Kamal Haasan shares a photo from Indian 2 sets - Sakshi
Sakshi News home page

Kamal Haasan ఇండియన్‌-2: యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్న కమల్‌హాసన్‌

Published Fri, Mar 10 2023 9:39 AM | Last Updated on Fri, Mar 10 2023 11:31 AM

Kamal Haasan Shares Photo From Indian 2 Sets - Sakshi

ఫారిన్‌ స్టంట్‌ మాస్టర్స్‌ డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొంటుంది ఇండియన్‌-2. 1996లో కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్‌’కు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇటీవల ఆరంభమైన నెలరోజుల షెడ్యూల్‌లో భాగంగా మొన్నటివరకు నైట్‌ సీన్స్‌ తీసిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేసింది. ‘ఇండియన్‌ 2’ సినిమాకు ఓ హైలైట్‌గా ఉండనున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఫారిన్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement