
సినిమాల కోసం కాజల్ అగర్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టాలీవుడ్ ‘చందమామ’ కి జూన్ 19న పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమయమంతా కొడుకుకే కేటాయిస్తుంది ఈ బ్యూటీ. తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. మళ్లీ ఇటీవల షూటింగ్‌లకు హాజరవుతుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందట. దీంతో కొడుకు బాగోగులు చూసుకోవడం కాజల్‌కు ఇబ్బంది అవుతుందట. అందుకే కుమారుడి బాధ్యతను తన చెల్లి నిషా అగర్వాల్‌కి అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషాతో పాటు ఆమె తల్లి కూడా నీల్ కిచ్లూ బాగోగులు చూసుకుంటున్నారట. ఇండియన్-2తో పాటు కాజల్ తమిళ్‌లో మరో సినిమా చేస్తుంది.