Is Kajal Aggarwal Re Entry With Kamal Haasan Indian 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Kajala Aggarwal: కాజల్‌ రీఎంట్రీ.. ఇండియన్‌ 2తో వస్తుందా?

Published Thu, Jul 14 2022 8:46 AM | Last Updated on Thu, Jul 14 2022 11:01 AM

Is Kajal Aggarwal Re Entry With Kamal Haasan Indian 2 Movie - Sakshi

ఇండస్ట్రీలోకి కాజల్‌ అగర్వాల్‌ రీ ఎంట్రీ ఎప్పుడు? ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఇంతకు ముందు తెలుగు, తమిళం భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా దుమ్ము రేపిన ఈ బ్యూటీ గత 2020లో పెళ్లి చేసుకుని ఆమె అభిమానులకు షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్లు వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారు. అలాంటి కాజల్‌ నటనకు విరామం ఇచ్చి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. గత ఏప్రిల్‌ నెలలో పండంటి బిడ్డను కని అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. కొన్ని నెలల పాటు నటనకు దూరమే అని, ఆ తరువాత మంచి కథా చిత్రాలతో రీఎంట్రీ అవుతానని ఓ భేటీలో పేర్కొన్నారు. ఆచార్యలో చిరంజీవి పక్కన మెరిసినా ఆమె నటించిన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించారు.

చదవండి: దిల్‌ రాజు కొడుకు పేరేంటో తెలుసా?

కాజల్‌ నటించిన మరో భారీ చిత్రం ఇండియన్‌–2. శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలారిష్టాలు అన్నట్లు ఆది నుంచి ఆటంకాలతో కొంత భాగం చిత్రీకరణ జరుపుకుని ఆగిపోయింది. ఇందులో ఉన్న కాజల్‌ అగర్వాల్‌ను తొలగించినట్లు ప్రచారం జరిగింది. కాగా పలువురి ప్రయత్నాలు, రాయబారాల ఫలితంగా తాజాగా ఈ చిత్ర స్క్రిప్టు బూజు దులపడానికి యూనిట్‌ వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ద్విభాషా చిత్రం చేస్తున్నారు. దీని తరువాత ఇండియన్‌–2 చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో కాజల్‌ నటిస్తారా? లేదా? అసలు ఆమె రీ ఎంట్రీ ఎప్పుడు? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement