The 7 Villains Of Kamal Haasan Indian 2 Movie - Sakshi
Sakshi News home page

ఏడుగురు విలన్లు.. ముగ్గురు హిరోయిన్లతో కమల్‌ విజృంభన

Published Mon, Feb 27 2023 7:52 AM | Last Updated on Mon, Feb 27 2023 9:35 AM

Seven Villains In Kamal Haasan Indian 2 Movie - Sakshi

తమిళ సినిమా: కమలహాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్‌ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్‌ 2 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నటి కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనా షూటింగ్‌ స్పాట్‌లో ప్రమాదాలు, దర్శకుడికి నిర్మాణ సంస్థ మధ్య వివాదం, కరోనా కారణాలతో షూటింగ్‌ మధ్యలో ఆగిపోయింది. కాగా పలు పంచాయితీలు, కేసులు అనంతరం ఇటీవలే ఇండియన్‌ 2 చిత్రం షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది.

ప్రస్తుతం షూటింగ్‌ చెన్నైలో జరుపుకుంటోంది. చిత్రంలో సేనాపతిగా కమలహాసన్‌ గెటప్‌తో కూడిన పోస్టర్‌ విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందుతోంది. గత వారం రోజులుగా చెన్నై, పనైయూర్‌లో చిత్ర షూటింగ్‌ను రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు. చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో తమిళ్, బ్రిటీష్‌ స్టంట్‌ కళాకారులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా చిత్రంలో కమల్‌ హాసన్‌కు ఏడుగురు విలన్లు ఉంటారని అందులో ఒకరు సముద్రఖని అని సమాచారం. మొత్తం మీద ముగ్గురు హీరోయిన్లు, ఏడుగురు విలన్లతో కమలహాసన్‌ ఇండియన్‌ 2 చిత్రంతో మరోసారి తెరపై విజృంభిస్తున్నారన్నమాట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement