట. లైకా ప్రొడక్షన్స్, శంకర్‌తో ముందు విడిగా మాట్లాడి, ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమల్‌హాసన్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కమల్ జోక్యంతోనైనా శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వివాదం కొలిక్కి వస్తుందా? సమస్య పరిష్కారం అయి, షూటింగ్ మొదలవుతుందా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. 1996లో దర్శకుడు శంకర్, హీరో కమల్‌హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. చదవండి: ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత -
వివాదం.. డైరెక్టర్ శంకర్ స్పందన కోసం చూస్తున్నాం
దర్శకుడు శంకర్‌ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఇండియన్ 2’ నిర్మాణం, ‘అన్నియన్’ రీమేక్ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడదని మద్రాస్ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్ హఠాన్మరణం కూడా ‘ఇండియన్ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్ ఉన్న సీన్స్‌ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్ పేర్కొన్నారు. కాగా.. కమల్‌హాసన్‌తో ఓ సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది వివేక్ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. మరి.. ‘ఇండియన్ 2’, ‘అన్నియన్’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి. శంకర్ స్పందన కోసం చూస్తున్నాం! – సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్ రైట్స్ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్‌ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ తనవే అని ఆస్కార్ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్ హక్కులు తనవేనని శంకర్ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్‌పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో ఆయన శంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్ రైట్స్ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో రీమేక్ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్ చేయలేను’’ అని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు. -
‘ఇండియన్ -2’ వివాదం: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ఇండియన్ -2’ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మద్రాసు హైకోర్టు సూచించింది. కోర్డు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది. లైకా ప్రొడక్షన్లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్‌పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్ తమ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చికే ‘ఇండియన్-2’ షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. నటుడు వివేక్ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
కథ నాది, మీకు హక్కు లేదు, అర్థం అవుతుందనుకుంటా: శంకర్
వరుస వివాదాలతో దర్శకుడు శంకర్ అల్లాడిపోతున్నారు. హీరో రామ్‌చరణ్‌తో శంకర్ సినిమాను అనౌన్స్ చేయగానే ‘కమలహాసన్‌తో తాము నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయనిదే ఎక్కడికీ కదలడానికి లేదు’ అని లైకా ప్రొడక్షన్స్ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా, తమిళ చిత్రం ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌ను హీరో రణ్‌వీర్‌సింగ్‌తో చేయనున్నట్టు బుధవారం నాడు శంకర్ ప్రకటించడం మరో సంచలనమైంది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. శంకర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే అప్పట్లో ‘అన్నియన్’ చిత్రాన్ని నిర్మించిన ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆ కథ హక్కులు తనవి అంటూ ఘాటుగా లేఖ పంపారు. ఆ వెంటనే శంకర్ దానికి తన స్పందనగా మరో ఘాటైన ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ వివాదం సినీసీమలో గురువారం పెద్ద చర్చనీయాంశమైంది. నన్నడగకుండా ఎలా తీస్తారు? – ‘అన్నియన్’ నిర్మాత రవిచంద్రన్ ‘నా ఊహలకు తగ్గట్టు పవర్ఫుల్ హీరో దొరికాడు. హిందీలో నా ‘అన్నియన్ ’ అతనే’ అని దర్శకుడు శంకర్ ఇలా ప్రకటించారో, లేదో అలా వివాదం మొదలైంది. ‘‘నన్ను సంప్రదించకుండానే రీమేక్‌ని ప్రకటిస్తారా?’ అంటూ ‘అన్నియన్ ’ చిత్ర నిర్మాత ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్ మండిపడ్డారు. దర్శకుడు శంకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... ‘‘మీరు (శంకర్) ‘అన్నియన్ ’ ఆధారంగా హిందీలో ఓ సినిమాను అనౌన్స్ చేయడం తెలిసి, షాక్ అయ్యాను. ‘అన్నియన్ ’కు నేను నిర్మాతని అని మీకు గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ లైన్ పై పూర్తి స్థాయి హక్కులను రచయిత సుజాత (దివంగత రచయిత సుజాతా రంగరాజన్ )కు డబ్బు చెల్లించి నేను సొంతం చేసుకున్నాను. ఇందుకు ఆధారాలు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయి. ‘అన్నియన్ ’ స్టోరీలైన్ కు సంబంధించిన పూర్తి హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఈ స్టోరీలైన్ తో రీమేక్ సినిమా చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. మీ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సక్సెస్ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న మీకు ‘అన్నియన్ ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నేనే. ఈ సినిమా సక్సెస్ఫుల్ దర్శకుడిగా మీ స్టార్‌డమ్‌ను పెంచింది. ఇందులో ‘అన్నియన్ ’ నిర్మాతగా నా సపోర్ట్ ఉంది. కానీ ఇదంతా మరచిపోయి నన్ను సంప్రదించకుండానే మీరు హిందీ రీమేక్‌ను అనౌన్స్ చేశారు. ఎప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు, మీ స్థాయిని తగ్గించుకునేలా ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నియన్ ’ హక్కులు నా దగ్గర ఉన్నాయి గనుక, హిందీ రీమేక్ ఆలోచనను విరమించుకోవాలని సలహా ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు రవిచంద్రన్ . కథ... స్క్రీన్ ప్లే...డెరెక్షన్ నావి! – దర్శకుడు శంకర్ ‘అన్నియన్ ’ హక్కులు తనవేనంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన నిర్మాత రవిచంద్రన్ కు దర్శకుడు శంకర్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘ఆ ‘అన్నియన్ ’ కథ హక్కులు మీవి (రవిచంద్రన్) అంటూ... పంపిన మెయిల్ చూసి షాక్ అయ్యాను. కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శంకర్ అనే టైటిల్‌తోనే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను నేను ఎవరికి అప్పగించ లేదు. ఆ స్క్రిప్ట్ నిజానికి రచయిత సుజాత గారిదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ సినిమాకు డైలాగ్స్ మాత్రమే రాశారు. అందుకే, ఆయనకు సినిమాలో డైలాగ్ రైటర్‌గా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డైలాగ్స్ మినహా... ‘అన్నియన్ ’ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా దేనిలోనూ సుజాత గారి ప్రమేయం లేదు. ‘అన్నియన్ ’కు దర్శకుడిగా నాకే కాదు. నిర్మాతగా మీకూ పేరు వచ్చింది. నిర్మాతగా సినిమా స్క్రిప్ట్‌పై మీకు హక్కు లేదు. నిరాధారమైన ఆరోపణలను ఇకనైనా మానుకోండి. మీరు చెబుతున్న అవాస్తవాలు నా భవిష్యత్ ప్రాజెక్ట్స్‌ను ప్రభావితం చేయవు. నా వివరణ మీకు పాజిటివ్‌గానే అర్థం అవుతుందని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు శంకర్. కమల్ వస్తే... శంకర్ రెడీనే! ‘అన్నియన్’ వివాదం ఇలా ఉండగా... ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా, శంకర్ మరో సినిమాను డైరెక్షన్ చేయకూడదని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిగింది. శంకర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ‘‘లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఆరోపించినట్లు ‘ఇండియన్ 2’ను శంకర్ మధ్యలో వదిలేయలేదు. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఫారిన్ టెక్నీషియన్స్‌తో షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు. జూన్‌లో కూతురి పెళ్ళి పెట్టుకున్నప్పటికీ, కమల్‌హాసన్ గనక షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్ 2’ను పూర్తి చేయడానికి శంకర్ సిద్ధంగానే ఉన్నారు’’ అని కోర్టుకు విన్నవించుకున్నట్లు కోడంబాకమ్ సమాచారం. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్ ’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను అనౌన్స్ చేశారు శంకర్. తొలిపార్టులో హీరోగా నటించిన కమల్‌హాసనే మలిపార్టులో కూడా హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
ఇండియన్ 2: దర్శకుడు శంకర్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడంపై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఆరంభం నుంచి పలు అవరోధాలను ఎదుర్కొంటోంది. కరోనాకు ముందే ఇండియన్ 2 చిత్రం నిలిచిపోయింది. దీంతో శంకర్ ఇతర చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైకా సంస్థ శంకర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తమ సంస్థ ఇండియన్ 2 చిత్రం నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అయితే ఇప్పటికే రూ.236 కోట్లు అయ్యిందని తెలిపారు. ఇప్పటికీ 80 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. శంకర్‌కు రూ. 40 కోట్లు పారితోషకం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో రూ. 14 కోట్లు అడ్వాన్‌గా చెల్లించామన్నారు. అయితే తమ చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్ ఇతర చిత్రాలకు పని చేయకుండా ఆయనపై నిషేధించాలని కోరారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి పీటీ.ఆషా సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించరాదంటూ శంకర్‌పై నిషేధం వధించలేమని పేర్కొన్నారు. శంకర్‌ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: డైరెక్టర్ శంకర్‌పై నిర్మాతల కేసు! -
డైరెక్టర్ శంకర్‌పై నిర్మాతల కేసు!
‘ఇండియన్ 2’ షూటింగ్‌ను దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ సినిమా శంకర్ కెరీర్‌ను ఇబ్బందిపెడుతూనే ఉంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగి, నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సినిమా మళ్ళీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు ‘ఇండియన్ 2’లో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్ రాజకీయంగా బిజీ అయిపోయారు. ఇటు శంకర్ కూడా రామ్‌చరణ్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్‌కు షాక్ ఇచ్చింది. ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ,మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ‘‘ఇండియన్ 2’ బడ్జెట్ రూ. 236 కోట్లనుకున్నాం. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌కు రూ. 180 కోట్లు ఖర్చు అయ్యాయి. లాగే శంకర్‌కు మేం ఇస్తామన్న 40 కోట్ల పారితోషికంలో ఆల్రెడీ 14 కోట్లు చెల్లించాం. మిగిలిన 26 కోట్ల రూపాయలను కూడా కోర్టు సమక్షంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని లైకా ప్రొడక్షన్స్ తమ పిటిషన్ లో పేర్కొందని కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. అయితే దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలాంటి పరిష్కారంతో ముగుస్తుందనే చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. -
మార్చిలోపు ముగించేయాలి
కోవిడ్ వల్ల సినిమా షూటింగ్స్ అన్నీ అటూఇటూ అయిపోయాయి. ఈ అనూహ్య గ్యాప్‌ను కవర్ చేయడానికి రెండు పడవల ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు కొందరు స్టార్స్. కమల్‌హాసన్ కూడా రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసే ప్లాన్ వేశారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్నారు కమల్. ఈ ఇద్దరి కాంబినేషన్లో 1995లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్. అలాగే యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ‘విక్రమ్’ సినిమా కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాల్లోని తన భాగం చిత్రీకరణను మార్చి లోపల పూర్తి చేయాలనుకుంటున్నారట కమల్. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో పూర్తిగా నిమగ్నం కావాలన్నది ఆయన ప్లాన్ అని సమాచారం. ‘విక్రమ్’ సినిమా వచ్చే వేసవిలో థియేటర్స్‌లోకి వస్తుందని ఆల్రెడీ ప్రకటించారు. ‘భారతీయుడు 2’ భారీ సినిమా కాబట్టి కమల్ చిత్రీకరణ పూర్తయినా ఇంకా చాలా పనులు ఉంటాయి. అందుకని ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని ఊహించవచ్చు. -
జనవరికి డెడ్‌లైన్
కమల్‌హాసన్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతానని ఆ మధ్య ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కమల్‌హాసన్. కరోనా వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. అయితే సినిమాలో తన భాగాన్ని జనవరి నెలలోగా పూర్తి చేయాలని శంకర్‌ను కోరారట కమల్. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో జరగనున్నాయి. అందుకు సిద్ధమవ్వడం కోసమే ఈ నిర్ణయం అని ఊహించవచ్చు. -
కాబోయే భర్త ఎలా ఉండాలంటే?
చెన్నై: తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే అంటూ చెప్పుకొచ్చింది నటి రకుల్ ప్రీత్‌సింగ్. ఇంతకుముందు తెలుగులో క్రేజీ కథానాయికగా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాలపై ఎక్కువగా సారిస్తోంది. అలా తమిళంలో 2, హిందీలో మూడు చిత్రాలతో బిజీగా ఉంది. సాధారణంగా రకుల్ ప్రీత్ సింగ్ ఆమె అభిమానులు గ్లామర్ స్టార్ గానే చూడాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆమె అందాల ఆరబోతలో విజృంభిస్తోంది. తరచూ అలాంటి ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తోంది. కాగా ప్రస్తుత లాక్డౌన్ కాలంలో తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను ఇటీవల సామాజిక మాద్యమాలకు విడుదల చేసింది. అదే మాదిరిగా ఇతర నటీమణుల మాదిరిగానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ కాలక్షేపం చేసింది. (చదవండి: నటి సెక్యూరిటీ గార్డుకు కరోనా) అలా ఒక అభిమాని ఏలాంటి అర్హతలు ఉన్న వ్యక్తి మీకు భర్తగా రావాలని అని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే తనకు ప్రేమ అన్నా, పెళ్లి అన్నా చాలా గౌరవం అని ఆమె పేర్కొంది. ఇక తనకు ఎలాంటి భర్త కావాలన్న విషయానికి వస్తే ఆ విషయంగా తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ముఖ్యంగా చాలా పొడవైన వాడుగా ఉండాలని చెప్పింది. అది ఎంతగా అంటే తాను హైహిల్స్ వేసుకున్నా తలెత్తే చూసేలా నేను చేసుకోబోయే అతను ఉండాలని ఆమె అంది. అదేవిధంగా మంచి బుద్ధి, తెలివికలవాడై ఉండాలని చెప్పింది. మరి అలాంటి వాడు ఇప్పటికీ తారస పడలేదా అనే ప్రశ్నకు ఇంకా లేదని రకుల్ చెప్పింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్ –2 చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఆశగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. (చదవండి: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్యూట్ ఫోటోలు) -
అవి నిజం కాదు
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాల్లో ఒక హీరోయిన్ గా నటించిన పాయల్ ‘సీత’ (2019) చిత్రంలో ఓ స్పెషల్‌సాంగ్ చేశారు. లేటెస్ట్గా కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాల్లో ఆమె ప్రత్యేక పాటలు చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై పాయల్ స్పందించారు. ‘‘నా గురించి ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ‘ఇండియన్ 2’, ‘పుష్ప’ చిత్రాల్లో నేను స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఇప్పటికింకా అంగీకరించలేదు. ఆ రెండు సినిమాల్లో ప్రత్యేకమైన పాటల్లో నేను నర్తించబోతున్నాననే వార్తలు నిజం కాదు.. కేవలం పుకార్లు మాత్రమే. ప్రస్తుతం నేను ఏ సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదు కూడా. ప్రస్తుతానికి చాలా స్క్రిప్ట్స్ చదువుతున్నాను. ఏదైనా సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే నేనే చెబుతా’’ అని సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారామె. -
స్పెషల్ పాయల్
‘ఆర్ఎక్స్ 100’లో తన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపారు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. గత ఏడాది ‘సీత’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. తాజాగా మరో స్పెషల్ సాంగ్‌లో నర్తించడానికి రెడీ అవుతున్నారని టాక్. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించారట ‘ఇండియన్ 2’ చిత్రబృందం. పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. -
శంకర్ సినిమాలో పాయల్‌కు అవకాశం?
ఆర్ఎక్స్-100తో కుర్రకారు మనసు దోచుకున్న నటి పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సాధించిన ఈ నటికి ఊహించిన విధంగా ఆఫర్లు రావడం లేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కెరీర్ పరంగా ఆమెకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. అయితే ఈ అమ్మడికి ఊహించని అవకాశం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాయల్‌కు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ కథానాయకుడిగా ‘ఇండియన్ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. (చదువులో నేను టాపర్: సమంత) ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ప్రత్యేక గీతం కోసం పాయల్‌ను చిత్ర బృందం సంప్రదించిందని టాక్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్‌కు అవకాశం వస్తే పెద్ద బ్రేక్ దొరికినట్లేనని, శంకర్ సినిమాలో కనిపిస్తే అటు నార్త్ ఇటు సౌత్‌లో ఫుల్ క్రేజ్ పెరుగుతుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (తండ్రి అయిన దర్శకుడు) -
భారతీయుడు ఆగలేదు
‘‘భారతీయుడు’ సినిమా ఆగిపోయింది’’ అనే వార్త కోలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను లైకా ఖండించింది. తాజాగా మరోసారి కూడా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ – ‘‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయింది. ఇంత పూర్తి చేశాక సినిమాను ఎందుకు ఆపేస్తాం? లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతాం’’ అని పేర్కొన్నారు. -
బ్రేక్‌లోనూ బిజీ
ఖాళీ సమయంలో ఏదైనా కొత్త కళ నేర్చుకోవడం ఉత్తమమని అంటున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. కరోనా వైరస్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అందరూ స్వీయ గృహనిర్భందంలో ఉంటున్నారు. ఈ ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ – ‘‘ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒక కొత్త కళను నేర్చుకోవడానికే నేను ఇష్టపడతాను. నేను నేర్చుకుంటున్న కొత్త విషయం నాకు నా లైఫ్‌లో ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు. కానీ టైమ్ వేస్ట్ చేయడం కన్నా ఏదో ఒక కొత్త పనిని సాధన చేయడం ఉత్తమం అని నా భావన. ప్రస్తుతం నేను చెస్ నేర్చుకుంటున్నాను. మార్షల్ఆర్ట్స్ (‘ఇండియన్ 2’ సినిమా కోసం) కోసం మరింత సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. మనలో లోపాలుంటే సరిచేసుకోవడానికి ఈ ఖాళీ సమయం ఉపయోగపడుతుంది. గ్యాప్ కూడా మంచికే. ఈ బ్రేక్‌లోనూ ఏదో ఒకటి చేస్తూ బిజీగానే ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మోసగాళ్ళు’, ‘ఇండియన్ 2’, ‘ముంబైసాగ’ చిత్రాల్లో నటిస్తున్నారామె. -
ఇండియన్-2 ప్రమాదం: హైకోర్టుకు కమల్
సాక్షి, చెన్నై : తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్-2 చిత్ర షూటింగ్ సందర్భంగా చెన్నైలో ఇటీవల ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు టెక్నీషియన్ మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణ తీరుపై అభ్యంతకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కమల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. (దర్శకుడు శంకర్‌కు తీవ్ర గాయాలు) -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్?
చెన్నై : హీరో కమలహాసన్‌ను దర్శకుడు గౌతమ్‌మీనన్ మరోసారి డైరెక్ట్ చేయనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌లో వస్తోంది. గౌతమ్‌మీనన్ ఇంతకుముందు పలు సంచలన చిత్రాలను తెరకెక్కించారు. కాక్క కాక్క, విన్నైతాండి వరువాయా, మిన్నలే ఇలా విజయవంతమైన చిత్రాలు ఈయన దర్శకత్వంలో వచ్చినవే. అలాంటి వాటిలో కమలహాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఒకటి. కమలహాసన్ పోలీస్అధికారిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా వేట్టైయాడు విళైయాడు చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం గురించి కమలహాసన్, దర్శకుడు గౌతమ్‌మీనన్ ఇటీవల చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదం కారణంగా ఇండియన్–2 చిత్రం షూటింగ్ నిలిపి వేశారు. మళ్లీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత కమలహాసన్ రాజకీయపనుల్లో బిజీ అవుతారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తన మక్కళ్ నీది మయ్యం పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు దగ్గర పడుతుండడంలో కమలహాసన్ ఆ పనుల్లోనే ఉంటారు. దీంతో ఒక వేళ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించినా, ఆ చిత్రం ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశం లేదు. బహూశా శాసనసభ ఎన్నికలు ముగిసిన తరువాత వైట్టైయాడు విళైయాడు–2 చిత్రం ఉండవచ్చు. అదే విధంగా కమలహాసన్ తలైవన్ ఇరుకిండ్రాన్ చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. అదేవిధంగా దేవర్‌మగన్–2 కూడా చేస్తానని చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు సెట్‌పైకి వస్తాయన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇక దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రస్తుతం నటనపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఆయన విక్రమ్ హీరోగా చేసిన ధ్రువనక్షత్రం పూర్తి కాలేదు. అదేవిధంగా తెలుగు చిత్రం పెళ్లిచూపులును రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా శింబు హీరోగా విన్నైతాండి వరువాయా–2 చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్‌తో వేట్టైయాడు విళైయాడు 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. -
కాజల్ అగర్వాల్‌కు సమన్లు?
సాక్షి, పెరంబూరు: నటి కాజల్ అగర్వాల్‌కు క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్లో గత నెల 19వ తేదీన క్రేన్ కిందపడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం ఘటికలు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రమాద సంఘటన కేసును క్రైమ్‌బ్రాంచ్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న వారిని విచారించారు. అంతేకాకుండా చిత్ర దర్శకుడు శంకర్, కథానాయకుడు కమలహాసన్‌కు సమన్లు జారీచేశారు. దర్శకుడు శంకర్, ఆ తరువాత నటుడు కమలహాసన్ చెన్నైలోని క్రైమ్‌బ్రాంచ్ అధికారులు ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్నారు. తదుపరి ఆ ఘటన ప్రాంతంలో ఉన్న ఇండియన్–2 చిత్ర కథానాయకి కాజల్‌అగర్వాల్‌ను విచారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సమన్లను జారీ చేయనున్నట్లు తాజా సమాచారం. -
తెలిసిందే చెప్పా: కమల్ హాసన్
ఇండియన్–2 షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం నేపథ్యంలో ఆ చిత్ర హీరో కమల్‌హాసన్ మంగళవారం పోలీస్ ముందు హాజరయ్యారు. వాస్తవాలను పోలీసులకు చెప్ప డం నాధర్మం.. అదే చేశానని కమల్ మీడియాతో అన్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్ గత నెల 19న రాత్రి చెన్నై పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా భారీ క్రేన్ కుప్పకూలి అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ సహా ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నజరత్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్–2 చిత్రం కోసం ఈవీపీ స్టూడియోలో భారీసెట్ వేసే పనులు సాగుతుండగా ఇందుకు పోలీస్ నుంచి అనుమతి పొందలేదని విచారణలో బయటపడింది. చెన్నై నగర కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ కేసు నజరత్‌పేట పోలీసుల నుంచి క్రైం బ్రాంచ్ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. సెంట్రల్ క్రైం బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి గత నెల 23వ తేదీన విచారణ ప్రారంభించారు. అనుమతి లేకుండా భారీ సెట్ నిర్మాణానికి సిద్ధమైన నిర్వాహకులను, క్రేన్‌ను బాడుగలకు ఇచ్చిన యాజమాన్యం, ఆపరేటర్ తదితర ఆరుగురిని విచారించారు. వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం చిత్ర దర్శకుడు శంకర్‌కు సమన్లు పంపారు. ఈ సమన్లు అనుసరించి గత నెల 27వ తేదీన హాజరైన శంకర్‌ను సుమారు ఒకటిన్నర గంటకు పైగా విచారించారు.(కమల్, శంకర్, కాజల్ విచారణకు హాజరు కావాలంటూ..!) ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత నిర్మాతలదేనని కమల్ చెబుతుండగా, శంకర్, కమల్లదే బాధ్యతని నిర్మాతలు వాదిస్తున్నారు. ఇలా ఇరువర్గాలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్న తరుణంలో విచారణకు హాజరుకావాల్సిందిగా గతనెల 29వ తేదీన క్రైంబ్రాంచ్ పోలీసులు కమల్‌హాసన్‌కు సమన్లు పంపారు. సమన్లు అందుకున్న కమల్ మంగళవారం ఉదయం 10 గంటలకు చెన్నై ఎగ్గూరులోని సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసు కార్యాలయానికి వచ్చారు. విచారణాధికారైన అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి ముందు హాజరైనారు. చిత్రం కోసం భారీసెట్‌ను వేయాలని ఆదేశించింది ఎవరు, ముందు జాగ్రత్తగా రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు, పరిశ్రమల్లో వినియోగించే భారీ క్రేన్‌ను అనుమతి లేకుండా ఎందుకు తెచ్చారు, ప్రమాదం జరిగినపుడు మీరు ఎక్కడున్నారు, ప్రమాదాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా, ఆ సమయంలో తీసుకున్న చర్యలు ఏమిటి..? వంటి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు కమల్ ఇచ్చిన సమాధానాన్ని వీడియో ద్వారా వాంగ్మూలంగా నమోదు చేశారు. విచారణ సమయంలో కమల్‌తోపాటు అతడి న్యాయవాది కూడా రావచ్చని పోలీస్‌శాఖ అనుమతి ఇచ్చింది. అన్ని విషయాలూ తానే చెప్పగలనని న్యాయవాదిని కమల్ నిరాకరిస్తూ ఒంటరిగానే లోనికి వెళ్లారు. సుమారు 2.30 గంటలకు పైగా కమల్‌ను పోలీసులు విచారించారు. (రూ. కోటి ప్రకటించిన కమల్ హాసన్) వాస్తవాలు చెప్పడం నా ధర్మం: కమల్‌హాసన్ విచారణ ముగించకుని బయటకు వచ్చిన కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు నన్ను పిలిపించారు. ప్రమాదం సమయంలో ఎలాంటి గాయాలకు గురికాకుండా బైటపడినవారిలో నేనూ ఒకడిని. అందుకే ప్రమాదం గురించి తెలిసిన విషయాలు చెప్పడం నా ధర్మం. అన్ని విషయాలు చెప్పాను. ఇకపై ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాను. ఇవి రాజకీయ వేధింపులే : కమల్ అభిమానులు రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకే అన్నాడీఎంకే ప్రభుత్వం కమల్ ను వేధింపులకు గురిచేస్తోందని కమల్ అభిమానులు ఆందోళనకు దిగారు. కమల్ రాక ముందే పెద్ద సంఖ్యలో చెన్నై ఎగ్మూరులోని పోలీస్ స్టేషన్‌కు కమల్ అభిమానులు, మక్కల్ నీదిమయ్యం నేతలు చేరుకున్నారు. కమల్ రాగానే తోపులాట చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అనేక తమిళ సినిమా షూటింగుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఆనాడు ఎవ్వరినీ ఇలా పోలీస్ స్టేషన్‌కు పిలిపించలేదని వారు విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన లైకా ప్రొడక్సన్స్ అధినేతలు, ఇతర నిర్మాతలను విచారణకు పిలవకుండా కమల్, శంకర్‌ను మాత్రమే పిలవడం వెనుక రాజకీయ కక్షసాధింపు ధోరణి ఉందని ఆరోపించారు -
ఇలా అయితే ఎలా కరోనా?
కాదేదీ సినిమా షూటింగ్‌కి అవాంతరం అంటారో నిర్మాత. అవును, సినిమా షూటింగ్ ఆగిపోవడానికి.. ఆగకుండా కురిసే వర్షం నుండి అనుకోకుండా వచ్చే వైరస్ కూడా కారణం అవొచ్చు. ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉన్నా, నటీనటుల కాల్షీట్లు కావాల్సినన్ని ఉన్నా, కొన్ని సార్లు షూటింగ్ అనుకున్నట్టుగా సాగదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ – కరోనా. చాలా దేశాలు ప్రాణ భయంలో ఉన్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ దెబ్బ అన్ని పరిశ్రమలపై పడింది. సినీ పరిశ్రమ మీద కూడా. ఇలా అకారణంగా ఊడిపడ్డ ఈ వైరస్ కారణంగా పలు సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఇలా అయితే ఎలా కరో (చెయ్య)నా అనే డైలమాలో కొన్ని యూనిట్లు పడ్డాయి. మొత్తానికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ప్రమోషన్లు డైలమాలో పడుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా అనూహ్య ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాల గురించి వివరాలు. థాయ్ వద్దోయ్ నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సీరియస్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఏసీపీ విజయ్ వర్మ అనే పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అహిషోర్ సోల్మాన్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో జరపాలనుకున్నారు. కరోనా ప్రభావం థాయ్‌ల్యాండ్‌లో కనిపించడంతో ఈ షెడ్యూల్‌ను వాయిదా వేసింది చిత్రబృందం. మరి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి కరోనా హడావిడి తగ్గాక థాయ్‌ల్యాండ్ వెళతారా? లేకపోతే లొకేషన్‌నే షిఫ్ట్ చేస్తారా? వేచి చూడాలి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయుడు మళ్లీ వెతుకుతున్నాడు చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ చెన్నైలో రెడీ అవుతున్న ‘ఇండియన్ 2’ను ఇబ్బందుల్లో పడేసింది. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1995లో వచ్చిన ‘ఇండియన్’కి సీక్వెల్ ఇది. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో పలు లొకేషన్లలో ప్లాన్ చేశారు శంకర్. దీనికి సంబంధించిన లొకేషన్లను కూడా గత ఏడాది సందర్శించి ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేయడం రిస్క్. దీంతో లొకేషన్‌ను మార్చాలనే ప్లాన్‌లో ఉందట చిత్రబృందం. దీనికోసం మళ్లీ లొకేషన్లు వెతకడం నుంచి ప్రారంభించాలి. దీనివల్ల షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏజెంట్ ప్లాన్ ఇంపాజిబుల్ ఏజెంట్ ఈతన్ హంట్ తన సరికొత్త మిషన్ కోసం ఇటలీ ప్రయాణించాల్సిన పని. అందుకు తగ్గ ప్లాన్‌ని సిద్ధం చేసుకున్నారు కూడా. కానీ అనుకోకుండా కరోనా అతని ప్రయాణానికి బ్రేక్ వేసింది. టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సిరీస్‌లో వస్తున్న ఏడో సినిమా ఇది. ఈ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలను ఇటలీలో షూట్ చేయాలనుకున్నారు. ఇటలీలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. నో వే టు డూ ప్రపంచాన్ని చుట్టేయగల యాక్షన్ హీరో జేమ్స్‌బాండ్ . ప్రస్తుతం ఈ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రమిది. ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే చైనాలో ఓ ప్రమోషనల్ టూర్‌తో పాటు స్పెషల్ ప్రీమియర్స్‌ను ప్లాన్ చేసింది ‘నో టైమ్ టు డై’ టీమ్. అయితే నో వే టు డూ అనే పరిస్థితి. కరోనా కారణంగా చైనాలో థియేటర్స్ అన్నీ కొన్ని రోజులుగా మూతబడి ఉన్నాయి. కరోనా కారణంగా ప్రమోషనల్ టూర్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. చైనా మార్కెట్లో బాండ్ సినిమా విడుదల కాకపోతే సుమారు సుమారు 70 నుంచి 100 మిలియన్ డాలర్ల బిజినెస్ కోల్పోయినట్టే. ఇలా అనూహ్యంగా వచ్చిన ఈ వైరస్ వల్ల మరికొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఎంతో సమయం, డబ్బు వృథా కాక మానదు. పరిస్థితులన్నీ చక్కబడి షూటింVŠ లు, రిలీజ్లు ఎప్పటిలానే చకచకా అయిపోవాలని కోరుకుందాం. -
కన్నీటి పర్యంతమైన దర్శకుడు శంకర్
పెరంబూరు: ఇండియన్-2 చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యూనిట్ సభ్యుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి అందించనున్నట్లు దర్శకుడు శంకర్ ప్రకటించారు. ఇప్పటికే నటుడు కమలహాసన్ కోటి రూపాయలు, చిత్ర నిర్మాత సుభాష్కరన్ రూ. 2 కోట్లను అందించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం దర్శకుడు శంకర్ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆయన ఇండియన్-2 చిత్రం షూటింగ్లో జరిగిన ప్రమాదం షాక్, మనోవేదన నుంచి తాను ఇంకా కోలుకోలేదన్నారు. ఒక నెల రోజుల ముందే తన వద్ద సహాయకుడిగా చేరిన కృష్ణ మృతి ఆయన్ను బాధిస్తూనే ఉందన్నారు. ఇంత భారీ బడ్జెట్ చిత్ర యూనిట్లో చేరిన కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుని చాలా చక్కగా పని చేసిన వ్యక్తి కృష్ణ అని, అతన్ని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. కృష్ణ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు అతని తల్లి పడిన ఆవేదన ఇంకా తన కళ్లలో మెదులుతూనే ఉందని వాపోయారు. ప్రొడక్షన్ బాయ్ మధును మార్చురీలో చూసి తన గుండె ముక్కలైందని, ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రన్ మరణం తనను తీవ్రంగా బాధిస్తోందని, దుఖం ఆగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా అనూహ్యంగా జరిగిన ప్రమాద ఘటనతో షాక్ నుంచి బయట పడలేక వేదన పడుతున్నానని శంకర్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదం వ్వవహారంపై కేసు దర్యాప్తు చేస్తున్న క్రైంబ్రాంచ్ పోలీసు అధికారుల విచారణకు శంకర్ హాజరైన విషయం తెలిసిందే. కాగా కమలహాసన్ కూడా త్వరలో విచారణకు హాజరు కానున్నట్లు తెలిసింది.