
చిన్న పిల్లల రక్షణ ప్రధానం
వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, నిమ్మరసం, కీర దోస, పుదీన నీరు తాగించాలి. తెల్లని వదులైన కాటన్ దుస్తులు వేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి పంపవద్దు. తలనొప్పి, తలతిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక చెమట, అదిక దాహం కలిగితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, నల్లగొండ