
ఈ దీపావళికి బిగ్ స్క్రీన్‌ను పలకరించనున్న బాలీవుడ్ మూవీ సూర్యవంశీ టీమ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు.
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఎట్టకేలకు బిగ్ స్క్రీన్‌ను పలకరించనున్న బాలీవుడ్ మూవీ సూర్యవంశీ టీమ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. రణవీర్‌తో కలిసి స్పెప్పులతో ఇరగదీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!)
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సూర్యవంశీ మూవీలోని లేటెస్ట్ ట్రాక్ ‘ఐలారే అల్లా’ పాటకు రణవీర్‌తో కలిసి స్టెప్పులేశాడు అక్షయ్. ఈ క్రేజీ డాన్స్‌కు మీరు అడుగులు రోపండి అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. జాగ్రత్త.. ఎక్కడైనా పొరపాటు జరిగిందో, మీ ఫ్యూచర్‌కు దెబ్బే అంటే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఐలారే పాటను గురువారం ట్విటర్‌లో షేర్ చేశారు.(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే)
రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సూర్యవంశీ. అజయ్ దేవగన్‌ని ‘సింగం’గా, రణ్‌వీర్‌ని ‘సింబా’గా చూపించిన రోహిత్ తాజాగా అక్షయ్‌ని ‘సూర్యవంశీ’ గా చూపించబోతున్నాడు. అంటే సింగిల్ ఫ్రేమ్‌లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ అన్నమాట. వీరితోపాటు కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. (Freida Pinto: అవును..నా డ్రీమ్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!)
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న దీపావళికి విడుదల కానుంది. తమ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆదరించాలంటూ దర్శకుడు రోహిత్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మూవీ ప్రమోషన్‌లో ప్రస్తుతం అంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. ఓటీటీలో కంటే థియేటర్‌లో రిలీజ్ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్న కొన్ని సినిమాలలో సూర్యవంశీ కూడా ఒకటి.
The celebrations have begun & here is your party starter pack!!#AilaReAillaa song out now - https://t.co/mLu67F7jTr#Sooryavanshi releases this Diwali, 5th November in cinemas. #BackToCinemas pic.twitter.com/R3HJwOzFT4
— Karan Johar (@karanjohar) October 21, 2021