
లోక నాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక‍్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). కమలహాసన్‌తో చేసిన ఫొటోషూట్ చిత్రంపై అంచనాలను పెంచింది. అదే జోరులో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత అనూహ్యంగా సెట్లో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కొల్పోవడం.
చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
చిత్రంలో హాస్య భూమిక పోషిస్తున్న వివేక్ హఠాన్మరణం, ఆ తరువాత దర్శకుడికి, లైకా ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఇలా ఎన్నో రకాలు అడ్డుంకులు వచ్చాయి. ఈ విషయంలో లైకా సంస్థ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే దర్శకుడికి, నిర్మాతల మధ్య సామరస్య పూర్వక చర్చలు జరిగిన అవి ఫలించకపోవడంతో శంకర్ ఆర్‌సీ15 మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఎట్టకేలకు ఇటీవల సమస్యలు, విభేదాలు సద్దుమనగడంతో ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్ర బృందం.
చదవండి: ఉమా మహేశ్వరి అంత్యక్రియలు, పాడే మోసిన బాలయ్య
అయితే దీనికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్ వేటలో పడిందట. ఇండియన్ 2 హీరోయిన్‌గా కాజల్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ఇటీవల వారితో మూవీ టీం సంప్రదింపులు కూడా జరిగిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉందని వినికిడి. ఇక ఇండియన్ 2 హీరోయిన్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు.