
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన యాక్షన్ ఫిలింతో అలరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన హంట్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్లాప్‌గా నిలిచింది. ఇక సుధీర్ బాబు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన మామ మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఇందుకోసం ప్రమోగం చేస్తున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్, ఫిట్‌నెస్ లుక్‌తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ సినిమా కోసం బొద్దుగా తయారయ్యాడు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో తన లుక్‌ను తాజాగా విడుదల చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. దీనికి ‘బెట్.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. లావుగా ఉన్న సుధీర్ బాబుని ఇలా చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ కామెంట్స్ చేస్తున్నారు.
Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie
— Sudheer Babu (@isudheerbabu) March 1, 2023