ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్‌.. ఈసారైన కలిసొచ్చేనా? | Rakul Preet Singh Hopes On Indian 2 And Ayalaan Movies Will Be Plus For Her Career, Deets Inside - Sakshi

Rakul Preet Singh: ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్‌.. ఈసారైన కలిసొచ్చేనా?

Sep 12 2023 10:52 AM | Updated on Sep 12 2023 11:00 AM

Rakul Preet Singh Hopes On Indian 2, Ayalaan Movies Will Be Plus For Her Career - Sakshi

తమిళ సినిమా: దక్షిణాదిలో పాగా వేసిన ఉత్తరాది బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. శృతి మించిన అందాల ఆరబోతకు కేరాఫ్‌ ఈ జాణ. గ్లామర్‌తోనే తన సినీ పయనాన్ని లాగించేస్తున్న రకుల్‌ ప్రీతిసింగ్‌కు మంచి అభినయాన్ని ప్రదర్శించిన ఒక్క చిత్రం కూడా లేదనే చెప్పాలి. అయినా ఇంతకుముందు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంది. అదే విధంగా తమిళంలో కొన్ని చిత్రాలు చేసినా ఇక్కడ సరైన హిట్‌ పడలేదు. ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో నటించినా, ఆ సక్సెస్‌ క్రెడిట్‌  హీరో కార్తీ, దర్శకుడు హెచ్‌ వినోద్‌ల ఖాతాలోనే పడింది.

ఈ మధ్య అవకాశాలకు దూరమైన రకుల్‌ ప్రీతిసింగ్‌ ఆశలన్నీ తమిళ పరిశ్రమపైనే. ఈమె ఇటీవల హిందీ, తెలుగులో భాషల్లో నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో కమల్‌ హాసన్‌ సరసన నటిస్తున్న ఇండియన్‌ 2, శివకార్తికేయన్‌తో జత కట్టిన అయలాన్‌ చిత్రాలనే నమ్ముకుంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయినా తాను నటిగా చాలా ఉత్సాహమైన స్థానంలో ఉన్నానని రకుల్‌ ప్రీతిసింగ్‌ చెప్పుకుంటోంది.

ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ భాషలకతీతంగా తనకు అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పింది. సినిమా ద్వారా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవడం మంచి అనుభవం అని పేర్కొంది. తాను ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు విడుదల కానున్నాయని, ఇది తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని చెప్పింది. అయితే తన పాన్‌ ఇండియా చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement