
ఇవాళ నవంబరు 29వ తేదీ. అయితే ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదులెండీ ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన రోజు అని చెప్పేందుకు అలా రాశా. అయితే ఎందుకు అని మీకు సందేహం వచ్చి ఉంటుంది సుమా. అందుకే ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి.
ప్రిన్స్ మహేశ్ బాబుకు ఆయన అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. మహేశ్ బాబు రాజకుమారుడులా ఎంట్రీ ఇచ్చి.. మురారిలా మురిపించి.. ఒక్కడుగా వచ్చి.. బాక్సాఫీస్‌ను ఊపేసిన పోకిరిలా అయినా.. తెలుగు సినిమాకు పక్కా బిజినెస్‌మెన్‌లా సరికొత్త మార్కెట్ సృష‍్టించిన ఓవర్‌సీస్ స్టార్ అతడే.
గెలుపోటములతో సంబంధం లేకుండా.. సైనికుడులా కష్టపడుతూ.. ఎల్లప్పుడు దూకుడుగా ఉంటూ.. శ్రీమంతుడిలా అలరిస్తూ.. మహర్షిలా సాయం చేస్తూ.. సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ మహేశ్ బాబు. ఆయన అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదగడానికి ఈరోజే ప్రధాన కారణం.
నటనకు నాంది పడింది ఈరోజే..: మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణానికి పునాది పడింది ఈ రోజే. దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'నీడ' సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ నటించారు. 1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో మహేశ్ బాబు బాలనటుడిగా అదరగొట్టారు. అప్పట్లో ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. మరోవైపు మహేశ్ బాబు బాగా నటించడంతో ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకున్నారు.
తొమ్మిది చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించి..: బాలనటుడిగా మొత్తం తొమ్మిది చిత్రాల్లో మహేశ్ బాబు నటించగా.. అందులో కృష్ణతో కలిసి ఏడు చిత్రాల్లో మెప్పించాడు. సరిగ్గా 43 ఏళ్ల కింద ఇదే రోజు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు.. చిన్నప్పటి ఫొటోలను షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు.
43 years of his Reign 👑
— SSMB Space 🌟 (@SSMBSpace) November 29, 2022
& Still Continues to Conquer ❤️🔥
Superstar @urstrulyMahesh 🦁#43YearsForSSMBReignInTFI 💥#MaheshBabu #SSMB pic.twitter.com/dZSobnxlen