
రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలి..
గ్రామంలోని షాపు నంబర్–9 డీలర్ నిరుపేదల నుంచి బియ్యం కొనుగోలు చేసి ప్రైవేటుగా అమ్ముకుంటున్నాడు. గతంలో ఫిర్యాదు చేస్తే పోలీసులను ఆశ్రయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. తిరిగి విధుల్లోకి చేరాడు. కానీ ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో పాటు దివ్యాంగుడినైన తనకు ఇందిరమ్మ ఇంటిని కేటాయించాలని అధికారులను వేడుకున్నా.. అయినా స్పందించలేదు. ఎంపీడీఓను కలిస్తే కాంగ్రెస్ నాయకులను కలవమని చెబుతున్నారు.
– లెంకలపల్లి కుమారస్వామి,
దుంపెల్లిగూడెం, గోవిందరావుపేట