
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్(vijay) విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట..పెళ్లి విషయంలో గొడవ జరిగి విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే అటు తమన్నా కానీ ఇటు విజయ్ కానీ ఈ బ్రేకప్ రూమర్స్‌పై స్పందించకుండా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి తమన్నా హాజరై మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి బ్రేకప్ గురించి పరోక్షంగా ప్రశ్నించగా.. తమన్నా తనదైన శైలీలో సమాధానం ఇచ్చింది.
ఓదెల 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో తమన్నాతో పాటు చిత్రబృందం అంతా పాల్గొంది. ట్రైలర్ రిలీజ్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి..‘మంత్ర తంత్రాలు ఉపయోగించి ఎవరి మీదనైనా విజయం (హిందీలో విజయ్) సాధించాలనుకుంటున్నారా?’అని పరోక్షంగా విజయ్ బ్రేకప్ గురించి ప్రశ్నించింది. దీనికి తమన్నా సమాధానం చెబుతూ.. ‘మంత్ర తంత్రాలతో అలాంటి పనులు జరుగుతాయి అంటే నేను నమ్మను. ఒకవేళ అదే నిజమైతే మీ(మీడియా)పై మంత్రాలను ప్రయోగిస్తా. అప్పుడు అందరూ నా చేతుల్లో ఉంటారు. నేను చెప్పింది వింటారు. నేను ఏం చెబితే అదే రాసుకుంటారు’ అని నవ్వుతూ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌తో బ్రేకప్ అయింది కాబట్టే..అతని పేరు కూడా చెప్పడానికి ఆమెకు ఇష్టం లేకనే ఇలా సమాధానం చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఓదెల 2 సినిమా విషయానికొస్తే.. 2022లో ఓటీటీలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఓదెల’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో తమన్నా శివశక్తిగా కనిపించబోతుంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.