
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.
కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది.
తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA
— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025