Bharateeyudu 2 Intro: భార‌తీయుడు ఈజ్ బ్యాక్‌.. ఇండియ‌న్ 2 ఇంట్రో వ‌చ్చేసింది.. | Kamal Haasan Indian 2 Movie First Glimpse Out | Sakshi
Sakshi News home page

Bharateeyudu 2 Intro: భార‌తీయుడు 2 ఇంట్రో చూశారా? అదిరిపోయిందంతే!

Published Fri, Nov 3 2023 7:15 PM | Last Updated on Sat, Nov 4 2023 1:32 PM

Kamal Haasan Indian 2 Movie First Glimpse Out - Sakshi

భార‌తీయుడుకి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికారులు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు?  పేట్రేగిన లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగా

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం భార‌తీయుడు 2. 1996లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ భార‌తీయుడు చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ రూపొందుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. . శుక్ర‌వారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రిలీజ్ చేశారు. 

‘భార‌తీయుడు’లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌టంతో క‌థ ముగిసింది. అయితే ఇప్పుడు దేశంలో మ‌ళ్లీ లంచ‌గొండిత‌నం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవ‌రూ ఏ ప‌నులు చేయ‌టం లేదు. దీంతో సామాన్యుడు బ‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారింది. అప్పుడు భార‌తీయులంద‌రూ క‌మ్ బ్యాక్ ఇండియ‌న్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మ‌ళ్లీ దేశంలోకి భార‌తీయుడు అడుగుపెట్టాల‌ని రిక్వెస్టులు పంపుతారు. 

చివ‌ర‌కు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెడ‌తారు. వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి ఏం చేశారు.. భార‌తీయుడుకి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికారులు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు?  పేట్రేగిన లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగాయి? అనే విష‌యాల‌ను గ్లింప్స్‌లో చూపించారు. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి..

ఈ గ్లింప్స్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహా త‌దిత‌రులు క‌నిపించారు. ఈ ఇంట్రో గ్లింప్స్‌ను త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌, మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్  విడుద‌ల చేశారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్‌ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement