'భారతీయుడు 2' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా? | Bharateeyudu 2 Telugu Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Bharateeyudu 2 Trailer: కమల్ హాసన్ 'భారతీయుడు 2' ట్రైలర్ రిలీజ్

Jun 25 2024 7:19 PM | Updated on Jun 25 2024 7:37 PM

Bharateeyudu 2 Trailer Telugu Latest

కమల్ హాసన్ వారాల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇందులో ఒకటి 'కల్కి'. జూన్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇక 'భారతీయుడు 2'.. జూలై 12న ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా అన్ని భాషల ట్రైలర్స్‌ని ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?)

అప్పుడెప్పుడో 1996లో శంకర్-కమల్ హాసన్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు' మూవీ సెన్సేషన్ సృష్టించింది. రెండు గెటప్పులో కమల్ అద్భుతమైన నటన.. ప్రేక్షకుల మైండే పోగొట్టేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ కుదిరింది. హీరో దర్శకుడు సేమ్. కాన్సెప్ట్ కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లే తీసుకున్నారు.

ట్రైలర్ చూసుకుంటే.. సిద్ధార్థ్ ఓ స్టూడెంట్. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని ప్రశ్నిస్తాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విట్టర్‌లో 'ఆయన మళ్లీ రావాలి' అని ట్రెండ్ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం చేశాడు. ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇకపోతే గతంలో జూలై 12న రిలీజ్ అని ప్రకటించారు. ట్రైలర్‪‌లో మాత్రం డేట్ వేయలేదు. బహుశా 'కల్కి' టాక్ బట్టి నిర్ణయం తీసుకుంటారేమో?

(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement