‘ఇండియన్‌ 3’​కి కమల్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. 30 రోజుల్లో షూటింగ్‌ పూర్తి! | Kamal Haasan Green Signal To Indian 3 Movie, Remuneration And Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Indian 3 Movie Update: త్వరలోనే భారతీయుడు 3.. కమల్‌కు భారీ రెమ్యునరేషన్‌

Published Wed, Oct 11 2023 10:41 AM | Last Updated on Wed, Oct 11 2023 12:07 PM

Kamal Haasan Green Signal To Indian 3 Movie - Sakshi

 కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్‌–2. ఇది 1996లో కమలహాసన్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్లో రూపొందిన సూపర్‌ హిట్‌ చిత్రం ఇండియన్‌ సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్‌న్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ్రహ్మాండ కథాచిత్రాన్ని శంకరే తెరకెక్కిస్తున్నారు. నటి కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీతిసింగ్‌, ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం ప్రారంభమై ఇప్పటికి షూటింగ్‌ దశలోనే ఉంది.

ఇండియన్‌ 2 చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోందని అనుకుంటున్న సమయంలో తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్‌ మరో 30 రోజులు నిర్వహించాల్సి ఉందని తెలిసింది. కారణం ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలను పరిశీలించిన శంకర్‌ దీని పరిధి పెరిగినట్లు గమనించినట్లు సమాచారం. దీంతో దీనికి మరో సీక్వెల్‌ కూడా రూపొందించడానికి సిద్ధమైనట్లు తెలిసింది.

అంటే ఇండియన్‌ చిత్రానికి మూడో భాగం కూడా పోతుందన్నమాట. ఇండియన్‌ చిత్రం మూడో సీక్వెల్‌ నిర్మాతలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు. ఇప్పుడు మరో 30 రోజులు షూటింగ్‌ నిర్వహిస్తే ఇండియన్‌–3 చిత్రం కూడా పూర్తి అవుతుందని సమాచారం. ఈ షూటింగ్‌ కూడా కమలహాసన్‌ కాల్‌షీట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కాగా ఇందుకోసం ఆయనకు మరో రూ.120 కోట్లు చెల్లించనున్నారని తెలిసింది.

కాగా ఇండియన్‌–3 చిత్రం కూడా రూపొందడంతో కమలహాసన్‌ ఇప్పటికే నటించడానికి అంగీకరించిన హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో నటించడం 233వ చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో నటించనున్న 234వ చిత్రాల షూటింగ్‌ మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కమలహాసన్‌ మరో పక్క బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌షో 7 సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement