
బుల్లితెరపై యాంకర్‌గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు. పలు రియాలిటీ షోలకు యాంకర్‌గా పనిచేశారు. అలా యాంకరింగ్‌తో ఫేమస్ అయిన ప్రదీప్ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఈ సినిమకు నితిన్- భరత్ దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రదీప్. ఇటీవలే ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే ఓ రాజకీయ నాయకురాలితో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పుకుండా పెళ్లి అయితే చేసుకుంటానని అన్నారు.
తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. ముందు జీవితంలో సెటిల్ కావాలనుకున్నా. నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం. అవీ ఆలస్యం కావడంతోనే మిగిలిన పనులు కూడా వాయిదా పడుతున్నాయి. అన్నీ కూడా సరైన టైమ్‌కే పూర్తి అవుతాయని నమ్ముతున్నా. రాజకీయ నాయకురాలితో తన పెళ్లి అని వస్తున్న వార్తలు నేనూ విన్నా.. అంతకుముందే రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు.. త్వరలో క్రికెటర్‌తో పెళ్లి అంటారేమో. అన్నీ సరదా కోసమే చేస్తున్న ప్రచారం' అంటూ నవ్వుతూ మాట్లాడారు. కాగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న విడుదల కానుంది.