
ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి
చిట్యాల : పట్టణంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలను మళ్లించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పోలీసులకు సూచించారు. శుక్రవారం చిట్యాల పాలకేంద్రం వద్ద, పోలీస్‌స్టేషన్ ఎదురుగా జంక్షన్ వద్ద జరుగుతున్న ప్‌లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను మళ్లించాలని సూచించారు. పనులు వేగవంతంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, సీఐ కె.నాగరాజు, ఎస్‌ఐ ఎన్.ధర్మా తదితరులు ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్